మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న మూవీ కాకా. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి వీరిద్దరు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా కాకా గురించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు. ఇట్లు అర్జున్ సక్సెస్ మీట్‌కు హాజరైన చిరంజీవి కాకాపై మాట్లాడారు.
ఎక్కడికెళ్లినా తమన్ ఈ మధ్య ప్రధానంగా కాకా గురించే మాట్లాడుతున్నాడని మెగాస్టార్ సరదాగా అన్నారు. ఇక్కడ నీకు ఒక ప్రమాదం పొంచి ఉందంటూ తమన్‌కు షాకిచ్చాడు చిరంజీవి. ఏ ఈవెంట్‌కు వెళ్లినా వాళ్ల సినిమా గురించి చెప్పట్లేదని ఫీలవుతారని తమన్‌కు సూచించారు. మిగతావాళ్లు మా మూవీ గురించి చెప్పట్లేదు..కాకానే కేకనా అని అడుగుతున్నారని మెగాస్టార్ సరదాగా చెప్పారు. కానీ తమన్ చెప్పేదే వందశాతం కరెక్టే.. కాకాతో కచ్చితంగా కొడతాం అంటూ మెగాస్టార్ ధీమా వ్యక్తం చేశారు. ఇది చూసిన డైరెక్టర్ బాబీ.. కాకానే చెప్పేశాడుగా అంటూ పోస్ట్ చేశాడు. తాజాగా మెగాస్టార్ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Definitely కొడతాం 😎🔥 That’s the statement from our #KAAKA Megastar @KChiruTweets garu 💥 JAN 13th Sankranthi 2027❤️🔥 #KAAKAOnJan13 https://t.co/iREEOcE75Z
— Kaaka (@KaakaMovie) November 17, 2026


