యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును జింబాబ్వే క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రిచర్డ్ నగరావ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో జింబాబ్వే జట్టు పగ్గాలను యువ ఆల్‌రౌండర్ బ్రియాన్ బెన్నెట్‌కు సెలక్టర్లు అప్పగించారు. నవంబర్ 5 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అలాగే చివరిగా డిసెంబర్ 2017లో టెస్ట్ మ్యాచ్ ఆడిన వెటరన్ లెగ్ స్పిన్నర్ గ్రేమ్ క్రీమర్ తిరిగి రెడ్ బాల్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దాదాపు అతడు 9 ఏళ్ల తర్వాత అతడు జింబాబ్వే తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
అంతేకాకుండా బెల్జియం పౌరసత్వం కలిగిన యువ బ్యాటర్ యాంటమ్ నఖ్వీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది
అతడు బెల్జియంలో జన్మించినప్పటికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రం జింబాబ్వేలోనే ఆడుతున్నాడు. 2024 జనవరిలో జరిగిన లోగాన్ కప్ టోర్నమెంట్‌లో మిడ్ వెస్ట్ రైనోస్ జట్టు తరఫున ఆడుతూ 295 బంతుల్లోనే 300 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
జింబాబ్వే దేశీవాళీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అతడు చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిని 2024లో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు, అలాగే 2025లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
అయితే పౌరసత్వం, పేపర్‌వర్క్ వంటి సాంకేతిక కారణాల వల్ల అతడికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు అతడికి ఐసీసీ నుంచి జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో అఫ్గాన్ సిరీస్‌లో జింబాబ్వే తరపున డెబ్యూ చేసే ఛాన్స్ ఉంది.
జింబాబ్వే టెస్ట్ జట్టు: బ్రియాన్ బెన్నెట్ (కెప్టెన్), అంటుమ్ నఖ్వీ, బెన్ కర్రాన్, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రాడ్ ఎవాన్స్, బ్రెండన్ టేలర్, క్రెయిగ్ ఎర్విన్, గ్రేమ్ క్రీమర్, ఇన్నోసెంట్ కైయా, ఎర్నెస్ట్ మసుకు, కుండై మతిగిము, న్యూమాన్ న్యామ్‌హురి, తడివానాషే మారుమణి, తఫద్జ్వా త్సిగా, విన్సెంట్ మసెకేసా, వెల్లింగ్టన్ మసకద్జా, వెస్లీ మాధేవెరే


