ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ సంచలనం | Afghanistan Create History, Achieve Their Highest-Ever ODI Team Ranking | Sakshi
Sakshi News home page

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ సంచలనం

Nov 2 2026 7:14 PM | Updated on Nov 2 2026 7:25 PM

Afghanistan Create History, Achieve Their Highest-Ever ODI Team Ranking

అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ జట్టు తన ప్రస్ధానంలో మరో చారిత్రత్మక మైలు రాయిని అందుకుంది.  ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ ఆరో స్ధానానికి ఎగబాకింది. రెహమత్‌షా నాయకత్వంలోని అఫ్గాన్ జట్టు శ్రీలంకను వెనక్కి నెట్టి తమ అత్యుత్తమ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.

ఈ ఘనతతో అఫ్గానిస్తాన్‌.. ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి బ‌ల‌మైన జట్ల కంటే మెరుగైన స్థానంలో నిలిచింది. అఫ్గానిస్తాన్ ఖాతాలో ప్రస్తుతం 94 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అఫ్గాన్ జట్టు గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తోంది. 

ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 191 వన్డేల్లో 96 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముఖ్యంగా 2023 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లపై చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో జరిగిన హోమ్ వన్డే సిరీస్‌ను 3-0తో అఫ్గాన్‌ వైట్‌వాష్ చేసింది.

ఐర్లాండ్ పర్యటనలో ఐదు వన్డే సిరీస్‌లో 4 మ్యాచ్‌లను గెలుచుకోవడమే కాకుండా.. యూఏఈ (వన్డే ట్రై-సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనల కారణంగానే వన్డే ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ పురోగతి సాధించింది. కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు రెండు స్ధానాల్లో భారత్‌, న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి.
చదవండి: IND vs NZ: అతడొక ఫినిషర్.. అలాంటి ప్లేయర్‌ను ఎలా పక్కన పెడతారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement