breaking news
South Africa vs Australia
-
వరల్డ్ నంబర్ వన్ జట్టుగా సౌతాఫ్రికా
న్యూలాండ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో సౌతాఫ్రికా 176 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 3-0 తేడాతో సొంతం చేసుకుంది. 288 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఐడైన్ మార్క్రమ్(78), మార్కెస్ అకర్మాన్(95), డేవిడ్ బెడింగ్హామ్(50), మార్కో జాన్సెన్(52) హఫ్ సెంచరీలతో రాణించారు.అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీతో సత్తాచాటాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు.నంబర్ వన్ జట్టుగా సౌతాఫ్రికాఈ విజయంతో సౌతాఫ్రికా ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకుంది. గత రెండున్నరేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సౌతాఫ్రికా 124 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత స్ధానాల్లో ఆసీస్, న్యూజిలాండ్, భారత్ కొనసాగుతున్నాయి.చదవండి: పాకిస్తాన్‌తో ఫైనల్.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్ -
ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. 111 పరుగులకే ఆలౌట్
కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 176 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 329 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఐడైన్ మార్క్రమ్(78), మార్కెస్ అకర్మాన్(95), డేవిడ్ బెడింగ్హామ్(50), మార్కో జాన్సెన్(52) హఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 6 వికెట్లతో సత్తాచాటాడు.అనంతరం ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జోష్ ఇంగ్లిస్ (102) సెంచరీతో రాణించగా.. అలెక్స్ కేరీ 80 పరుగులతో కీలక నాక్ ఆడాడు. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టుకు వంద పరుగుల ఆధిక్యం లభించింది.100 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా 387 పరుగులు చేసి ఆలౌటైంది. రికెల్టన్ (101), వియాన్ ముల్డర్ (115) అద్భుత సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా ముందు సౌతాఫ్రికా 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య చేధనలో ఆస్ట్రేలియాను సైమన్ హార్మర్ తన స్పిన్ మయాజాలంతో దెబ్బతీశాడు. హార్మర్ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. పేసర్ కగిసో రబాడ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో నాథన్ లియోన్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: పాకిస్తాన్‌తో ఫైనల్.. శ్రీలంక 325 పరుగుల భారీ స్కోర్ -
సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం.. టెస్టు ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యంత దూకుడైన ఫాస్ట్‌బౌలర్ అతడే అనడంలో అతిశయోక్తి లేదు. రబాడ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.1-1తో సమంగా కాగా సౌతాఫ్రికా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి కాగా ప్రొటిస్, కంగారూలు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి.ఈ క్రమంలో కేప్‌టౌన్ వేదికగా గురువారం సౌతాఫ్రికా- ఆసీస్ మధ్య మూడో టెస్టు మొదలైంది. న్యూలాండ్స్ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.287 పరుగుల లక్ష్యంఇక ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులు చేసింది. ఫలితంగా వంద పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసిన ప్రొటిస్ జట్టు.. ఆసీస్‌కు 287 పరుగుల లక్ష్యం విధించింది. అయితే, లక్ష్య ఛేదనలో కంగారూలకు కగిసో రబాడ చుక్కలు చూపించాడు.A FIERY START TO THE DAY FROM RABADA 🔥🔥 #SAvAUS https://t.co/wwmX6ma3j3— FanCode (@FanCode) October 31, 2026రబాడ ప్రపంచ రికార్డుటాపార్డర్లో ట్రవిస్ హెడ్ (14), మ్యాట్ రెన్షా (0), మార్నస్ లబుషేన్ (4)లను వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 350 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు రబాడ. తద్వారా అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా కగిసో రబాడ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.WICKET NUMBER 350 FOR RABADA 🥵 Australia in big trouble 😳 #SAvAUS https://t.co/g7FjLgKfwy— FanCode (@FanCode) October 31, 2026అతి తక్కువ బంతుల్లో టెస్టుల్లో 350 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్లు👉కగిసో రబాడ (సౌతాఫ్రికా)- 13808 బంతుల్లో👉డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా)- 14719 బంతుల్లో👉వకార్ యూనిస్ (పాకిస్తాన్)- 14905 బంతుల్లో👉మాల్కమ్ మార్షల్ (వెస్టిండీస్)- 16285 బంతుల్లో👉మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 16908 బంతుల్లో.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా తరఫున 350కి పైగా వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గానూ రబాడ రికార్డులకెక్కాడు. డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షాన్ పొలాక్ 421, మఖాయా ఎంతిని 390 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఇవీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. భారత జట్టులో కీలక మార్పు -
ఆసీస్ టార్గెట్ 288.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు
కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో సౌతాఫ్రికా గెలుస్తుందా? ఓడుతుందా అన్నది చివరిరోజు ఆటలో తేలిపోనుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్లో రియాన్ రికిల్టన్ (219 బంతుల్లో 101; 12 ఫోర్లు), వియాన్ ముల్డర్ (221 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో సౌతాఫ్రికా కోలుకుంది. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 318 బంతుల్లో 154 పరుగులు జోడించారు.మిగతా బ్యాటర్లలో మార్కస్ అకెర్మన్ (62) అర్థశతకం సాధించగా, మాథ్యూ బ్రీట్జ్కే (43) పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా, కమిన్స్, లియోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇవాళ ఆటకు చివరి రోజు కాగా.. ఆస్ట్రేలియా ముంగిట సౌతాఫ్రికా 288 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గతంలో 2002లో ఇదే కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో సౌతాఫ్రికా నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించడం విశేషం. తనకు అచ్చొచ్చిన మైదానంలో 288 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ఛేదిస్తుందా లేక సఫారీ బౌలర్ల ధాటి చతికిలపడుతుందా అన్నది చూడాలి.ఇక సెంచరీలతో చెలరేగిన వియాన్ ముల్డర్, రియాన్ రికిల్టన్ సరికొత్త ఫీట్ నమోదు చేశారు. టెస్టు ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తరఫున ఆరు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు బాదిన జాబితాలో ఈ జోడీ చోటు దక్కించుకుంది.గతంలో 1955లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులో జాన్ వైట్ (113), పాల్ విన్స్లో (108) సెంచరీలు సాధించగా; 1997లో కేప్‌టౌన్ వేదికగా భారత్‌తో టెస్టులో బ్రియాన్ మెక్‌మిలన్ (103 నాటౌట్), లాన్స్ క్లూసెనర్ (102 నాటౌట్); 2013లో గెబెర్హా వేదికగా న్యూజిలాండ్‌తో టెస్టులో ఫాప్ డుప్లెసిస్ (137), డీన్ ఎల్గర్ (103 నాటౌట్); తాజాగా రికిల్టన్, వియాన్ ముల్డర్ ద్వయం ఈ ఫీట్ సాధించారు.🇿🇦 SOUTH AFRICA vs AUSTRALIA | 3RD TEST | DAY 4 Australia looked firmly in control. A 100-run first-innings lead, South Africa struggling at 40/4. It seemed like the visitors were heading towards a comfortable victory. But South Africa had other plans! Ryan Rickelton (101) and Wiaan Mulder (115) turned the entire game around with a magnificent 154-run partnership. South Africa fought back to post 387, setting Australia a target of 288. And suddenly, what looked like Australia’s match is now wide open! One day. Two outstanding centuries. A completely different contest. 288 to win. 10 wickets in hand. No clear favourite. One final day to decide everything! 🔥 #SAvAUS #TestCricket #Cricket— GameDayDesk (@GameDayDesk) October 31, 2026ఇదీ చదవండి: లంకను చావుదెబ్బ తీసిన స్కాట్లాండ్జైస్వాల్ డకౌట్.. మరోసారి మెరిసిన పడిక్కల్ -
చరిత్ర సృష్టించిన జోష్ ఇంగ్లిష్.. తొలి ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
న్యూలాండ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లిష్.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీల బాదుతూ కేవలం 132 బంతుల్లోనే తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా 135 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిష్.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లిష్ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఏ ఇతర ఆటగాడికి సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ (టెస్టులు, వన్డేలు, టీ20లు) ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.ఆస్ట్రేలియా తరఫున టీ20, వన్డేల్లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు కేవలం ముగ్గురి (గ్లెన్ మ్యాక్స్‌వెల్-5, ఆరోన్ ఫించ్-2, జోష్ ఇంగ్లిస్-2) పేరిట మాత్రమే ఉంది. అయితే మూడు ఫార్మాట్లలోనూ మల్టీపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ప్లేయర్ మాత్రం ఇంగ్లిష్‌నే కావడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లిష్ ఖాతాలో రెండేసి చొప్పున టెస్టు, వన్డే, టీ20 సెంచరీలు ఉన్నాయి.ఆసీస్ భారీ స్కోర్ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 100 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ఇంగ్లిష్తో పాటు గ్రీన్(65), అలెక్స్ కారీ(80), రెన్షా(74) కీలక నాక్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మన్ నాలుగు, జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. -
సౌతాఫ్రికాతో టెస్టు.. చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌లో స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు మార్కస్ అకెర్మన్ (95), ఐడెన్ మార్కరమ్ (78), వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (50), మార్కో జాన్సెన్ (52) అర్థశతకాలు సాధించారు. రియాల్ రికిల్టన్ (42) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా, నాథన్ లియోన్ రెండు, హాజిల్‌వుడ్, కన్నోలి చెరో వికెట్ తీశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి రెండు జట్లు సమానంగా నిలిచాయి. ఒక దశలో 158-0తో పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆ తర్వాత తడబడింది. మొత్తంగా తొలి రెండు సెషన్లు సౌతాఫ్రికా దూకుడు ప్రదర్శించగా, చివరి సెషన్లో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో సఫారీలు ఆలౌట్ అయ్యారు.స్టార్క్ అరుదైన రికార్డుమ్యాచ్లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్‌కు 110 టెస్టుల్లో ఇది 20వ ఐదు వికెట్ల హాల్. ఈ నేపథ్యంలో స్టార్క్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 20వ సారి ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ (25 సార్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల (ఫాస్ట్, స్పిన్) విభాగంలో స్టార్క్.. న్యూజిలాండ్ దిగ్గజ స్పిన్నర్ డానియల్ వెటోరితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక స్టార్ స్పిన్నర్ రంగన హెరాత్ (34 సార్లు) జాబితాలో తొలి స్థానంలో ఉండగా, పాక్ లెజెండ్ వసీం అక్రమ్ (25 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో ఉన్న బంగ్లా బౌలర్లు షకీబ్ అల్ హసన్, తైజుల్ ఇస్లామ్ చెరో 19 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు.వార్న్ రికార్డు బద్దలుమ్యాచ్లో 72 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసిన స్టార్క్ పనిలో పనిగా ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డును కూడా బద్దలుకొట్టాడు. కేప్‌టౌన్ వేదికలో ఇప్పటివరకు షేన్ వార్న్ బౌలింగ్ (6-161) ప్రదర్శన అత్యుత్తమంగా ఉండేది. తాజాగా స్టార్క్.. వార్న్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక స్టార్క్ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి 11 టెస్టుల్లో 62 వికెట్లు పడగొట్టాడు. 3 minutes of extraordinary pace bowling by Mitchell Starc. Take a bow 🙇♂️ https://t.co/Sopph7SPa8— Troll cricket unlimitedd (@TUnlimitedd) October 27, 2026ఇదీ చదవండి: సిక్సర్లతో విరుచుకుపడ్డ రషీద్ ఖాన్.. జింబాబ్వేపై ఘన విజయం'ఆయన ఎలా ఆడారో తెలియదు; అద్భుతం ఒక్కసారే జరుగుతుంది' -
సౌతాఫ్రికా తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్
అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నిర్ణయాత్మక మూడో టెస్టు కోసం సౌతాఫ్రికా తమ తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన పేసర్ అన్రిచ్ నోర్జే స్ధానంలో.. గెరాల్జ్ కోయిట్జీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అదేవిధంగా వికెట్ కీపర్‌గా ర్యాన్ రికెల్టన్ను ప్రోటీస్ టీమ్ మేనెజ్మెంట్ కొనసాగించింది.అయితే మరోసారి స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన సౌతాఫ్రికా.. రెండో టెస్టులో మాత్రం అద్భుతంగా పుంజుకుని ఆసీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు కీలకమైన మూడో టెస్టులో సత్తాచాటి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్ భారీ షాక్ తగిలే అవకాశముంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయం కారణంగా కేప్‌టౌన్ టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. స్మిత్ ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నాడు. అతడు ఇంకా తన గాయం నుంచి కోలుకోలేదని ఆసీస్ హెడ్‌కోచ్ మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశారు. కానీ స్టార్ ప్లేయర్లు కెమెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిష్ మాత్రం జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో నిక్ మ్యాడిన్సన్పై సెలక్టర్లు వేటు వేశారు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్‌ను గ్రీన్, హెడ్ ప్రారంభించే అవకాశముంది.దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ఐడెన్ మార్క్రామ్, మార్క్వెస్ అకెర్మాన్, డేవిడ్ బెడింగ్హామ్, టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కగిసో రబడా, కోయిట్జీచదవండి: IND vs NZ: 'అతడొక అద్భుతం.. టీమిండియాకు దొరికిన వజ్రం' -
‘వాళ్లిద్దరితో పోల్చడం అతడు చేసుకున్న పుణ్యం’
గెబెర్హా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 179 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఎంత పెద్ద ఇన్నింగ్స్ ఆడినా టెంబా బవుమా మైదానంలో కంట్రోల్ తప్పడని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో ముందు వరుసలో ఉంటాడని కొనియాడాడు. ఇక తన గొప్పలు ప్రపంచానికి చెప్పుకునేందుకు ఇష్టపడడంటూ ఆకాశానికెత్తాడు. ఈ రెండు విషయాల్లో భారత మాజీ క్రికెటర్లు గుండప్ప విశ్వనాథ్, అజింక్యా రహానేలతో బవుమాను పోల్చవచ్చని తెలిపాడు. మిడ్-డే కాలమ్‌లో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.‘‘దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బవుమా ఎంపికైనప్పుడు, అతడి నియామక ప్రక్రియపై ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి. టెస్టు కెప్టెన్‌గా అతడు పనికిరాడనే విమర్శలు పెరిగిపోయాయి. కానీ కాలం గడిచేకొద్ది కేవలం నాయకుడిగానే పరిమితం కాకుండా, బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో తనను అవమానించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా 14 టెస్టుల్లో 12 విజయాలు అందుకున్న బవుమా.. అతడి సారథ్యంలో జట్టు ఒక టెస్టు మాత్రమే ఓడిపోగా, మరో టెస్టు డ్రా చేసకుంది. కెప్టెన్‌గా రహానే కూడా భారత్ తరఫున ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ విషయంలో మాత్రం అజింక్యా రహానేతో బవుమాను పోల్చవచ్చు. మరో విషయమేంటంటే.. ఈ ఇద్దరు గొప్పలు చెప్పుకోరు. అలాగే తాము ఎంత గొప్పవాళ్లమనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు వీళ్ల వద్ద ప్రచార బృందం (పీఆర్) కూడా లేదు. ఇక మైదానంలో బవుమా ప్రవర్తించే తీరు, ఆగ్రహం ప్రదర్శించకుండా ఓపికతో ఉండడం లాంటివి చూస్తే నా సహచరుడు గుండప్ప విశ్వనాథ్ గుర్తుకువస్తున్నాడు. రహానే, గుండప్ప విశ్వనాథ్ వంటి గొప్ప ఆటగాళ్లతో పోల్చడం బవుమా చేసుకున్న అదృష్టం’’ అని గావస్కర్ రాసుకొచ్చాడు.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా 0-1తో వెనుకబడిన సౌతాఫ్రికా రెండో టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 425 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 110/6తో కష్టాల్లో ఉన్నప్పుడు, బావుమా 179 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గట్టెక్కించాడు. అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆసీస్ ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక చివరి టెస్టు మ్యాచ్ అక్టోబర్ 27 నుంచి జరగనుంది.ఇదీ చదవండి: పాపం పడిక్కల్.. పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ముంబై హెడ్‌కోచ్ పొలార్డ్ కీలక నిర్ణయం! -
గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు భారీ షాక్
ఆస్ట్రేలియాతో సిరీస్ డిసైడర్ మూడో టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ కీలక మ్యాచ్‌కు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా దూరమయ్యాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన రెండో టెస్టుల్లో గజ్జల్లో గాయానికి గురయ్యాడు.అతడు కోలుకోవడానికి దాదాపు రెండు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు అతడు అందుబాటులో లేడు. నోర్జే స్ధానంలో తుది జట్టులోకి కార్బిన్ బాష్ లేదా గెరాల్డ్ కోట్జీ వచ్చే అవకాశముంది. మరోవైపు కైల్ వెర్రెయిన్ను బ్యాక్‌ప్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించారు. కాగా రెండో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ర్యాన్ రికెల్టన్, బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి మారాడు. కైల్ వెర్రెయిన్ను కూడా బ్యాకప్ వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించారు. రెండో టెస్టులో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ర్యాన్ రికెల్టన్, ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.ఇక చివరి టెస్టులో ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మహారాజ్ రెండవ టెస్టుకు దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో సైమన్ హార్మర్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆడాడు. హార్మర్ బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించాడు. దీంతో అతడిని పక్కన పెట్టే సహసాన్ని ప్రోటీస్ సెలక్టర్లు చేయరు. ఇక మూడో టెస్టు మ్యాచ్ అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రారంభం కానుంది. కాగా రెండో టెస్టులో ఆసీస్‌ను ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో సఫారీలు చిత్తు చేసిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా వర్సెస్ 3వ టెస్టుకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), మార్క్వెస్ అకెర్మాన్, డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కోయెట్జీ, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్,కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రెయిన్.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ ప్రపంచ రికార్డు -
సౌతాఫ్రికాతో టెస్టు.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆసీస్ బౌలర్
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసినప్పటికీ, ఆ జట్టు బౌలర్ స్కాట్ బోలండ్ మాత్రం అరుదైన ఫీట్ సాధించాడు. మ్యాచ్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బోలండ్ 60 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. సాధారణంగా పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే బోలండ్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వన్‌డౌన్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన బోలండ్ 14 బంతుల్లో రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలోఆన్ ఆడిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగో రోజు ఆట ముగిసిన సమయంలో స్కాట్ బోలండ్ ఆరో స్థానంలో వచ్చాడు. ఈసారి 166 బంతుల్లో 40 పరుగులు చేసిన బోలండ్ నైట్‌వాచ్‌మన్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. గెబెర్హా (గతంలో పోర్ట్ ఎలిజెబెత్) వేదికగా జరిగిన టెస్టులో నైట్‌వాచ్‌మన్‌గా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా స్కాట్ బోలండ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ బౌలర్ ఇయాన్ థాంప్సన్ (39 పరుగులు) పేరిట ఉంది. 1965లో సౌతాఫ్రికాతో టెస్టులో ఇయాన్ థాంప్సన్ ఈ ఫీట్ సాధించాడు. తాజాగా 60 ఏళ్ల తర్వాత స్కాట్ బోలండ్ ఆ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు.ఇక రెండో టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో ఆసీస్‌ను ఇన్నింగ్స్ తేడాతో మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది. ఇరుజట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా అక్టోబర్ 27 నుంచి జరగనుంది.ఇదీ చదవండి: ‘ప్లాన్ లేదు.. ఏమీ లేదు; ఆడుకుంటూ పోయామంతే’చరిత్ర సృష్టించిన జో రూట్ -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ అండ్ 31 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టు సిరీస్‌ను 1-1తో ప్రోటీస్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (179) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. అతడితో పాటు మార్కో జాన్సెన్ కూడా 85 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లతో సత్తాచాటాడు.కుప్పకూలిన ఆసీస్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను సఫారీ బౌలర్లు దెబ్బతీశారు. మార్కో జాన్సెన్ 5 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ కేవలం 99 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్(ఫాలో ఆన్)లో కూడా ఆసీస్ బ్యాటర్ల తీరు మారలేదు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (121) సెంచరీతో సత్తాచాటినప్పటికి, ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు.స్కాట్ బోలాండ్(40), అలెక్స్ కారీ(37) కాస్త ఫర్వాలేదన్పించారు. ఫలితంగా ఆసీస్ ఫాలో ఆన్‌లో 295 పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్లు కాగిసో రబాడా నాలుగు, వియాన్ ముల్డర్ మూడు వికెట్లతో చెలరేగారు. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్ అక్టోబర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదికగా ప్రారంభం కానుంది. -
ఓటమి కొరల్లో ఆస్ట్రేలియా.. పోరాడుతున్న హెడ్
గెబెర్హా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా ఓటమి కొరల్లో చిక్కుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కూడా తడబడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది. హెడ్ (87 నాటౌట్) ఆసీస్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.అంతకుముందు యాన్సెన్ (5-33) ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో విలవిలలాడింది. యాన్సెన్‌తో పాటు రబాడ (2-33), ముల్దర్ (2-14), నోర్జే (1-5) కూడా వికెట్లు తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 28 పరుగులతో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.దీనికి ముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (425-9 డిక్లేర్) చేసింది. 110 పరుగులకే 56 వికెట్లు కోల్పోయి కష్టాల్లో జట్టును టెంబా బవుమా వీరోచిత సెంచరీ (179)తో ఆదుకున్నాడు. టెయిలెండర్లు మార్కో యాన్సెన్ (85), సైమన్ హార్మర్ (82)తో కలిసి భారీ భాగస్వామ్యాలు (132, 182) నెలకొల్పి, జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 5, స్టార్క్ 3, లబూషేన్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్ తొలి రెండు రోజులు ఆట పెద్దగా సాధ్యపడలేదు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి టెస్ట్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. 60 ఏళ్ల రికార్డు బ్రేక్
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో దుమ్ములేపిన జాన్సెన్.. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా జట్టు 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్ కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. కేవలం 100 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85 పరుగులు చేశాడు. సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయినప్పటికీ జాన్సెన్ ఓ అరుదైన ఘనతను పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టుల్లో సౌతాఫ్రికా తరపున నంబర్ 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా జాన్సెన్ నిలిచాడు.ఇంతకుముందు ఈ రికార్డు పీటర్ వాన్ డెర్ మెర్వె పేరిట ఉంది. 1966లో జోహన్నెస్‌బర్గ్‌లో వాన్ డెర్ మెర్వె 76 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో 60 ఏళ్ల రికార్డును జాన్సెన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జాన్సెన్‌తో పాటు టెంబా బవుమా(179) భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425-9 వద్ద డిక్లేర్ చేసింది.99 పరుగులకే ఆసీస్ ఆలౌట్అనంతరం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులే కుప్పకూలింది. మార్కో యాన్సెన్ (5/33) ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించగా, కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.చదవండి: AUS vs SA: స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. స్టీవ్ వాకు కూడా సాధ్యం కాలేదు! -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. స్టీవ్ వాకు కూడా సాధ్యం కాలేదు!
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 11,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఈ ఫీట్‌ను అందుకున్న మూడో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్ రికార్డులకెక్కాడు. అతడి కంటే ముందు రికీ పాంటింగ్ (13,378 పరుగులు), అల్లన్ బోర్డర్ (11,174 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించారు. స్టీవ్ వా, డేవిడ్ వార్నర్, మైకెల్ క్లార్క్, మాథ్యూ హెడెన్ వంటి దిగ్గజాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు.కాగా ఈ మ్యాచ్‌లో స్మిత్ తీవ్రమైన మెడ నొప్పితో ఇబ్బంది పడుతూనే తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. 88 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన పరుగులకే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరగడంతో ఆసీస్ కేవలం 99 పరుగులకే కుప్పకూలింది.మార్కో యాన్సెన్ (5/33) ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించగా, కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా (179) భారీ సెంచరీతో కదం తొక్కాడు.చదవండి: IND vs NZ: పాపం వైభవ్ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్
సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వీరోచిత సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను అద్భుతమైన పోరాటంతో బవుమా ఆదుకున్నాడు.ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్(85)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో బవుమా 226 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సూపర్ సెంచరీతో బవుమా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన బవుమాగెబెహాలోని సెయింట్ జార్జెస్ పార్క్‌లో టెస్టు సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బవుమా చరిత్రకెక్కాడు. 1992లో భారత్‌పై కేప్లర్ వెస్సెల్స్ 95 పరుగులే ఈ వేదికలో అత్యధిక స్కోర్‌గా ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో వెస్సెల్స్ రికార్డును బవుమా బ్రేక్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మైదానంలో టెస్టు సెంచరీ చేసిన ప్రపంచంలోనే మూడో కెప్టెన్‌గా అతడు నిలిచాడు.రికార్డు సమం!అదేవిధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మార్క్రమ్(4) రికార్డును బవుమా(4) సమం చేశాడు. అతడి కెరీర్‌లోని 5 టెస్టు సెంచరీలలో 4 సెంచరీలు డబ్ల్యూటీసీ మ్యాచ్‌లోనే రావడం విశేషం. కాగా ప్రోటీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 425-9 వద్ద డిక్లేర్ చేసింది. బవుమా 179 పరుగులు చేసి ఔటయ్యాడు.చదవండి: IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తిలక్ వర్మ! -
మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంతవేగంగా(బంతుల పరంగా) 450 వికెట్ల మైలు రాయిని అందకున్న ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో వియాన్ ముల్డర్‌ను ఔట్ చేసి స్టార్క్ ఈ ఘనత సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్ స్టార్ కేవలం 20,577 బంతుల్లో బంతుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్( 23,474 బంతులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మెక్‌గ్రాత్ ఆల్‌టైమ్ రికార్డును మిచెల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన తొలి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కూడా అతడే కావడం గమనార్హం.ఓవరాల్‌గా 450 టెస్టు వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రికార్డు ఇప్పటికీ శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. మురళీధరన్ కేవలం 80 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. అతడి తర్వాతి స్దానంలో భారత స్పిన్నర్ అశ్విన్(89) ఉన్నాడు.సూపర్ ఫామ్‌లో స్టార్క్కాగా ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్లో మిచెల్ స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. చాలా మ్యాచ్‌లకు తోటి ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ గాయాలతో దూరమైనప్పటికీ, స్టార్క్ ఒంటిచేత్తో ఆసీస్ పేస్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. యాషెస్ సిరీస్‌లో కేవలం 5 మ్యాచుల్లోనే 31 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అంతేకాకుండా భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లు (మ్యాచ్‌ల పరంగా):ముత్తయ్య మురళీధరన్ - 80 మ్యాచులురవిచంద్రన్ అశ్విన్ - 89 మ్యాచులుఅనిల్ కుంబ్లే - 93 మ్యాచులుగ్లెన్ మెక్‌గ్రాత్ - 100 మ్యాచులుషేన్ వార్న్ - 101 మ్యాచులుమిచెల్ స్టార్క్ - 109 మ్యాచులు*ఆస్ట్రేలియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు:షేన్ వార్న్ - 708 వికెట్లునాథన్ లయన్ - 573 వికెట్లుగ్లెన్ మెక్‌గ్రాత్ - 563 వికెట్లుమిచెల్ స్టార్క్ - 450* వికెట్లుడెన్నిస్ లిల్లీ - 355 వికెట్లు -
విజయంతో జోష్ మీదున్న ఆసీస్‌కు బిగ్‌షాక్!
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియాకు రెండో టెస్టుకు ముందు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా గాయానికి గురైన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి టెస్టుకు దూరంగా ఉన్న గ్రీన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని జట్టు హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు. ''గ్రీన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు కోలుకోవడానికి మూడు లేదా నాలుగు రోజులు పట్టవచ్చు. ఒకవేళ ఈ సిరీస్‌లో గ్రీన్ ఆడినప్పటికీ, బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమవనున్నాడు.'' అని చెప్పుకొచ్చాడు.గాయంతో బాధపడుతున్న గ్రీన్ వాస్తవానికి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అర్థసెంచరీ, రెండో టెస్టులో సెంచరీ సాధించిన గ్రీన్ మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 184 పరుగులు చేశాడు. గ్రీన్ పరిస్థితి ఇలా ఉంటే, గాయం నుంచి కోలుకున్న జోష్ ఇంగ్లిస్ నెట్స్‌లో సాధన చేయడం కనిపించింది. రెండో టెస్టులో జోష్ ఇంగ్లిస్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: చీఫ్ సెలెక్టర్‌గా రమేశ్ పవార్..? ఓజా తాత్కాలికమే..!జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కీలక నిర్ణయం -
ఆసీస్‌తో రెండో టెస్టుకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన; అతడిపై వేటు!
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం చవిచూసిన సౌతాఫ్రికా రెండో టెస్టులో ఆ తప్పును పునరావృతం చేయకూడదని భావించింది. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) రెండో టెస్టుకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తొలుత 18 మందితో ప్రకటించాలనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో టోనీ డీజార్జి అందుబాటులోకి రాకపోవడంతో అతడి పేరును జట్టు నుంచి తొలగించి అప్డేట్ స్క్వాడ్‌ను ప్రకటించింది. తొలి టెస్టులో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన ట్రిస్టన్ స్టబ్స్‌పై వేటు పడగా, అతడి స్థానంలో మాథ్యూ బ్రీట్జ్కేను ఎంపిక చేసింది. కాగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టబ్స్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 33 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన స్టబ్స్.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు మాథ్యూ బ్రీట్జ్కే 2025లో జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆఖరిసారిగా ఆడాడు. ఓవరాల్‌గా రెండు టెస్టులు ఆడిన మాథ్యూ 14 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్న మాథ్యూ బ్రీట్జ్కే మంచి ఫామ్‌లో ఉన్నాడని, అందుకే రెండో టెస్టుకు అతడిని ఎంపిక చేసినట్లు ప్రొటీస్ హెడ్‌కోచ్ శుక్రి కొన్రాడ్ స్పష్టం చేశాడు. ఇక రెండో టెస్టుకు కైల్ వెరిన్నే స్థానంలో రియాన్ రికిల్టన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. దీంతో కైల్ వెరిన్నె రెండో టెస్టుకు బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కైల్ వెరిన్నే తాను ఆడిన గత 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా సాధించలేకపోయాడు. ఓవరాల్‌గా మాథ్యూ బ్రీట్జ్కే 50 ఇన్నింగ్స్‌ల్లో 1280 పరుగులు సాధించాడు.ఇక తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికాపై విజయాన్ని అందుకుంది. మాట్ రెన్షా (తొలి ఇన్నింగ్స్‌లో 190, రెండో ఇన్నింగ్స్‌లో 82) వీరోచిత పోరాటం చేయగా, ఆసీస్ బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 18 నుంచి గెబెర్హా వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: 'అవార్డులతో లగేజీ బరువైపోయింది.. మోసుకెళ్లడం కష్టమే!'పాతికేళ్లుగా అదే పనిచేస్తున్నా దాదా!.. యువీ -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మ్యాట్ రెన్షా టెస్టు క్రికెట్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రెన్షా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో కదం తొక్కిన రెన్షా(190).. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 272 పరుగులు చేశాడు. అంతేకాకుండా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్టు పడగొట్టాడు. తద్వారా రెన్షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన రెన్షాదక్షిణాఫ్రికా గడ్డపై ఒక టెస్టు మ్యాచ్‌లో 250కి పైగా పరుగులు చేసి, 2 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా (స్వదేశీ లేదా విదేశీ) రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడూ ఈ ఫీట్‌ను సాధించలేకపోయారు.ఇంతకుముందు ప్రోటీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ 2012లో ఇదే డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో 224 పరుగులు చేసి 3 వికెట్లు పడగొట్టాడు. కాలిస్ మూడు వికెట్లు తీసినప్పటికీ, 250 పరుగుల మార్క్‌ను మాత్రం చేరుకోలేకపోయాడు. ఆ రికార్డును ఇప్పుడు రెన్షా బ్రేక్ చేశాడు.ఆసీస్ ఘన విజయంఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికాపై ఆ్రస్టేలియా 214 పరుగుల తేడాతో గెలుపొందింది. 421 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 102/4తో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టు చివరకు 86.5 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (75; 10 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హాజల్‌వుడ్ 49 పరుగులే ఇచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు.సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. చివరి రోజు మిగిలిన ఆరు వికెట్లలో హాజల్‌వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెన్షాకు 2 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 284 పరుగులకు పరిమితమైంది. ఆసీస్ 314/6 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ప్రత్యర్థికి 421 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్ -
SA vs AUS: సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆస్ట్రేలియా
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 214 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభంలో తడబడ్డా అనూహ్య రీతిలో పుంజుకుని బవుమా బృందానికి ఊహించని షాకిచ్చింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా మూడు టెస్టులు ఆడేందుకు ఆసీస్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ ప్రొటిస్- రన్నరప్ కంగారూ జట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు మొదలైంది.కష్టాల నుంచి గట్టెక్కించిన రెన్షాడర్బన్ వేదికగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభంలో ప్రొటిస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో కేవలం 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కంగారూలు కష్టాల్లో పడ్డారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మ్యాట్ రెన్షా వీరోచిత శతకంతో అదరగొట్టాడు. మొత్తంగా 397 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, ఒక సిక్స్ బాది 190 పరుగులు చేసిన రెన్షా.. తృటిలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు.ఇక కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (43) రెన్షాకు సహకారం అందించాడు. ఫలితంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్దర్ నాలుగు, మార్కో యాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. అన్రిచ్ నోర్జే రెండు, సైమన్ హార్మర్ ఒక వికెట్ తీశారు.284 పరుగులకే ఖేల్ ఖతంఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే చాపచుట్టేసింది. డేవిడ్ బెడింగ్హామ్ (49), ట్రిస్టన్ స్టబ్స్ (32), సైమన్ హార్మర్ (35 నాటౌట్), కేశవ్ మహరాజ్ (34), వియాన్ ముల్దర్ (30) చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. కంగారూ జట్టు బౌలర్లలో కెప్టెన్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లియాన్ తలా రెండు.. బ్యూ వెబ్‌స్టర్ ఒక వికెట్ పడగొట్టారు.భారీ లక్ష్యం విధించిన కంగారూలుఇక తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌ను 314/6 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాట్ రెన్షా (82) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోగా.. నిక్ మాడిసన్ (48), బ్యూ వెబ్‌స్టర్ (39 నాటౌట్) రాణించారు. ఈసారి నోర్జే, మహరాజ్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కో యాన్సెన్, సైమన్ హార్మర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చేతులెత్తేసిన ప్రొటిస్ జట్టుకాగా ఆసీస్ విధించిన 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక సౌతాఫ్రికా చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (75), వన్‌డౌన్ బ్యాటర్ బెడింగ్హామ్ (46) రాణించగా.. ముల్దర్ 29, యాన్సెన్ 35 పరుగులు చేయగలిగారు.మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. బవుమా, స్టబ్స్, వెరియెన్నె, మహరాజ్ ఒక్కో పరుగు చేయగా.. రియాన్ రికెల్టన్ 2, నోర్జే 4 పరుగులు చేశారు. హార్మర్ డకౌట్ అయ్యాడు. అదరగొట్టిన హాజిల్వుడ్ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మ్యాట్ రెన్షా రెండు, స్టార్క్, కమిన్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆసీస్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రొటిస్- ఆసీస్ మధ్య ఆదివారం మొదలయ్యే రెండో టెస్టుకు గెబెర్హ వేదిక.చదవండి: జట్టును వీడిపోండి.. లేదంటే రిటైర్ అవ్వండి: యువీ, గంభీర్ కెరీర్లు అలా ఖతం -
టెస్టు క్రికెట్లో అరుదైన దృశ్యం.. 30 వికెట్లు, 1090 పరుగులు!
టెస్టు క్రికెట్లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడుతుండగా.. అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఆడుతున్నాయి. ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతున్న వేదికల మధ్య 10,988 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, ఒక యాదృశ్చిక ఘటనకు వేదికగా మారాయి.విషయంలోకి వెళితే.. ఈ రెండు మ్యాచ్‌లు గత శుక్రవారం (అక్టోబర్ 9న) ప్రారంభమయ్యాయి. మ్యాచ్‌లో నాలుగు రోజులు ముగిసిన తర్వాత రెండు మ్యాచ్‌ల్లోనూ సమానంగా 30 వికెట్లు నేలకూలాయి. అంతేకాదు రెండు మ్యాచ్‌ల్లోనూ నాలుగు రోజుల ఆట ముగిసేసరికి యాదృశ్చికంగా 1090 పరుగులు సాధించడం విశేషం. మరో అంశమేమిటంటే, ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆతిథ్య జట్లపై అతిథులుగా వచ్చిన జట్లే పైచేయిలో ఉన్నాయి. మరోవైపు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికాలు చివరి రోజు మొత్తం ఆడి డ్రా కోసమే ప్రయత్నిస్తున్నాయి.విజయానికి ఆరు వికెట్ల దూరంలో..421 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో మార్కరమ్ (45 బ్యాటింగ్), వియాన్ ముల్డర్ (5 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, కమిన్స్, రెన్షాలు చెరో వికెట్ పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు 314-6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు, సౌతాఫ్రికా ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకం బాదిన మ్యాట్ రెన్షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ (82) సత్తా చాటాడు. మ్యాడిసన్ (48), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (27), కమిన్స్ (32 నాటౌట్), వెబ్‌స్టర్ 39 (నాటౌట్) ఇలా జట్టులో ప్రతి బ్యాటర్ తలో చేయి వేయడంతో ఆసీస్ ప్రత్యర్దికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జే, మహారాజ్ తలో 2, యాన్సెన్, హార్మర్ చెరో వికెట్ పడగొట్టారు.ఆఫ్గన్ డ్రా చేసుకుంటుందా?ఇక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ డ్రా లక్ష్యంగా ఆడుతుంది. ఓవర్ నైట్ స్కోరు 132-3తో ఐదోరోజు ఆటను ప్రారంభించిన అఫ్గానిస్తాన్ ప్రస్తుతం 73 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. సేదికుల్లా అటల్ (64), ఇక్రమ్ అలిఖిల్ (27) క్రీజులో ఉన్నారు. బంగ్లా గెలుపుకు ఏడు వికెట్లు దూరంలో ఉండగా, అఫ్గాన్ విజయానికి 290 పరుగులు అవసరం.చదవండి: జింబాబ్వే మాజీ క్రికెటర్ అకాల మరణంచరిత్ర సృష్టించిన గిల్.. ఏకైక క్రికెటర్‌గా రికార్డు -
సఫారీలకు దేవుడే దిక్కు.. విజయానికి 6 వికెట్ల దూరంలో ఆసీస్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట చూసిన తర్వాత ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత సెంచరీ చేసిన మాట్ రెన్షా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొట్టాడు. కట్‌చేస్తే చివరి రోజుకు వచ్చేసరికి ఆస్ట్రేలియా విజయానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది. 421 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజులో మార్కరమ్ (45 బ్యాటింగ్), వియాన్ ముల్డర్ (5 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా, కమిన్స్, రెన్షాలు చెరో వికెట్ పడగొట్టారు. ఇక సౌతాఫ్రికాకు ప్రస్తుతం మార్కరమ్ మినహా స్పెషలిస్ట్ బ్యాటర్ లేకపోవడంతో సౌతాఫ్రికా ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెన్షా లాగా మార్కరమ్ కూడా చివరిదాకా నిలబడి వీరోచిత పోరాటం చేస్తే తప్ప సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే.అంతకముందు ఆస్ట్రేలియా జట్టు 314-6 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆ జట్టు, సౌతాఫ్రికా ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వీరోచిత శతకం బాదిన మ్యాట్ రెన్షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ (82) సత్తా చాటాడు. మ్యాడిసన్ (48), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (27), కమిన్స్ (32 నాటౌట్), వెబ్‌స్టర్ 39 (నాటౌట్) ఇలా జట్టులో ప్రతి బ్యాటర్ తలో చేయి వేయడంతో ఆసీస్ ప్రత్యర్దికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో నోర్జే, మహారాజ్ తలో 2, యాన్సెన్, హార్మర్ చెరో వికెట్ పడగొట్టారు.ఇదీ చదవండి: Ranji Trophy: విజయం దిశగా హైదరాబాద్ -
సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో 21వ శతాబ్ధంలో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా స్టార్క్ తన రికార్డును (5,495 బంతులు) మరింత మెరుగుపరుచుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టులోనూ స్టార్క్ ఆ రికార్డును కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు స్టార్క్ 5,495 బంతుల పాటు ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ (4,688 బంతులు) ఉండగా.. స్టార్క్, అండర్సన్ మధ్య దాదాపు వంద బంతుల వ్యత్యాసం ఉండడం విశేషం. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4,478 బంతులు) మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (4,302 బంతులు, ఇంగ్లండ్) నాలుగు, కివీస్ మాజీ పేసర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ( 4,054 బంతులు) ఐదు స్థానాల్లో ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే నాలుగు రోజు ఆట మొదలవ్వగా.. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. లబుషేన్ (16), స్మిత్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఆసీస్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్హమ్ (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, మార్కరమ్ (37), సిమోన్ హార్మర్ (35) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్, హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (190) వీరోచిత సెంచరీ చేయగా, కమిన్స్ (43) రాణించాడు. వియాన్ ముల్డర్ 4 వికెట్లు తీశాడు.🚨 MOST BALLS WITHOUT CONCEDED A SIXES IN TEST CRICKET 🚨 5495 balls - Mitchell Starc 4477 balls - Jasprit Bumrah......See more https://t.co/wCXWZ9Fsnf— VIKAS (@Vikas662005) October 11, 2026ఇదీ చదవండి: ‘హైదరాబాద్‌లో ఖేల్ ఖతం.. ఆఖరి మ్యాచ్‌లో అతడిని ఆడించండి’సెంచరీతో చెలరేగిన జడేజా.. సౌరాష్ట్ర భారీ స్కోరు -
ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు
గెబెర్హా వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభారంభం అందించింది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడుఅతడు ఒకట్రెండు రోజుల్లో సౌతాఫ్రికాకు పయనం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాతో జరిగినే వన్డే సిరీస్‌లో ఉదర కండరాల గాయం బారిన ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ సైతం కోలుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు కూడా రెండో టెస్టు కోసం జట్టు ఎంపికు అందుబాటులో ఉండనున్నాడు. వాస్తవానికి గ్రీన్ గైర్హాజరీలో తొలి టెస్టు తుది జట్టులో ఇంగ్లిష్‌కు చోటు దక్కాల్సి ఉండేది. కానీ ఇంగ్లిష్ కూడా గాయపడడంతో అతడి స్దానంలో నిక్ మాడిన్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చారు. అయితే ఇప్పుడు గ్రీన్, ఇంగ్లిష్ కూడా తిరిగి రావడంతో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టును ఎంపిక చేయడం కోచ్‌లకు సవాలుగా మారింది.కాగా డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు పర్వాలేదనప్పించారు. టాపార్డర్ విఫలమైనప్పటికి రెన్షా(190) విరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 137.2 ఓవర్లలో 390 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతున్నారు. 33 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. విరాట్ కోహ్లి రికార్డ్ బ్రేక్ -
సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్ బౌలర్ ప్రపంచ రికార్డు
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. టెస్టుల్లో పదో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా నాథన్ లియోన్ రికార్డులకెక్కాడు. 98 ఇన్నింగ్స్‌ల్లో లియోన్ ఈ ఘనత సాధించాడు. గతంలో పదో నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (825 పరుగులు)దే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా నాథన్ లియోన్ 1000 పరుగుల మార్క్ దాటి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.పదో నెంబర్లో వచ్చి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు👉నాథన్ లియోన్ -1019 పరుగులు👉స్టువర్ట్ బ్రాడ్ 825 పరుగులు👉నీల్ వాగ్నర్- 594 పరుగులు👉డేల్ స్టెయిన్- 568 పరుగులు👉టిమ్ సౌథీ- 511 పరుగులు👉వకార్ యూనిస్- 496 పరుగులు👉బిషన్ బేడీ- 470 పరుగులుఓవరాల్గా నాథన్ లియోన్ 143 టెస్టుల్లో 1705 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 47గా ఉంది. ఇక తన స్పిన్ బౌలింగ్‌తో 571 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.ఇక మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన నాథన్ లియోన్ మాట్ రెన్షాకు తనవంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 134 పరుగులు జోడించారు. తద్వారా సౌతాఫ్రికాపై టెస్టుల్లో తొమ్మిదో వికెట్‌కు ఈ జోడి నెలకొల్పిన 134 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా నిలిచింది.దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:👉195 - మార్క్ బౌచర్ & పాట్ సిమ్‌కాక్స్ (దక్షిణాఫ్రికా) వర్సెస్ పాకిస్తాన్, జోహన్నెస్‌బర్గ్, 1998👉134 - నాథన్ లియోన్, మాట్ రెన్షా (ఆస్ట్రేలియా) వర్సెస్ దక్షిణాఫ్రికా, డర్బన్, 2026*👉106 - జేమ్స్ అండర్సన్, గ్రేమ్ స్వాన్ (ఇంగ్లాండ్) వర్సెస్ దక్షిణాఫ్రికా, సెంచూరియన్, 2009టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:👉154 - జాక్ బ్లాక్‌హామ్, సిడ్ గ్రెగొరీ వర్సెస్ ఇంగ్లాండ్, సిడ్నీ, 1894👉134 - నాథన్ లియోన్, మాట్ రెన్షా వర్సెస్ దక్షిణాఫ్రికా, డర్బన్, 2026*👉133 - జాసన్ గిల్లెస్పీ , స్టీవ్ వా వర్సెస్ భారత్, కోల్‌కతా, 2001మ్యాచ్ విషయానికొస్తే, మాట్ రెన్షా (190) వీరోచిత పోరాటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో కమిన్స్, రెన్షాలు ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అనంతరం టెయిలెండర్లతో కలిసి వీరోచిత పోరాటం చేసిన రెన్షా పది పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. బెడింగ్హమ్ (30), మార్కరమ్ (28) క్రీజులో ఉన్నారు.Nathan Lyon becomes the first-ever player to score 1000 Test runs at No.10 position. Most runs at No.10 1019 - NATHAN LYON🇦🇺 825 - Stuart Broad🏴 594 - Neil Wagner🇳🇿 568 - Dale Steyn🇿🇦 511 - Tim Southee🇳🇿 496 - Waqar Younis🇵🇰 470 - Bishen Bedi🇮🇳 #SAvAUS https://t.co/aDbPgxYavX— Kausthub Gudipati (@kaustats) October 10, 2026ఇదీ చదవండి: భారత్‌తో వన్డే సిరీస్.. ప్రత్యేక జెర్సీ ధరించనున్న కివీస్ ఆటగాళ్లు!చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్ -
చాంపియన్స్ అని ఊరికే అనలేదు.. ఇదీ కమ్‌బ్యాక్ అంటే!
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇచ్చిన కమ్‌బ్యాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తొలిరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బౌలర్లు విజృంభిస్తుండడంతో ఆస్ట్రేలియా పని అయిపోయిందనుకున్నారు. సఫారీ బౌలర్ల ధాటికి చూస్తుండగానే ఆసీస్ టాపార్డర్, మిడిలార్డర్ పేక మేడలా కూలింది. 124 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పాట్ కమిన్స్, మాట్ రెన్షాలు సఫారీ బౌలర్లను తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు.ఈ ఇద్దరు కలిసి మొదటి రోజు ఆటను 187-6 స్కోరు వద్ద ముగించారు. ఇక రెండో రోజు తొలి సెషన్లోనే ఆస్ట్రేలియా పని పడదామనుకున్న సౌతాఫ్రికా బౌలర్లకు ఈ ఇద్దరు ముచ్చెమటలు పట్టించారు. తొలి సెషన్లో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆసీస్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ దశలో తన కెరీర్లో ఒక మరిచిపోలేని అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ (98 బంతుల్లో 43) ఔటైనప్పటికీ, మిచెల్ స్టార్క్ (25 బంతుల్లో ఆరు పరుగులు) సఫారీ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఈ దశలో రెన్ షా వీరోచిత శతకంతో మెరిశాడు. లంచ్ అనంతం ఆస్ట్రేలియా 300 మార్క్‌ను కూడా దాటింది. కనీసం రెండొందల మార్క్‌ను చేరుతుందా అనుకున్న దశలో కమిన్స్, మాట్ రెన్ షాల వీరోచిత పోరాటం ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. దీంతో వీరిద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోలుగా మారిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్‌ను సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేశారు. ‘ఒక కెప్టెన్ అంటే ఎలా ఆడాలన్నదానికి కమిన్స్ నిర్వచనం’.. ‘ఇది రా కమ్‌బ్యాక్ అంటే’.. ‘కమిన్స్, రెన్ షాల పోరాటం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఏమి కమ్‌బ్యాక్ ఇచ్చార్రా బాబు’..‘అందుకే టెస్టుల్లోనూ చాంపియన్స్ అనిపించుకున్నారు’.. ‘మీ వీరోచిత ఇన్నింగ్స్‌లకు ఇదే మా సలామ్’ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 107 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. మాట్ రెన్ షా (130), నాథన్ లియోన్ (7) క్రీజులో ఉన్నారు.A FIGHTING INNINGS BY CAPTAIN PAT CUMMINS AGAINST SOUTH AFRICA. https://t.co/7OPwWPNKpd— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2026 Crucial knock under pressure! 👏 Matt Renshaw reaches a well-fought 60 (144)* as wickets fall around him. Australia currently 214/7 in the first session of Day 2 against South Africa. https://t.co/oWXOCp4vYa— 𝐅 𝐀 𝐈 𝐙 𝐀 𝐍⚡🇵🇰 (@Faizanali_001) October 10, 2026ఇదీ చదవండి: సీఎస్కేలో మరో భారీ మార్పుసౌతాఫ్రికాతో తొలి టెస్టు.. ఆసీస్ బ్యాటర్ వీరోచిత సెంచరీ -
సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. ఆసీస్ బ్యాటర్ వీరోచిత సెంచరీ
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలదొక్కుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ మాట్ రెన్ షా (210 బంతుల్లో 100 నాటౌట్) వీరోచిత సెంచరీతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (43) రాణించాడు. ఒక దశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 96 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. రెన్ షా (102), నాథన్ లియోన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, నోర్ట్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు.👉మాట్ రెన్ షాకు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ కాగా, తొమ్మిదిన్నరేళ్ల తర్వాత 19 ఇన్నింగ్స్‌ల అనంతరం రెన్ షా టెస్టుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఇక 2017లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెన్ షా తన తొలి శతకాన్ని సాధించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున రెన్ షా 15 టెస్టులు, 15 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.👉2022 తర్వాత ఒక విదేశీ బ్యాటర్ డర్బన్‌లో సెంచరీ చేయడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022లో బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్ హసన్ జాయ్ (137 పరుగులు) సెంచరీ సాధించాడు.👉2014 తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీ చేయడం మళ్లీ ఇదే. 2014లో కేప్‌టౌన్ టెస్టులో డేవిడ్ వార్నర్ (145 పరుగులు) సెంచరీ సాధించాడు. తాజాగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై మరో ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీ బాదాడు.👉2009 తర్వాత డర్బన్ (కింగ్స్‌మీడ్ మైదానం) టెస్టులో ఒక ఆసీస్ బ్యాటర్ శతకం మార్క్ అందుకోవడం విశేషం. 2009లో ఫిలిప్ హ్యూజ్ (160 పరుగులు) సెంచరీతో మెరిశాడు. A Test Hundred After 9 Years For Matt Renshaw His 2nd Overall What A Gritty Knock Under Pressure 😮💨🔥 https://t.co/Ti0HMB16WD— Cricket Dani (@CricketDani56) October 10, 20261st Test century in 2017 vs Pakistan 2nd Test cenutry in 2026 vs South Africa Almost a decade later, Renshaw is back to three figures in Tests! 💯 #MattRenshaw #SAvsAUS https://t.co/VE0tMsV5Jp— CREX (@Crex_live) October 10, 2026ఇదీ చదవండి: 'పిల్లల కోసమే ఇదంతా.. వాళ్ల సంతోషం నాకు ముఖ్యం' -
సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ.. ఆసీస్‌ను రక్షించిన బ్యాడ్‌లైట్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా రెండు సెషన్లు పూర్తయిన తర్వాత ఆటను నిలిపివేశారు. అయితే తొలిరోజు ఆటలో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రోజు ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. మాట్ రెన్షా (46 నాటౌట్), కెప్టెన్ పాట్ కమిన్స్ (33 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, నోర్ట్జే తలా 2 వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ కలిసిరాలేదు. ఓపెనర్లిద్దరు తొందరగానే పెవిలియన్ చేరగా, లబుషేన్ (37), స్మిత్ (25) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ, భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ (14), బ్యూ వెబ్‌స్టర్ (4) కూడా తొందరగానే పెవిలియన్ చేరడంతో 124 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక అంతకముందు పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ 33 బంతులాడి పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో టెస్టు క్రికెట్లో లాంగెస్ట్ డకౌట్ (బంతుల పరంగా) అయిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇక స్టీవ్ స్మిత్ ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా రికార్డును బద్దలుకొట్టి టెస్టు క్రికెట్లో ఆసీస్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.ఇదీ చదవండి:పాక్‌తో మ్యాచ్; బరిలో భారత దిగ్గజ క్రికెటర్ల కుమారులు! -
టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా రికార్డును (10,927 పరుగులు) స్మిత్ అధిగమించాడు.ఓవరాల్‌గా ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 168 టెస్టుల్లో 13,378 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. పాంటింగ్ తర్వాతి స్థానంలో మరో దిగ్గం అలెన్ బోర్డర్ 156 టెస్టుల్లో 11,174 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా 125 టెస్టుల్లోనే స్టీవ్ వా టెస్టుల్లో సాధించిన పరుగులను దాటేసి మూడో స్థానానికి చేరుకున్న స్మిత్.. ఇప్పుడు అలెన్ బోర్డర్‌ను కూడా వెనక్కి నెట్టేసే అవకాశం అతడి ముంగిట ఉంది. ఇప్పటివరకు 125 టెస్టుల్లో 10,900 పరుగులకు పైగా చేసిన స్మిత్ ఖాతాలో 37 సెంచరీలు, 45 ఫిఫ్టీలున్నాయి. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీల రికార్డు రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 41 సెంచరీలు చేశాడు. పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించేందుకు స్మిత్ నాలుగు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. త్వరలో పాంటింగ్‌ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ బ్యాటర్‌గా స్మిత్ నిలిచే అవకాశముంది.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు) తొలి స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (169 టెస్టుల్లో 14,278 పరుగులు) రెండో స్థానంలో, పాంటింగ్ (168 టెస్టుల్లో 13,378 పరుగులు) మూడో స్థానంలో, జాక్ కల్లిస్ (166 టెస్టుల్లో 13, 289 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (164 టెస్టుల్లో 13,288 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.ఈతరం టెస్టు బ్యాటర్లలో ప్యాబ్-4గా గుర్తింపు పొందిన నలుగురిలో స్మిత్ ఒకడిగా గుర్తింపు పొందాడు. జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), విరాట్ కోహ్లి (భారత్) మిగిలిన ముగ్గురు. ఈ ముగ్గురిలో విలియమ్సన్, కోహ్లి ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఫ్యాబ్-4 కాస్తా ఫ్యాబ్-2గా మారిపోయింది. ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత జట్టులోకి.. టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు! -
పదేళ్ల తర్వాత జట్టులోకి.. టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు!
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన నిక్ మాడిసన్ 33 బంతులాడి పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో టెస్టు చరిత్రలో నిక్ మాడిసన్ది మూడో లాంగెస్ట్ డకౌట్ (బంతుల పరంగా) కావడం గమనార్హం. ఆసీస్ ఓపెనర్ నిక్ మాడిసన్ కంటే ముందు న్యూజిలాండ్ ఓపెనర్ డారిన్ ముర్రే (39 బంతుల్లో డకౌట్, 1995లో శ్రీలంకతో టెస్టులో) తొలి స్థానంలో ఉండగా, జింబాబ్వే ఓపెనర్ ట్రెవర్ గ్రిప్పర్ (36 బంతుల్లో డకౌట్, 2000 మార్చిలో వెస్టిండీస్‌పై) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా నిక్ మాడిసన్ 33 బంతుల్లో డకౌటయ్యి మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో జింబాబ్వే ఓపెనర్ మార్క్ డెక్కర్ (30 బంతుల్లో) ఉన్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బ్రియాన్ లక్ హర్ట్స్ (29 బంతుల్లో) ఐదో స్థానంలో ఉన్నాడు.ఆసీస్ తరఫున మొదటి స్థానంలో..ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యంత ఎక్కువ బాల్స్ ఆడి డకౌట్ అయిన ఓపెనర్‌గా నిక్ మాడిసన్ నిలిచాడు. గతంలో 2022లో హోబర్ట్ వేదికగా జరిగిన టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 బంతుల్లో డకౌట్) ఇప్పటివరకు లాంగెస్ట్ డకౌట్‌గా ఉండేది. తాజాగా వార్నర్‌ను నిక్ మాడిసన్ ఏకంగా 11 బంతుల తేడాతో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 26 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (25) క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓపెనర్ నిక్ మాడిసన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. లబుషేన్ (37) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, వియాన్ ముల్డర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముల్డర్ రెండు వికెట్లు తీశాడు.ఇదీ చదవండి: SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు
డర్బన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమినరీ జట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. తొడ కండరాల గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న స్టార్ ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడకు ఈ ప్రాథమిక జట్టులో చోటు దక్కింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందే రబాడ తన పూర్తి ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది.అదేవిధంగా, స్టార్ పేస్ బౌలర్లు గెరాల్డ్ కోయెట్జీ, అన్రిచ్ నోర్ట్జే, డేన్ ప్యాటర్సన్‌లను ప్రోటీస్ సెలక్టర్లు తిరిగి టెస్టు జట్టులోకి తీసుకున్నారు. ఇక దక్షిణాఫ్రికా 'ఎ' జట్టు తరఫున అద్భుతంగా రాణించిన అన్క్యాప్డ్ బ్యాటర్ మార్క్వెస్ అకెర్‌మన్‌కు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు లభించింది. టాప్ ఆర్డర్లో స్థానం కోసం అకెర్మన్, టోనీ డి జోర్జీ మరియు ట్రిస్టన్ స్టబ్స్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇక ఇప్పటికే జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరొక మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సఫారీలు కైవసం చేసుకున్నారు.ఆసీస్ తొలి టెస్టుకు సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా, మార్క్వెస్ అకెర్మాన్, డేవిడ్ బెడింగ్హామ్, కార్బిన్ బాష్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, అన్రిచ్ నోర్ట్జే, డేన్ ప్యాటర్సన్, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్జ్,కైల్ వెర్రెయిన్చదవండి: బస్సు నుంచి పడిపోయిన రోహిత్ శర్మ.. కోహ్లి రియాక్షన్ వైరల్ -
బవుమా-డికాక్ మధ్య తీవ్ర వాగ్వాదం
ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాళ్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. డీఆర్ఎస్ విషయంలో కెప్టెన్ టెంబా బవుమా నిర్ణయంపై సీనియర్ ఆటగాడు క్వింటన్ డికాక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సహచరులు జోక్యం చేసుకొని ఇద్దరిని శాంతపరచడంతో వివాదం అక్కడికి ముగిసింది.The exchange between Temba Bavuma and de Kock. He has to respect Bavuma as a captain. pic.twitter.com/zo8KBKNiNA— Ngqanga Nentsiba Zayo (@Intengu_drongo) September 27, 2026పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48వ ఓవర్లో లిజాడ్ విలియమ్స్ వేసిన బంతి జేవియర్ బార్ట్లెట్ వెనుక కాలికి తగిలింది. బంతి లెగ్ సైడ్ వైపు వెళ్తున్నట్లు భావించిన అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.బౌలర్ విలియమ్స్ మాత్రం డీఆర్ఎస్ కోరేందుకు ఆసక్తి చూపాడు. అయితే వికెట్ల వెనుక ఉన్న డికాక్ మాత్రం రివ్యూకు వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. కెప్టెన్ బవుమా మాత్రం వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు.దీంతో డికాక్ తన అభిప్రాయాన్ని బవుమాకు గట్టిగా చెప్పాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ముదరకుండా సహచర ఆటగాళ్లు ఇద్దరిని శాంతపరిచారు.చివరికి రివ్యూలో బంతి వికెట్లను తాకే అవకాశం ఉందని తేలడంతో అంపైర్ నిర్ణయం మారింది. బార్ట్లెట్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో డికాక్ అంచనా తప్పని తేలింది.డికాక్ మాట విని డీఆర్ఎస్ తీసుకోకపోయుంటే..!ఒకవేళ బవుమా డికాక్ మాట విని డీఆర్ఎస్ తీసుకోకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకంటే అప్పటికే బార్ట్లెట్ సుడిగాలి అర్ద శతకంతో సౌతాఫ్రికా ఆటగాళ్లలో గుబులు రేకెత్తించాడు. బవుమా కాన్ఫిడెంట్‌గా రివ్యూ తీసుకోవడంతో సౌతాఫ్రికాకు మేలు జరిగింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 366 పరుగుల లక్ష్యానికి ఆసీస్ 33 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.బవుమా నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే కాకుండా సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేసిందని సౌతాఫ్రికా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బవుమా నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన డికాక్‌పై వారు మండిపడుతున్నారు. అతడు కెప్టెన్.. అతని నిర్ణయానికి మర్యాద ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.కాగా, బవుమా-డికాక్ మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో డికాక్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతుగా మోకాళ్లపై కూర్చునే నిర్ణయాన్ని పాటించకుండా మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న బవుమా.. డికాక్ నిర్ణయంతో తాము ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పాడు. అయితే డికాక్ వ్యక్తిగత నిర్ణయాన్ని, అతడి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని కూడా స్పష్టం చేశాడు.ఇదీ చదవండి: జగజ్జేతలను చిత్తు చేసిన బవుమా సేన -
జగజ్జేతలను చిత్తు చేసిన బవుమా సేన
డిఫెండింగ్ వన్డే ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా జట్టు భారీ షాకిచ్చింది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా నిన్న జరిగిన రెండో వన్డేలో జగజ్జేతను 32 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఆసీస్‌పై వరుసగా ఆరో వన్డే సిరీస్ గెలిచింది. ఓవరాల్‌గా ఆసీస్‌పై సౌతాఫ్రికాకు ఇది పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. ప్రపంచంలో ఏ జట్టు ఆస్ట్రేలియాపై ఇన్ని ద్వైపాక్షిక సిరీస్ విజయాలు సాధించలేదు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (103), డేవిడ్ మిల్లర్ (142) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 5 వికెట్లతో రాణించగా, హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీశాడు.భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు శుభారంభమే లభించినా మ్యాచ్ గెలవలేకపోయింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (84), ట్రవిస్ హెడ్ (84) మెరుపు అర్ద సెంచరీలతో రాణించినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో జేవియర్ బార్ట్లెట్ (50) మెరుపు అర్ద శతకం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లు తలో చేయి వేసి ఆసీస్‌ను దెబ్బకొట్టారు. లిజాడ్ విలియమ్స్ 3, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ఫోర్టుయిన్ తలో 2, మార్క్రమ్ ఓ వికెట్ తీశారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు మూడో వన్డే సెప్టెంబర్ 30న జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: తొలిసారి తుది జట్టులో యాన్సెన్ సోదరులు -
తొలిసారి తుది జట్టులో యాన్సెన్ సోదరులు
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఓ అరుదైన ఘనతకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తరఫున యాన్సెన్ సోదరులు (మార్కో, డువాన్) తొలిసారి బరిలోకి దిగారు. తద్వారా సౌతాఫ్రికా తరఫున కలిసి బరిలోకి దిగిన 9వ సోదరుల జోడీగా రికార్డుల్లోకెక్కారు.ఈ పరిణామ నేపథ్యంలో సౌతాఫ్రికా తరఫునే కాకుండా, ఇతర దేశాల తరఫున కూడా ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగిన పాపులర్ బ్రదర్స్‌పై ఓ లుక్కేద్దాం. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు చాలామంది సోదరులు కలిసి బరిలోకి దిగారు. వీరిలో క్లిక్ అయ్యింది మాత్రమే పలువురే. ఈ కథనంలో ఆ పాపులర్ బ్రదర్స్‌ను ఓసారి గుర్తు చేసుకుందాం. ముందుగా సౌతాఫ్రికా విషయానికొస్తే..యాన్సెన్ సోదరులకు ముందు సౌతాఫ్రికా తరఫున ఎనిమిది బ్రదర్స్ జోడీలు కలిసి బరిలోకి దిగినప్పటికీ.. గుర్తింపు పొందిన పెయిర్స్ మాత్రం మూడే. అందులో గ్రేమ్-పీటర్ పొలాక్, పీటర్-గ్యారీ కిర్‌స్టన్, అల్బీ-మోర్నీ మోర్కెల్ జోడీలు ఉన్నాయి. మలాన్ (పీటర్, జన్నెమన్), హెర్మన్ (రూబిన్, జోర్డన్) సోదరులు కూడా అడపాదడపా గుర్తింపు కలిగి ఉన్నారు.ఇతర దేశాల ప్రముఖ బ్రదర్స్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్-మార్క్ వా సుప్రసిద్ద బ్రదర్స్ జోడీ. భారత్‌కు చెందిన ఇర్ఫాన్-యూసుఫ్ పఠాన్ జోడీ కూడా విశ్వవ్యాప్త గుర్తింపు కలిగి ఉంది.వా సోదరులు (ఆస్ట్రేలియా): స్టీవ్ వా, మార్క్ వా 1990లలో ఆస్ట్రేలియా టెస్టు, వన్డే జట్లలో కీలక సభ్యులుగా కలిసి ఆడారు.పఠాన్ సోదరులు (భారత్): ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ భారత్ తరఫున కలిసి ఆడారు. 2007 టీ20 ప్రపంచకప్ విజేత భారత జట్టులోనూ ఇద్దరూ ఉన్నారు.పాండ్యా సోదరులు (భారత్): హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో కలిసి ఆడారు.చాపెల్ సోదరులు (ఆస్ట్రేలియా): ఇయాన్, గ్రెగ్ చాపెల్ ఆస్ట్రేలియా తరఫున కలిసి ఆడగా, మరో సోదరుడు ట్రెవర్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఆడాడు.మొహమ్మద్ సోదరులు (పాకిస్తాన్): హనీఫ్, సాదిక్, ముష్తాక్, వజీర్ మొహమ్మద్‌లు పాకిస్తాన్ తరఫున ఆడిన ప్రముఖ సోదరులు.మోర్కెల్ సోదరులు (దక్షిణాఫ్రికా): అల్బీ, మోర్నీ మోర్కెల్ కూడా దక్షిణాఫ్రికా తరఫున కలిసి ఆడారు.కరన్ సోదరులు (ఇంగ్లండ్): టామ్, సామ్ కరన్‌లు ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు.ఓ'బ్రియన్ సోదరులు (ఐర్లాండ్): కెవిన్, నీల్ ఓ'బ్రియన్లు ఐర్లాండ్ తరఫున కలిసి ఆడారు.ఇలా చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ క్రికెట్లో కలిసి ఆడిన బ్రదర్స్ జోడీలు చాలానే ఉన్నాయి. మార్ష్ సోదరులు (షాన్-మిచెల్, ఆస్ట్రేలియా)లీ సోదరులు (షేన్-బ్రెట్, ఆస్ట్రేలియా)హస్సీ సోదరులు (మైక్-డేవిడ్, ఆస్ట్రేలియా)హోలియోక్ సోదరులు (ఆడమ్-బెన్, ఇంగ్లండ్)మెక్కల్లమ్ సోదరులు (బ్రెండన్-నాథన్, న్యూజిలాండ్)ఫ్లవర్ సోదరులు (ఆండీ-గ్రాంట్, జింబాబ్వే)ఇదీ చదవండి: SA vs AUS: సౌతాఫ్రికా కెప్టెన్ సూపర్ సెంచరీ.. ధోని సరసన -
సౌతాఫ్రికా కెప్టెన్ సూపర్ సెంచరీ.. ధోని సరసన
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఎయిడెన్ మార్క్రమ్, ఆ తర్వాత కాసేపటికే క్వింటన్ డికాక్ (15) పెవిలియన్‌కు చేరారు.ఈ సమయంలో బవుమా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 112 బంతుల్లో తన వన్డే కెరీర్లో 6వ సెంచరీ మార్కును పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 116 బంతులు ఎదుర్కొన్న బవుమా.. 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుటయ్యాడు.అతడితో పాటు డేవిడ్ మిల్లర్ (93 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్లతో 142) భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఎంఎస్ ధోనీ రికార్డు సమం:ఈ మ్యాచ్‌లో శతక్కొట్టిన బవుమా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాపై కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో ఎంఎస్ ధోనీ, బాబర్ ఆజమ్, స్టీఫెన్ ఫ్లెమింగ్‌ల సరసన బవుమా చేరాడు. వీరంతా కెప్టెన్‌గా ఆసీస్‌పై చెరో 2 సెంచరీలు సాధించగా.. ఈ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్ (3), విరాట్ కోహ్లి (3) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.మరోవైపు సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో కెప్టెన్‌గా డుప్లెసిస్ (5 సెంచరీలు) సరసన బవుమా నిలిచాడు. బవుమా ఇప్పటివరకు కెప్టెన్‌గా 5 వన్డే సెంచరీలు చేశాడు. -
ఏం క్యాచ్ రా బాబు.. కళ్ళు మూసి తెరిచేలోపే! వీడియో వైరల్
జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కానోలీ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మ్యాచ్ మొదటి బంతికే సూపర్ క్యాచ్‌తో దక్షిణాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్ను పెవిలియన్‌కు పంపాడు.తొలి ఓవర్ వేసిన ఆసీస్ స్పీడ్ స్టార్ జోష్ హేజిల్‌వుడ్.. మొదటి బంతిని మార్క్రమ్కు ఆఫ్‌స్టంప్ వెలుపల షార్ట్ బాల్‌గా సంధించాడు. ఆ బంతిని ఎయిడెన్ కవర్స్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. షాట్ బాగానే కనెక్ట్ అయినప్పటికీ, కవర్-పాయింట్లో ఉన్న కానోలీ ఊహకందని అద్భుతం చేశాడు. తన తలపై నుంచి వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో క్యాచ్‌గా మలచుకున్నాడు.దీంతో ఒక్కసారిగా మార్క్రమ్తో పాటు మైదానంలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు "క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్లలో ఇది ఒకటి" అని కొనియాడుతున్నారు.సౌతాఫ్రికా భారీ స్కోర్ఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్(93 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్స్‌లతో 142), టెంబా బావుమా(103) వీరోచిత సెంచరీలతో కదం తొక్కారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ ఐదు వికెట్లతో చెలరేగాడు.Markram's stay was cut short immediately thanks to this grab pic.twitter.com/GyDosOkhQW— Werner (@Werries_) September 27, 2026చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ ఓపెనర్లు -
మిల్లర్ ప్రపంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్ టెంబా బవుమా సెంచరీతో చెలరేగగా.. తాజాగా ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. గతంలో హెన్రిచ్ క్లాసెన్ (2023లో 57 బంతుల్లో) సెంచరీ చేసి తొలి స్థానంలో ఉండగా.. 2016లో 69 బంతుల్లో సెంచరీ సాధించిన మిల్లర్ తాజా మ్యాచ్‌లో 73 బంతుల్లో శతకం మార్క్‌ను చేరుకోవడం విశేషం. వీరిద్దరి తర్వాత డికాక్ (74 బంతుల్లో), మార్కరమ్ (74 బంతుల్లో) సెంచరీలు సాధించారు.👉ఇక వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ మిల్లర్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు తాజా దానితో కలిపి నాలుగు సెంచరీలు చేసిన మిల్లర్ రెండో స్థానంలో ఉండగా, డుప్లెసిస్ (5 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత డికాక్, హర్షలే గిబ్స్ చెరో 3 సెంచరీలతో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో ఐదు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మిల్లర్ (8 సెంచరీలు) జోస్ బట్లర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ధోని, యువరాజ్లు చెరో ఏడు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉 ఆస్ట్రేలియాతో ఒక వన్డే మ్యాచ్‌లో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. మిల్లర్‌కు మాత్రం ఇది రెండోసారి. గతంలో 2014లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ (106), డివిలియర్స్ (136 నాటౌట్) తొలిసారి ఈ ఫీట్ సాధించారు. 2018లో హోబర్ట్ వేదికగా డుప్లెసిస్ (125), మిల్లర్ (139) శతకాలు బాదారు. తాజాగా బవుమా, మిల్లర్లు మరోసారి ఆస్ట్రేలియాపై ఒకే మ్యాచ్‌లో శతకాలతో విరుచుకుపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ బవుమా, మిల్లర్ సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోరు చేసింది. మిల్లర్ (93 బంతుల్లో 142; 12 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, బవుమా (116 బంతుల్లో 103) క్లాస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావాళ్లలో పెద్దగా ఎవరు ఆడలేదు. చివర్లో డాన్ జాన్ (27 నాటౌట్), మార్కో జాన్సెన్ (19) మెరుపులతో సౌతాఫ్రికా 350 పరుగుల మార్క్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ ఐదు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు.ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. నిర్వాహకులను ఏకిపారేసిన పీవీ సింధు -
ఏడాది తర్వాత బరిలోకి.. కుమ్ముతాడనుకుంటే ఇలా బుక్కయ్యాడు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్కరమ్ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న మార్కరమ్ తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఏడాది తర్వాత ఎంతో ఆశతో బరిలోకి దిగిన మార్కరమ్కు ఆస్ట్రేలియా పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మార్కరమ్, డికాక్ ఆరంభించారు. హాజిల్‌వుడ్ ఇన్నింగ్స్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ వేశాడు. మార్కరమ్ దానిని టచ్ చేసే క్రమంలో కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కూపర్ కన్నోలి సూపర్ వన్ హ్యాండ్ క్యాచ్ తీసుకోవడంతో మార్కరమ్ గోల్డెన్ డక్ అయ్యాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో తొలి బంతికే వెనుదిరిగిన నాలుగో బ్యాటర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో హర్షలే గిబ్స్ రెండుసార్లు, హషీమ్ ఆమ్లా రెండు సార్లు, జానేమన్ మలన్ ఒకసారి ఈ చెత్త రికార్డును నమోదు చేశారు. తాజాగా వీరి సరసన మార్కరమ్ చేరాడు. గిబ్స్ 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జేమ్స్ ఫ్రాంక్లిన్ బౌలింగ్‌లో ఒకసారి.. అదే ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అక్రమ్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక హషీమ్ ఆమ్లా 2011లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బొలింగర్ బౌలింగ్‌లో; 2013లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జానేమన్ మలన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ విషయానికొస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా 28 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (45), బవుమా (74) క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది.WHAT A CATCH BY COOPER CONNOLLY 🤯🔥 pic.twitter.com/cfK8zlWyio— Johns. (@CricCrazyJohns) September 27, 2026ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బయటకు! -
ఆసీస్‌తో రెండో వన్డే.. సౌతాఫ్రికా జట్టులో మార్పులు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగనున్న రెండో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి విడుదల కాగా.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టులోకి వచ్చాడు. రికెల్టన్ తిరిగి మూడో వన్డే సమయానికి అందుబాటులో ఉంటాడని క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. రెండో వన్డే ఇవాళ జోహనెస్బర్గ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియారెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లు..సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డి కాక్(w), టెంబా బవుమా(c), మాథ్యూ బ్రీట్జ్కే, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, డువాన్ జాన్సెన్, బ్యోర్న్ ఫోర్టుయిన్, కేశవ్ మహారాజ్, లిజాద్ విలియమ్స్ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(c), ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, అలెక్స్ క్యారీ(w), మాట్ రెన్షా, కామెరాన్ గ్రీన్, జాక్ ఎడ్వర్డ్స్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్కాగా, 3 మ్యాచ్‌ల వన్డే మరియు టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మాథ్యూ బ్రీట్జ్కే, కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికాను గెలిపించాడు. బ్రీట్జ్కే సెంచరీ, మహారాజ్ 4 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టారు.టెస్ట్ సిరీస్‌కు ముందు గాయాల బెడదవన్డే సిరీస్ ముగిసిన అనంతరం అక్టోబర్ 9 నుంచి సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాను గాయాల బెడద వేధిస్తుంది. పేసర్లు క్వేనా మఫాకా, కగిసో రబాడా, లుంగి ఎంగిడి ప్రస్తుతం హ్యామ్‌స్ట్రింగ్ గాయాలతో జట్టుకు దూరంగా ఉన్నారు. వీరు ముగ్గురు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోతే సౌతాఫ్రికా విజయావకాశాలు భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: Virat Kohli: ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది..! -
ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు షాక్.. స్వదేశానికి స్టార్ ఆటగాడు!
సౌతాఫ్రికా పర్యటనను ఓటమితో ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కీపింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లిస్ కుడిచేయి చూపుడువేలికి బంతి బలంగా తగిలింది. చికిత్స అనంతరం ఇంగ్లిస్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం ఇంగ్లిస్ గాయాన్ని పరిశీలించగా, చూపుడువేలిలో చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో ఇంగ్లిస్‌ను చికిత్స కోసం స్వదేశానికి తిరిగిరావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. పెర్త్‌లో ఇంగ్లిస్ చేతి వేలి గాయానికి ట్రీట్మెంట్ తీసుకోనున్నాడు. వన్డే సిరీస్‌కు దూరమైన జోష్ ఇంగ్లిస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడు కోలుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.అయితే మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లిస్ స్థానంలో ఇప్పటివరకు ఏ ఆటగాడిని ఎంపిక చేయలేదని తెలుస్తోంది. దీంతో రేపు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అలెక్స్ కేరీ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 67 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. రేపు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు భావిస్తుండగా, రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం లేకపోలేదు.తొలి వన్డేకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో వన్డేలో ఆడే అవకాశముంది. అయితే మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ రెండో వన్డేకు విశ్రాంతి తీసుకునే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలోనే ఆసీస్ జట్టు ప్రధాన బౌలర్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా ప్లాన్ చేసింది.ఇక మూడో వన్డే సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. డర్బన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి 13 వరకు తొలి టెస్టు, అక్టోబర్ 18 నుంచి 22 వరకు గెహ్రా వేదికగా రెండో టెస్టు, అక్టోబర్ 27 నుంచి 31 వరకు కేప్‌టౌన్ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.ఇదీ చదవండి: రేపు తొలి వన్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక; గత రికార్డులు ఇలా! -
24 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా స్పిన్నర్ అరుదైన ఫీట్
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డే క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ (22 వికెట్లు).. పాట్ సిమ్కాక్స్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అంతేకాదు కేశవ్ మహరాజ్‌కు వన్డేల్లో ఇది ఐదో నాలుగు వికెట్ల హాల్ కాగా, ఓవరాల్‌గా అత్యధిక సార్లు నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో ఇమ్రాన్ తాహిర్ (10 సార్లు) కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై వన్డేల్లో కేశవ్ మహరాజ్ సాధించిన (4/20) వికెట్ల ప్రదర్శన సౌతాఫ్రికా తరఫున రెండో అత్యుత్తమం. 2002లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్‌పై నికీ బోజే (5/12) వికెట్ల ప్రదర్శన తొలి అత్యుత్తమంగా ఉంది. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా, ఈ నాలుగుసార్లు సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కే (106 బంతుల్లో 112) శతకం సాధించగా, మార్కో జాన్సన్ (75) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (60) అర్థసెంచరీతో రాణించగా, మాట్ రెన్షా (44) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు తీయగా, కార్బిన్ బోస్క్, జోర్న్ ఫోర్టిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: Asian Games 2026: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్ -
SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ప్రొటిస్ జట్టు 67 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మెరుపులు మెరిపించారుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో తడబడ్డా తిరిగి పుంజుకుంది. ఇందుకు నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే, మార్కో యాన్సెన్ మెరుపులు కారణం. బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో శతక్కొట్టగా (112).. ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు.ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కేవలం 59 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 75 పరుగులు సాధించాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది.230 పరుగులకే ఆసీస్ ఆలౌట్అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ప్రొటిస్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. బిజోర్న్ ఫార్చూన్, కార్బిన్ బాష్ తలా రెండు, గెరాల్డ్ కోయెట్జి, మార్కో యాన్సెన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.పరుగులు తీయడంతో పాటు వికెట్, క్యాచ్లుఇక ఈ మ్యాచ్‌లో మార్కో యాన్సెన్ నాలుగు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్ (3), కోయెట్జి బౌలింగ్‌లో మ్యాట్ రెన్షా (44), మహరాజ్ బౌలింగ్‌లో జాక్ ఎడ్వర్డ్స్ (5), బాష్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ (16) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో మార్కో యాన్సెన్ చరిత్ర సృష్టించాడు.ఆస్ట్రేలియాతో ఓ వన్డే మ్యాచ్‌లో అత్యధికంగా 75 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి.. నాలుగు క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా యాన్సెన్ రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా ఓ వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న ఐదో ఆటగాడిగా మార్కో యాన్సెన్ నిలిచాడు.ఒక వన్డే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి నాలుగు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఒక వికెట్ తీసిన క్రికెటర్లు వీరే👉సచిన్ టెండుల్కర్ (ఇండియా)- పాకిస్తాన్ మీద ఢాకా వేదికగా 1998లో 67 పరుగులు, ఒక వికెట్, నాలుగు క్యాచ్‌లు👉యూనిస్ ఖాన్ (పాకిస్తాన్)- జింబాబ్వే మీద హరారే వేదికగా 2002లో 90 పరుగులు, ఒక వికెట్, నాలుగు క్యాచ్‌లు👉మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా)- టీమిండియా మీద మెల్బోర్న్ వేదికగా 2004లో 63 పరుగులు, ఒక వికెట్, నాలుగు క్యాచ్‌లు👉మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా)- ఇంగ్లండ్ మీద నాటింగ్‌హామ్ వేదికగా 2024లో 77 పరుగులు, మూడు వికెట్లు, నాలుగు క్యాచ్‌లు👉మార్కో యాన్సెన్ (సౌతాఫ్రికా)- ఆస్ట్రేలియా మీద డర్బన్ వేదికగా 2026లో 75 పరుగులు, ఒక వికెట్, నాలుగు క్యాచ్‌లు.చదవండి: తొలి టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ -
సొంతగడ్డపై విజృంభించిన దక్షిణాఫ్రికా.. తొలి వన్డేలో ఆసీస్ చిత్తు
డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే (106 బంతుల్లో 112 పరుగులు, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ (59 బంతుల్లో 75 పరుగులు, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సఫారీలు కంగారుల ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు.మహారాజ్ మ్యాజిక్‌అనంతరం 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), ట్రావిస్ హెడ్ (36) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ విజృంభించడంతో ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. మహారాజ్ 9.2 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు కార్బిన్ బాష్, జోర్న్ ఫోర్టుయిన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జోహన్స్‌బర్గ్ వేదికగా జరగనుంది.చదవండి: WI vs ZIM: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు -
సౌతాఫ్రికాకు మరో భారీ షాక్..! ఇంకేమి గెలుస్తారు?
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ పేసర్లు కగిసో రబాడ, లుంగీ ఎంగిడి గాయాల కారణంగా సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా మరొక యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా కూడా ఈ జాబితాలో చేరాడు.ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో మఫాకా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ప్రాక్టీస్‌ను మధ్యలోనే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా నిర్వహించిన స్కాన్లలో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.ఈ క్రమంలోనే మూడు వన్డేల సిరీస్‌కు అతడు దూరమైనట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల మఫాకా స్థానంలో లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా మఫాకా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల నమీబియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ యంగ్ పేసర్ సత్తాచాటాడు. దీంతో ఆసీస్ సిరీస్‌లోనూ ఎంగిడీ, రబాడా లేని లోటును మఫాకా తీరుస్తాడని ప్రోటీస్ టీమ్ మేనెజ్మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అతడు కూడా గాయం కారణంగా దూరం కావడంతో సౌతాఫ్రికా బౌలింగ్ లైనప్ బలహీనంగా మారింది. సెప్టెంబర్ 24 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.చదవండి: ICC T20 Rankings: ప్రపంచ నెం1 వన్ బౌలర్‌గా పాకిస్తాన్ స్టార్.. ఇదే తొలిసారి -
సౌతాఫ్రికాతో సిరీస్.. పాట్ కమిన్స్ కీలక నిర్ణయం!
సౌతాఫ్రికాలో పర్యటించనున్న ఆస్ట్రేలియా మల్టీ ఫార్మాట్ సిరీస్ (మొదట మూడు వన్డేలు, తర్వాత మూడు టెస్టులు) ఆడనుంది. ఈ నేపథ్యంలో రేపు డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఇప్పటికే జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కమిన్స్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ కేవలం ఒక్క వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తన నిర్ణయాన్ని వెల్లడించగా, బోర్డు కూడా అతడి విజ్ఞప్తిని అంగీకరించింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కంటే ముందు టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా ఆస్ట్రేలియా టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియా ఆడనుండడంతో దీనిని కమిన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు. కమిన్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. వీళ్లిద్దరు మొదటి వన్డేతో పాటు మూడో వన్డే ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే కమిన్స్ మాత్రం కేవలం రెండో వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే మిచెల్‌మార్ష్ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశముంది.ఇక సౌతాఫ్రికా టూర్లో ఆస్ట్రేలియా తొలుత గురువారం తొలి వన్డే, సెప్టెంబర్ 27న రెండో వన్డే, సెప్టెంబర్ 30న మూడో వన్డే ఆడనుంది. ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న ఆస్ట్రేలియా అక్టోబర్ 9 నుంచి 13 మధ్య తొలి టెస్టు, అక్టోబర్ 18 నుంచి 22 మధ్య రెండో టెస్టు, అక్టోబర్ 26 నుంచి 30 మధ్య మూడో టెస్టు ఆడనుంది. -
సౌతాఫ్రికాకు ఊహించని షాక్! ఇక అంతే సంగతి?
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గాయాల వల్ల స్టార్ పేసర్లు కగిసో రబాడా, ఒట్నీల్ బార్ట్మన్లు దూరం కాగా.. తాజాగా స్పీడ్‌స్టార్ లుంగి ఎంగిడి కూడా ఈ జాబితాలో చేరాడు. కుడి కాలి తొడ కండరాల గాయం కారణంగా అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఈ నెల ఆరంభంలో డాల్ఫిన్స్‌తో జరిగిన ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున ఆడుతున్న సమయంలో ఎంగిడి గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడిన అతడికి ఆస్పత్రిలో స్కాన్ నిర్వహించగా గాయం తీవ్రత బయటపడింది. వైద్యులు అతడికి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో ఆసీస్‌తో వన్డే సిరీస్ నుంచి అతడు తప్పుకున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.ఎంగిడి స్థానంలో 20 ఏళ్ల యువ పేసర్ న్కోబాని మోకోయెనాను ప్రొటీస్ సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రబాడా, బార్ట్‌మన్, ఎంగిడి వంటి కీలక పేసర్లు లేకుండా సౌతాఫ్రికా యువ బౌలింగ్ విభాగం పటిష్టమైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను ఏమేరకు అడ్డుకుంటుందో చూడాలి.ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు ప్రోటీస్ జట్టుటెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, జోర్న్ ఫోర్టుయిన్, డువాన్ జాన్సెన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, న్కోబానీ మోకోనా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: IND vs AUS: భారత జట్టులో సిక్కోలు కుర్రాడికి చోటు!? -
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్ ప్లేయర్ దూరం.. షాక్‌లో సౌతాఫ్రికా!
టెస్టు చాంపియన్ సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ కగిసో రబాడ తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆసీస్‌తో జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా రబాడ అందుబాటులో ఉండడం అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డబ్ల్యూటీ సీ పట్టికలో సౌతాఫ్రికా 75 పీసీటీతో రెండో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుండడంతో ఈ సిరీస్‌కు సౌతాఫ్రికాకు కీలకం కానుంది. ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉన్నప్పటికీ, తమ నంబర్‌వన్ స్థానాన్ని కాపాడుకోవాలంటే సౌతాఫ్రికా సిరీస్ ముఖ్యమే. డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా 80 పీసీటీతో తొలి స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 పీసీటీ), న్యూజిలాండ్ (72.22 పీసీటీ)తో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ ఆసీస్‌కు సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ను కోల్పోతే పాయింట్లు పడిపోవడంతో పాటు మూడో స్థానానికి పడిపోయే అవకాశముంది. అప్పుడు మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌కు ఫైనల్ ఆడే అవకాశం లభించవచ్చు. స్వదేశంలో టీమిండియాతో న్యూజిలాండ్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ఆడనుండడం కివీస్‌కు సానుకూలాంశం కానుంది.రబాడకు ఏమైంది?ఆస్ట్రేలియాతో వన్డే, టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు సన్నాహకాలు ప్రారంభించింది. ప్రాక్టీస్ సందర్భంగా రబాడ తొడ కండరాల్లో చీలిక వచ్చింది. స్కానింగ్‌లో రబాడ గ్రేడ్-3 టియర్తో బాధపడుతున్నట్లు తేలింది. దీంతో రబాడ కనీసం 9 నుంచి 10 వారాలు ఆటకు దూరమయ్యే అవకాశముంది. అయితే వచ్చే నెల సెప్టెంబర్ 24 నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. రబాడ కోలుకోవడానికి తొమ్మిది వారాలు సమయం పట్టనుండడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అక్టోబర్ 9 నుంచి 27 మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. 9-10 వారాలు రెస్ట్ కావడంతో ఈ లెక్కన రబాడ టెస్టు సిరీస్‌కు కూడా దూరమైనట్లేనని సౌతాఫ్రికా క్రికెట్ మెడికల్ టీమ్ ధృవీకరించింది.Read: గాయంతో కీలక బ్యాటర్ ఔట్.. పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! -
AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!
క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు చిరకాలం గుర్తుండిపోతాయి. రెండు కొదమసింహాలు ఒకటిని మించి మరొకటి తలపడితే వచ్చే మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా క్రికెట్ అభిమానులను సైతం ఆద్యంతం మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్ కూడా ఒకటి ఉంది. ఆఖరిదాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విజయం ఎవరిదన్నది పక్కనబెడితే అభిమానులకు మాత్రం చెప్పలేనంత జోష్‌ను ఇచ్చింది. అదే మార్చి 12, 2006లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్. టీ20లు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో మ్యాచ్‌లన్నీ వన్డే, టెస్టు ఫార్మాట్లోనే ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో వన్డేల్లో 400 పరుగులు చేయడం గొప్పగా చూసేవారు. కానీ ఒత్తిడి తట్టుకొని రెండో ఇన్నింగ్స్‌లో టార్గెను ఛేదించడమే గాక రెండు ఇన్నింగ్స్‌లకు కలిపి 800 పరుగులకు నమోదవ్వడం చిన్న విషయం కాదు. తాజాగా మ్యాచ్‌కు నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి గుర్తుకు చేసుకుందాం.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోరు చేసింది. అప్పటివరకు వన్డే క్రికెట్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్ రికీ పాంటింగ్ 164 పరుగులతో యాంకర్ పాత్ర పోషించగా, గిల్‌క్రిస్ట్ (55), సైమన్ కటిచ్ (79), మైక్ హస్సీ (81) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే కొండంత లక్ష్యం చూశాకా రెండో బ్యాటింగ్‌కు దిగే ఏ జట్టైనా భయపడాల్సిందే. కానీ సౌతాఫ్రికా మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్ ఆడడం మొదలెట్టింది. కొండంత స్కోరు టార్గెట్‌గా ఉంచడంతో ఆస్ట్రేలియా కూడా మొదట్లో సఫారీల ఇన్నింగ్స్‌ను లైట్ తీసుకుంది. కానీ ఓపెనర్ హర్షలే గిబ్స్ (175 పరుగులు), గ్రేమీస్మిత్ (90 పరుగులు) మొదటి నుంచే ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు పరుగులెత్తింది. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోతు వచ్చింది. అయితే మధ్యలో సౌతాఫ్రికా వికెట్లు కోల్పోయినప్పటికీ మార్క్ బౌచర్ (50 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి ఒక బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఇక క్రికెట్ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమంటే ఇదేనేమో అనిపించింది. అప్పటిదాకా వన్‌సైడ్ భారీ స్కోర్లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఈ మ్యాచ్ తర్వాత భారీ టార్గెట్లు కూడా అవలీలగా ఛేదించడం మొదలయ్యిందని చెప్పొచ్చు. క్రికెట్ చరిత్రలోనే ఇదొక గొప్ప మ్యాచ్‌గా మిగిలిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో దక్షిణాఫ్రికా ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ వరల్డ్‌కప్ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. దురదృష్టకరమైన జట్టుగా పేరు పొందిన సౌతాఫ్రికా ఇప్పటివరకు గెలిచిన ఏకైక ట్రోఫీ ఐసీసీ నాకౌట్ చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కావడం గమనార్హం.చదవండి: ‘గేమ్‌ప్లాన్ ఎవడిదో కానీ చంపేయాలి’! -
సౌతాఫ్రికా హోం సమ్మర్ షెడ్యూల్ ప్రకటన
ఈ ఏడాది (2026-27) హోం సమ్మర్ షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (CSA) ఇవాళ ప్రకటించింది. ఈ సీజన్లో మూడు ప్రధాన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నాయి. ఈ సీజన్ ఆస్ట్రేలియా సిరీస్‌తో మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్ సఫారీ గడ్డపై అడుగుపెడుతుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టు 3 వన్డేలు, 2 టెస్ట్‌లు, 3 టీ20లు ఆడనుంది. ఆతర్వాత ఇంగ్లండ్ టీమ్ సౌతాఫ్రికాలో ల్యాండవుతుంది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ 3 వన్డేలు, 3 టెస్ట్‌లు ఆడుతుంది. దీనికి సంబంధించిన తేదీలు, వేదికల వివరాలు ఇలా ఉన్నాయి.ఆస్ట్రేలియా టూర్ సెప్టెంబర్ 24-తొలి వన్డే, డర్బన్సెప్టెంబర్ 27-రెండో వన్డే, జోహనెస్బర్గ్సెప్టెంబర్ 30-మూడో వన్డే, పోచెఫ్స్ట్రూమ్అక్టోబర్ 9-13: తొలి టెస్ట్, డర్బన్‌అక్టోబర్ 18-22: రెండో టెస్ట్, గ్కెబెర్హాఅక్టోబర్ 27-31: మూడో టెస్ట్, కేప్టౌన్బంగ్లాదేశ్ టూర్ నవంబర్ 15-19: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్నవంబర్ 23-27: రెండో టెస్ట్, సెంచూరియన్డిసెంబర్ 1- తొలి వన్డే, ఈస్ట్ లండన్డిసెంబర్ 4- రెండో వన్డే, గ్కెబెర్హాడిసెంబర్ 7- మూడో వన్డే, కేప్‌టౌన్‌డిసెంబర్ 10- తొలి టీ20, కింబర్లీడిసెంబర్ 12- రెండో టీ20, బెనోనీడిసెంబర్ 13- మూడో టీ20, సెంచూరియన్ఇంగ్లండ్ టూర్డిసెంబర్ 17-21: తొలి టెస్ట్, జోహనెస్బర్గ్డిసెంబర్ 26-30: రెండో టెస్ట్, సెంచూరియన్2027 జనవరి 3-7: మూడో టెస్ట్, కేప్టౌన్జనవరి 10- తొలి వన్డే, పార్ల్జనవరి 13- రెండో వన్డే, బ్లోంఫాంటైన్జనవరి 15- మూడో వన్డే, బ్లోంఫాంటైన్ఈ పర్యటనలో జరగాల్సిన టీ20 సిరీస్‌ను షెడ్యూల్ సమస్యల కారణంగా వాయిదా వేసి, తర్వాతి తేదీల్లో నిర్వహించనున్నారు. -
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం. దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్‌ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.మెక్కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్‌తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
సిక్సర్‌తో ఆగమనం.. వన్డేల్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన డెవాల్డ్ బ్రెవిస్
సౌతాఫ్రికా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ వన్డే క్రికెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్లో తానెదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో ఈ ఘనతను అతి కొద్ది మంది (2002 తర్వాత) మాత్రమే సాధించారు. బ్రెవిస్‌కు ముందు షమీమ్ హొస్సేన్ (బంగ్లాదేశ్), ఇషాన్ కిషన్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే), క్రెయిగ్ వ్యాలెస్ (స్కాట్లాండ్), జవాద్ దావూద్ (కెనడా), జోహన్ లవ్ (సౌతాఫ్రికా) వన్డేల్లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచారు. జోహన్ లవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో సౌతాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్ రికార్డు నెలకొల్పాడు.బాధాకరమేమిటంటే బ్రెవిస్ సిక్సర్ బాదిన మరుసటి బంతికే ఔటయ్యాడు. కెయిన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన బ్రెవిస్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో తొలి బంతికి సిక్సర్ కొట్టి, ఆతర్వాతి బంతికే ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (82), బవుమా (65), మాథ్యూ బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.సెంచరీ.. ఓ హాఫ్ సెంచరీవన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బ్రెవిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. దురదృష్టవశాత్తు ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా గెలవలేకపోయింది. 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్రెవిస్ 180 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్
కెయిర్న్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.ప్రోటీస్ ఓపెనర్లు ఐడైన్ మార్క్రమ్(1), రికెల్టన్ త్వరగా ఔటైనప్పటికి మిడిలార్డర్లో డెవాల్డ్ బ్రెవిస్ మరోసారి మెరుపులు మెరిపించాడు. కాజాలి స్టేడియంలో బ్రెవిస్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బ్రెవిస్.. 6 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో 53 పరుగులు చేశాడు. అతడితో పాటు వండర్ డస్సెన్(38), స్టబ్స్(25) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఈల్లీస్ మూడు, జంపా, హాజిల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.మ్యాక్స్‌వెల్ మెరుపులు.. అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 66 పరుగులు అందించారు. అయితే సఫారీ బౌలర్లు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇవ్వడంతో ఆసీస్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో గ్లెన్ మాక్స్వెల్ విరోచిత పోరాటం కనబరిచాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగి తమ జట్టుకు సిరీస్ విజయాన్ని అందించాడు. మాక్స్ 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు కెప్టెన్ మిచెల్ మార్ష్(54) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ప్రోటీస్ బౌలర్లలో కార్బిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ, మఫాక తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: రిషబ్ పంత్ గాయం ఎఫెక్ట్.. సరికొత్త రూల్‌ను తీసుకురానున్న బీసీసీఐ! -
Aus vs SA: వేలు చూపిస్తూ ఓవరాక్షన్.. సౌతాఫ్రికా స్టార్‌కు షాకిచ్చిన ఐసీసీ
సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాకిచ్చింది. మంగళవారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తమ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనించనందుకు బాష్‌కు ఓ డీమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కర్బిన్ బాష్ అద్బుతమైన బంతితో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఔట్ చేసిన అనందంలో బాష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. బాష్ డ్వార్షుయిస్ వైపు వేలు చూపిస్తూ ఆడింది చాలు ఇక వెళ్లు అన్నట్లు సైగ చేశాడు.దీంతో అతడు ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘనకు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్‌ను ఔట్ చేసినప్పుడు బౌలర్లు సదరు బ్యాటర్‌ను కించపరిచే లేదా దుర్భలాషలడడం వంటి ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు కిందకు వస్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 53 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సఫారీలు సమం చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20కె యిర్న్స్ వేదికగా ఆగస్టు 16న జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్ గడ్డపై వేటకు సిద్దమవుతున్న కింగ్ కోహ్లి.. -
చెలరేగిన హాజిల్‌వుడ్, డేవిడ్.. సౌతాఫ్రికాపై ఆసీస్ ఘన విజయం
స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. ఆదివారం డార్విన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఆసీస్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగల్గింది.ఆసీస్ బ్యాటర్లలో టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. తన సహచర ఆటగాళ్లు విఫలమైనప్పటికి డేవిడ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడ్డాడు. 52 బంతులు ఎదుర్కొన్న డేవిడ్.. 8 సిక్స్‌లు, 4 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. అతడితో పాటు కామెరూన్ గ్రీన్(35) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రబాడ రెండు, ఎంగిడీ, లిండే, ముత్తుసామి చెరో వికెట్ సాధించారు.రికెల్టన్ విరోచిత పోరాటం..అనంతరం 179 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగల్గింది. సఫారీ బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71) ఆఖరి వరకు పోరాడాడు. అతడితో పాటు స్టబ్స్(37) పర్వాలేదన్పించాడు.మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్, జోష్ హాజిల్ వుడ్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటగా.. జంపా రెండు, మాక్స్వెల్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 12న డార్విన్ వేదికగా జరగనుంది.చదవండి: రాజస్తాన్ రాయల్స్‌తో నా జర్నీ ఒక అద్భుతం.. వారికి థ్యాంక్స్: శాంసన్ -
చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే
టెంబా బావుమా.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గత 27 ఏళ్ల అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా తన దేశానికి తీసుకొచ్చాడు.లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్‌ను బావుమా సారథ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో సఫారీలు రెండో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బావుమా కెప్టెన్‌గా, ఆటగాడిగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులతో కీలక నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్‌లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండరాల గాయంతో బాధపడుతూనే.. జట్టును ముందుండి నడిపించాడు. 134 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చరిత్ర సృష్టించిన బావుమా..తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్‌గా బావుమా నిలిచాడు.బావుమా ఇప్పటివరకు పది మ్యాచ్‌లలో ప్రోటీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరొకటి డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్మన్ కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది.బావుమా కెప్టెన్సీలో మాత్రం దక్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. చాప్మన్ 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ -
వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్ కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా ఓటమి రుచి చూపించింది. లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆసీస్ పరాజయం పాలైంది. 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో కంగారులు పై చేయి సాధించినప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయారు.ఆసీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్(136) అద్బుతమైన సెంచరీతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఛాంపియన్స్ సౌతాఫ్రికాపై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించారని అతడు కొనియాడాడు.మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. మనం ఊహించని విధంగా పరిస్థితులు చాలా త్వరగా మారవచ్చు. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని తప్పులు చేశాము. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం లభించిన తర్వాత కూడా ప్రత్యర్ధి ముందు సరైన టార్గెట్‌ను ఉంచలేకపోయాము.ఇంకా సెషన్ బ్యాటింగ్ చేసి ఉంటే మంచి స్కోర్ వచ్చేండేది. కానీ దక్షిణాఫ్రికా మాకు అవకాశం ఇవ్వలేదు. స్టార్క్-హాజిల్‌వుడ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రతీ పరుగుకు మేము చప్పట్లు కొట్టి అభినందించాము. బ్యాటింగ్ ఆర్డర్ టాప్-7లో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబోయే వాటిని పరిష్కరించుకుంటాము. కానీ జట్టులో ఉన్న ప్రతీ ఒక్క ప్లేయర్ గత రెండేళ్లుగా అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతోనే మేము ఇక్కడవరకు వచ్చాము. దురదృష్టవశాత్తూ టాస్క్‌ను ఫినిష్ చేయలేకపోయాము.ఈ మ్యాచ్‌లో కూడా మొదటి రెండు రోజుల్లో మా బౌలర్లు బాగా రాణించారు. మేము ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాము. లియన్ నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అతనికి వికెట్ దక్కలేదు. ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా అద్బుతమైన నాక్‌లు ఆడారు. మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. మ్యాచ్ సాగిన నాలుగు రోజుల పాటు వారు ఎక్కడ పట్టు కోల్పోలేదు. విజయానికి వారు పూర్తి అర్హులు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: WTC Final: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించగా.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బావుమా తిరిగి మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇక చారిత్రత్మక విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌లో 282 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్‌పై 282 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్‌పై 344 పరుగుల టార్గెట్‌ను విండీస్ చేధించింది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా -
వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా
సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సఫారీలు.. టెస్టు ఛాంపియన్షిప్ గదను సొంతం చేసుకుకున్నారు.ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ 5 వికెట్ల కోల్పోయి చేధించింది. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్ ఐడైన్ మార్క్రమ్(136) సౌతాఫ్రికా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు బావుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా బౌలర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లలో అద్బుతంగా రాణించారు.కగిసో రబాడ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టెంబా బావుమా స్పందించాడు. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని బావుమా తెలిపాడు."ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. ముందుగా మాకు ఇక్కడ సపోర్ట్‌గా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి మద్దతు నాకు దక్షిణాఫ్రికాలో ఆడుతున్న అనుభూతిని కలిగించింది. ఈ క్షణం కోసమే మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము. అందుకోసం చాలా కష్టపడ్డాము. మా కంటూ ఒక రోజు వస్తుందని అని నమ్మకంతో ముందుకు సాగాము.కానీ అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉండేవి. కానీ వాటన్నంటిని ఈ రోజు మేము జయించాము. ఒక జట్టుగా మాకు ఇది గర్వించదగ్గ విజయం. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్నాము. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో ఓడిపోయి హృదయ వేదన అనుభవించాము. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. అదే ఎనర్జీ, అదే పోరాట పటిమతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎట్టకేలకు మా లక్ష్యాన్ని చేరుకున్నాము. కగిసో రబాడ ఇక అద్బుతమైన ఆటగాడు. రెండు రోజుల క్రితం నేను ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌కు వెళ్లాను. రాబోయే కాలంలో రబాడ కచ్చితంగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నాను.అతడు ఈ మ్యాచ్‌కు ముందు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఛాంపియన్ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మార్క్రమ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మార్క్రమ్ టెస్టు జట్టులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. వారిందరికి మార్క్రమ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆ బాధ్యతను మార్క్రమ్ తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. మా దేశ ప్రజలు కూడా మా సెలబ్రేషన్స్‌లో భాగం అవుతారని భావిస్తున్నాను" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బావుమా పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో టెంబా బావుమా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సౌతాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ అందిచిన కెప్టెన్‌గా బావుమా చరిత్ర పుటలెక్కాడు.చదవండి: WTC Final 2025: ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా అవతరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ని ముద్దాడింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. అతడితో పాటు టెంబా బావుమా(64) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, హాజిల్‌వుడ్, కమ్మిన్స్ తలా వికెట్‌సాధించారు.దక్షిణాఫ్రికా ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?ఇక వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు ఎంతో ప్రైజ్‌మనీ దక్కింది, రన్నరప్ ఆస్ట్రేలియాకు ఎంతో మొత్తం లభించిందో తెలుసుకుందాం. తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన ప్రోటీస్‌కు టెస్టు ఛాంపియన్ షిప్ గదతో పాటు ప్రైజ్‌మనీ కింద 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.31.05 కోట్లు) లభించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఇక రన్నరప్ ఆస్ట్రేలియాకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ.18.63 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇక డబ్యూటీసీ 2023-25 సైకిల్లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12. 42 కోట్లు) క్యాష్ ప్రైజ్ అందనుంది.WTC 2025 ప్రైజ్‌మనీ వివరాలుసౌతాఫ్రికా: రూ. 31.05 కోట్లుఆస్ట్రేలియా: రూ. 18.63 కోట్లుఇండియా: రూ. 12.42 కోట్లున్యూజిలాండ్: రూ. 10.35 కోట్లుఇంగ్లండ్: రూ. 8.28 కోట్లుశ్రీలంక: రూ. 7.24 కోట్లుబంగ్లాదేశ్: రూ. 6.21 కోట్లువెస్టిండీస్: రూ. 5.17 కోట్లుపాకిస్తాన్: రూ. 4.14 కోట్లుచదవండి: WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా.. -
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము ఛోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి సఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.మార్క్రమ్ సూపర్ సెంచరీ..సౌతాఫ్రికా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంతో ఆ జట్టు ఓపెనర్ ఐడైన్ మార్‌క్రమ్‌ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో మార్క్రమ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ తన జట్టుకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అతడి ఇన్నింగ్స్‌కు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఆఖరిలో ఔటయ్యి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా లార్డ్స్‌లోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఓవరాల్‌గా 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు.బావుమాది వారియర్..ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ సెంచరీ ఎంతో విలువైందో, బావుమా ఇన్నింగ్స్ కూడా వెలకట్టలేనిది. తొడ కండరాల గాయంతో బాధపడుతునే తన జట్టు కోసం బావుమా పోరాడాడు. 134 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. మార్క్రమ్తో కలిసి కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పిన బావుమా.. దక్షిణాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, హాజిల్‌వుడ్ కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించి ప్రోటీస్ ఛాంపియన్స్‌గా నిలిచింది.సంక్షిప్త సమాచారం..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 212/10దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 138/10ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 207/10సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 282/5ఫలితం: ఆసీస్‌సై 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయంమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఐడైన్ మార్క్రమ్ -
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్‌గా
27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ప్రోటీస్ విజయానికి చేరువైంది.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికి సౌతాఫ్రికా తిరిగి పుంజుకుంది. ఐడైన్ మార్క్రమ్(102 బ్యాటింగ్), బావుమా(65 బ్యాటింగ్) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.వీరిద్దరూ మూడో వికెట్‌కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. బావుమా ఓ వైపు గాయంతో బాధపడుతూనే తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బావుమా కీలక నాక్ ఆడాడు. ఈ క్రమంలో టెంబా బావుమా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి కెప్టెన్‌గా..డబ్ల్యూటీసీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. టెంబా బావుమా 3వ రోజు ముగిసే సమయానికి 121 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. విలియమ్సన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై 52 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో విలియమ్సన్ రికార్డును బావుమా బ్రేక్ చేశాడు.చదవండి: 'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్‌కు ఆసీస్ కోచ్ వార్నింగ్ -
'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్‌కు ఆసీస్ కోచ్ వార్నింగ్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగింపునకు చేరుకుంది. నాలుగో రోజు మొదటి సెషన్లో ఫలితం తేలే అవకాశముంది. తొలి డబ్ల్యూటీసీ టైటిల్ విజయానికి సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలవగా.. ఆస్ట్రేలియా 8 వికెట్ల దూరంలో ఉంది.ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరిగాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ ఇంకా ముగియలేదని, గెలిచేందుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని ఈ కివీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), బావుమా(65) ఉన్నారు."ఈ ఫైనల్ మ్యాచ్‌పై మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. మ్యాచ్ ఇంకా ముగియలేదు, ఒక్క వికెట్ పడితే ఏదైన జరగొచ్చు. ప్రస్తుతం మార్క్రమ్, బావుమా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఔటయ్యాక కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చే పరిస్థితి వెరే విధంగా ఉంటుంది.ఇప్పుడు వికెట్లు ఎలా తీయాలన్నదే మేము ఆలోచిస్తున్నాము. తొలి సెషన్లో సవాల్లను ఎదుర్కొనేందుకు మా బౌలర్లు సిద్దంగా ఉన్నారని" వెట్టోరి మూడో రోజు ఆట అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ ఆసీస్ పేస్ త్రయం.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తిగా తెలిపోయారు. స్టార్క్ ఒక్కడే ఇప్పటివరకు రెండు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
WTC Final: ఓ వైపు గాయం.. అయినా కానీ! హ్యాట్సప్ బావుమా
టెంబా బావుమా.. ఓ జట్టు నాయకుడు ఎలా ఉండాలో తన పోరాట పటిమతో చాటి చెప్పాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా ఓ వారియర్‌లా పోరాడుతున్నాడు. ఓవైపు తీవ్రమైన గాయంతో బాధపడుతూనే తన జట్టును రెండో ఐసీసీ టైటిల్ విజయానికి చేరువ చేశాడు.తన గాయం కంటే.. సఫారీల 27 ఏళ్ల కలే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్నాడు. వియాన్ ముల్డర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బావుమాకు ఆదిలోనే ఓ లైఫ్ వచ్చింది. బావుమా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. ఆ తర్వాత టెంబా ఎడమ కాలి తొడ కండరాలు పట్టేశాయి.దీంతో ఫిజియో మైదానంలో వచ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ బావుమా మాత్రం జట్టు విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వికెట్ల మధ్య కుంటుతూనే పరుగులు తీశాడు. నొప్పిని భరిస్తూనే అవతలి ఎండ్‌లో మార్క్రమ్కు సపోర్ట్‌గా నిలిచాడు.సెంచరీ హీరో మార్క్రమ్తో కలిసి మూడో వికెట్‌కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో బావుమా పోరాట పటిమపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బావుమా ది వారియర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బావుమా 65 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(102 నాటౌట్) అద్బుత శతకంతో చెలరేగాడు.అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు
రెండో ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా దూసుకెళ్తోంది. మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల మరో ఐసీసీ టైటిల్ సఫారీల ఖాతాలో చేరనుంది.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్ అద్బుత శతకంతో చెలరేగాడు. మార్క్రమ్ 102 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్ టెంబా బావుమా(65 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.తొలి ఆటగాడిగా..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన ఐడైన్ మార్క్రమ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నాల్గవ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మార్క్రమ్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు జరిగిన రెండు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరూ ఫీట్ సాధించలేకపోయారు.ఓవరాల్‌గా మార్క్రమ్ కంటే ముందు డబ్ల్యూటీసీ ఫైనల్లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ మాత్రమే సెంచరీ సాధించారు. అయితే ఈ రెండు సెంచరీలు కూడా తొలి ఇన్నింగ్స్‌లో వచ్చినవే కావడం గమనార్హం. అదేవిధంగా లార్డ్స్ మైదానంలో ఒకే టెస్టులో డకౌట్, సెంచరీ నమోదు చేసిన తొమ్మిదవ బ్యాటర్‌గా మార్క్రమ్ నిలిచాడు.చదవండి: విజయం దిశగా దక్షిణాఫ్రికా -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్‌స్టాస్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్ దూరమయ్యే అవకాశముంది. -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేసిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో తన జట్టును ఆదుకున్నాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్టార్క్ తన విరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. హెడ్, స్మిత్, లబుషేన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. స్టార్క్ తన విలువను మరోసారి చాటుకున్నాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ స్పీడ్ స్టార్.. ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 136 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఓ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ బ్రౌన్ పేరిట ఉండేది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రౌన్.. 35 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో బ్రౌన్ ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. -
నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో ఆసీస్-సౌతాఫ్రికా ఆటగాళ్లు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్‌ను ధరించారు.ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.కాగా అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(44 బ్యాటింగ్) ఆసీస్‌ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.The sports fraternity observes a solemn moment of silence in memory of the lives lost in the tragic Ahmedabad plane crash, standing in deep solidarity with the grieving families during this difficult time. pic.twitter.com/nTXfRnyksP— Star Sports (@StarSportsIndia) June 13, 2025చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్ -
WTC Final 2025: విజయానికి చేరువలో సౌతాఫ్రికా
విజయం దిశగా సౌతాఫ్రికా..లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), టెంబా బావుమా(65) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి.లక్ష్యం దిశగా సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ధీటుగా బదులిస్తోంది. 39 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా.. రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(76), బావుమా(41) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి.మార్క్రమ్ హాఫ్ సెంచరీసౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 51 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..వియాన్ ముల్డర్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన ముల్డర్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(41), బావుమా(5) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(19), ముల్డర్(22) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282 పరుగులు..లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో టెయిలాండర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. స్టార్క్ 58 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మిచెల్ స్టార్క్ ఇటు బంతితోనూ, అటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను స్టార్క్ అందుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 64 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్‌తో పాటు హాజిల్‌వుడ్(17) కూడా ఉన్నాడు. సౌతాఫ్రికాకు ఆసీస్ టెయిలాండర్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ కొరకరాని కొయ్యగా మారాడు. తన బ్యాటింగ్‌తో సఫారీలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 37 పరుగులతో స్టార్క్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 51 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన నాథన్ లియోన్.. రబాడ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 43 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్(19), హాజిల్‌వుడ్(0) ఉన్నారు.లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 144-8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజును ఆటను ఆసీస్ ఆరంభించింది. క్రీజులో మిచెల్ స్టార్క్(16), నాథన్ లియోన్(2) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలిందితుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ తన అద్బుత బౌలింగ్‌తో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన కమ్మిన్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.👉ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:78* - పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)77 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)74 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)66 - నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)63 - రవిచంద్రన్ అశ్విన్ (భారత్)👉లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.లార్డ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు1. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికాపై 28 పరుగులిచ్చి 6 వికెట్లు2. బాబ్ విల్లీస్ - 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి 6 వికెట్లు3. డేనియల్ వెట్టోరి - 2008లో పరుగులిచ్చి 5 వికెట్లు👉ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ 300 టెస్టు వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. -
WTC Final 2025: నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్
218 పరుగుల ఆధిక్యంలో ఆసీస్రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించారు. కగిసో రబాడ, ఎంగిడీ చెరో 3 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సెన్, ముల్డర్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ ఇన్నింగ్స్‌కు ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ 43(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.164 పరుగుల ఆధిక్యంలో ఆసీస్32 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 164 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. క్రీజులో క్యారీ(14), మిచెల్ స్టార్క్(5) ఉన్నారు.ఆలౌట్ దిశగా ఆస్ట్రేలియా.. ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కమ్మిన్స్.. ఎంగిడీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 27 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 152 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హెడ్.. ముల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్రెండో ఇన్నింగ్స్‌లో సైతం సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. వెబ్‌స్టెర్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన వెబ్‌స్టెర్ ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..స్టీవ్ స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన స్మిత్.. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.ఆసీస్ మూడో వికెట్ డౌన్మార్నస్ లబుషేన్ రూపంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 48/3ఆసీస్ రెండో వికెట్ డౌన్కామెరూన్ గ్రీన్(0) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో గ్రీన్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(4), లబుషేన్(16) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్ఉస్మాన్ ఖవాజా రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖవాజా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్రీన్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు..ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(15), ఖవాజా(4) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 98 పరుగుల ఆధిక్యం కొనసాగుతోంది.138 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సైతం చేతులేత్తేశారు. ఆసీస్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతానాన్ని శాసించాడు. అతడితో పాటు స్టార్క్ రెండు వికెట్లు, హాజిల్‌వుడ్ వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హామ్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. సౌతాఫ్రికా ఏడో వికెట్ డౌన్లంచ్ బ్రేక్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. 52వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. మూడో బంతికి వెర్రియిన్ను పెవిలియన్‌కు పంపగా.. ఆఖరి బంతికి జానెసన్ను ఔట్ చేశాడు. 52 ఓవర్లకు సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.లంచ్ బ్రేక్‌కు దక్షిణాఫ్రికా స్కోరంతంటే?ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 91 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బెడింగ్హామ్(39),వీర్రెయిన్(9) ఉన్నారు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. కెప్టెన్ బావుమా ఔట్టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన బావుమా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్35 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బెడింగ్హామ్(17 బ్యాటింగ్), బావుమా(36 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 66/427 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(17), బెడింగ్హమ్(17) ఉన్నారు.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను మిచెల్ స్టార్క్ ప్రారంభించాడు. క్రీజులో ప్రస్తుతం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా(3), బెడింగ్హామ్(8) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బ్యాటింగ్‌కు చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వెబ్‌స్టెర్‌తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన స్మిత్..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్‌లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బోర్డర్ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్లు వీరే..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-18అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)- 17వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 17డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)- 14గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 14అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్‌లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్లు..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 591వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) - 575గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్) - 571డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) - 551శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (వెస్టిండీస్) - 512దిలీప్ వెంగ్‌సర్కార్ (భారత్) - 508అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 503చదవండి: WTC Final: ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ ఐదు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు.అతడి పేస్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఖవాజా, గ్రీన్, వెబ్‌స్టెర్, కమ్మిన్స్ వంటి కీలక వికెట్లను రబాడ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్.. తెల్లముఖం వేసిన హెడ్! వీడియో
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ అద్బుత క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సంచలనాత్మక క్యాచ్‌తో వెర్రీన్ పెవిలియన్‌కు పంపాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ ఓ బౌండరీ బాది మంచి టచ్‌లో కన్పించాడు. మొదటి సెషన్ చివరి ఓవర్ వేసిన మార్కో జానెసన్ రెండో బంతిని హెడ్‌కు లెగ్ సైడ్ సంధించాడు. ఆబంతిని హెడ్ లైగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ వెర్రీన్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన హెడ్ బిత్తరపోయాడు.చేసేదేమిలేక నిరాశతో హెడ్(11) పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మొదట 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్మిత్(66), వెబ్‌స్టెర్(56 నాటౌట్) ఆదుకున్నారు. 52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో కమ్మిన్స్, వెబ్‌స్టెర్ ఉన్నారు.#MarcoJansen dismisses TravisHead after a splendid catch by #KyleVerreynne behind the stumps! 🔥LIVE NOW 👉 https://t.co/9lZGHcdeVP #WTCFinal | #SAvAUS, Day 1, watch LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar pic.twitter.com/i4HNMMtsrW— Star Sports (@StarSportsIndia) June 11, 2025 -
ఆసీస్ స్టార్ ఓపెనర్ అత్యంత చెత్త రికార్డు.. బుమ్రా సరసన
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. మార్నస్ లబుషేన్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఖవాజా.. ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఖవాజా ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన ఖవాజా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక డకౌటైన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా, తిలకరత్నే దిల్షాన్, మెకల్లమ్ సరసన నిలిచాడు.బుమ్రా, దిలాన్ష్, మెకల్లమ్ ఐసీసీ ఈవెంట్ల ఫైనల్లో రెండు సార్లు డకౌట్ కాగా.. ఖవాజా సైతం సరిగ్గా రెండు సార్లు ఎటువంటి పరుగులు చేయకుండా ఔటయ్యాడు. కాగా ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో కూడా ఖవాజా డకౌటయ్యాడు.ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు వీరే..జస్ప్రీత్ బుమ్రా - 2తిలకరత్నే దిల్షాన్ - 2ఉస్మాన్ ఖవాజా - 2బ్రెండన్ మెకల్లమ్ - 2మొయిన్ అలీ - 1కష్టాల్లో ఆసీస్..కాగా ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లకు సఫారీ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి కంగారులు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇప్పటివరకు రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనంKagiso Rabada delivers big time for South Africa with two wickets in an over 🔥Catch the action live on our official broadcasters here ➡ https://t.co/oas2Rsdptj#Cricket #CricketReels #WTC25 pic.twitter.com/I9vOR8nCup— ICC (@ICC) June 11, 2025 -
India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికా
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికాసౌతాఫ్రికా బ్యాటర్లు సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(3) , బెడింగ్‌టన్(8) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో రబాడతో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు.ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన వెబ్‌స్టెర్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 210/8ఆసీస్ ఏడో వికెట్ డౌన్199 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రబాడ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు అలెక్స్ క్యారీ(23).. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్స్టీవ్ స్మిత్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన స్మిత్.. మార్క్రమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 44 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టెర్(48), అలెక్స్ క్యారీ(1) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న స్మిత్, వెబ్‌స్టెర్31 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(45), వెబ్‌స్టెర్(8) ఆచితూచి ఆడుతున్నారు.పంజా విసురుతున్న ప్రోటీస్ పేసర్లు..ట్రావిస్ హెడ్ రూపంలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హెడ్.. మార్కో జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 23.2 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(26) ఉన్నాడు. ప్రోటీస్ బౌలర్లలో రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్ఆచితూచి ఆడుతున్న స్మిత్, లబుషేన్..ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును సీనియర్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(17), లబుషేన్(17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.రబాడ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. 7వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖావాజా(0), గ్రీన్(4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(10), స్మిత్(0) ఉన్నారు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులోకి కామెరూన్ గ్రీన్ తిరిగి రాగా.. సౌతాఫ్రికా టెస్టు టీమ్‌లోకి పేసర్ లుంగీ ఎంగిడీ పునరాగమనం చేశాడు.ప్రోటీస్ జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆసీస్‌కు రెండో ఫైనల్. ఈ ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సఫారీలు భావిస్తుంటే, కంగూరులు మాత్రం మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చోకర్స్‌గా పేరొందిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన ఆసీస్‌ను ఓడించడం అంతసులువు కాదు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.చదవండి: శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ -
'చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా అమీతుమీ తెల్చుకోనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ టైటిల్‌ను అందుకోవాలని ప్రోటీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచ క్రికెట్లో చోకర్స్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా ఈ సారి ఎలాగైనా ఆ ట్యాగ్‌ను పోగొట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాను ఓడించడం సఫారీలకు అంతసులువు కాదు.గతంలో ఐసీసీ టోర్నీ నాకౌట్స్ మ్యాచ్‌లలో ప్రోటీస్ చిత్తు అయింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ తన జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలవనంతవరకు ఛోకర్స్ ట్యాగ్ అలానే ఉంటుందని బౌచర్ అన్నాడు. ఈసారి గెలిచి ఆ ట్యాగ్‌ను చెరేపేయాలని బౌచర్ ప్రోటీస్‌కు పిలుపునిచ్చాడు."మేము మా తొలి ట్రోఫీ కోసం ఆడుతున్నాము. చాలా మంది మేము డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవమని అనుకుంటున్నారు. కానీ టెస్టు క్రికెట్ పరిస్థితులు వేరు. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. చాలా మలుపులు ఉంటాయి. అవునూ మాకు చోకర్స్ అనే ట్యాగ్ ఉంది. మేము ఐసీసీ ట్రోఫీని గెలుచుకునేవరకు ఆ ట్యాగ్ పోదు. కాబట్టి గెలిచి ఆ ముద్రను పోగుట్టుకోవాలి. కచ్చితంగా మా ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ యువ జట్టుకు ఆ ట్యాగ్‌ను చెరిపేసే సత్తా ఉందని" బౌచర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా -
రెండు నెలలు బ్యాట్ టచ్ చేయలేదు.. వింతగా అన్పించింది: స్టీవ్ స్మిత్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భాస్తోంది.ఇప్పటికే లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇక ఫైనల్ పోరుకు ముందు తన ప్రాక్టీస్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల పాటు కనీసం బ్యాట్‌ను కూడా తను టచ్ చేయలేదని స్మిత్ చెప్పుకొచ్చాడు.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీఫైనల్లో ఆసీస్ ఓటమి తర్వాత.. స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లు కొంతమంది ఐపీఎల్లో పాల్గొంటే.. మరి కొంతమంది డొమాస్టిక్ క్రికెట్లో ఆడారు. కానీ స్మిత్ మాత్రం న్యూయర్క్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తన తుంటి గాయంపై ట్రైనర్‌తో కలిసి పనిచేశాడు."నేను సాధరణంగా ఇంటిలో ఖాళీగా ఉంటే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి మాత్రం అందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే న్యూయర్క్‌కు వెళ్లిపోయాను. నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్‌లో తొలి షాట్ ఆడేంతవరకు కనీసం బ్యాట్‌ను కూడా టచ్ చేయలేదు.చాలా రోజులు తర్వాత బ్యాట్ పట్టుకుంటే చాలా కొత్తగా అన్పించింది. రెండు ప్రాక్టీస్ సెషన్ల తర్వాత నా లయను తిరిగి నేను అందుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. 2014లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. తుంటి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు తిరిగి స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నేను ఇప్పటికీ ఓపెనర్‌గా రాణించగలనని భావిస్తున్నాను. కానీ నేను ఆడిన గత నాలుగు మ్యాచ్‌లలో అంత మెరుగ్గా రాణించలేకపోయాను. ఈ రోజుల్లో టాప్-4లో బ్యాటింగ్ చేసే ఎవరైనా ఓపెనర్‌గా రాణించగలరు" అని స్మిత్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్ -
WTC Final: సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్.. ఇక ఆసీస్‌కు చుక్కలే
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC)-2025 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్‌ను సీఎస్ఎ (Cricket South Africa) నియమించింది. ఫైనల్ మ్యచ్‌కు రెండు రోజుల ముందు ప్రోటీస్ జట్టుతో బ్రాడ్ చేరనున్నాడు. లార్డ్స్ మైదానంలో పరిస్థితులపై బ్రాడ్‌కు పూర్తి స్ధాయి అవగహన ఉంది. అతడు తన కెరీర్లో ఎన్నో మ్యాచ్‌లు ఈ క్రికెట్ మక్కాలో ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడితో సీఎస్ఎ తమ కోచింగ్ స్టాప్‌లోకి చేర్చుకుంది.రికార్డుల రారాజు..కెరీర్లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్ జట్టుఉస్మాన్ ఖ్వాజా, సామ్ కోన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, వెబ్‌స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజెల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్, మాథ్యూ కుహ్నెమాన్ -
డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఈ మెగా మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనున్నది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 18 కోట్లు) నగదు బహుమతి లభించనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 ఫైనల్లో భారత జట్టుపై గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు ప్రైజ్‌మనీని డబుల్ చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగమైన ఇతర జట్లకు కూడా నగదు బహుమతి లభించనుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.44 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 1.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ అందనుంది. ఇక డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి పాలవ్వడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు? -
నాకు ఇదే చివరి ఐసీసీ టోర్నీ: స్టార్ క్రికెటర్ కామెంట్స్ వైరల్
సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(Rassie van der Dussen) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్లో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) చివరి ఐసీసీ టోర్నీ కాబోతుందని పేర్కొన్నాడు. అయితే, తన రిటైర్మెంట్ అంశం గురించి ఇప్పుడే చెప్పలేనని.. ఇది మాత్రం వాస్తమని అన్నాడు.అఫ్గన్‌తో మ్యాచ్‌లో అర్ధ శతకంకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకాగా.. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను ఎదుర్కొంది. కరాచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో డసెన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధ శతకంతో అదరగొట్టాడు. కేవలం 46 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు.నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీతదుపరి సౌతాఫ్రికా ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రావల్పిండిలో బుధవారం జరగాల్సిన మ్యాచ్ రద్దై పోయింది. ఈ క్రమంలో మార్చి 1న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన డసెన్.. ‘‘నాకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అని కచ్చితంగా చెప్పగలను.ఇందుకోసం ముందుగా నేనేమీ ప్రణాళికలు రచించుకోలేదు. మేనేజ్మెంట్ కూడా నాపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇదే నిజం. నా కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ప్రొటిస్ తరఫున క్రికెట్ ఆడటంమే నా ఏకైక లక్ష్యం. దేశానికి ప్రాతినిథ్యం వహించడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు.ప్రొటిస్ తరఫున కొనసాగుతాచాలా మంది రిటైర్మెంట్ తర్వాత లీగ్ క్రికెట్ ఆడతావా? అని అడుగుతున్నారు. ఏమో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. కానీ లీగ్ క్రికెట్లో ఆడాలన్న తపన నాలో ఉంది. అయితే, ముందుగా చెప్పినట్లు సౌతాఫ్రికాకు ఆడటమే నా మొదటి ప్రాధాన్యం. ఒకవేళ ఇంకో సెంట్రల్ కాంట్రాక్టు దక్కితే కచ్చితంగా ప్రొటిస్ తరఫున కొనసాగుతా’’ అని తన మనసులోని భావాలను పంచుకున్నాడు.కాగా 36 ఏళ్ల రాసీ వాన్ డెర్ డసెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడగుపెట్టాడు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటి వరకు 18 టెస్టులు, 69 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 905, 2516, 1257 పరుగులు చేశాడు. వన్డేల్లో అతడి ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి.చాంపియన్స్ ట్రోఫీ-2025లో సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, తెంబా బావుమా (కెప్టెన్), రాసీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి, హెన్రిచ్ క్లాసెన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.చదవండి: ‘ఏంటిది? నేను అవుటయ్యానా?’.. జాన్సన్ దెబ్బకు రహ్మనుల్లా బౌల్డ్ -
T20 WC 2025: వరల్డ్‌కప్ ఫైనల్లో సౌతాఫ్రికా.. ఆసీస్ చిత్తు
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నీలో సౌతాఫ్రికా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరల్డ్‌కప్ తాజా ఈవెంట్లో గ్రూప్-1 నుంచి భారత్, ఆస్ట్రేలియా.. గ్రూప్-2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణఈ క్రమంలో శుక్రవారం ఉదయం సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా(South Africa Women U19 vs Australia Women U19) మధ్య తొలి సెమీ ఫైనల్(Semi Final-1) మ్యాచ్ జరిగింది. కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు కంగారు జట్టు బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.ఓపెనర్లలో ఇనెస్ మెకియోన్ డకౌట్ కాగా.. గ్రేస్ లియాన్స్ 2 పరుగులే చేసి అవుటైంది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ లూసీ హామిల్టన్() 18 పరుగులు చేయగా.. మిగతా వాళ్లలో ఎలియనోర్ లారోసా(7), హస్రత్ గిల్(1), చ్లోయే ఐన్స్‌వర్త్(1), లిలీ బాసింగ్వైట్(2), టెగాన్ విలియమ్సన్(3*) పూర్తిగా విఫలమయ్యారు.105 పరుగులేఅయితే, మిడిలార్డర్ బ్యాటర్ కాయిమే బ్రే 36 పరుగులతో రాణించగా.. ఎల్లా బ్రిస్కో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. పదిహేడు బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 27 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 105 పరుగులు చేయగలిగింది.ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఆష్లే వాన్ విక్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఎంతబిసెంగ్ నిని, కెప్టెన్ కైలా రెయ్నెకె, షేష్నీ నాయుడు ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ జెమ్మా బోతా(24 బంతుల్లో 37 రన్స్) శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సిమోనే లౌరెన్స్(5) మాత్రం నిరాశపరిచింది.రాణించిన కెప్టెన్వన్డౌన్ బ్యాటర్ ఫే కౌలింగ్(7) కూడా విఫలం కాగా.. కైలా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో బాధ్యతాయుతంగా ఆడింది. 26 బంతుల్లో 26 పరుగులు చేసింది. ఆమెకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ కరాబో మేసో(19) కాసేపు క్రీజులో నిలబడగా.. మికే వాన్వూస్ట్ 8, షేష్నీ నాయుడు 2 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.1 ఓవర్లలో 106 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మహిళ అండర్-19 టీ20 వరల్డ్‌కప్ సెకండ్ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ ఆష్లే వాన్ విక్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. రెండో సెమీ ఫైనల్లో భారత్- ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండో బెర్తు కోసంఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు.. ఫైనల్లో సౌతాఫ్రికాతో ట్రోఫీ కోసం తలపడుతుంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇక తాజా ఎడిషన్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్‌గా స్థాయికి తగ్గట్లు రాణించి సెమీ ఫైనల్ వరకు వచ్చింది. మరోసారి చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది.చదవండి: Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్‌బౌల్డ్! దారుణ వైఫల్యం -
‘డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయం మాదే’
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ)లో తొలిసారి ఫైనల్‌కు చేరింది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో తొలి టెస్టులో గెలుపొంది మెగా టైటిల్ పోరుకు అర్హత సాధించిన ప్రొటిస్ జట్టు.. రెండో టెస్టులోనూ విజయం సాధించి పర్యాటక జట్టును 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాగా టెస్టుల్లో సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఏడో గెలుపు కావడం విశేషం.కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) బ్యాటర్‌గా, సారథిగా రాణిస్తూ ఇలా జట్టును విజయపథంలో నడిపించి.. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర్చాడు. ఈ నేపథ్యంలో అతడపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్(Graeme Smith ) బవుమా నాయకత్వ లక్షణాలను కొనియాడాడు.బవుమా అలాంటి వాడు కాదు‘‘సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం మా అందరికీ గర్వకారణం. కెప్టెన్‌గా బవుమాకు కూడా ఇది ఉద్వేగ సమయం. గత రెండు, మూడేళ్లుగా అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. అయితే, గతేడాది అతడి బ్యాటింగ్ సగటు 50గా నమోదైంది.నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తూ ఈస్థాయికి చేర్చాడు. మైదానంలో ఆటగాళ్లపై అరుస్తూ.. పిచ్చిగా ప్రవర్తించే వ్యక్తిత్వం బవుమాకు లేదు. అతడు అసలు అలాంటి దుందుడుకు స్వభావం గల వ్యక్తి కానేకాదు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. ఆటతోనే అందరికీ సమాధానం చెప్తాడు.టెస్టుల్లో వరుసగా జట్టుకు ఏడు విజయాలు అందించిన కెప్టెన్. అంతకంటే అద్భుతమైన విషయం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్లో జట్టును నిలిపాడు. మేమంతా అతడికి అండగా ఉంటాం’’ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు.గెలుపు మాదేనని భావిస్తున్నాఇక ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే అంశంపై స్పందిస్తూ.. ‘‘ఇలాంటి ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌లో విజేత ఎవరన్నది అంచనా వేయడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికైన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. కాబట్టి ఏ జట్టుకూ హోం అడ్వాంటేజీ ఉండదు.ఆస్ట్రేలియా మీడియాను చూస్తుంటే మాత్రం.. లార్డ్స్‌లో కంగారూలను ఓడించి మేము కచ్చితంగా ట్రోఫీ గెలవాలనే సంకల్పం మరింత బలపడింది. ఫైనల్లో ఆసీస్‌ను ఓడిస్తే ఆ మజానే వేరు’’ అని గ్రేమ్ స్మిత్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. కాగా ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన ప్రొటిస్ కెప్టెన్‌గా గ్రేమ్ స్మిత్‌కు అరుదైన ఘనత ఉంది.ఆసీస్‌పై స్మిత్‌కు ఘనమైన రికార్డుస్మిత్ సారథ్యంలో 2006లో తొలుత ఆసీస్‌ను వన్డేలో ఓడించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత మూడేళ్ల అనంతరం అంటే 2009లో కంగారూ గడ్డపై పాంటింగ్ బృందాన్ని టెస్టుల్లో చిత్తు చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి మొట్టమొదటి సారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాడు తన మణికట్టుకు దెబ్బతాకినా.. గ్రేమ్ స్మిత్ బ్యాటింగ్ చేసిన తీరు.. సౌతాఫ్రికా ఆటగాళ్ల పట్టుదలకు అద్దంగా నిలిచింది.ఇక ఇప్పుడు పదహారేళ్ల తర్వాత గ్రేమ్ స్మిత్‌లాగే ఆస్ట్రేలియాను ఓడించే సువర్ణావకాశం ముంగిట బవుమా నిలిచాడు. కాగా సారథిగా బవుమా గత 14 టెస్టుల్లో సౌతాఫ్రికాకు 10 విజయాలు అందించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 63 టెస్టులు ఆడిన బవుమా నాలుగు శతకాల సాయంతో 3606 పరుగులు సాధించాడు.ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాపై 3-1తో గెలిచిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకువచ్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా జూన్ 11-15 వరకు ఈ మెగా టెస్టు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: BCCI: గంభీర్‌పై వేటు?.. రోహిత్, కోహ్లిలు మాత్రం అప్పటిదాకా..! -
WTC Final: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే?
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా కావడం టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది. ఈ మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసిపోవడం వల్ల ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ రేసులో రోహిత్ సేన నిలవగలిగింది. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిస్తేనే భారత్‌కు మార్గం సుగమమవుతుంది.మూడో స్థానంలోనే టీమిండియాడబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో తమ చివరి టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే భారత్‌కు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉండేది. ఈ క్రమంలో తొలి టెస్టులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం ఘోరంగా ఓడిపోయింది.అయితే, మూడో మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుని కనీసం డ్రా చేసుకోగలిగింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రోహిత్ సేన మూడో స్థానం నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఇక విజయాల శాతం 55.88గా ఉంది.మరోవైపు.. అగ్రస్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు 76 పాయింట్లే ఉన్నా.. గెలుపు శాతం 63.33. ఇక రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉండగా.. విన్నింగ్ పర్సెంటేజ్ 58.89. కాగా సౌతాఫ్రికా తదుపరి సొంతగడ్డ మీద పాకిస్తాన్‌తో రెండు టెస్టులు ఆడనుంది.ఇక ఆస్ట్రేలియా కూడా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ రెండు జట్లు తమ తదుపరి సిరీస్‌లలో సులువుగానే గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి... టీమిండియాకు పెద్ద సవాలే ముందుంది.రోహిత్ సేన తప్పక గెలవాల్సిందేఈ సీజన్లో టీమిండియాకు మిగిలినవి రెండే టెస్టులు. ఆసీస్‌తో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులో కచ్చితంగా రోహిత్ సేన గెలవాల్సిందే. తద్వారా ఆస్ట్రేలియాపై 3-1తో విజయం సాధిస్తే.. భారత్ విజయాల శాతం 60.52కు పెరుగుతుంది. మరోవైపు.. ఆసీస్ విన్నింగ్ పర్సెంటేజ్ 57 శాతానికి పడిపోతుంది. దీంతో టీమిండియాకు ఫైనల్ లైన్ క్లియర్ అవుతుంది.లేని పక్షంలో.. ఒకవేళ ఈ సిరీస్ 2-2తో డ్రా అయితే.. రోహిత్ సేన గెలుపు శాతం 57.01 అవుతుంది. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియాకు టైటిల్ పోరుకు అర్హత సాధించడం సులువవుతుంది. శ్రీలంక టూర్లో కంగారూలు 2-0తో గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.సౌతాఫ్రికాకు లైన్‌క్లియర్!ఇక సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను గనుక 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాబట్టి అప్పుడు రెండోస్థానం కోసం రేసు ప్రధానంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్యే ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా అద్భుతం చేసి సౌతాఫ్రికాను నిలువరిస్తే అప్పుడు పరిస్థితి మరింత రసవత్తరంగా మారుతుంది. చదవండి: అదే జరిగితే కెప్టెన్సీకి రోహిత్ శర్మ గుడ్‌బై! -
ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ (212) చేసినప్పటికీ.. ఆసీస్‌కు అంత సులువుగా విజయాన్ని దక్కనీయలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆసీస్ ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. ఆసీస్ చేతిలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మరోసారి సెమీస్‌లో ఓడినందుకు బాధగా ఉంది. మాటల్లో చెప్పలేను. ముందుగా ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ కోసం వారికి శుభాకాంక్షలు. వారు ఈ రోజు అద్భుతంగా ఆడారు. మేము బ్యాట్‌తో, బంతితో ప్రారంభించిన విధానం బాగా లేదు. అక్కడే మ్యాచ్‌ను కోల్పోయాం. పరిస్థితులకు వారి నాణ్యమైన బౌలింగ్ అటాక్ తోడైంది. దీంతో వారు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోతే భారీ స్కోర్ సాధించడం చాలా కష్టం. అయినా మిల్లర్ (101), క్లాసెన్ (47) అద్భుతంగా ఆడి ఫైటింగ్ టోటల్‌ను ఇచ్చారు. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో మిల్లర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఛేదనలో ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. అదే మా కొంపముంచింది. మార్క్రమ్, మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వారిని ఒత్తిడిలోకి నెట్టారు. మాకూ అవకాశాలు వచ్చాయి. అయితే మేము వాటిని ఒడిసిపట్టుకోలేకపోయాం. కొయెట్జీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడో యోధుడు. ఇతర సీమర్లతో కాని పనిని కొయెట్జీ ఈ రోజు చేసి చూపించాడు. అతడు తీసిన స్మిత్ వికెట్ నమ్మశక్యంగా లేదు. క్వింటన్ టైటిల్ గెలచి కెరీర్ ముగించాలని కోరుకున్నాడు. దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ఫలితం ఎలా ఉన్నా డికాక్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచిపోతాడు. -
టీమిండియాతో ఫైనల్.. ఏకపక్షంగా ఉంటుంది: ఆసీస్ కెప్టెన్ కమిన్స్
వరల్డ్‌కప్ 2023 రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను ఓడించి రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కతా వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక 49.4 ఓవర్లలో 21 పరుగులకు ఆలౌటయ్యారు. డేవిడ్ మిల్లర్ సెంచరీతో (101) సత్తా చాటగా.. క్లాసెన్ 47 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌కు విజయం అంత ఈజీగా దక్కలేదు. ప్రొటిస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడమే కాకుండా 48వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లారు. ఆఖర్లో కమిన్స్ (14 నాటౌట్), స్టార్క్ (16 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. 62 పరుగులతో పాటు 2 వికెట్లు తీసిన ట్రవిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. డగౌట్లో కూర్చోవడం కంటే క్రీజ్‌లో ఉండటమే తేలిక అనిపించింది. రెండు గంటలపాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అంతంగా ఫలితం అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది. స్టార్క్, హాజిల్‌వుడ్ ఊహించని విధంగా అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్పిన్ అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై వారు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్ అత్యద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభంలో మేము ఈ విభాగంలో చాలా బలహీనంగా ఉండి మ్యాచ్‌లు చేజార్చుకున్నాం. 37 ఏళ్ల వయసులోనూ వార్నర్ మైదానంలో పాదరసంలా కదులుతున్నాడు. ఈ రోజు ట్రవిస్ హెడ్‌ది. మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు అమూల్యమైన పరుగులు మెరుపు వేగంతో చేశాడు. నాణ్యమైన సఫారీ స్పిన్నర్లను హెడ్ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మాలో కొద్దిమందికి ఇదివరకే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. కొంతమంది టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడారు. మరోసారి ఫైనల్‌కు చేరినందుకు ఆనందంగా ఉంది. భారత్‌తో ఫైనల్ ఇంకా ప్రత్యేకం. ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్టేడియం మొత్తం నిండిపోతుంది. ప్రేక్షకులు భారత్‌కు ఏకపక్షంగా మద్దతు ఇస్తారు. అలాంటి వాతావరణం ఊహించుకుంటేనే చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. -
CWC 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్.. అరుదైన రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. కాగా, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే, కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
World Cup 2023: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా
వన్డే వరల్డ్‌కప్-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. మరోసారి నాకౌట్స్ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఎనిమిదో సారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరితో పాటు టెయిలెండర్లు ప్యాట్ కమ్మిన్స్(14), స్టార్క్(16) కూడా ఆసీస్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ ట్రావిస్ హెడ్‌కు దక్కింది. ఇక నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
అప్పుడు ఆసీస్.. ఇప్పుడు దక్షిణాఫ్రికా! 1999 వరల్డ్‌కప్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను మిల్లర్(101) అద్బుత సెంచరీతో అదుకున్నాడు. దీంతో ప్రోటీస్ ఆస్ట్రేలియా ముందు 213 పరుగుల టార్గెట్‌ను ఉంచగల్గింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 23 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. అయితే ఆసీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి సఫారీలు ఇంకా పోటీలో ఉన్నారు. 1999 వరల్డ్‌కప్‌లో షేన్ వార్న్ మ్యాజిక్.. కాగా 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య లో స్కోరింగ్ థ్రిల్లర్ జరిగింది. అప్పుడు ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ మ్యాజిక్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. ఆ తర్వాత షేన్ వార్న్ మళ్లీ తన స్పిన్ మయాజాలంతో కల్లిస్‌ను ఔట్ చేశాడు. వెంటనే రోడ్స్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. ఎందుకంటే అప్పటిలో సూపర్ ఓవర్ రూల్ ఇంకా అమలులో లేదు. ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో షేన్ వార్న్ తన 10 ఓవర్ల కోటాలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బౌలింగ్ కోటాలో 4 మెయిడన్లు ఉండడం గమనార్హం. ఇప్పుడు వార్న్ లాంటి మ్యాజిక్ ప్రోటీస్ స్పిన్నర్లు ఎవరైనా చేస్తారో లేదో వేచి చూడాలి. చదవండి: World Cup 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే! -
దక్షిణాఫ్రికా కెప్టెన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ కప్ చరిత్రలోనే!
వన్డే వరల్డ్‌కప్-2023లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మరోసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీఫైనల్లో బావుమా డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్టార్క్ వేసిన ఓ అద్భుత బంతికి బావుమా వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ఈ మ్యాచ్‌లో డకౌటైన బావుమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో డకౌట్‌గా వెనుదిరిగిన నాలుగో కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. 40 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలో బావుమా కంటే ముందు ముగ్గురు కెప్టెన్లు సెమీఫైనల్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 1996 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో అజారుద్దీన్ డకౌటయ్యాడు. అజారుద్దీన్ తర్వాతి స్ధానాల్లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఉన్నాడు. ఇక సెమీస్ ఫైనల్లో మాత్రం దక్షిణాఫ్రికా తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: 'కోహ్లి, షమీ, అయ్యర్ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.. కానీ అతడే రియల్ హీరో' -
ఇదేమి బ్యాటింగ్ రా బాబు.. అందుకే 'చోకర్స్' ట్యాగ్ లైన్
వరల్డ్ క్రికెట్లో 'చోకర్స్' అంటే మనకు టక్కున దక్షిణాఫ్రికానే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లలో చేతులెత్తేసే నైజం సౌతాఫ్రికాది. అందుకే ప్రోటీస్ జట్టును చోకర్స్ అని పిలుస్తుంటారు. వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా నిజం చేసంది. వన్డే వరల్డ్‌కప్-2023లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆసీస్ బౌలర్ల ధాటికి సఫారీలు విలవిల్లాడుతున్నారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి పవర్లో ప్లేలో అయితే సౌతాఫ్రికా కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. లీగ్ మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మెరుపులు మెరిపించిన దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో మాత్రం కంగారుల ముందు తలవంచింది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టారు. 14 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఏడాది వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా.. కీలకమైన సెమీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. చదవండి: MS Dhoni: ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లిన ధోని.. ఆమె పాదాలకు నమస్కరించి.. -
CWC 2023: కెప్టెన్‌గా ఇప్పటివరకు హిట్టే! బ్యాటర్‌గా ఫట్టు.. ఇలా అయితే ఎలా?
ICC WC 2023- Temba Bavuma Batting Failure: వన్డే వరల్డ్‌కప్-2023లో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 145 పరుగులు చేశాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. తాజాగా కీలక సెమీ ఫైనల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీలో ఆరంభం నుంచి అదరగొట్టింది సౌతాఫ్రికా. శ్రీలంకపై భారీ విజయంతో ఈవెంట్‌ను ఆరంభించిన సఫారీ జట్టు.. లీగ్ దశలో తొమ్మిదింట ఏడు విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను చిత్తుగా ఓడించిన సఫారీలు భారీగా రన్‌రేటు మెరుగపరుచుకున్నారు. లీగ్ దశలో ఏడు విజయాలతో సెమీస్‌కు పాకిస్తాన్‌పై ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కిన ప్రొటిస్ జట్టు.. అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఏంకగా 243 పరుగుల తేడాతో మట్టికరిచింది. ఇక అఫ్గనిస్తాన్‌పై విజయంతో లీగ్ దశను ముగించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, కగిసో రబడ వంటి కీలక ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించడంతో సౌతాఫ్రికా మరోసారి సెమీస్‌లో అడుగుపెట్టగలిగింది. కెప్టెన్‌గా ఇలా హిట్టయినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పేలవ ప్రదర్శన కనబరిచాడు తెంబా బవుమా. View this post on Instagram A post shared by ICC (@icc) ఆసీస్ పేసర్ల దెబ్బకు సఫారీల విలవిల ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో నెట్టింట అతడిపై ట్రోలింగ్ మొదలైంది. కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించిన సఫారీలు తుదిజట్టులో అదనపు స్పిన్నర్‌ను చేర్చుకున్నారు. కేశవ్ మహరాజ్‌తో పాటు తబ్రేజ్ షంసీని ఆడించేందుకు సిద్ధమైంది మేనేజ్మెంట్. అయితే, పిచ్ పేసర్లకు అనుకూలిస్తుండటం ఆస్ట్రేలియాకు వరంగా మారింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి బవుమాను పెవిలియన్‌కు పంపిన మిచెల్ స్టార్క్.. హిట్టర్ ఎయిడెన్ మార్కరమ్(10) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ క్వింటన్ డికాక్(3), రాస్సీ వాన్ డర్ డస్సెన్(6) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వర్షం కారణంగా 14వ ఓవర్ వద్ద ఆట నిలిపివేసే సమయానికి సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు మాత్రమే చేసింది. Temba Bavuma contribution for South Africa throughout the ODI world cup 2023 😂#SAvsAUS #Bavuma #Chokers #Proteas pic.twitter.com/HEXXvqJNtr — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) November 16, 2023 Temba Bavuma gone for a duck in Semifinal 🔥 The man the myth the legend Brigadier Temba Bavuma 👏#SAvsAUS pic.twitter.com/uUhxYkbS67 — Radhika Chaudhary (@Radhika8057) November 16, 2023 -
CWC 2023: ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా ఓటమి.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Cricket World Cup 2023 - South Africa vs Australia: వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా 8వ సారి వరల్డ్‌కప్ ఫైనల్ బెర్త్‌ను ఆసీస్ ఖారారు చేసుకుంది. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ కొట్టి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(62) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్(30), ఇంగ్లీష్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వరుసక్రమంలో వికెట్లు పడగొడుతూ ఆసీస్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచారు. కానీ చివరకి విజయం మాత్రం కంగారులనే వరించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్, రబాడ, మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. ఇక ఆక్టోబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇంగ్లీష్ ఔట్.. తిరిగి గేమ్‌లోకి దక్షిణాఫ్రికా 193 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన ఇంగ్లీష్‌ను కొయెట్జీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ప్రోటీస్ తిరిగి మళ్లీ పోటోలోకి వచ్చింది. ఆసీస్ విజయానికి 19 పరుగులు కావాలి. విజయం దిశగా ఆసీస్.. దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆసీస్ గెలుపుకు 72 బంతుల్లో 25 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(27), మిచెల్ స్టార్క్(6) ఉన్నారు. ఉత్కంఠగా సెమీఫైనల్-2 ఈడెన్‌గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకున్న స్టీవ్ స్మిత్‌ను కొయెట్జీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సఫారీలు మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చారు. ఆసీస్ విజయానికి ఇంకా 38 పరుగులు కావాలి. క్రీజులో ఇంగ్లీష్(19), మిచెల్ స్టార్క్(1) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. మాక్స్వెల్ ఔట్ దక్షిణాఫ్రికా స్పిన్నర్లు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. డేంజరస్ మాక్స్‌వెల్‌ను తబ్రేజ్ షంషి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆసీస్ విజయానికి 25 ఓవర్లలలో 72 పరుగులు కావాలి. క్రీజులో స్మిత్, ఇంగ్లీష్ ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. 113 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన లబుషేన్.. షంస్సీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆసీస్ విజయానికి 79 పరుగులు కావాలి. క్రీజులోకి మాక్స్వెల్ వచ్చాడు. ఆసీస్ మూడో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులతో అద్బుతంగా ఆడుతున్న ట్రెవిస్ హెడ్‌ను కేశవ్ మహారాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ఆసీస్ విజయానికి 35 ఓవర్లలో 104 పరుగులు కావాలి. దక్షిణాఫ్రికాతో సెమీస్.. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో హెడ్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 92/2 రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా కమ్‌బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. 61 పరుగులు వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 61/2 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. మార్క్రమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. 7 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 60/1 దూకుడుగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు.. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్(11), హెడ్(9) పరుగులతో ఉన్నారు. మిల్లర్ విరోచిత శతకం.. ఆస్ట్రేలియా టార్గెట్ 213 పరుగులు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. దక్షిణాఫ్రికా 49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో డేవిడ్ మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి జట్టుకు ఫైటింగ్ స్కోర్‌ను అందించాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్, క్లాసెన్(47) అదుకున్నారు. క్లాసెన్ ఔటైన తర్వాత మిల్లర్ పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమ్మిన్స్ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, హెడ్ తలా రెండు వికెట్లు సాధించారు డేవిడ్ మిల్లర్ సెంచరీ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. 24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తన అద్భుత ఇన్నింగ్స్ మిల్లర్ అదుకున్నాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. 48 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 203/9 ఎనిమిదో వికెట్ డౌన్.. 191 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కేశవ్ మహారాజ్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 47 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 196/8 ఏడో వికెట్ డౌన్.. 172 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరగులు చేసిన గెరాల్డ్ కోయెట్జీ.. కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలయన్‌కు చేరాడు. 44 ఓవర్లు దక్షిణాఫ్రికా స్కోర్: 174/7 40 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 156/6 మిల్లర్ 67, కోయెట్జీ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 149-6 మిల్లర్ 66, కోయెట్జీ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. మిల్లర్ హాఫ్ సెంచరీ 31.3: మాక్స్వెల్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మిల్లర్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 30.5: హెడ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన మార్కో జాన్సెన్. ఆరో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. కొయోట్జీ క్రీజులోకి వచ్చాడు. క్లాసెన్ బౌల్డ్ 30.4: నిలకడగా సాగుతున్న సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ట్రవిస్ హెడ్ బ్రేక్ వేశాడు. 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న క్లాసెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. దీంతో ప్రొటిస్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. కాగా మిల్లర్‌తో కలిసి క్లాసెన్ 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌతాఫ్రికా స్కోరు: 27 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 95/4 ►26.4: మరో సిక్స్ కొట్టిన క్లాసెన్ ►26.3: జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన క్లాసెన్ సగం ఇన్నింగ్స్ ముగిసే సరికి ప్రొటిస్ ఇలా క్లాసెన్, మిల్లర్ 79 బంతుల్లో 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. క్లాసెన్ 22, మిల్లర్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. 25 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 79/4 నిలకడగా ఆడుతున్న క్లాసెన్, మిల్లర్ ►21 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 68/4 (21) ►డేవిడ్ మిల్లర్ కాస్త దూకుడు పెంచాడు. 19వ ఓవర్ ముగిసే సరికి 28 బంతులు ఎదుర్కొని 25 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో క్లాసెన్ నిలకడగా ఆడుతూ 13 పరుగుల వద్ద ఉన్నాడు. స్కోరు: 62-4 మళ్లీ మొదలైన ఆట వర్షం తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది. 15 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు: 46-4 వర్షం కారణంగా ఆగిన ఆట వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. వరణుడి ఆగమానికి ముందు సౌతాఫ్రికా 14 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 44 పరుగులు చేసింది. క్లాసెన్ 10, మిల్లర్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్లు స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు. సౌతాఫ్రికాకు షాకుల మీద షాకులు 11.5:హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో డస్సెన్ అవుట్. డస్సెన్(6) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా. మిల్లర్, క్లాసెన్ క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 10.5: స్టార్క్ బౌలింగ్‌లో మార్కరమ్ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇప్పటికే బవుమా, డికాక్ వికెట్లు కోల్పోయిన ప్రొటిస్.. మార్కరమ్ రూపంలో మరో కీలక వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో కూరుకుపోయింది. క్లాసెన్, డస్సెన్(5) క్రీజులో ఉన్నారు. 10.1: ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో తొలి బౌండరీ స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన మార్కరమ్ పవర్ ప్లేలో సౌతాఫ్రికా స్కోరు: 18/2 పవర్ ప్లేలో సౌతాఫ్రికా దారుణ ప్రదర్శన కనబరిచింది. 10 ఓవర్లు ముగిసే సరికి ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. ►తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 17/2 ►6, 7 ఓవర్లను మెయిడిన్ చేసిన హాజిల్‌వుడ్, స్టార్క్. సౌతాఫ్రికా స్కోరు: 8/2 (7) 5.4: రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ క్వింటన్ డికాక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఇక ఆరంభంలోనే బవుమా వికెట్ తీసి స్టార్క్ షాకివ్వగా.. కీలక వికెట్ పడగొట్టి హాజిల్‌వుడ్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. మార్కరమ్, డస్సెన్ క్రీజులో ఉన్నారు. స్కోరు: 8-2(6). కట్టుదిట్టంగా ఆసీస్ బౌలింగ్ బౌలింగ్ ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సఫారీలను కట్టడి చేస్తున్నారు. దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టపోయిన ప్రొటిస్ జట్టు కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 2/1 (2) ►రాస్సీ వాన్ డర్ డస్సెన్ 0, డికాక్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్‌తో సెమీస్.. తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా ►0.6: తొలి ఓవర్లోనే సౌతాఫ్రికాకు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. కెప్టెన్ తెంబా బవుమాను డకౌట్‌గా వెనక్కి పంపాడు. ►టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) తుదిజట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్. -
CWC 2023 2nd Semi Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా ఓ మార్పు చేసింది. లుంగి ఎంగిడి స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్,సీన్ అబాట్‌ల స్థానాల్లో మ్యాక్స్‌వెల్, స్టార్క్ రీఎంట్రీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), టెంబా బవుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్ -
CWC 2023 AUS VS SA 2nd Semis: అభిమానులకు బ్యాడ్‌న్యూస్
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ (నవంబర్ 16) జరగాల్సిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం పడనప్పటికీ.. స్టేడియం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. The covers are on at the Eden Gardens. pic.twitter.com/X3gMgFTAFw — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి, మ్యాచ్ ఇవాళ రద్దైనా రేపు జరుగుతుంది. వాతవరణం అప్డేట్ తెలిసి క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆస్ట్రేలియా అభిమానులు మరింత కలవరపడుతున్నారు. ఒకవేళ ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైతే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా సౌతాఫ్రికా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగలకూడదని ఆసీస్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్ షమీ (9.5-0-57-7) సూపర్ బౌలింగ్‌తో మెరవడంతో భారత్ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. -
సెమీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్!
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. బావుమా ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్‌లో కూడా తొడ కండరాలు పట్టేయడంతో పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే స్కానింగ్‌లో అతడి గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు సెమీస్‌కు దూరం కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌కు బావుమా దూరమైతే అతడి స్ధానంలో రెజా హెండ్రిక్స్ తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: World Cup 2023: పాకిస్తాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్‌కప్‌లో చెత్త ప్రదర్శనకు కారణాలేంటి? -
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆసీస్ ఓటమి పాలైంది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైన కంగారూ జట్టు.. ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. 312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(109) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన ఆసీస్.. అంతకుముందు 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది. చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో‘సారీ’
ICC Cricket World Cup 2023- Australia vs South Africa, 10th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభం నుంచే షాకుల మీద షాకులిచ్చింది సౌతాఫ్రికా. ప్రొటిస్ బౌలర్ల దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముఖ్యంగా పేసర్ కగిసో రబడ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 71 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన కంగారూ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఆరో ఓవర్ ఐదో బంతికి మిచెల్ మార్ష్(7)ను మార్కో జాన్సెన్ అవుట్ చేయడంతో మొదలైంది ఆసీస్ వికెట్ల పతనం. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్(13), రబడ బౌలింగ్‌లో స్మిత్(19) ఎల్బీడబ్ల్యూ, జోష్ ఇంగ్లిస్‌ను బౌల్డ్ కాగా.. మహరాజ్ బౌలింగ్‌లో మాక్స్వెల్(3) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగిన రబడ స్టొయినిస్(5)ను అవుట్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి దశలో మార్నస్ లబుషేన్‌కు తోడుగా టెయిలెండర్ మిచెల్ స్టార్క్(51 బంతుల్లో 27 పరుగులు) పట్టుదలగా క్రీజులో నిలబడిన వేళ మార్కో జాన్సెన్ దెబ్బకొట్టాడు. ఆ వెంటనే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్న లబుషేన్‌ను కేశవ్ మహరాజ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, 41వ ఓవర్ మూడో బంతికి తబ్రేజ్ షంసీ బౌలింగ్‌లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిల్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసిపట్టాడు. దీంతో షంసీ ఖాతాలో వరల్డ్‌కప్ క్రికెట్లో తొలి వికెట్ చేరింది. అదే ఓవర్లో హాజిల్‌వుడ్‌ను కూడా షంసీ అవుట్ చేయడంతో ఆసీస్ కథ ముగిసిపోయింది. 177 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 134 పరుగులు భారీ తేడాతో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ప్రొటిస్ పేసర్లలో రబడకు మూడు, జాన్సెన్కు రెండు, లుంగి ఎంగిడికి ఒక వికెట్ దక్కగా.. స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, తబ్రేజ్ షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. డికాక్ సెంచరీతో.. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా గురువార నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. కంగారూ జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023లో వరుసగా రెండో శతకం(109) నమోదు చేయగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 56 పరుగులతో రాణించాడు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. కాగా ఈ మెగా టోర్నీ తాజా ఎడిషన్‌లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో పరాజయం.తొలుత చెన్నైలో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. -
SA Vs Aus: వరుసగా రెండో సెంచరీ! ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన డికాక్
ICC WC 2023- Australia vs South Africa- Quinton De Kock: వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా పలు అరుదైన ఘనతలు సాధించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ప్రొటిస్ జట్టుకు క్వింటన్ డికాక్ సెంచరీతో శుభారంభం అందించాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 29.5వ ఓవర్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో సిక్సర్ బాది వంద పరుగులు చేసుకున్నాడు. వరుసగా రెండో సెంచరీ ప్రపంచకప్-2023లో వరుసగా రెండోసారి సెంచరీ సాధించి.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకం నమోదు చేశాడు. ఈ సందర్భంగా.. వరల్డ్‌కప్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్(4) తర్వాత ఈ ఘనత సాధించిన హషీం ఆమ్లా(2), ఫాఫ్ డుప్లెసిస్(2), హర్షల్ గిబ్స్(2)లతో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. రెండో ప్రొటిస్ బ్యాటర్‌గా అదే విధంగా సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఎలైట్ లిస్టులో హషీం ఆమ్లా 27 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. 19 సెంచరీలతో డికాక్ అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(18)ను అధిగమించాడు. గిబ్స్ అరుదైన రికార్డు బ్రేక్ అంతేగాక వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన తొలి సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో హర్షల్ గిబ్స్(1999లో- 101 పరుగులు) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో 100 పరుగులతో ఫాఫ్ డుప్లెసిస్(2019) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా ఆసీస్ మీద ఓవరాల్‌గా డికాక్‌కు ఇది మూడో శతకం. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ డికాక్‌ను బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎయిడెన్ మార్కరమ్ అర్ధ శతకంతో రాణించగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, రెండు మార్పులు
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియంలో ఇవాళ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయగా.. సౌతాఫ్రికా గత మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఓ మార్పు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ స్థానంలో మార్కస్ స్టోయినిస్.. అలెక్స్ క్యారీ స్థానంలో జోస్ ఇంగ్లిస్ తుది జట్టులోకి వచ్చారు. సౌతాఫ్రికా టీమ్‌లో గెరాల్డ్ కొయెట్జీ స్థానంలో తబ్రేజ్ షంషి తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు .. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
CWC 2023: ప్రపంచకప్‌లో ఇవాళ రసవత్తర సమరం
ప్రపంచకప్-2023లో ఇవాళ (అక్టోబర్ 12) రసవత్తర సమరం జరుగనుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా తలపడనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ హోరాహోరీ పోరులో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. సౌతాఫ్రికా శ్రీలంకపై ఘన విజయం సాధించగా.. ఆస్ట్రేలియా.. టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా నాలుగో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఏడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాదే పైచేయి.. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు 6 సార్లు ఎదురెదురు పడగా.. ఆస్ట్రేలియా 3, సౌతాఫ్రికా 2 పర్యాయాలు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ టై అయ్యింది. ఈ ఇరు జట్లు చివరిసారిగా 2019 ప్రపంచకప్‌లో తలపడగా.. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఫేవరెట్‌గా సౌతాఫ్రికా..! ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ ఎవరన్న విషయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం సౌతాఫ్రికాయే అని చెప్పాలి. వరల్డ్‌కప్‌కు ముందు ఇరు జట్లు తలపడిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికానే కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సఫారీలు.. ఆతర్వాత ఆనూహ్యంగా పుంజుకుని వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ చేజిక్కించుకున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ సౌతాఫ్రికా అదే ఫామ్‌ను కొనసాగించింది. శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు ప్రొటీస్ ఆటగాళ్లు సెంచరీలు చేశారు. ఫలితంగా ఆ జట్టు వరల్డ్‌కప్‌లో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఆసీస్ విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌కు ముందు సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. ఆతర్వాత భారత్‌తో జరిగిన సిరీస్‌ను కూడా 1-2తేడాతో కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ ఆసీస్.. టీమిండియా చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌కే (199) పరిమితమైన ఆ జట్టు, దాన్ని కాపాడుకోవడం విఫలమైంది. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, టెంబా బవుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి, లుంగి ఎంగిడి -
చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. చెలరేగిన మార్క్రమ్, మిల్లర్.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జన్సెన్, ఫెలుక్వాయో మెరుపులు.. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్ (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 పరుగుల మార్కును దాటింది. పర్వాలేదనిపించిన డికాక్, డస్సెన్.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్, మిల్లర్, జన్సెన్, ఫెలుక్వాయోలతో పాటు డికాక్ (27), డస్సెన్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్ బవుమా (0), గత మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో వీరవిహారం చేసిన క్లాసెన్ (6), గెరాల్డ్ కొయెట్జీ (0), కేశవ్ మహారాజ్ (0) నిరాశపరిచారు. క్లాసెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న జంపా.. నాలుగో వన్డేలో తన బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకుని, వన్డేల్లో అత్యంత ఘోరమైన గణాంకాలు (10-0-113-0) నమోదు చసేలా చేసిన క్లాసెన్‌పై ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జంపా.. క్లాసెన్‌ను కేవలం 6 పరుగులకే క్లీన్‌బౌల్డ్ చేశాడు. క్లాసెన్ వికెట్ తీశాడన్న మాట తప్పిస్తే.. జంపా ఈ మ్యాచ్‌లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి ఏకంగా 71 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు తీశారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. వార్నర్ (10), ఇంగ్లిస్ (0) ఔట్ కాగా.. మిచెల్ మార్ష్ (46), లబూషేన్ (27) క్రీజ్‌లో ఉన్నారు. జన్సెన్కు 2 వికెట్లు పడ్డాయి. కాగా, 5 మ్యాచ్‌లో ఈ వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు చెరో 2 మ్యాచ్‌లు గెలిచి, సిరీస్‌లో సమంగా నిలిచాయి. -
నా శరీరం 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. కానీ: డికాక్ భావోద్వేగం
SA Vs Aus 5th ODI- Quinton de Kock gets emotional: సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డే ఆడుతున్న ఈ లెఫ్టాండర్ శరీరం సహకరించని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు డికాక్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డికాక్ కంట నీటిచెమ్మ ఆస్ట్రేలియాతో సిరీస్ స్వదేశంలో ఆఖరిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆసీస్‌తో ఐదో వన్డే ఆరంభానికి ముందు డికాక్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లు చెమర్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 30 ఏళ్లకే ఎందుకిలా? కాగా స్టార్ బ్యాటర్‌గా పేరొందిన డికాక్ ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నాడు. 30 ఏళ్ల వయసులోనే డికాక్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను నిరాశ పరిచింది. సిగ్గుపడాల్సిందేమీ లేదు ఈ నేపథ్యంలో క్వింటన్ డికాక్ ఈసీఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘నా టెస్టు కెరీర్ ముగిసిన సమయంలో ఇలాంటి భావన కలిగింది. మళ్లీ ఇప్పుడు కూడా! టెస్టుల్లో ఆడాలని శక్తిమేర ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. 50 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్ అవడం సరైందేనా అని నా సన్నిహితులను అడిగాను. ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టడం కోసం ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు. శరీరం 40 ఏళ్లు అంటోది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా గత 10-11 ఏళ్లలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాను. నా శరీరమేమో నాకు 40 ఏళ్లని చెబుతోంది.. కానీ ఐడీ మాత్రం నాకింకా 31 ఏళ్లే అని చూపిస్తోంది.. మానసికంగా నేను 20 ఏళ్లవాడిలా నటించేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. అబుదాబి టూర్ మొదలు ఇండియాలో టెస్టులు.. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో అనుభవాల గురించి డికాక్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 లీగ్‌లలో ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని.. అందుకే తాను కూడా పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి సారించాలనుకున్నానని డికాక్ పేర్కొన్నాడు. అవును.. ఎక్కవ డబ్బులు వస్తాయి.. కానీ జాతీయ జట్టును విజయపథంలో నిలిపే క్రమంలో మాత్రం ఎప్పుడూ తాను వెనకడుగు వేయలేదని ఈ లెఫ్టాండర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ కేవలం డబ్బు గురించే ఆలోచించి ఉంటే ఐదేళ్ల క్రితమే రిటైర్ అయ్యేవాడినని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదో వన్డేలో క్వింటన్ డికాక్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డేలో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా అరంగేట్రం 2012లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా డికాక్ సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్లో క్వింటన్ డికాక్.. టెస్టుల్లో 3300, వన్డేల్లో 6176, టీ20లలో 2907 పరుగులు సాధించాడు. చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా? -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వన్డేల్లో హెన్రిచ్ క్లాసెన్ వరల్డ్ రికార్డు
దక్షిణాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లు బాది 174 పరుగులు సాధించాడు. 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసెన్ 57 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత 26 బంతుల్లో మరో 74 పరుగులు సాధించాడు. రికార్డుల క్లాసెన్ తద్వారా క్లాసెన్ పలు అరుదైన రికార్డులు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా ఆస్ట్రేలియాపై శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటర్ 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా అదే విధంగా.. వన్డే క్రికెట్ చరిత్రలో క్లాసెన్ ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు.. ఒకే బౌలర్ బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గానూ నిలిచాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. గతంలో ఆడం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఏడు సిక్స్‌లు కొట్టాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. వన్డేల్లో క్లాసెన్ వరల్డ్ రికార్డు ఇవన్నీ ఒకెత్తైతే.. వన్డేల్లో 200కు పైగా స్ట్రైక్‌రేటుతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా క్లాసెన్ చరిత్ర సృష్టించడం వేరే లెవల్! అంతకు ముందు ఈ రికార్డు సంయుక్తంగా.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(245.45 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు నాటౌట్), ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(231.41 స్ట్రైక్‌రేటుతో 162 పరుగులు, నాటౌట్) పేరిట ఉండేది. ఆడం జంపా చెత్త రికార్డు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు.. మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్ (62; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అదరగొట్టారు. దాంతో తొలుత దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 416 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధికంగా ఏడుసార్లు 400 అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. భారత్ ఆరుసార్లు ఈ ఘనత సాధించింది. సిరీస్ సమం మరోవైపు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో 113 పరుగులిచ్చాడు. వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా మిక్ లూయిస్ (10 ఓవర్లలో 113; ఆస్ట్రేలియా; 2006లో దక్షిణాఫ్రికాపై) పేరిట ఉన్న చెత్త రికార్డును జంపా సమం చేశాడు. ఇక 417 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అలెక్స్ క్యారీ (77 బంతుల్లో 99; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ కోల్పోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 2–2తో సమంగా ఉన్నాయి. చివరిదైన ఐదో వన్డే ఆదివారం జరుగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఫైనల్‌కు ఆల్‌రౌండర్ దూరం! లంకకు యువ క్రికెటర్.. #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 -
SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు
Heinrich klaasen 174: ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడు. 83 బంతుల్లో 13, 13 సిక్సర్ల సాయంతో ఏకంగా 174 పరుగులు సాధించాడు. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు 57 బంతుల్లోనే సెంచరీ సాధించిన క్లాసెన్.. వన్డే ఫార్మాట్లో ఐదో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 416 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ క్రమంలో టీమిండియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. అంతర్జాతీయ వన్డేల్లో 400కు పైగా స్కోరు నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆసీస్‌పై 164 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సమం మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. తొలి రెండు వన్డేల్లోనూ జయభేరి మోగించారు. ఈ క్రమంలో వరుస ఓటముల నుంచి తేరుకున్న ఆతిథ్య ప్రొటిస్ జట్టు మూడో మ్యాచ్‌లో 111 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆసీస్‌కు ఊహించని షాక్‌లు ఈ క్రమంలో శుక్రవారం ఇరు జట్లు సెంచూరియన్ వేదికగా నాలుగో వన్డేలో తలపడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హెన్రిచ్ క్లాసెన్ చుక్కలు చూపించాడు. అద్భుత శతకంతో మెరిసి.. సౌతాఫ్రికాకు 416 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇక లక్ష్య ఛేదనలో కంగారూలకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. ట్రవిస్ హెడ్ ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలెక్స్ క్యారీ 99 పరుగులతో పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరుస వికెట్లు కోల్పోవడంతో 34.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయిన ఆసీస్.. 164 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-2తో సమం చేసింది. వన్డేల్లో అత్యధికసార్లు 400కు పైగా స్కోర్లు నమోదు చేసిన జట్లు ►సౌతాఫ్రికా- 7 సార్లు ►టీమిండియా- 6 సార్లు ►ఇంగ్లండ్- 5 సార్లు ►ఆస్ట్రేలియా- 2 సార్లు ►శ్రీలంక- 2 సార్లు. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ #Klassen🥵@Heini22 🔥#OrangeArmy 💥@SunRisers 🧡#SAvsAUS😺😸 pic.twitter.com/DEoOrZuCpp — Bhagi👰 (@orangearmylub) September 16, 2023 💯 for Klassen infront of his home crowd !! 100(57)* He was batting on 29(28) Scored the next 71 runs off 29 balls#Klassen #SAvAus pic.twitter.com/wCrMXYiB0r — Karthik Rao (@Cric_Karthikk) September 15, 2023 What a Finish by #Klassen #CSA pic.twitter.com/Vn95QIvIqE — sivakumar (@sivakumar90) September 15, 2023 -
క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం
వన్డే క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం జరిగింది. సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. 83 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 174 పరుగులు చేశాడు. క్లాసెన్‌కు తొలుత రస్సీ వాన్ డర్ డస్సెన్ (65 బంతుల్లో 62; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (45 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 416 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ (8) మినహా అందరూ పరుగులు చేశారు. క్వింటన్ డికాక్ (45), రీజా హెండ్రిక్స్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. క్లాసెన్ మహోగ్రరూపం.. క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని విధ్వంసం సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 57 బంతుల్లో శతక్కొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇది ఐదో వేగవంతమైన శతకం. గతంలో క్లాసెన్ ఓసారి 54 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతుల్లో) పేరిట ఉంది. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ వన్డే క్రికెట్ ఉన్నన్ని రోజులు గుర్తుంటుంది. క్లాసెన్‌కు మిల్లర్ కూడా జతకలవడంతో ఆసీస్ బౌలింగ్ లైనప్ తునాతునకలైంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 10 ఓవర్లలో రికార్డు స్థాయిలో 113 పరుగులు సమర్పించుకున్నాడు. జంపాతో పాటు స్టొయినిస్ (10-1-81-1), హాజిల్‌వుడ్ (10-0-79-2), నాథన్ ఇల్లిస్ (10-0-79-1), మైఖేల్ నెసర్ (10-0-59-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సౌతాఫ్రికా సిరీస్ ఆవకాశాలు సజీవంగా ఉంటాయి. క్లాసెన్ పరుగులు ఇలా సాధించాడు.. తొలి హాఫ్ సెంచరీ: 38 బంతులు రెండో హాఫ్ సెంచరీ: 19 బంతులు మూడో హాఫ్ సెంచరీ: 20 బంతులు ఆఖరి 24 పరుగులు: 6 బంతులు ఈ ఇన్నింగ్స్‌లో క్లాసెన్ ఆఖరి 150 పరుగులను 58 బంతుల్లో చేయడం విశేషం. క్లాసెన్-మిల్లర్ జోడీ కేవలం 94 బంతుల్లో 222 పరుగులు జోడించింది. క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం. ఆస్ట్రేలియాపై రెండో ఫాస్టెస్ట్ హండ్రెడ్.. కోహ్లి 52 బంతుల్లో ఆసీస్‌పై శతక్కొట్టాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా జంపా.. ఆసీస్‌కే చెందిన మిక్ లెవిస్ (113) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సార్లు (7) 400 స్కోర్ దాటిన సౌతాఫ్రికా -
శతక్కొట్టిన మార్క్రమ్.. వార్నర్ ఒంటరిపోరాటం.. ఎట్టకేలకు సౌతాఫ్రికాకు తొలి గెలుపు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో సౌతాఫ్రికా ఎట్టకేలకు తొలి గెలుపు సాధించింది. 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన మూడో మ్యాచ్‌లో ప్రొటీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయంపాలైంది. తాజా గెలుపుతో ఆ జట్టు సిరీస్ అవకాశాలను (1-2) సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఎయిడెన్ మార్క్రమ్ విధ్వంసకర శతకంతో (74 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. డికాక్ (82), బవుమా (57)లు సైతం అర్ధసెంచరీలతో చెలరేగగా.. హెండ్రిక్స్ (39), జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. క్లాసెన్ (0), మిల్లర్ (8) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తీన్వర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ ఓ దశలో విజయం దిశగా సాగినప్పటికీ.. సఫారీ యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (4/50) ఆసీస్ విజయావకాశాలకు అడ్డుకట్ట వేశాడు. అతనికి తబ్రేజ్ షంషి (2/29), కేశవ్ మహారాజ్ (2/37), మగాల (1/40) సహకరించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వార్నర్ (78) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ట్రవిస్ హెడ్ (38), మిచెల్ మార్ష్ (29)లకు శుభారంభాలు లభించినప్పటికీ, వారు ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. లబూషేన్ (15), అలెక్స్ క్యారీ (12), స్టోయినిస్ (10), టిమ్ డేవిడ్ (8), సీన్ అబాట్ (2), ఇల్లిస్ (16), తన్వీర్ సంగా (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లారు. ఈ సిరీస్‌లో నాలుగో వన్డే సెప్టెంబర్ 15న సెంచూరియన్‌లో జరుగనుంది. -
మార్క్రమ్ విధ్వంసకర శతకం.. సౌతాఫ్రికా భారీ స్కోర్
5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (సెప్టెంబర్12) జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు ఎయిడెన్ మార్క్రమ్ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. కేవలం 74 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకంతో (102 నాటౌట్) విరుచుకుపడ్డాడు. మార్క్రమ్కు జతగా క్వింటన్ డికాక్ (77 బంతుల్లో 82; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ టెంబా బవుమా (62 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించగా.. రీజా హెండ్రిక్స్ (39), మార్కో జన్సెన్ (32) పర్వాలేదనిపించారు. ఈ నలుగురు సత్తా చాటడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్ (0), డేవిడ్ మిల్లర్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 2 వికెట్లు పడగొట్టగా.. మార్కస్ స్టోయినిస్, నాథన్ ఇల్లిస్, తన్వీర్ సంగా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రస్తుతానికి సౌతాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా కొనసాగుతుంది. -
సౌతాఫ్రికాకు భారీ షాక్! వెన్నునొప్పితో స్టార్ పేసర్ ‘అవుట్’..
Australia tour of South Africa, 2023 ODI Series: ఆస్ట్రేలియాతో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రొటిస్ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. వెన్ను నొప్పి తీవ్రతరమైన కారణంగా ఆసీస్‌తో మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సౌతాఫ్రికా క్రికెట్ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి సోమవారం ప్రకటన విడుదల చేసింది. టీ20 సిరీస్‌లో ఘోర పరాభవం కాగా మూడు టీ20లు, 5 వన్డేల సిరీస్ కోసం కంగారూ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగష్టు 30న మొదలైన టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టును ఆసీస్.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా తొలి రెండు వన్డేల్లోనూ విజయం సాధించి 2-0తో ముందంజలో ఉంది. ముఖ్యంగా శనివారం నాటి రెండో వన్డేలో ఏకంగా 123 పరుగుల తేడాతో గెలుపొంది ఫుల్ జోష్‌లో ఉంది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత మైదానాన్ని వీడిన ఈ రైట్ఆర్మ్ పేసర్.. తర్వాత తిరిగొచ్చి ఫీల్డింగ్ చేశాడు. వెన్నునొప్పి తీవ్రతరం అయితే.. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను సోమవారం జొహన్నస్‌బర్గ్‌కు పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో వైద్యపరీక్షలు జరుగుతున్న సమయంలో.. అతడు సెప్టెంబరు 12 నాటి మూడో వన్డేకు దూరం కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక వన్డే సిరీస్‌లో ఇప్పటికే వెనుబడ్డ సౌతాఫ్రికాకు.. వన్డే వరల్డ్‌కప్-2023 సమీపిస్తున్న తరుణంలో నోర్జే గాయం అశనిపాతంలా మారింది. శ్రీలంకతో తొలి మ్యాచ్.. వరల్డ్‌కప్‌నకు ముందు ఎదురుదెబ్బ ప్రొటిస్ కీలక పేసర్లలో ఒకడైన అన్రిచ్ నోర్జే గనుక మెగా ఈవెంట్ నాటికి అందుబాటులోకి రాకుంటే జట్టుకు కష్టాలు తప్పవు. ఇక భారత్ వేదికగా మొదలు కానున్న ప్రపంచకప్ టోర్నీలో అక్టోబరు 7న ఢిల్లీలో శ్రీలంకతో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆసీస్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ కాపాడుకోవాలంటే మూడో వన్డే తప్పక గెలవాల్సి ఉంది. వన్డే వరల్డ్‌కప్‌నకు సౌతాఫ్రికా జట్టు: తెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్. చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే? -
సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో అతి భారీ పరాజయం
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు టీ20ల్లో భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా స్వదేశంలో (డర్బన్) ఆస్ట్రేలియాతో నిన్న (ఆగస్ట్ 30) జరిగిన తొలి మ్యాచ్‌లో 111 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన ప్రొటీస్.. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా అతి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. పరుగుల పరంగా సఫారీలు టీ20ల్లో ఎదుర్కొన్న భారీ పరాజయాల్లో టాప్-4 ఆసీస్ చేతుల్లోనే కావడం విశేషం. Australia has handed South Africa four out of their five biggest defeats in terms of runs in T20Is.#SAvsAUS pic.twitter.com/rW0OABPfk6 — CricTracker (@Cricketracker) August 31, 2023 నిన్నటి మ్యాచ్ తర్వాత అతి పెద్ద పరాజయాన్ని సౌతాఫ్రికా 2020లో ఎదుర్కొంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఆ తర్వాత అతి భారీ పరాజయాన్ని కూడా సౌతాఫ్రికా అదే ఏడాది చవిచూసింది. 2020లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 97 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీని తర్వాతి భారీ పరాజయం సౌతాఫ్రికాకు 2006లో ఎదురైంది. నాడు బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 95 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయ్యారు. ఇలా టీ20ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఎదుర్కొన్న భారీ పరాజయాలన్నీ ఆసీస్ చేతిలోనే కావడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మిచెల్ మార్ష్ (49 బంతుల్లో 92 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (28 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం 227 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 115 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు. -
అప్పుడలా! ఈసారి మాత్రం వరల్డ్‌కప్ ట్రోఫీ మాదే: సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
అప్పటి దాకా అదరగొట్టడం... అభిమానుల్లో అంచనాలు పెంచేయడం... మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో చేతులెత్తేయడం.. కనీసం ఫైనల్ కూడా చేరలేక చతికిలపడటం.. మీరు ఊహించిన పేరు నిజమే! ఈ ప్రస్తావన సౌతాఫ్రికా గురించే! 1992 నుంచి వరల్డ్‌కప్ టోర్నీలో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా ఇంత వరకు ఒక్క వన్డే ట్రోఫీ కూడా గెలవలేదు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లలో విజయం అంచులదాకా వెళ్లి బోల్తా పడటం.. ‘చోకర్స్’ అనే ‘నామధేయం’ తమకు సరిగ్గా సరిపోతుందని మళ్లీ మళ్లీ నిరూపించుకోవడం ప్రొటిస్‌కు బాగా అలవాటు. ఈసారి ట్రోఫీ గెలుస్తాం అయితే, ఈసారి ఆ అపఖ్యాతిని కచ్చితంగా చెరిపేసుకుంటాం అంటున్నాడు సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబడ. ప్రపంచకప్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా భారత్‌లో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇప్పటి వరకు జరగనిది.. ఇప్పుడు చేసి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రొటిస్ పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న 28 ఏళ్ల రబడ ఈ మేరకు మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా క్రికెట్ గురించి బయట నడుస్తున్న డ్రామా, చర్చల గురించి మేము అస్సలు పట్టించుకోము. నిజమే ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతూ.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోతే ఎలా ఉంటుందో తెలుసు. ప్రతి క్రికెటర్ కల అదే! తీవ్రమైన నిరాశ కలుగుతుంది కదా! ఈ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈసారి దానిని సాధ్యం చేసి చూపించాలని నేను... మేమంతా బలంగా కోరుకుంటున్నాం. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలవడం ఎవరికైనా ఇష్టమే కదా! ప్రతి ఒక్క క్రికెటర్ కల అదే! ఒక్కసారి జట్టును ప్రకటిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు’’ అంటూ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. కాగా ఇప్పటి వరకు నాలుగుసార్లు వరల్డ్‌కప్ సెమీస్ వరకు చేరుకున్న సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ముందడుగు వేయలేకపోయింది. అప్పుడలా.. ఆఖరిగా.. 2019 వరల్డ్‌కప్‌లో మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచి.. విజయంతో టోర్నీని ముగించింది. అయితే, ఈసారైనా కప్ గెలుస్తారంటూ.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు మాత్రం ఫాఫ్ డుప్లెసిస్ బృందం నిరాశనే మిగిల్చింది. ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే! చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్‌గా మిచెల్ మార్ష్.. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు 14 మంంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. టీ20ల్లో ఆస్ట్రేలియా సారధి ఎంపికైన 12వ ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. కాగా టెస్టులు, వన్డేల్లో ఆసీస్ జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ సారథ్యం వహిస్తుండగా.. టీ20ల్లో మాత్రం శాశ్వత కెప్టెన్ లేడు. ఈ ఏడాది ఆరంభంలో ఆరోన్ ఫించ్ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్ధానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. అయితే టీ20 ప్రపంచకప్-2024కు ముందు మార్ష్‌ను టీ20ల్లో తమ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా నియమించే ఛాన్స్ ఉంది. కాగా మార్ష్ మూడు ఫార్మాట్లలో కూడా కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే జరిగిన యాషెస్ సిరీస్‌లో కూడా అతడు అద్బుతమైన ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 250 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ముగ్గురు మొనగాళ్లు ఎంట్రీ! ఇక ప్రోటీస్ సిరీస్‌తో ముగ్గురు యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. లెఫ్టార్మ్ స్పీడ్‌స్టర్ స్పెన్సర్ జాన్సన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ , మాథ్యూ షార్ట్‌లకు తొలిసారి ఆసీస్ జట్టులో చోటు దక్కింది. ఆరోన్ హార్డీ వన్డే ప్రపంచకప్-2023కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన ప్రాథమిక జట్టులో కూడా ఛాన్స్ లభించింది. ప్రోటీస్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా చదవండి: అస్సలు ఊహించలేదు.. అతడే మా కొంపముంచాడు! కొంచెం బాధ్యతగా ఆడాలి: హార్దిక్ -
వైట్‌వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా
సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు డ్రా ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ వైట్‌వాష్‌ను దక్షిణాఫ్రికా తప్పించుకోగలిగింది. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్ 2-0 తేడాతో మూడు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 475/4 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 195 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా 255 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో సౌతాఫ్రికాను ఆసీస్ పాలో ఆన్ ఆడించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాలో ఆన్ ఆడటం ప్రారంభించిన ప్రోటీస్ ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు ఆఖరి టెస్టును డ్రాగా ముగించాయి. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ఆటగాడిగా -
Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్ భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ బవూమా, మార్కో జాన్సెన్లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్ వైపు అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు. ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్‌తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్‌మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
ఆసీస్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా! స్టార్ బ్యాటర్ రీ ఎంట్రీ
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు డీన్ ఎల్గర్ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆసీస్ సిరీస్‌కు ఆ జట్టు స్టార్ బ్యాటర్ మార్క్రమ్ను ప్రోటీస్ సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అదే విధంగా ఈ సిరీస్‌కు కీగన్ పీటర్సన్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన ప్రోటీస్ కీలక ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుసెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న బ్యాటర్ డి బ్రుయిన్కు తిరిగి చోటు దక్కింది. డి బ్రుయిన్ చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ఆడాడు. మరోవైపు యువ ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ దక్షిణాఫ్రికా తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక డిసెంబర్ 17న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా టెంబా బావుమా సారథ్యంలో ప్రోటీస్ జట్టు టీ20 ప్రపంచకప్-2022లో గ్రూపు దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), టెంబా బావుమా, గెరాల్డ్ కోయెట్జీ, థ్యూనిస్ డి బ్రుయిన్, సరెల్ ఎర్వీ, సైమన్ హర్మర్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబడ, గ్లెంటన్ స్టౌర్మాన్, కెన్ డ్యూస్లీ వెర్నీ, కె. , ఖయా జోండో -
WC 2023: టీ20 లీగ్ కోసమే వన్డే సిరీస్ రద్దు! ఇది కచ్చితంగా సరైన నిర్ణయమే!
CSA T20 Challenge 2022: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయాన్ని ప్రొటిస్ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సమర్థించాడు. కొత్తగా ప్రవేశపెట్టనున్న టీ20 లీగ్ కోసం బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా బోర్డుతో ఎన్ని సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందన్న స్మిత్.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్‌లీగ్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జనవరి 12 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, దక్షిణాఫ్రికాలో కొత్తగా టీ20 క్రికెట్ లీగ్ ఆరంభించనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా ప్రొటిస్ బోర్డు.. ఆసీస్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రేమ్ స్మిత్ కుదరదు! కానీ, అప్పటికే తమ అంతర్జాతీయ కాలెండర్ నిండిపోయిన కారణంగా తేదీలు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విధిలేక దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో నేరుగా అడుగుపెట్టే అవకాశాలను దక్షిణాఫ్రికా చేజేతులా సంక్లిష్టతరం చేసుకున్నట్లయింది. సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ప్రొటిస్.. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టాలంటే క్వాలిఫికేషన్ రౌండ్ ఆడాల్సిన పరిస్థితి. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సరైందే! ఈ విషయంపై తాజాగా స్పందించిన గ్రేమ్ స్మిత్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘‘సొంతగడ్డపై ఇలాంటి మ్యాచ్‌లు(టీ20) ఆదాయం తెచ్చిపెడతాయి. మా క్రికెట్ లీగ్ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో అన్ని రకాలుగా చర్చించాం. రీషెడ్యూల్ విషయమై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాం. అయినా, వర్కౌట్ కాలేదు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా టి20 లీగ్‌కు గ్రేమ్ స్మిత్ కమిషనర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా సెప్టెంబరులో టీమిండియా పర్యటనకు రానున్నట్లు బీసీసీఐ బుధవారం ధ్రువీకరించింది. భారత్‌లో ప్రొటిస్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చదవండి: South Africa T20 League: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్ తలపిస్తోంది Zim Vs Ban: మరీ జింబాబ్వే చేతిలోనా.... అస్సలు ఊహించలేదు! మాకిది ఘోర అవమానం! -
WC 2023: దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి అవుట్?!
ICC ODI World Cup 2023: దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రొటిస్ ప్రపంచకప్-2023 టోర్నీ అర్హత అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకునే పరిస్థితులు తలెత్తిన తరుణంలో వరల్డ్‌కప్ ఈవెంట్లో నేరుగా అడుగుపెట్టే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17 వరకు ప్రొటిస్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, తమ దేశంలో కొత్తగా టీ20 దేశవాళీ క్రికెట్ లీగ్ నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా దక్షిణాఫ్రికా బోర్డు.. ఆసీస్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. అస్సలు కుదరదు! కానీ, ఇప్పటికే కంగారూల క్యాలెండర్ వివిధ అంతర్జాతీయ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా రీషెడ్యూల్ చేసేందుకు వీలుపడదని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రొటిస్ బోర్డు ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్‌లీగ్ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు మెగా ఈవెంట్ ఎంట్రీ సంక్లిష్టతరం కానుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి ప్రొటిస్ జట్టు అవుట్?! సూపర్‌లీగ్‌లో టాప్-8లో నిలిచిన జట్లు ఈ ఈవెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. దక్షిణాఫ్రికా పరిస్థితి ఇలా ఉంటే ఆస్ట్రేలియా ఇప్పటికే 70 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. జింబాబ్వేతో టూర్ నేపథ్యంలో మరో మూడు వన్డేలు ఆడనుంది కూడా! దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు చేసుకున్న కారణంగా కంగారూలకు పెద్దగా నష్టమేమీ లేదు! ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ.. ‘‘జనవరిలో జరగాల్సిన వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా తప్పుకోవడం నిరాశ కలిగించింది.అయితే, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మాత్రం యథావిథిగా జరుగుతుంది. మా షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగానే వన్డే సిరీస్‌ను రీషెడ్యూల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు. పూర్తిగా తప్పుకొన్నట్లేనా? కాదు! మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్ పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్ రౌండ్‌కు నెదర్గాండ్స్ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్‌లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్ వరల్డ్‌కప్- 2023 క్వాలిఫికేషన్ రేసులో నిలిచింది. మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్ రౌండ్ నిర్వహిస్తున్నారు. ఇక ఆతిథ్య దేశం భారత్ ప్రపంచకప్-2023కి నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టాప్-8 స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. కాబట్టి దక్షిణాఫ్రికా గనుక టాప్-8లో స్థానం దక్కించుకోలేకపోతే నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది. ఇందుకోసం అసోసియేట్ దేశాలతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో విజయం సాధించిన రెండు జట్లు రేసులో నిలుస్తాయి. చదవండి: IND VS ENG 1st ODI: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. బంతి తగిలి చిన్నారికి గాయం Jasprit Bumrah: ఇంగ్లండ్ బ్యాటర్లను ఉతికి ‘ఆరే’సిన బుమ్రా.. అద్భుతం అంటూ వారిని ట్రోల్ చేసిన భార్య సంజనా! -
ప్రపంచకప్ ఫైనల్ చేరే జట్లు అవే: డూప్లెసిస్
మాంచెస్టర్: ప్రపంచకప్ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు తలపడతాయని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ జోస్యం చెప్పాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డూప్లెసిస్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాపై గెలుపు తమకన్నా ఎక్కువగా భారత్ సంతోషిస్తుందన్నాడు. భారత్-ఇంగ్లండ్ జట్లే ఫైనల్లో తలపడుతాయని, కీలక మ్యాచ్‌లను ఆసీస్, భారత్‌లు అద్భుతంగా ఆడుతాయన్నాడు. కీలక పరిస్థితుల్లో తాను ఎదో ఒక జట్టుకు మద్దతుగా నిలవక తప్పదన్నాడు. ఇక వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్ ఓటమితో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సెమీస్ ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఖరారు కాగా.. ఆసీస్.. ఇంగ్లండ్‌తో ఆడనుంది. గూగుల్ సీఈవో నోట అదే మాట.. క్రికెట్ డైహార్డ్ ఫ్యాన్, గూగుల్ సీఈవో సుంధర్ పిచాయ్ సైతం ఫైనల్లో తలపడేవి భారత్- ఇంగ్లండేనని తెలిపారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కూడా బలమైన జట్లేనని, కానీ వీటితో జరిగే పోరులో ఇంగ్లండ్, భారత్‌లే పైచేయి సాధిస్తాయని పేర్కొన్నారు. -
దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓటమి
-
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు సఫారీలనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 315 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (122) శతకంతో చెలరేగగా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ( 85) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (100: 94 బంతుల్లో), డస్సెన్ (95: 97 బంతుల్లో) అద్భుతంగా ఆడి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో డూప్లెసిస్ సేన మెగాటోర్నీకి ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. ఆసీస్ రెండోస్థానానికి పరిమితమైంది. -
ఫుల్‌గా తాగి.. 175 బాదిన బ్యాట్స్‌మన్
వన్డే క్రికెట్ చరిత్రలో 12/3/2006 తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. సరిగ్గా ఇదే తేదీన దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలో 400కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి.. ఈ అరుదైన ఘనతను సఫారీలు సొంతం చేసుకోవడం వెనుక చిచ్చరపిడుగు హెర్షల్లీ గిబ్స్ పాత్ర ఉంది. జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్ చెలరేగిపోయాడు. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు. అయితే, గిబ్స్ సాధించిన అరుదైన ఈ ఫీట్ వెనుక ఉన్న ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వన్డే మ్యాచ్‌కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్ హ్యాంగోవర్ స్థితిలో గిబ్స్ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ హ్యాంగోవర్‌తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గిబ్స్ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగానని గిబ్స్ పేర్కొన్నాడు. సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్కు ఆ హ్యాంగోవర్ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌లో గిబ్స్ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది.


