పరుగుల వరద.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన అనామక బ్యాటర్‌ | Chinmay Sutar has broken all time world record for most runs scored in first six innings after making debut | Sakshi
Sakshi News home page

పరుగుల వరద.. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టిన అనామక బ్యాటర్‌

Nov 4 2026 6:01 PM | Updated on Nov 4 2026 6:22 PM

Chinmay Sutar has broken all time world record for most runs scored in first six innings after making debut

source: X

భారత దేశవాళీ క్రికెట్‌లో ఇటీవలి కాలంలో ఓ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడే చిన్మయ్‌ సుతార్‌. ముంబైలో జన్మించిన ఈ అనామక బ్యాటర్‌ ప్రస్తుతం మిజోరం జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

సుతార్‌ కొద్ది రోజుల కిందట రంజీ ట్రోఫీలో క్వాడ్రపుల్‌ సెంచరీ (400) చేసి చరిత్ర సృష్టించాడు. బిబి నింబాల్కర్‌ తర్వాత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

సుతార్‌ తాజాగా మరో భారీ ఘనత సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం తర్వాత తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు (834) చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు బషీర్ షా (831) పేరిట ఉండిన ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

బషీర్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తన తొలి ఇన్నింగ్స్‌ల్లో 831 పరుగులు చేస్తే.. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు చిన్మయ్‌కు కేవలం​ 5 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. మిజోరం తరఫునే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్మయ్‌ తన తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 35, 99, 400 నాటౌట్‌, 125, 175 స్కోర్లు చేశాడు.

ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 175 పరుగులు చేయడంతో చిన్మయ్‌ ఈ భారీ రికార్డు సాధించాడు. చిన్మయ్‌ రికార్డు శతకం కారణంగా మిజోరం ఈ మ్యాచ్‌పై పట్టు సాధించింది. 

ఇదీ చదవండి: కోహ్లి మెరుపులు.. తొలి వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement