హర్యానా గాయని, ప్రముఖ డ్యాన్సర్ సప్నా చౌదరి, ఆరేళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పనుంది. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇటీవల ఆయనపై గృహహింస కేసు నమోదు చేసింది. తాజాగా భర్త యశ్‌వీర్ సాహు(వీర్ సాహు) నుండి విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. మాజీ 'బిగ్ బాస్' కంటెస్టెంట్ సప్నా ఇటీవల 'ఎన్‌ఎమ్‌ఎఫ్ న్యూస్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సందర్భంగా ప్రేమ, నమ్మకద్రోహం, వివాహం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను వివరించింది.
అంతా సవ్యంగా ఉన్నంత కాలం కలిసే ముందుకు సాగదని అనిపించినప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నామని, తమ బంధం విచ్ఛిన్నం కావడానికి కారణాలు కేవలం తనకు, వీర్‌కు మాత్రమే తెలుసు అన్నారు. అలాగే తనకు నమ్మకద్రోహం జరిగిందన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రేమ అంటే కేవలం శారీరకమైనది కాదని, ప్రేమ ఆత్మకు సంబంధించినది. ఇందులో భావోద్వేగాలుంటాయి కానీ పురుషులు ఎక్కువగా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారని, మహిళలు మాత్రం తరచుగా భావోద్వేగాలకు లోనవుతారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!
ఆరేళ్ల బంధం, ఇద్దరు పిల్లలు, గుర్తింపులేదు : సప్నా చౌదరి
వివాహం తన జీవితంపై, కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిందో కూడా సప్నా గుర్తుచేసుకుంది. 'బిగ్ బాస్' షో తర్వాత తనకు విపరీతమైన పాపులారిటీ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించింది. భార్యగా, తల్లిగా, కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పటికీ, చివరికి తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవడం మానేశానని గ్రహించినట్టు పేర్కొంది. . కుటుంబ బాధ్యతలు, కెరీర్‌ను బ్యాలెన్స్ చేసే క్రమంలో ఎక్కడో ఒకచోట తన వ్యక్తిగత గుర్తింపును, వృత్తిపరమైన ఆశయాలను కోల్పోయానని వాపోయింది. వీర్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఏదీ లేదని కూడా సప్నా స్పష్టం చేసింది. తనను తాను గాఢంగా ప్రేమించే వ్యక్తిగా అభివర్ణించుకున్న ఆమె, తన ప్రేమకు అర్హుడైన వ్యక్తి దొరికితేనే మరో బంధంలోకి అడుగుపెట్టే విషయం ఆలోచిస్తానని తెలిపింది.
1990 సెప్టెంబర్ 25న జన్మించిన సప్నా చౌదరి కేవలం ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు మాత్రమే చదువుకున్నారు. ఎంతో కష్టపడి ఒక్కోమెట్టు ఎదుగుతూ వచ్చిన సప్నా ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం సుమారు రూ. 25 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఏదైనా ఈవెంట్‌లో రెండు మూడు గంటల ప్రదర్శనకు దాదాపు రూ. 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం.. 2022 నాటికి సప్నా చౌదరి నికర ఆస్తుల విలువ సుమారు రూ. 50 కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి :బుడ్డోడి ఫోజులకు ఫిదా : సర్‌ప్రైజ్ ఆఫర్
2020లొ గాయకుడు, నటుడు వీర్ సాహును వివాహం చేసుకుంది. ఈ జంట తమ పెళ్లి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. వీరికి మొదటి బిడ్డ పుట్టిన తర్వాతే వీరి వివాహ వార్త బయటకు వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హర్యానీ సంగీతం, నృత్య ప్రదర్శనల ద్వారా సప్నా ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత 'బిగ్ బాస్' 11వ సీజన్‌లో పాల్గొనడం ద్వారా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఇదీ చదవండి: 100 అడుగుల కరెన్సీ దండ : పెళ్లికి బామ్మర్ది సర్‌ప్రైజ్


