breaking news
british prince william
-
బ్రిటిష్ యువరాజు ఇంట్లో దొంగలు, ఇద్దరు అరెస్ట్
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ విలియం, యువరాణి కేథరిన్ దంపతుల ఇంట్లోకి ఇద్దరు అక్రమంగా చొరబడటం కలకలం రేపుతోంది. లండన్‌కు సుమారు 171 కిలోమీటర్ల దూరంలోని సాండ్రింగ్ హామ్ ఎస్టేట్‌లో అన్మేర్ హాల్లో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ద సన్ పత్రిక కథనం తెలిపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ముసుగులు వేసుకున్న వ్యక్తులు లోనికి ప్రవేశించినట్లు ఈ కథనం తెలిపింది. అయితే ‘అన్మెర్ హాల్’వద్ద అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న నార్ఫ్లోక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణ మొదలుపెట్టారు. పోలీసు కుక్కలు, డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బ్రిటిష్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఇదిలా ఉండగా.. మంగళవారం లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌తో ప్రిన్స్ విలియం సమావేశమయ్యారు. అయితే చొరబాటు అంశంపై ఎలాంటి వ్యాఖలూ చేయలేదు. భద్రతకు సంబంధించిన అంశాలపై తాము స్పందించమని విలియం, కేట్ దంపతుల కార్యాలయం ‘కెన్సింగ్టన్ ప్యాలెస్’ఒక ప్రకటన విడుదల చేసింది. దివంగత రాణి ఎలిజబెత్–2 అన్మేర్హాల్ను విలియం, కేట్లకు వివాహ కానుకగా ఇచ్చారు. పది పడకలున్న ఈ భవనంలో విలియం, కేట్ దంపతులు వారాంతాల్లో మాత్రమే గడుపుతూంటారు. ఇదీ చదవండి: వైద్య చరిత్రలో అద్భుతం : పంది కిడ్నీతో 365 రోజులు!గతంలోనూ చొరబాట్లు.. బ్రిటన్ రాజకుటుంబ నివాసాల్లోకి దుండగులు చొరబడటం ఇదే మొదటిసారి కాదు. 2024 అక్టోబర్‌లో రాజు ఛార్లెస్, రాణి కెమిల్లాల విండ్సర్ క్యాజిల్ ఎస్టేట్‌లోకి చొరబడిన దొంగలు ఓ పికప్ ట్రక్కు, క్వాడ్ బైక్‌ను ఎత్తుకెళ్లారు. అంతకు మూడేళ్ల ముందు, విల్లు, బా ణాలతో విండ్సర్ క్యాజిల్ ప్రాంగణంలోకి ప్ర వేశించిన జస్వంత్ సింగ్ చైల్ అనే వ్యక్తిని భద్ర తా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏఐ చాట్‌బాట్ ప్రోద్బలంతో రాణి ఎలిజబెత్‌ను హత్య చేయడానికి వచ్చానని అంగీకరించడంతో అతడికి కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. 1982లో మైఖేల్ ఫాగన్ అనే వ్యక్తి ఏకంగా రాణి ఎలిజబెత్ పడకగదిలోకే చొరబడటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదీ చదవండి: అమానుషం : కుమార్తెకు విషమిచ్చి, గొంతు నులిమి పరువు హత్య -
పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్
బ్రిటన్‌లో వార్షిక ట్రూపింగ్ ది కలర్ సందర్భంగా ప్రిన్స్ విలయమ్స్ ఎదుట సైనికులు పరేడ్ రిహార్స్ల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు సైనికులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో లండన్‌లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు చేరుకోవడంతో.. సైనికులు ఆ వేడికి తాళ్లలేక స్ప్రుహ తప్పి పడిపోయారు. చక్రవర్తి అధికారిక పుట్టిన రోజు సందర్భంగా ప్రతి జూన్‌లో లండన్‌లో ట్రూపింగ్ ది కలర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు. అందుకోసం వార్షిక కవాతు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే విలియమ్స్ ఎదుట రిహార్సల్స్ చేస్తున్నారు సైనికులు. అదే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో..ఆ వేడికి తాళ్లలేక ముగ్గురు సైనికులు కుప్పకూలినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు ప్రిన్స్ విలియం సైనికులను కృతజ్ఞతలు తెలుపుతు ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో విలియమ్స్..ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడుకి చాలా కృతజ్ఞతలు. Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD — The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023 క్లిష్ట పరిస్థితుల్లో మీరు నిబద్ధతతో మీ విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏటా నిర్వహించే కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ వంతుగా కృషి చేస్తున్నందుకు ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. సైనికులు విధి నిర్వహణలో భాగంగా ఆ సమయంలో ఉన్ని ట్యూనిక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించడంతో ఎండకు తాళ్లలేకపోయారు. దీంతో స్ప్రుహ కోల్పోయిన ఆ సైనికులకు వైద్యులు తక్షణ చిక్సిత్స అందించారు. కాగా, జూన్ 17న అంగరంగ వైభవంగా జరగనున్న సదరు కార్యక్రమాన్ని చార్లెస్ III పర్యవేక్షిస్తారు. 💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5 — Reuters (@Reuters) June 10, 2023 (చదవండి: రన్‌వేపై రెండు ప్యాసింజర్ విమానాలు ఢీ..ప్రయాణికులకు తీవ్ర గాయాలు) -
జర్నలిస్టు ముద్దు.. లైట్ తీసుకున్న ఐష్
ముంబై: భారత్‌లో బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్ టన్ దంపతుల పర్యటన సందర్భంగా ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కోడలు, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పట్ల ఓ జర్నలిస్టు ప్రవర్తనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బ్రిటిష్ యువరాజు విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ పర్యటనలో భాగంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో యువరాజు దంపతులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారిలో నీలికళ్ల సుందరి ఐష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐష్‌ను చూసిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఈ సందర్భంలో ఓ జర్నలిస్ట్ ఐష్‌ని విష్ చేయగా.. దానికి ప్రతిస్పందించిన ఐష్ హాయ్ హౌ ఆర్ యూ అంటూ ముందుకొచ్చి అతనికి షేక్ హ్యండ్ ఇచ్చింది. అంతే.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ జర్నలిస్ట్ ఐష్ చేతిని ముద్దాడాడు. దీంతో అక్కడున్నవారంతా నివ్వెరపోయారు. ఐష్ మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా... హుందాగా నవ్వులు చిందిస్తూ ముందుకు కదిలారు.


