వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్
వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’. ఆశిష్ విద్యార్థి, శ్రేయా శర్మ కీలక పాత్రల్లో నటించారు. అంకుర్ పజ్ని, విశాల్ రంజన్ మిశ్రా ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది.
‘రెండు ముఖాలు... ప్రమాదకరమైన వ్యామోహం’ అన్న క్యాప్షన్‌తో మంగళవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. భార్యాభర్తల మధ్య నెలకొన్న అపనమ్మకం, కుట్ర, వ్యామోహం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది.


