విజేత పాకిస్తాన్‌ | Pakistan chased down a target of 326 to win the ODI tri series final against Sri Lanka | Sakshi
Sakshi News home page

విజేత పాకిస్తాన్‌

Nov 1 2026 3:34 AM | Updated on Nov 1 2026 3:34 AM

Pakistan chased down a target of 326 to win the ODI tri series final against Sri Lanka

లాహోర్‌: ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన తుది పోరులో ఆతిథ్య పాకిస్తాన్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. మొదట శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్‌ కమిందు మెండిస్‌ (128 బంతుల్లో 131; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు.

పాకిస్తాన్‌ బౌలర్లలో కెప్టెన్‌ షాహిన్‌ షా అఫ్రిది, నసీమ్‌ షా, సల్మాన్‌ ఆగా, హారిస్‌ రవూఫ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 48.3 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (99 బంతుల్లో 127; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో విజృంభించగా... అరాఫత్‌ మిన్హాస్‌ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచి కొట్టాడు.  ఈ ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక, పాకిస్తాన్‌తో పాటు ఇంగ్లండ్‌ కూడా ఆడింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement