విజేతగా పాకిస్తాన్‌.. బహిష్కరించిన భారత క్రికెట్‌ జట్టు | Indian Blind Cricket Team Boycotts Asia Cup Ceremony Pakistan Declared Winner | Sakshi
Sakshi News home page

విజేతగా పాకిస్తాన్‌.. బహిష్కరించిన భారత క్రికెట్‌ జట్టు

Nov 20 2026 6:59 PM | Updated on Nov 20 2026 7:10 PM

Indian Blind Cricket Team Boycotts Asia Cup Ceremony Pakistan Declared Winner

PC: CABI X

ఆసియా కప్‌-2026 అంధుల టీ20 క్రికెట్‌ టోర్నీలో పాకిస్తాన్‌ పురుషుల జట్టును విజేతగా ప్రకటించారు. ఢాకా వేదికగా శుక్రవారం భారత్‌- పాక్‌ జట్ల  మధ్య ఫైనల్‌ జరగాల్సి ఉండగా.. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దైపోయింది.

అవార్డుల కార్యక్రమం బహిష్కరణ
ఈ నేపథ్యంలో రన్‌రేటు పరంగా పాకిస్తాన్‌ జట్టు మెరుగ్గా ఉందనే కారణంతో పాక్‌ జట్టును విజేతగా నిర్ణయించారు. దీంతో భారత అంధుల క్రికెట్‌ అసోసియేషన్‌ (CABI) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించడంతో పాటు.. ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే మున్ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడబోమని హెచ్చరించింది.

ఈ విషయం గురించి CABI ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. ‘‘ఫైనల్‌ ఆడకుండానే పాకిస్తాన్‌కు ట్రోఫీ ఇచ్చేశారు. ప్రపంచ అంధుల క్రికెట్‌ మండలి (WBCC) అధ్యక్షుడు, పాకిస్తాన్‌ అంధుల క్రికెట్‌ మండలి చీఫ్‌ సుల్తాన్‌ షా.. WBCC టెక్నికల్‌ కమిటీ నిబంధనలను ఉల్లంఘించారు.

రూల్‌ ప్రకారం ఇద్దరూ విజేతలే
రూల్‌ ప్రకారం మ్యాచ్‌ రద్దైపోయినపుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. రిఫరీ ఇదే నిర్ణయం తీసుకుంటారు. కానీ సుల్తాన్‌ షా ఈ నిబంధనను తుంగలో తొక్కేశారు. CABI ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దైన కారణంగా భారత్‌- పాక్‌ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సింది. 

కానీ అలా జరుగలేదు. WBCC దృష్టికి మేము ఈ విషయాన్ని తీసుకువెళ్లాము. అందుకు వాళ్లు అంగీకరించారు కూడా. కానీ సుల్తాన్‌ షా రిఫరీని ఒత్తిడి చేసి పాకిస్తాన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేశారు. అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి పనులు చేయడం టోర్నీ విశ్వసనీయతనే దెబ్బ తీస్తుంది. మేము దీనిని వ్యతిరేకిస్తున్నాం’’ అని తెలిపింది.

నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం
ఇక ఈ వివాదంపై భారత జట్టు కెప్టెన్‌ టి.దుర్గారావు స్పందిస్తూ.. ‘‘ఫైనల్‌ రద్దైన తర్వాత రిఫరీ మమ్మల్ని పిలిచి.. రన్‌రేటు ఆధారంగా పాకిస్తాన్‌ను విజేతగా.. మమ్మల్ని రన్నరప్‌గా ప్రకటిస్తామని చెప్పారు.

ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. దీనిని వ్యతిరేకిస్తున్నామని మేము రిఫరీకి చెప్పేశాము. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఇరుజట్లను విజేతగా ప్రకటిస్తారు. కానీ వీళ్లు అలా చేయలేదు. నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం’’ అని స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: రాణించిన పృథ్వీ షా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుపులు.. ఆఖరి బంతికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement