PC: BCCI/Blackcaps/X
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 3-2తో గెలిచిన టీమిండియా కివీస్ గడ్డ మీద వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య నవంబరు 4 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. మరి ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్స్, జట్టు, లైవ్‌స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం!!
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్, వేదికలు
👉తొలి వన్డే.. నవంబరు 4 (బుధవారం)- ఆక్లాండ్, ఈడెన్‌పార్క్
👉రెండో వన్డే.. నవంబరు 7 (శనివారం)- వెల్లింగ్‌టన్, హెన్రీ స్టేడియం
👉మూడో వన్డే.. నవంబరు 10 (మంగళవారం)- హామిల్టన్, సెడాన్ పార్క్
👉నాలుగో వన్డే.. నవంబరు 13 (శుక్రవారం)- మౌంట్ మౌంగనూయ్, బే ఓవల్
👉ఐదో వన్డే.. నవంబరు 15 (ఆదివారం)- మౌంట్ మౌంగనూయ్, బే ఓవల్.
మ్యాచ్ టైమింగ్స్
👉భారత కాలమానం ప్రకారం న్యూజిలాండ్- భారత్ వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలకు ఆరంభం.
లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే
👉సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (టీవీ), సోనీ లివ్ (డిజిటల్)
వన్డే సిరీస్‌కు భారత్, న్యూజిలాండ్ జట్లు
టీమిండియా
మొదటి మూడు వన్డేలకు భారత జట్టు (అప్‌డేట్)
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రెడ్డి (మొదటి వన్డేకు మాత్రమే), అకిబ్ నబీ.
నాలుగు, ఐదో వన్డేలకు భారత జట్టు (అప్‌డేట్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్.
తొలి మూడు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లేయిర్ టిక్నర్.
మిగిలిన రెండు వన్డేలకు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జేకబ్ డఫీ, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లేయిర్ టిక్నర్, విల్ యంగ్.
ఇవీ చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న పాకిస్తాన్‌కు షాక్!
చరిత్ర సృష్టించిన నమీబియా.. ఐర్లాండ్‌కు షాక్!


