– ఆర్.నారాయణమూర్తి
‘‘తల్లిదండ్రులంటే దేవుడితో సమానం అని ‘ఆలోచన’ సినిమా ద్వారా చాలా గొప్పగా చెప్పారు దర్శకులు చాచా. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి వెళ్లిపోతున్నారు. కుటుంబ విలువలను మనం కాపాడుకోవాలి. ‘ఆలోచన’ లాంటి సినిమా తీయాలంటే నిర్మాతలకు చాలా ధైర్యం కావాలి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి కోరారు. జీవీ నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహ రాజు, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆలోచన’.
సురేందర్ చాచా దర్శకత్వంలో పీఎస్‌జే ఫిల్మ్స్ అండ్ కో ఫిల్మ్స్‌పై ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆలోచన’ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆర్.నారాయణమూర్తి, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గెస్ట్స్‌గా హాజరయ్యారు. ‘‘ఆ నలుగురు’ సినిమాలాగా ‘ఆలోచన’ ఉంటుంది’’ అన్నారు తమ్మారెడ్డి భర్వాజ. ‘‘సీనియర్ సిటిజన్స్ నేపథ్యంలో తీసిన చిత్రమిది’’ అన్నారు ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్, సురేందర్ చాచా పేర్కొన్నారు.


