భువనేశ్వర్‌ కుమార్‌ చెత్త రికార్డు.. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే | Bhuvneshwar Kumar Scripts Worst-Ever Series For A Bowler In T20I History | Sakshi
Sakshi News home page

NZ vs IND: భువనేశ్వర్‌ కుమార్‌ చెత్త రికార్డు.. టీ20 క్రికెట్‌ చరిత్రలోనే

Nov 2 2026 3:11 PM | Updated on Nov 2 2026 3:18 PM

Bhuvneshwar Kumar Scripts Worst-Ever Series For A Bowler In T20I History

టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన భువీ.. తన రీఎంట్రీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోఈ యూపీ పేసర్ ఘోరంగా విఫలమయ్యాడు.

ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. మొత్తం 16 ఓవర్లు బౌలింగ్ చేసి 11.25 ఎకానమీతో ఏకంగా 180 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతని బౌలింగ్ సగటు 180.00గా నమోదైంది. తద్వారా భువ‌నేశ్వ‌ర్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.  

ఒక టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు నమోదు చేసిన బౌలర్‌గా భువనేశ్వర్ చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ పేరిట ఉండేది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జేమీసన్ 175.00 సగటుతో బౌలింగ్ చేయగా, తాజా సిరీస్‌తో భువనేశ్వర్ అతడిని అధిగమించాడు.

టీ20 సిరీస్‌లో అత్యంత చెత్త బౌలింగ్ సగటు న‌మోదు చేసిన బౌల‌ర్లు

180.00 - భువనేశ్వర్ కుమార్ (వర్సెస్ న్యూజిలాండ్, 2026)

175.00 - కైల్ జేమీసన్ (వర్సెస్ ఆస్ట్రేలియా, 2021)

న్యూజిలాండ్ సిరీస్‌లో భువీ గణాంకాలు

1వ టీ20: 4 ఓవర్లలో 0/49

2వ టీ20: 4 ఓవర్లలో 1/50

3వ టీ20: 4 ఓవర్లలో 0/40

5వ టీ20: 4 ఓవర్లలో 0/41 
చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న పాకిస్తాన్‌కు షాక్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement