కంటేనే.. అమ్మానాన్న కాదు..! | Tia Bhatia: They were told to replace her and what her parents did | Sakshi
Sakshi News home page

Tia Bhatia: అవధులు లేని ప్రేమ ఈ అమ్మానాన్నలది! తండ్రి మాత్రం..

Nov 22 2026 4:56 PM | Updated on Nov 22 2026 5:16 PM

Tia Bhatia: They were told to replace her and what her parents did

కని పెంచిన తల్లిదండ్రులకు మించి గొప్ప శ్రేయోభిలాషులు మరొకరు ఉండరనేది జగమెరిగిన సత్యం. కానీ కన్నప్రేమకు మించిన నిస్వార్థ ప్రేమను చాటుకుని ఆదర్శంగా నిలిచారు ఈ తల్లిదండ్రలు. అంతేగాదు అమ్మానాన్న అన్న మాటకు అసలైన అర్థంగా మారారు. 

Tias adoption story: ఆ దపంతులే నవ్‌ భాటియా, అర్విందర్‌ కౌర్‌లు. కెనడాకు చెందిన ఈ దంపతులకు తల్లిదండ్రులు  అవ్వాలని ఎంత ఆశాగానో ఎదురుచూశారు. అయితే ఎందువల్లనో ఆ జంటకు పిల్లలు కలగలేదు. దాంతో ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకున్నారు. అందుకోసం 1990 ఆ టైంలో హర్యానాలోని అంబాలాలో ఒక అనాథశ్రమమలో తొమ్మిది మంది పిల్లలను దత్తతకు ఇవ్వనున్నట్లు తెలుసుకున్నారు. 

అయితే భర్త నవ్‌ భాటియాకి పని ఒత్తిడి వల్ల హర్యానాకు వచ్చే అవకాశం లేకపోవడంతో అర్విందర్‌ కౌర్‌నే భారత్‌కి వచ్చి ఆ ఆశ్రమంలో దత్తత ఇవ్వనున్న ఆ తొమ్మదిపిల్లలను చూసేందుకు వచ్చారు. దత్తతకు ముందు వరసలో పెట్టిన చిన్నారినే ఆమె ఎంపిక చేసుకున్నారు. ఈ చిన్నారిని ఆమె తల్లిదండ్రలే అనాధశరణాలయంలో వదిలేశారట. అప్పుడు ఆమె చాలా బలహీనంగా ఎముకలు బయటకు కనిపించేలా ఉండేదట. 

అయినప్పటికీ..ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చి ఆమెతో సంతోషంగా గడుపుతుండగా..అమాంతం పిడుగు పడ్టట్టు ఓ బాధకర ఘటన అనూహ్యంగా ఎదురైంది ఆ జంటకు. ఆ చిన్నారితో కొన్ని నెలలు గడవక ముందే..అంటే దత్తత తెచ్చుకున్నాం అనే ఆనందం ముగిసిపోక ముందే..ఒక చేదు వార్త ఒక పరీక్షలా ఎదురైంది. ఆ చిన్నారికి వాళ్లు టియా అని నామకరణం చేశారు. ఆ చిన్నారి ముద్దూ మురిపెంలో మునిగి తేలక ముందే.. ఆమె హార్ట్‌లో రంధ్రం ఉందని తక్షణమే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. 

దాంతో అరవింద్‌ కౌర్‌ సదరు అనాథ శరణాలయంలోకి ఫోన్‌ చేసి విషయం తెలిపారు. వాళ్లు వెంటనే  ఆ పాపను ఇచ్చేసి..మీరు మరో పాపను దత్తత తీసుకోండి అని అన్నారు..ఒక్కసారిగా ఈ దంపతులకు చాలా కోపం వచ్చింది. అదేమి బొమ్మ కాదు మార్చుకోవడానికి ప్రాణాతో ఉన్న ఒక మనిషి, మన కూతురు అని భావోద్వేగంగా అన్నారు. 

తాము కేవలం విషయం తెలియజేయడానికే ఫోన్‌ చేశామంటూ ఫోన్‌ పెట్టేశారు  ఆ దంపతులు. ఆవేళ ఈ చిన్నారి పట్ల ఆ జంట తమ విశాల హృదయాన్ని చూపడమే కాదు..ఆమెకు ఆత్మీయతతో కూడిన ప్రేమానురాగాలను పంచారు. తను ఈ ప్రపంచానికి చెందినదానినేనా అనే సందేహం రానివ్వకుండా గుండెల్లో పెట్టకుని పెంచుకున్నారు. అతేగాదు అరవింద్‌ కౌర్‌ ఆ చిన్నారి నోట నుంచి ‘అమ్మా’ అన్న పిలుపు కోసం..పదే పదే పట్టించుకోనట్లు నటిస్తూ ఉండేదని టియా తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. 

అంతేగాదు వాళ్లు తనని దత్తత తీసుకోలేదని, తమనే నీవు దత్తత తీసుకున్నానవని అంటుంటారని సంతోషంగా చెబుతోంది టియా. ప్రస్తుతం టియా భాటియా కెనడాలోని టొరంటోలో నివశిస్తోంది. ఆమె ఒక నటి, యూట్యూబర్‌, డిజిటల్‌ క్రేయటర్‌. తన దత్తత ప్రయాణం గురించి బహింరంగా మాట్లాడటమే కాదు..కుటుంబం అనేది ప్రేమ మీదే ఆధారపడి ఉంటుందని, రక్త సంబంధం మీద కాదని చెప్పేందుకేనని అంటుండటం విశేషం. 

ప్రస్తుతం ఆమె వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నట్టు తెలిపింది. అంతేగాదు టియా ఇది తనకు రెండో అవకాశం ఇవ్వడానికి మించిందని, అందుకు తన తల్లిదండ్రులకు సదా కృతజ్ఞతలు చెబుతూనే ఉంటానని అంటోందామె. అయితే తన తండ్రి భిన్నంగా ఆలోచిస్తారని, ఆయన ఎప్పుడు ‘నువ్వే మమల్ని దత్తత తీసుకున్నావు, మేం కాదు’ అదే చెప్పు అని అంటారని నవ్వుతూ చెబుతోంది. ఈ కథ నిజంగా కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని రుజువు చేసింది కదూ..!.

ఇదీ చదవండి: 64 ఏళ్ల నాటి సూప్‌ డబ్బా పెయింటింగ్..అన్ని కోట్లు ఖరీదా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement