ప్రముఖ స్టార్ నటి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాలీవుడ్‌కు చెందిన అన్నా హాత్‌వే లేటు వయసులో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్థానిక న్యూయార్క్ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌లో ప్రెగ్నెన్సీ ప్రకటించిన ఆమె.. తాజాగా బిడ్డకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆమె వయస్సు 44 ఏళ్లుగా తెలుస్తోంది.
కాగా.. 2012లో అన్నా హాత్‌వే.. ఆడమ్ సుల్మాన్‌ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇప్పటికే 10 ఏళ్ల జొనాథన్, 6 ఏళ్ల జాక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నటి హాత్‌వే ఈ ఏడాది క్రిస్టోఫర్ నోలన్ తెరెకెక్కించిన ది ఓడిస్సీ మూవీలో కనిపించారు. ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. జూలై 14న 'ది ఒడిస్సీ' న్యూయార్క్ ప్రీమియర్ షోలోనూ అన్నా హాత్ వే సందడి చేశారు. కాగా.. ఈ హాలీవుడ్ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 2న విడుదలైంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆమె వెరైటీ అనే మరో చిత్రంలోనూ నటించింది.


