పాకిస్తాన్ జట్టు (PC: ICC)
ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో నిర్ణీత సమయంలో బౌలర్ల కోటా పూర్తి చేయనందున.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ జట్టుకు జరిమానా వేసింది.
కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్, శ్రీలంకతో పాకిస్తాన్ ముక్కోణపు వన్డే సిరీస్ ఆడింది. ఈ క్రమంలో పాక్‌తో పాటు శ్రీలంక ఫైనల్ చేరగా ఇంగ్లండ్ ఇంటిబాట పట్టింది. ఇక శనివారం జరిగిన టైటిల్ పోరులో శ్రీలంకపై పాక్ మూడు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది.
అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ స్లో ఓవర్‌రేటు మెయింటెన్ చేసినందున మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకుంది. జట్టులో ప్రతీ సభ్యుడి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత ఉంటుందని స్పష్టం చేసింది. పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది తమ తప్పిదాన్ని అంగీకరించాడని పేర్కొంది.
మ్యాచ్ విషయానికొస్తే... లాహోర్ వేదికగా జరిగిన ఫైనల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 325 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. అనూహ్య రీతిలో 48.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్ ఫఖార్ జమాన్ మెరుపు సెంచరీ (99 బంతుల్లో 127)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడుగా సాద్ బేగ్ (74), అరాఫత్ మిన్హాస్ (61) అర్ధ శతకాలతో రాణించారు.
ఇవీ చదవండి: ఐదేసిన ముకేశ్.. సిరాజ్‌కు నాలుగు వికెట్లు; కివీస్ 424 ఆలౌట్
చరిత్ర సృష్టించిన నమీబియా.. ఐర్లాండ్‌కు షాక్!


