చీరకట్టులో మహిళా పారిశ్రామికవేత్త సైకిల్‌ రైడ్‌..! | Indian Entrepreneur Rides Bicycle In Saree On Sheikh Zayed Road Dubai | Sakshi
Sakshi News home page

చీరకట్టులో మహిళా పారిశ్రామికవేత్త సైకిల్‌ రైడ్‌..!

Nov 24 2026 11:14 AM | Updated on Nov 24 2026 11:15 AM

Indian Entrepreneur Rides Bicycle In Saree On Sheikh Zayed Road Dubai

దుబాయ్‌లో చీర కట్టుకుని రెండు ప్రధాన ఫిట​్‌నెస్‌ ఛాలెంజ్‌లు పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు భారత సంతతి పారిశ్రామికవేత్త కాంచన నాయర్‌. సాంప్రదాయ దుస్తులలో షేక్‌ జాయెద్‌ రోడ్డుపై సైకిల్‌ తొక్కిన కొన్ని వారాల తర్వాత దుబాయ్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త ఆదివారం నాడు మళ్లీ అదే ప్రసిద్ధ రహదారిపై చీర కట్టుకుని 10 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. 14 ఏళ్ల క్రితం యూఏఈకి వలస వచ్చారామె. ఇది తన రెండొవ ఇల్లు అని గర్వంగా చెప్పింది. 

ఈ దేశం తనకెంతో ఇచ్చిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గర్వంగా పరిగెత్తానని అందుకు సంబంధించిన వీడీయోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఈ నేల చాలా అవకాశాలు, బలం, లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించినందుకుగానూ తన ప్రతి అడుగు ఒక నివాళి అని అన్నారు. తన మూలాలు భారత్‌లో ఉన్నాయని, కానీ యూఏఈకి తన హృదయంలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. 

అలాగే ఆమె ఈ నెల ప్రారంభంలో చీరకట్టులో సైకిల్‌ తొక్కిన అనుభవాన్ని కూడా పంచుకున్నారామె. చీరలో కేరళ పిరవి గర్వంగా దుబాయ్‌ రైడ్‌. ప్రతి రోజూ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే జాయెద్‌ రోడ్డు నుంచి దుబాయ్‌ రైడ్‌. ఇది తనకు మర్చిపోలేని అనుభవం అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. తానొక మలయాళీ మహిళా స్ఫూర్తితో ప్రయాణించానని అన్నారామె. కాగా, గతేడాది కూడా తను దుబాయ్‌ రైడ్‌లో పాల్గొనాలని అనుకున్నారట. 

 

కానీ రిజిస్ట్రేషన్‌ గడువుని కోల్పోయానని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశాన్ని కోల్పోకూడదనే పట్టుదలతో ఈ కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు రిజిస్ట్రేషన్‌ ఖరారు చేసుకుఇని, గులాబీరంగు సైకిల్‌ను తీసుకొన్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత మళ్లీ సైకిల్‌ తొక్కడం, అది కూడా చీరలో ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వలేదన్నారు. దారిపొడవునా పాటలు పాడుకుంటూ ఎంజాయ్‌ చేస్తూ వెళ్లానన్నారు. 

దుబాయ్‌ రన్‌ ప్రత్యేకత ఏంటంటే..
దుబాయ్ రన్ అనేది సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏటా నిర్వహించే, ఉచితంగా పాల్గొనగల ఒక సరదా పరుగు పోటీ. ఇది దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా, కార్లు లేని షేక్ జాయెద్ రోడ్‌లో జరుగుతుంది. దీనిని మొదటిసారిగా 2019లో ప్రారంభించారు. 

ఈ ఈవెంట్ కేవలం రన్నర్లనే కాకుండా, అన్ని వయసుల జాగింగ్‌, వాకింగ్‌ చేసేవారిని కూడా ఒకచోట చేర్చుతుంది. ఈ ఏడాది ఈ ఈవెంట్‌ను నవంబర్ 22న నిర్వహించారు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ కార్యక్రమంలో అన్ని వయసుల,  సామర్థ్యాలకు చెందిన 3 లక్షల మందికి పైగా పాల్గొన్నారు.

 

ఇదీ చదవండి: పెళ్లి లెహంగాలోనే నవవధువు పుల్-అప్స్..! ఏకంగా వంద కేజీల..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement