పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు | BJP Akali Dal alliance again in Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు

Nov 24 2026 12:24 PM | Updated on Nov 24 2026 12:24 PM

BJP Akali Dal alliance again in Punjab

ఢిల్లీ : పంజాబ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పేపథ్యంలో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను అధికారికంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్,  అకాళీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాధల్ ప్రకటించనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, షిరోమణి అకాలీదళ్ తిరిగి కూటమిగా ఏర్పడనున్నాయి. రైతు చట్టాలపై విభేదాలతో ఆరేళ్ల క్రితం 24 ఏళ్ల భాగస్వామ్యాన్ని ఇరు పార్టీలు వదులుకున్నాయి.

అయితే తాజా పొత్తులో భాగంగా సీట్ల పంపకం ఖరారుపై సీనియర్ నాయకులతో సమావేశం జరగనున్నది. ఆప్, కాంగ్రెస్‌కు ఈ కూటమి గట్టిపోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు. అకాలీదళ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌ఏడీకి కేవలం 3 సీట్లు (ప్రస్తుతం 2), బీజేపీకి 2 సీట్లు మాత్రమే దక్కాయి.

92 సీట్లు గెలుచుకుని ఆప్‌ అధికారంలోకి వచ్చింది. గతంలో బీజేపీ 23, ఎస్‌ఏడీ 94 సీట్లలో పోటీ పడ్డాయి. ఇప్పుడు బీజేపీ రెట్టింపు సీట్లు కోరుతున్నదని సమాచారం. ఎస్‌ఏడీ 70-75 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థి ప్రకటనపైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయంలో ఎస్‌ఏడీ తమ నాయకుడినే ముందుకు తీసుకురావాలని పట్టుబడుతోందని సమాచారం. 

ఇదీ చదవండి: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. సోనియాకు నోటీసులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement