శుబ్‌మన్ గిల్ (Photo Credit: Sonysports X)
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. కివీస్‌ను తొలుత 180 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్... డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. 22.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.
ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు అనంతరం భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్‌లో కూడా అదరగొట్టేశాము.
అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది
ముఖ్యంగా రోహిత్ భాయ్ డారిల్ మిచెల్‌ను రనౌట్ చేసిన తీరు అద్భుతం. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీని విడదీయడం మాకు కలిసి వచ్చింది. వాళ్లిద్దరు గతంలో ఇండియాలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
Shanagiri and Reflexes both getting better with age for the Hitman 😍 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony LIV & Sony Vizha. #SonySportsNetwork #SonyLIV #SonyVizha #NZvIND https://t.co/NlYb7LRmHV
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
ఏదేమైనా మా జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్షుల్‌కు ఇలాంటి పిచ్‌లు కొట్టిన పిండిలాంటివే. బ్రార్ కూడా అదనపు బౌన్స్‌తో అద్బుతం చేశాడు. వర్షం తర్వాత పిచ్ మరింతగా మారిపోయింది. అందుకే లక్ష్యాన్ని తగ్గించారు.
విరాట్ భాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి
అయితే, విరాట్ భాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మా గెలుపును సులువు చేశాడు. వెల్లింగ్‌టన్‌లోనూ నిలకడైన ప్రదర్శనతో ఇలాంటి ఫలితమే పునరావృతం చేసేందుకు పట్టుదలగా ఉన్నాము’’ అని శుబ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
Chasing targets, setting standards. Virat Kohli makes it look all too effortless! 👏 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha and Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/qna13184JZ
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
కాగా డారిల్ మిచెల్ (28), గ్లెన్ ఫిలిప్స్ (30) కివీస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. రోహిత్ పక్షిలా గాల్లోకి ఎగిరి మిచెల్‌ను అవుట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 37 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 74) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కివీస్‌ను దెబ్బకొట్టిన పేసర్ అన్షుల్ కాంబోజ్ (2-22)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అతడు మిచెల్ సాంట్నర్ (4), నాథన్ స్మిత్ (1) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇవీ చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి


