సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ.. ఆసీస్‌ను రక్షించిన బ్యాడ్‌లైట్‌ | Bad Light Stops Play-AUS Lose-6 Wickets-Vs SA-1st Test-Day-1-Stumps | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ.. ఆసీస్‌ను రక్షించిన బ్యాడ్‌లైట్‌

Oct 9 2026 7:44 PM | Updated on Oct 9 2026 8:02 PM

Bad Light Stops Play-AUS Lose-6 Wickets-Vs SA-1st Test-Day-1-Stumps

Photo Credit: Twitter

డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా రెండు సెషన్లు పూర్తయిన తర్వాత ఆటను నిలిపివేశారు. అయితే తొలిరోజు ఆట‌లో సౌతాఫ్రికా బౌల‌ర్లు చెల‌రేగారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో రోజు ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 187 ప‌రుగులు చేసింది. 

మాట్ రెన్‌షా (46 నాటౌట్‌), కెప్టెన్ పాట్ క‌మిన్స్ (33 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్‌, వియాన్ ముల్డ‌ర్‌, నోర్ట్జే త‌లా 2 వికెట్లు తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఏ ద‌శ‌లోనూ క‌లిసిరాలేదు. ఓపెన‌ర్లిద్ద‌రు తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరగా, ల‌బుషేన్ (37), స్మిత్ (25) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, భారీ స్కోర్లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. 

ఆ త‌ర్వాత వ‌చ్చిన వికెట్ కీప‌ర్ అలెక్స్ క్యారీ (14), బ్యూ వెబ్‌స్ట‌ర్ (4) కూడా తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేర‌డంతో 124 ప‌రుగుల వ‌ద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక అంత‌క‌ముందు ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్ నిక్ మాడిస‌న్ 33 బంతులాడి ప‌రుగులేమి చేయ‌కుండానే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. 

దీంతో టెస్టు క్రికెట్‌లో లాంగెస్ట్ డ‌కౌట్ (బంతుల ప‌రంగా) అయిన మూడో బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇక స్టీవ్ స్మిత్ ఆసీస్ దిగ్గ‌జం స్టీవ్ వా రికార్డును బ‌ద్ద‌లుకొట్టి టెస్టు క్రికెట్‌లో ఆసీస్ త‌ర‌ఫున‌ అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement