బిగ్‌బాస్‌ 10: ప్రియుడి కోసం తిరుమల కొండెక్కిన ప్రియాంక జైన్‌! | Bigg Boss 10 Telugu: Priyanka Jain Visit Tirumala | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 10: శివ కోసం ప్రియాంక జైన్‌ తిరుమల యాత్ర

Nov 26 2026 9:55 AM | Updated on Nov 26 2026 9:55 AM

Bigg Boss 10 Telugu: Priyanka Jain Visit Tirumala

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో శివ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శివ కోసం స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలనే సంకల్పంతో ఆమె తిరుమల కొండకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రియాంక జైన్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

‘శివ నా కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు తిరుమలకు వెళ్లారు. ఇప్పుడు శివ కోసం నేను కూడా ఏడుకొండలవాడి దగ్గరకు వచ్చాను’ అనే భావనతో ఆమె ఈ యాత్ర చేపట్టారు. శివ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవాలని, అతడి ప్రయాణం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ప్రియాంక తెలిపారు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో డీమాన్ పవన్, రీతూ.. ఇలా షాకిచ్చారేంటి?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో పాల్గొన్న ప్రియాంక జైన్‌ అప్పట్లో తన ఆటతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. శివతో ఆమెకు ఉన్న అనుబంధం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు శివ కోసం ప్రియాంక తిరుమలకు వెళ్లడం మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

శివ తన కోసం తిరుమలకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు అతడి కోసం తాను తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి చూపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో శివ టైటిల్‌ రేసులో ఉండటంతో.. ఆయన విజయం సాధించాలని ప్రియాంక చేసిన ప్రత్యేక ప్రార్థనకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement