Photo Credit: Twitter
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ అబ్బాస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ అబ్బాస్ 2026 ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తొలి స్థానంలో నిలిచాడు.
ఇప్పటివరకు మొహమ్మద్ అబ్బాస్ 39 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ (33 వికెట్లు) ఉండగా, మిచెల్ స్టార్క్ (32 వికెట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లా బౌలర్ మెహిది మిరాజ్ (28 వికెట్లు), ఓలీ రాబిన్సన్ (28 వికెట్లు), హసన్ మహ్ముద్ (27 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. స్టార్క్ 73 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ 64 వికెట్లతో రెండో స్థానంలో, సౌతాఫ్రికా బౌలర్ సిమోన్ హార్మర్ (50 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు.
భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (43 వికెట్లు), ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ (41 వికెట్లు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ (40 వికెట్లు) ఆరో స్థానంలో ఉండగా.. 2026లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న మొహమ్మద్ అబ్బాస్ 39 వికెట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 316 పరుగులకు ఆలౌటైంది. 90 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇదీ చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ


