కవలల ప్రసవం తర్వాత కోలుకోవడంపై..ఉపాసన భావోద్వేగం! | Health Tips: Upasana Konidela shared Postpartum Recovery After Twins | Sakshi
Sakshi News home page

Upasana Konidela: కవలల ప్రసవానంతరం తీవ్ర సమస్యలు..కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన

Nov 18 2026 1:18 PM | Updated on Nov 18 2026 1:26 PM

Health Tips: Upasana Konidela shared Postpartum Recovery After Twins

Upasana Konidela Discussing Postpartum Recovery: ప్రసవించడం ఒక ఎత్తు అయితే..ఆ తర్వాత తల్లిగా కోలుకోవడం అంతకుమించిన సవాలు. ఆ విషయాన్నే పంచుకుంది టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసింది. ఆ కవలల ప్రసవనంతరం తాను ఎదుర్కొన్న సమస్యల గురించి సోషల్‌మీడియా వేదికగా మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది ఉపాసన. 

ఈ మేరకు పోస్ట్‌లో ఆ జర్నీ గురించి మాట్లాడుతూ..తన రెండో గర్భధారణ అంత సులభం కాలేదన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందన్నారు. ఎందుకంటే నవ్వుతున్న తన ముఖం వెనుక కోలుకుంటున్న ఒక తల్లి ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. రెండోవ ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా గడిచిందన్నారు. ఆ గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నానని అన్నారామె. 

ప్రసవానంతరం చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని అవి తనను ఊహించని విధంగా కుదిపేశాయని గద్గత స్వరంతో చెప్పుకొచ్చారామె. ఒక తల్లిగా ఇంకా కోలుకుంటున్న దశలో ఉన్నానని, ఆ సమయంలో తనకు మద్దతిచ్చిన తన వైద్యుల బృందానికి ధన్యావాదాలు చెబుతున్నానని చెప్పారు. దయచేసి నాల్గవ త్రైమాసికం కాబోయే తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని కోరారామె. 

అలాగే ఆ కష్టమైన దశలో మార్గనిర్దేశం చేసిl ఐదుగురు నిపుణుల పేర్లను కూడా పంచుకున్నారు. తాను సంతాన సాఫల్య నిపుణుడు, గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, నియోనాటాలజిస్ట్, సైకాలజిస్టుల సేవలను తీసుకున్నట్లు చెప్పారు. దీన్ని విలాసవంతంగా చూడొద్దు..ఇది ప్రతి పేరెంట్స్‌కి అవసరమని అన్నారామె. 

ఇక తన భర్త రామ్‌చరణ్‌ గురించి ప్రస్తావిస్తూ..ఈ ప్రయాణంలో తనకు అన్ని విధాల ఆయన అండగా నిలిచారని, అలాంటి భాగస్వామిని పొందడం నిజంగా తన అదృష్టం అంటూ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే ప్రసవానంతర దశ అంతటా కాబోయే తల్లిదండ్రులు తమలో తాము కుంగిపోగుకుండా, వ్యక్తులుగా, పేరెంట్స్‌గా ఒకరికొకరు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని సూచించారామె. 

 

ఇదీ చదవండి: అమ్మ చేస్తే అభినందించరు.. కానీ నాన్న చేస్తే..! : పిల్లల పెంపకంపై ఉసాసన కొణిదెల షాకింగ్‌ వ్యాఖ్యలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement