‘ఇంకెన్నాళ్లు బెంచ్‌ మీదే ఉంటాడు.. టీమిండియాకు మంచిది కాదు’ | It is not good for him or Indian side: Ambati Rayudu On IND Star 2nd ODI vs NZ | Sakshi
Sakshi News home page

‘ఇంకెన్నాళ్లు బెంచ్‌ మీదే ఉంటాడు.. టీమిండియాకు మంచిది కాదు’

Nov 4 2026 8:42 PM | Updated on Nov 4 2026 8:54 PM

It is not good for him or Indian side: Ambati Rayudu On IND Star 2nd ODI vs NZ

టీమిండియా హెడ్‌కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ గిల్‌ (PC: BCCI X)

న్యూజిలాండ్‌ గడ్డ మీద టీ20 సిరీస్‌ను 3-2తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. ఆక్లాండ్‌లో బుధవారం నాటి తొలి వన్డేలో కివీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇక కివీస్‌- భారత్‌ జట్ల మధ్య శనివారం నాటి రెండో వన్డేకు వెల్లింగ్‌టన్‌ వేదిక. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు చోటు కల్పించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు.

గత రెండేళ్లలో ఇలా
వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి సౌతాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో కుల్దీప్‌నకు కావాల్సినంత ప్రాక్టీస్‌ ఉండాలని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా గత రెండేళ్లలో టీమిండియా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో 35 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడింటిలో మాత్రమే కుల్దీప్‌ను ఆడించారు.

ఇక తాజాగా న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లలోనూ కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. తొలి వన్డేలోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు కుల్దీప్‌ యాదవ్‌కు మద్దతుగా నిలిచాడు.

పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో
‘‘పిచ్‌ పరిస్థితులను బట్టే బౌలింగ్‌ విభాగం కూర్పు ఉంటుంది. న్యూజిలాండ్‌లో ఎక్కువగా బౌన్సీ వికెట్లే ఉంటాయి. కాబట్టి ఫాస్ట్‌బౌలర్లకే అవకాశాలు వస్తాయి. అయితే, పేసర్లు కాస్త అలసిపోయినట్లు అనిపిస్తే.. పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో మహ్మద్‌ సిరాజ్‌ వంటి వాళ్లకు చోటిస్తారు.

ఇంకెన్నాళ్లు బెంచ్‌ మీదే ఉంటాడు.. టీమిండియాకు మంచిది కాదు
ఇక తొలి వన్డేలో విజయం తర్వాత తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఒక్క మార్పునకు అవకాశం ఉన్నా.. కుల్దీప్‌ను ఆడించాలి. సుదీర్ఘకాలం పాటు అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం అతడితో పాటు టీమిండియాకు ఎంతమాత్రం మంచిది కాదు. అతడిని పరీక్షించాలి. అందుకోసం తుదిజట్టులో చోటివ్వాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు.

కాగా కుల్దీప్‌ యాదవ్‌కు బదులు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అక్షర్‌ పటేల్‌, నమన్‌ ధీర్‌లకు యాజమాన్యం పెద్దపీట వేస్తోంది. కివీస్‌తో ఐదో టీ20కి అక్షర్‌ దూరంగా ఉండగా వరుణ్‌ చక్రవర్తిని ఆడించారు.. కానీ కుల్దీప్‌ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక తొలి వన్డేలోనూ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కుల్దీప్‌ను పక్కనపెట్టేశారు.

ఇవీ చదవండి: రోహిత్‌ భాయ్‌ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు: గిల్‌
అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement