ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. 111 ప‌రుగుల‌కే ఆలౌట్‌ | 3rd Test: South Africa Thrash Australia by 176 Runs to Seal Series Win | Sakshi
Sakshi News home page

AUS vs SA: ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. 111 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Oct 31 2026 7:53 PM | Updated on Oct 31 2026 8:22 PM

 3rd Test: South Africa Thrash Australia by 176 Runs to Seal Series Win

కేప్‌టౌన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్టులో 176 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా 329 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

ఐడైన్‌ మార్‌క్రమ్‌(78), మార్కెస్ అకర్మాన్(95), డేవిడ్ బెడింగ్‌హామ్(50), మార్కో జాన్సెన్‌(52) హఫ్‌ సెంచరీలతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.

అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీతో రాణించగా.. అలెక్స్‌ కేరీ 80 పరుగులతో కీలక నాక్‌ ఆడాడు. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టుకు వంద పరుగుల ఆధిక్యం లభించింది.

100 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా 387 పరుగులు చేసి ఆలౌటైంది.  రికెల్టన్ (101), వియాన్ ముల్డర్ (115) అద్భుత సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా ముందు సౌతాఫ్రికా 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

ఈ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియాను సైమన్ హార్మర్ తన స్పిన్‌ మయాజాలంతో దెబ్బతీశాడు. హార్మర్ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పేసర్ కగిసో రబాడ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో నాథన్ లియోన్‌(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: పాకిస్తాన్‌తో ఫైనల్‌.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement