బ్రిటిష్‌ యువరాజు ఇంట్లో దొంగలు, ఇద్దరు అరెస్ట్‌ | Two arrested after break in at country home of Prince William and wife Kate | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ యువరాజు ఇంట్లో దొంగలు, ఇద్దరు అరెస్ట్‌

Nov 25 2026 1:28 PM | Updated on Nov 25 2026 1:28 PM

Two arrested after break in at country home of Prince William and wife Kate

విస్తృత గాలింపు తరువాత ఇద్దరి అరెస్ట్‌  

లండన్‌: బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ విలియం, యువరాణి కేథరిన్‌ దంపతుల ఇంట్లోకి ఇద్దరు అక్రమంగా చొరబడటం కలకలం రేపుతోంది. లండన్‌కు సుమారు 171 కిలోమీటర్ల దూరంలోని సాండ్రింగ్‌ హామ్‌ ఎస్టేట్‌లో అన్మేర్‌ హాల్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ద సన్‌ పత్రిక కథనం తెలిపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముసుగులు వేసుకున్న వ్యక్తులు లోనికి ప్రవేశించినట్లు ఈ కథనం తెలిపింది. అయితే ‘అన్మెర్‌ హాల్‌’వద్ద అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న నార్‌ఫ్లోక్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణ మొదలుపెట్టారు. 

పోలీసు కుక్కలు, డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టి ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు బ్రిటిష్‌ పోలీసులు మంగళవారం తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం లండన్‌లోని 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌తో ప్రిన్స్‌ విలియం సమావేశమయ్యారు. అయితే చొరబాటు అంశంపై ఎలాంటి వ్యాఖలూ చేయలేదు. భద్రతకు సంబంధించిన అంశాలపై తాము స్పందించమని విలియం, కేట్‌ దంపతుల కార్యాలయం ‘కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌’ఒక ప్రకటన విడుదల చేసింది. దివంగత రాణి ఎలిజబెత్‌–2 అన్మేర్‌హాల్‌ను విలియం, కేట్‌లకు వివాహ కానుకగా ఇచ్చారు. పది పడకలున్న ఈ భవనంలో విలియం, కేట్‌ దంపతులు వారాంతాల్లో మాత్రమే గడుపుతూంటారు.   

ఇదీ చదవండి: వైద్య చరిత్రలో అద్భుతం : పంది కిడ్నీతో 365 రోజులు!

గతంలోనూ చొరబాట్లు.. 
బ్రిటన్‌ రాజకుటుంబ నివాసాల్లోకి దుండగులు చొరబడటం ఇదే మొదటిసారి కాదు. 2024 అక్టోబర్‌లో రాజు ఛార్లెస్, రాణి కెమిల్లాల విండ్సర్‌ క్యాజిల్‌ ఎస్టేట్‌లోకి చొరబడిన దొంగలు ఓ పికప్‌ ట్రక్కు, క్వాడ్‌ బైక్‌ను ఎత్తుకెళ్లారు. అంతకు మూడేళ్ల ముందు, విల్లు, బా ణాలతో విండ్సర్‌ క్యాజిల్‌ ప్రాంగణంలోకి ప్ర వేశించిన జస్వంత్‌ సింగ్‌ చైల్‌ అనే వ్యక్తిని భద్ర తా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏఐ చాట్‌బాట్‌ ప్రోద్బలంతో రాణి ఎలిజబెత్‌ను హత్య చేయడానికి వచ్చానని అంగీకరించడంతో అతడికి కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. 1982లో మైఖేల్‌ ఫాగన్‌ అనే వ్యక్తి ఏకంగా రాణి ఎలిజబెత్‌ పడకగదిలోకే చొరబడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 

ఇదీ చదవండి: అమానుషం : కుమార్తెకు విషమిచ్చి, గొంతు నులిమి పరువు హత్య

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement