చీలమండ ఫ్రాక్చర్‌ గురించి ‘శివగామి’ ఆసక్తికర వ్యాఖ్యలు..! | Ramya Krishnan: revealed she underwent ankle fusion surgery | Sakshi
Sakshi News home page

Ramya Krishnan: చీలమండ ఫ్రాక్చర్ సర్జరీ తర్వాతే ఆ సన్నివేశాలు..! నటి రమ్యకృష్ణ షాకింగ్‌ వ్యాఖ్యలు

Nov 23 2026 5:09 PM | Updated on Nov 23 2026 5:17 PM

Ramya Krishnan: revealed she underwent ankle fusion surgery

56 ఏళ్ల నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెగిటివ్‌ పాత్రలోనూ తనదైన రీతీలో ప్రేక్షకులను మెప్పించి అశేష అభిమానులను సంపాదించుకున్న నటి. ఆ తర్వాత యువ హీరోయిన్లకు అత్త, అమ్మ పాత్రల్లో సైతం మెప్పిస్తూ పేరుతెచ్చుకుంటున్న ప్రముఖ నటి ఆమె. ముఖ్యంగా బాహుబలి మూవీలో ప్రభాస్‌ తల్లి శివగామిగా నటించి..మరింత ఫేమస్‌ అయ్యిందామె. అలాంటి అందాల నటి రమ్యకృష్ణ సైతం చీలమండ ఫ్రాక్చర్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అలాంటి గాయం నుంచి కోలుకోవడం ఎంత కష్టమో చెప్పుకొచ్చింది. తాను చాలా చిన్న వయసులో ఆ సమస్యను ఎదుర్కొన్నాని,  సర్జరీ కూడా చేయించుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలేంటి చీలమండ ఫ్రాక్చర్ సర్జరీ, కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఇదివరకటిలా కాలుని కదపలేరా అంటే..

Actor Ramya Krishnan Reveals serious ankle injury: నటి రమ్యకృష్ణ తనకు 1987లో కుడికాలు ఫ్రాక్చర్‌కు గురైందని దానికి చీలమండల కీలును ఫ్యూజ్‌ చేసే శస్త్ర చికిత్స అవసరమైందని గుర్తుచేసుకున్నారు. అక్కడ కీలు లేదని, ఎక్స్‌రే తీసి చూస్తే స్పష్టంగా చూస్తే తెలుస్తుందని అన్నారామె. ఆ ఫ్రాక్చర్‌తో మాములుగా నడవడం కూడా ప్రశ్నార్థకమేనని, ఆర్థోపెడిక్‌ సర్జన్లు కూడా చెబుతారని చెప్పుకొచ్చింది. అయితే ఆ సర్జరీ తర్వాత నృత్యాలకు సంబంధించిన పాటలు, శ్రమతో కూడిన సన్నివేశాలు చేశానని చెప్పుకొచ్చింది. తాను సంకల్ప బలంతో ఆ సమస్యను అధిగమించానని అన్నారామె. అసలు ఏంటి చీలమండ పగులు అంటే..

చీలమండ పగులు అంటే..
చీలమండ పగులు అంటే చీలమండ కీలును ఏర్పరిచే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు విరగడం. వీటిలో టిబియా (దీనిని షిన్‌బోన్ అని కూడా అంటారు), ఫైబులా (కాలి కింది భాగం వెలుపలి వైపున ఉండే చిన్న ఎముక), టాలస్‌(కాలిని పాదాన్న కలిపే ఎముక) ఉంటాయి. కొన్ని ఫ్రాక్చర్లు సాపేక్షంగా సంక్లిష్టత లేనివి అయినప్పటికీ, తీవ్రమైన గాయాలలో ఎముకలు స్థానభ్రంశం చెందడం, కీలు ఉపరితలం దెబ్బతినడం, లింగమెంట్‌ గాయాలు ఉండవచ్చు. అయితే ఇక్కడ ఫ్యాక్చర్‌ని బట్టి చికిత్స ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుందని అన్నారు.

చిన్న ఫ్రాక్చర్లు ప్లాస్టర్ లేదా వాకింగ్ బూట్ ఉపయోగించి కదలకుండా ఉంచడం ద్వారా నయం కావచ్చు అని అన్నారు. ఇది  కాలక్రమేణా ఎముక తనంతట తానుగా మరమ్మత్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే గణనీయంగా స్థానభ్రంశం చెందిన లేదా కీలు దెబ్బతిన్న ఫ్రాక్చర్లకు సర్జరీ అవసరమని అన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్లు విరిగిన ఎముకలను తిరిగి సరైన స్థానంలోకి తీసుకురావడానికి, అలాగే నయమయ్యే వరకు వాటిని ఆ స్థితిలో ఉంచడానికి ప్లేట్లు, స్కూలు లేదా ఇతర ఫిక్సేషన్ పరికరాలను ఉపయోగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

చీలమండ ఫ్యూజన్ శస్త్రచికిత్స అంటే..
యాంకిల్ ఫ్యూజన్ (వైద్య పరిభాషలో ఆర్థ్రోడెసిస్) అనేది ఒక శస్త్రచికిత్సా ప్రక్రియ. దీనిలో చీలమండ కీలును ఏర్పరిచే ఎముకలను శాశ్వతంగా కలిపివేస్తారు. దీనివల్ల దెబ్బతిన్న కీలు వద్ద కదలిక ఉండదు. కీలు తీవ్రంగా దెబ్బతిని, దానిని సరిగ్గా పునర్నిర్మించలేనప్పుడు యాంకిల్ ఫ్యూజన్‌ను సిఫార్సు చేస్తారని చెబుతున్నారు నిపుణులు. వివరిస్తున్నారు. 

ఈ ప్రక్రియలో దెబ్బతిన్న కీలు ఉపరితలాల మధ్య కదలికను నివారించడం ద్వారా, దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడానికి, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే, యాంకిల్ ఫ్యూజన్ సాధారణ చీలమండ పనితీరును పునరుద్ధరించదు. కీలు శాశ్వతంగా కలిసిపోయి ఉంటుంది కాబట్టి, రోగులు మునుపటిలా చీలమండలను కదిలించే సామర్థ్యాన్ని కోల్పోతారట. 

మెట్లు ఎక్కడం, ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలాలపై నడవడం, పరుగెత్తడం, నృత్యం చేయడం వంటి చీలమండ కార్యకలాపాలు మరింత సవాలుగా మారతాయని అన్నారు. ఇక్కడ పాదంలోని చుట్టుపక్కల కీళ్ళు, కోల్పోయిన కదలికను కొంతవరకు భర్తీ చేసి, రోగులు తమ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది.

కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే..
చీలమండ పగులు శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం అనేది గాయం తీవ్రత, చేసిన శస్త్రచికిత్సా విధానం, రోగి వయస్సు, ఎముకల ఆరోగ్యం,  మొత్తం శారీరక పరిస్థితి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రారంభ రికవరీలో సాధారణంగా నొప్పి, వాపును నియంత్రించడం, ఆపరేషన్ చేసిన ప్రాంతాన్ని రక్షించడం, కోలుకుంటున్న ఎముకలపై అనవసరమైన ఒత్తిడిని నివారించడంపై దృష్టి పెట్టాలన్నారు.. 

కొంతకాలం పాటు ప్రభావితమైన కాలుపై బరువు పెట్టకుండా ఉండమని రోగులకు సూచనలిస్తారని అన్నారు. బరువు మోయకుండా పరిమితం చేయాల్సిన కాలవ్యవధి, ఫ్రాక్చర్ తీరు, శస్త్రచికిత్స సమయంలో సాధించిన స్థిరత్వం తదితర అంశాలు కోలుకోవడంపై ఆధారపడి ఉంటాయట. 

ఎముకలు అతుక్కోవడానికి సాధారణంగా ఆరు నుంచి 12 వారాలు పడుతుందట. అయితే పూర్తి కార్యాచరణ రికవరీకి చాలా నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఒక్కోసారి ఈ చీలమండ ఫ్యూజన్ చేయించుకున్న రోగులకు, ఎముకలు పూర్తిగా అతుక్కోవడానికి అదనపు సమయం అవసరం కావచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఫిజియోథెరపీ ఎందుకు తప్పనిసరి..
చీలమండ ఫ్రాక్చర్ లేదా చీలమండ ఫ్యూజన్ తర్వాత కోలుకోవడంలో ఫిజియోథెరపీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎక్కువ కాలం కదలకుండా ఉండటం, కదలిక పరిమితం కావడం వల్ల కండరాల బలహీనత, బిగుతు, సమతుల్యత తగ్గడం వంటివి సంభవించవచ్చు. అదే ఫిజియోథెరటి తీసుకుంటే పిక్క, తొడ, తుంటి వంటి కండరాలు బలోపేతం అవ్వడమే కాకుండా సమతుల్యత మెరుపడుతుందట. 

ఫ్యూజ్ చేయబడిన కీలు దాని అసలు కదలికను తిరిగి పొందలేదు. అందువల్ల ఫిజియోథెరపీ తీసుకుంటే.. తొందరగా రికవరీ అయ్యే ఛాన్సులు ఉంటాయని అంటున్నారు. వైద్యుల సలహాలు సూచలను మేరకు వ్యాయామాలు, బరువులు మోయడం వంటి కార్యకలపాలు చేయాలట. అలాగే వైద్యులు పూర్తిగా కోలుకున్నారని నిర్థారించక గానీ శ్రమతో కూడిన శారీరక కార్యకలాపాలకు తిరిగి వెళ్ల కూడదని హితవు చెబుతున్నారు నిపుణులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement