ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు..బాధగాఉంది: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌ | Chiranjeevi Funny Comments On Venky Kudumula, Video Viral | Sakshi
Sakshi News home page

దూరంగా ఉండు.. నా దగ్గరకు వచ్చే అర్హత లేదు: వెంకీపై చిరు ఫన్నీ కామెంట్స్‌!

Nov 18 2026 1:05 PM | Updated on Nov 18 2026 1:14 PM

Chiranjeevi Funny Comments On Venky Kudumula, Video Viral

చిరంజీవి ఏ ఈవెంట్‌కి వెళ్లిన సరే..కాస్త కామెడీగానే మాట్లాడతాడు. తాను చెప్పాలనుకునే విషయాన్ని సున్నితంగా చెబుతూ.. అందరిని నవ్విస్తాడు కూడా. తాజాగా ఇట్లు అర్జున్‌  సినిమా సక్సెస్‌ మీట్‌కి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరంజీవి..వెంకీ కుడుములపై చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నిన్న(నవంబర్‌ 17) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఇట్లు అర్జున చిత్రబృందం సక్సెస్‌ మీట్‌ని నిర్వహించింది. ఈ  సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన వెంకీ కుడుములతో పాటు హీరో, హీరోయిన్లు, టెక్నిషియన్లు అంతా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఇక ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన నాగార్జునతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

(చదవండి: : సడన్‌గా ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఒకరకంగా చాలా బాధగా ఉంది. ఆయన కామెడీ సెన్స్‌ బాగుంటుంది.  . అది నాకు బాగా నచ్చుతుంది. ఆయన సినిమాలు చూశాను. నేను ఎవరినీ నాతో సినిమా చేస్తావా అని అడగలేదు. కానీ ఈ దుర్మార్గుడిని మాత్రం అడిగాను. మంచి కథతో వస్తాను సర్ అని చెప్పాడు. అప్పటి నుంచి చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. 

ఆఖరికి నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇట్లు అర్జునకు నిర్మాతగా మారాడు. పోనీ నాతో సినిమా నిర్మిస్తాడా అంటే.. యంగ్ స్టర్స్ కావాలట’ అని చిరంజీవి చమత్కరించాడు. అయితే పక్కనే ఉన్న వెంకీ.. చిరు ఇలా మాట్లాడుతుండగా..దగ్గరకు రాబోయాడు. ‘వద్దు..దూరంగా ఉండు. నా దగ్గరకు వచ్చే అర్హత నీకు లేదు. మా ఇంటి గెట్లు మూసేసి ఉంటాయి’ అని చిరు సరదాగా అనగా..   ‘మీరు తలుపులు మూసేసినా.. నేను దూకి వస్తా సర్’ అంటూ బదులిచ్చారు. వెంకీ సమాధానంతో వేదిక మొత్తం నవ్వులతో మార్మోగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement