Photo Credit: Twitter
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్యానా బ్యాటర్లు సిక్సర్ల జడివానతో స్టేడియం తడిసి ముద్దయింది. మ్యాచ్‌లో ఏకంగా 17 సిక్సర్లు నమోదవ్వడంతో హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 246 పరుగుల భారీ స్కోరు చేసింది.
వికెట్‌కీపర్ యశ్‌వర్ధన్ దలాల్ (46 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ అంకిత్ రాజేశ్ (21 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థసెంచరీలు సాధించగా, చివర్లో సమంత్ జఖర్ (19 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సుమిత్ కుమార్ (9 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు.
రైల్వేస్ బౌలర్లలో అందరు బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకోగా, రాహుల్ శర్మ, శివమ్ చౌదరీ, రాజ్ చౌదరీ, మొహమ్మద్ సైఫ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టోర్నీ చరిత్రలో హర్యానాకు ఇది రెండో అత్యధిక స్కోరు. గతంలో 2024లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. గతేడాది ముంబైతో మ్యాచ్‌లో 234 పరుగులు చేసినప్పటికీ, హర్యానా ఓటమి చవిచూసింది.
Just 20, already delivering important runs for Haryana across all three formats. Remember the name. Yashvardhan Dalal. #YashvardhanDalal #RLWvHAR #SMAT https://t.co/LzwVjlMrW7 https://t.co/h8nTh730kU
— MS (@ThirdManAngle) November 20, 2026


