చరిత్ర సృష్టించిన జోష్‌ ఇంగ్లిష్‌.. తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు | Josh Inglis Creates Australian Cricket History With Stunning Test Ton | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన జోష్‌ ఇంగ్లిష్‌.. తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

Oct 29 2026 5:57 PM | Updated on Oct 29 2026 6:23 PM

Josh Inglis Creates Australian Cricket History With Stunning Test Ton

న్యూలాండ్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్‌.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీల బాదుతూ కేవలం 132 బంతుల్లోనే తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 135 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిష్‌.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లిష్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఏ ఇతర ఆటగాడికి సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రేలియా తరఫున టీ20, వ‌న్డేల్లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు కేవలం ముగ్గురి (గ్లెన్ మ్యాక్స్‌వెల్-5, ఆరోన్ ఫించ్-2, జోష్ ఇంగ్లిస్-2) పేరిట మాత్రమే ఉంది. అయితే మూడు ఫార్మాట్లలోనూ మల్టీపుల్‌ సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ప్లేయర్ మాత్రం ఇంగ్లిష్‌నే కావడం గమనార్హం.  ప్రస్తుతం ఇంగ్లిష్‌ ఖాతాలో రెండేసి చొప్పున టెస్టు, వన్డే, టీ20 సెంచరీలు ఉన్నాయి.

ఆసీస్ భారీ స్కోర్‌
ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 100 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ఇంగ్లిష్‌తో పాటు గ్రీన్‌(65), అలెక్స్ కారీ(80), రెన్‌షా(74) కీలక నాక్స్ ఆడారు.  సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మన్ నాలుగు, జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement