టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌! | Anukul Roy Replaces Naman Dhir In India A Squad For Australia One-Day Series: Report | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌!

Oct 5 2026 1:43 PM | Updated on Oct 5 2026 1:48 PM

Anukul Roy Replaces Naman Dhir In India A Squad For Australia One-Day Series: Report

PC: BCCI/X

ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న మూడు అనధికారిక వన్డేల సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నమన్ ధీర్ వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌కు భారత జాతీయ జట్టులోకి ఎంపిక కావడంతో, అతడి స్థానంలో జార్ఖండ్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌ను ఇండియా-ఎ జట్టులోకి తీసుకున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్‌‌ను తొలగించడంతో నమన్ ధీర్‌కు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు లభించింది.

దీంతో నమన్‌కు ప్రత్యామ్నాయంగా అనుకుల్ సరైన ఆటగాడని భావించిన సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన అనుకుల్ రాయ్ ఇప్పటికే పుదుచ్చేరిలో ఇండియా-ఎ జట్టుతో కలిశారు.

అనుకుల్ రాయ్‌కి వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో వచ్చి మెరుపు బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. ఈ ఇండియా-ఎ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియా-ఎ జట్టులోనూ మార్పులు జరిగాయి. ఆల్‌రౌండర్లు జాక్ ఎడ్వర్డ్స్, ఆరోన్ హార్డీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సిరీస్‌కు దూరం కాగా.. వారి స్థానాల్లో రిలే మెరెడిత్, విల్ సదర్లాండ్‌లను జట్టులోకి తీసుకున్నారు. కాగా ఈ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ అక్టోబర్‌ 6న పుదుచ్చేరి వేదికగా జరగనుంది.

ఆసీస్‌తో సిరీస్‌కు భారత-ఎ జట్టు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ప్రియాన్ష్‌ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, కుమార్ కుషాగ్రా, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, అనుకుల్‌ రాయ్‌, సూర్యాన్ష్‌, ప్రభ్‌సిమ్రన్ సింగ్, గ్రూర్ సింగ్, గుర్జప్‌నీత్ సింగ్, యశ్ ఠాకూర్
చదవండి: స్లో ఓవ‌ర్ రేట్ దెబ్బ‌.. భారత్‌, వెస్టిండీస్‌లకు జరిమానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement