24 రూపాయలతో వచ్చి.. రూ.కోటి పట్టుకెళ్లాడు | Bhushan Thakare wins Rs 1 crore on Kaun Banega Crorepati | Sakshi
Sakshi News home page

KBC: 24 రూపాయలతో వచ్చి.. రూ.కోటి పట్టుకెళ్లాడు

Nov 26 2026 9:11 AM | Updated on Nov 26 2026 9:11 AM

Bhushan Thakare wins Rs 1 crore on Kaun Banega Crorepati

ప్రస్తుతం బాలీవుడ్‌లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ నడుస్తోంది. ఈ సీజన్‌-18కు అమితాబ్‌ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌ కూడా కోటి రూపాయల ప్రశ్నకు వరకు రాలేదు. తాజాగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న భూషన్ థాక్రే కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్‌లో కోటి రూపాయలు దక్కించుకున్న తొలి కంటెస్టెంట్‌గా నిలిచారు.

ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భూషణ్ థాక్రే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. ముంబయికి వచ్చిన సమయంలో అతని వద్ద అకౌంట్‌లో కేవలం రూ.24 రూపాయలే ఉన్నాయని తెలిపాడు. ఇప్పుడు తాను కోటీశ్వరుడిగా మారిపోయానని ఆనందం వ్యక్తం చేశారు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి పాల్గొనేందుకు తనకు పదేళ్లు పట్టిందని వెల్లడించాడు. 2016 నుంచే ప్రయత్నించానని.. చివరికీ ఈ రోజు అమితాబ్‌ను కలవాలన్న తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.

భూషణ్ మాట్లాడుతూ.. "నేను 2016 నుండే కేబీసీ కోసం ప్రయత్నిస్తున్నా. దాదాపు నాలుగైదు ఏళ్ల పాటు నాకు ఆడిషన్ ఇచ్చే అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత ఆడిషన్లు, ఇంటర్వ్యూలకు హాజరైనా విజయం దక్కలేదు. కానీ ఈసారి ఎంపికయ్యాను. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా" అని తెలిపారు. ముంబైలో తన ప్రయాణం, బస, భోజన ఏర్పాట్లన్నీ షో నిర్వాహకులే చూసుకోవడంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సి రాలేదని వెల్లడించాడు. యూపీఎస్సీ కోచింగ్ తనకు ఈ కోటి రూపాయలు గెలిచేందుకు ఉపయోగపడిందని భూషణ్ థాకరే తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement