breaking news
Mohammad Abbas Afridi
-
టెస్టు క్రికెట్లో పాక్ బౌలర్ అరుదైన ఫీట్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ అబ్బాస్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మొహమ్మద్ అబ్బాస్ 2026 ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు మొహమ్మద్ అబ్బాస్ 39 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ (33 వికెట్లు) ఉండగా, మిచెల్ స్టార్క్ (32 వికెట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లా బౌలర్ మెహిది మిరాజ్ (28 వికెట్లు), ఓలీ రాబిన్సన్ (28 వికెట్లు), హసన్ మహ్ముద్ (27 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కొనసాగుతున్నాడు. స్టార్క్ 73 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ 64 వికెట్లతో రెండో స్థానంలో, సౌతాఫ్రికా బౌలర్ సిమోన్ హార్మర్ (50 వికెట్లు) మూడో స్థానంలో ఉన్నారు. భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ (43 వికెట్లు), ఇంగ్లండ్ స్టార్ జోఫ్రా ఆర్చర్ (41 వికెట్లు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు. విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ (40 వికెట్లు) ఆరో స్థానంలో ఉండగా.. 2026లో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న మొహమ్మద్ అబ్బాస్ 39 వికెట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 316 పరుగులకు ఆలౌటైంది. 90 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.ఇదీ చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీNZ Vs IND: 'పేరు కారణంగానే సిరాజ్‌ను తప్పించారు!' -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆరోజే!
హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ జట్టుకు అనుభవజ్ఞుడైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అబ్బాస్ ఆఫ్రిదిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది.నాలుగు గ్రూపులుకాగా మోంగ్ కాక్ వేదికగా అక్టోబరు 30 నుంచి నవంబరు 1 మధ్య హాంకాంగ్ సిక్సెస్ తాజా ఎడిషన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గ్రూప్-‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా, హాంకాంగ్-చైనా... ఇంగ్లండ్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్.. గ్రూప్- ‘సి’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ.. గ్రూప్-‘డి’ నుంచి సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్, ఒమన్ తలపడనున్నాయి.ఇరుజట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే ఈ టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్లో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్టులోకి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తాయి. పాక్ ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.భారత జట్టు సారథిగా భువీఇక ఈసారి హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టుకు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథిగా ఎంపికయ్యాడు. అయితే, టీమిండియా పునరాగమనం, న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో భువీ ఈ టోర్నీ నుంచి తప్పుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గ్రూప్-‘సి’ మ్యాచ్‌లో భాగంగా భారత్- పాక్ అక్టోబరు 30న తలపడనున్నాయి. కాగా గత ఎడిషన్‌లో పాక్ విజేతగా నిలిచింది.హాంకాంగ్ సిక్సెస్-2026 టోర్నీకి పాకిస్తాన్ జట్టుమహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అహ్మద్ దనియాల్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఖవాజా నఫే, ముహమ్మద్ షాజాద్, సాద్ మసూద్.చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే!


