source: BCCI X
హాంకాంగ్ సిక్సస్ 2026 టోర్నీకి భారత జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు ఆర్సీబీ స్టార్ బౌలర్, టీమిండియా వెటరన్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరుగనున్న ఈ టోర్నీ కోసం భారత్ బలమైన జట్టును ఎంపిక చేసింది.
ఈ జట్టులో మొత్తం టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు. భువీ ఆర్సీబీ సహచరుడు కృనాల్ పాండ్యా, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ నితీశ్ రాణా, పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ టి నటరాజన్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా, రాహుల్ త్రిపాఠి ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
మూడేళ్ల తర్వాత రీఎంట్రీ
ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్న భువనేశ్వర్ కుమార్ దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టుకు ఎంపికయ్యాడు. అది కూడా కెప్టెన్‌గా. భువీ ఇటీవల ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దేశవాలీ టీ20 టోర్నీల్లో సత్తా చాటాడు. వాస్తవానికి భువీని భారత సీనియర్ జట్టుకే ఎంపిక చేయాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే సెలెక్టర్లు ముందుగా హాంగ్‌కాంగ్ సిక్సస్ లాంటి కీలక టోర్నీకి ఎంపిక చేశారు.
హాంకాంగ్ సిక్సస్‌కు భారత జట్టు
భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, నితీశ్ రాణా, శశాంక్ సింగ్, టి. నటరాజన్, రాహుల్ త్రిపాఠి, రాహుల్ తెవాతియా
ఇదీ చదవండి: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!


