పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్‌ ఆరోజే! | Hong Kong Sixes 2026 PCB Announces Pakistan Squad | Sakshi
Sakshi News home page

Hong Kong Sixes: పాకిస్తాన్‌ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్‌ ఆరోజే!

Oct 9 2026 11:47 AM | Updated on Oct 9 2026 11:55 AM

Hong Kong Sixes 2026 PCB Announces Pakistan Squad

PC: PCB/X

హాంకాంగ్‌ సిక్సెస్‌ 2026 టోర్నీకి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ జట్టుకు అనుభవజ్ఞుడైన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అబ్బాస్‌ ఆఫ్రిదిని కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

నాలుగు గ్రూపులు
కాగా మోంగ్‌ కాక్‌ వేదికగా అక్టోబరు 30 నుంచి నవంబరు 1 మధ్య హాంకాంగ్‌ సిక్సెస్‌ తాజా ఎడిషన్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. గ్రూప్‌-‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా, హాంకాంగ్‌-చైనా... ఇంగ్లండ్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌.. గ్రూప్‌- ‘సి’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ.. గ్రూప్‌-‘డి’ నుంచి సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌, ఒమన్‌ తలపడనున్నాయి.

ఇరుజట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసే ఈ టోర్నీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) గుర్తింపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్లో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్టులోకి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తాయి. పాక్‌ ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

భారత జట్టు సారథిగా భువీ
ఇక ఈసారి హాంకాంగ్‌ సిక్సెస్‌ టోర్నీలో భారత జట్టుకు వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సారథిగా ఎంపికయ్యాడు. అయితే, టీమిండియా పునరాగమనం, న్యూజిలాండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో భువీ ఈ టోర్నీ నుంచి తప్పుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-‘సి’ మ్యాచ్‌లో భాగంగా భారత్‌- పాక్‌ అక్టోబరు 30న తలపడనున్నాయి. కాగా గత ఎడిషన్‌లో పాక్‌ విజేతగా నిలిచింది.

హాంకాంగ్‌ సిక్సెస్‌-2026 టోర్నీకి పాకిస్తాన్‌ జట్టు
మహ్మద్‌ అబ్బాస్‌ ఆఫ్రిది (కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అహ్మద్‌ దనియాల్‌, ముహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, ఖవాజా నఫే, ముహమ్మద్‌ షాజాద్‌, సాద్‌ మసూద్‌.

చదవండి: సెలక్టర్లతో మాట్లాడాను.. టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement