టాలీవుడ్ స్టార్ కమెడియన్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్ | Actor Rao Ramesh at Comedian MS Narayana Grand Daughter Wedding | Sakshi
Sakshi News home page

MS Narayana: టాలీవుడ్ స్టార్ కమెడియన్ మనవరాలి పెళ్లి.. వీడియో వైరల్

Nov 26 2026 12:48 PM | Updated on Nov 26 2026 12:48 PM

Actor Rao Ramesh at Comedian MS Narayana Grand Daughter Wedding

ప్రస్తుతం ఎక్కడచూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ త్వరలోనే తేజ సజ్జా, సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కనున్నారు. వచ్చే నెలలోనే హనుమాన్ హీరో తేజ సజ్జా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. తాజాగా టాలీవుడ్ కమెడియన్ ఎంఎస్ నారాయణ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన మనవరాలి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది.

ఈ పెళ్లిలో టాలీవుడ్ నటుడు రావు రమేశ్ సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కాగా.. టాలీవుడ్‌ కమెడియన్‌గా ఎంఎస్ నారాయణ వందలకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో చిత్రాల్లో మనల్ని కడుపుబ్బా నవ్వించిన ఆయన 2015లో కన్నుమూశారు. ఆయనకు విక్రమ్, శశికిరణ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement