‘నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్‌’ | Aaryavir Sehwag Reveals His-Cricket Idol-Its-Not Virender Sehwag | Sakshi
Sakshi News home page

Aaryavir Sehwag: ‘నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్‌’

Nov 24 2026 9:26 AM | Updated on Nov 24 2026 9:29 AM

Aaryavir Sehwag Reveals His-Cricket Idol-Its-Not Virender Sehwag

Photo Credit: Twitter

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన ఫేవరెట్ క్రికెటర్ తన తండ్రి కాదని, విరాట్ కోహ్లీ అని వెల్లడించాడు. ఇటీవల జరిగిన 2026 అండర్-19 ఆసియా కప్ (U-19 Asia Cup) టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎగరేసుకుపోయిన ఆర్యవీర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లి తన ఆరాధ్య క్రికెటర్ అని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడటం కోహ్లిని చూసే నేర్చుకున్నానని ఆర్యవీర్ తెలిపాడు. తాను సెహ్వాగ్ 2.0 అనిపించుకోవడానికి ఇక్కడకు రాలేదని మరోసారి చెప్పుకొచ్చాడు. ఆర్యవీర్ సెహ్వాగ్‌గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు వెల్లడించాడు. 

అయితే తండ్రితో పోలిస్తే ఆర్యవీర్ ఆటలో పోలికలు వేరుగా ఉన్నాయి. సెహ్వాగ్ తరహాలో వచ్చీ రాగానే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడమే కాదు, పిచ్ పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం ఆర్యవీర్ శైలి. అండర్‌-19 ఆసియా కప్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.

ఇటీవల అండర్‌-19 ఆసియా కప్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆర్యవీర్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో 5 మ్యాచ్‌లాడిన ఆర్యవీర్ 90.25 సగటుతో 361 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్థసెంచరీలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్యవీర్‌ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు. 

ముఖ్యంగా ఉత్కంఠగా సాగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 58 పరుగులు చేసిన ఆర్యవీర్ మ్యాచ్‌ హీరోగా నిలిచాడు. రాబోయే దేశవాళీ క్రికెట్‌తో పాటు  అండర్-19 ప్రపంచకప్ జట్టులో స్థానమే లక్ష్యంగా ఆర్యవీర్ సిద్ధమవుతున్నాడు.

ఇదీ చదవండి: IND Vs UAE: యూఏఈతో మ్యాచ్‌.. గెలిస్తేనే సెమీస్‌కు తిల‌క్ సేన‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement