గోపీచంద్ ప్రస్తుతం సినిమాలైతే చేస్తున్నాడు గానీ హిట్ అనేది చూసి చాలా ఏళ్లయిపోయింది. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే చేస్తుండేసరికి జనాలు కూడా ఇతడి గురించి మర్చిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో గోపీచంద్ మళ్లీ విలన్‌గా చేస్తున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఇది నిజమేనా?
(చదవండి: హాలీవుడ్ సినిమా.. కానీ ఇంతింత రేట్లా?)
గోపీచంద్.. విలన్ పాత్రలతోనే కెరీర్ మొదలుపెట్టాడు. జయం, నిజం, వర్షం చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో అదరగొట్టేశాడు. ఇప్పటికీ ఈ మూవీస్ చూస్తే గోపీచంద్ నచ్చేస్తాడు. హీరోగా మారిన తర్వాత విలన్ రోల్స్ పూర్తిగా దూరం పెట్టేశాడు. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ సినిమా అయితేనే విలన్ పాత్ర చేస్తానని అన్నాడు. కానీ ఇప్పుడు తమిళ హీరో సూర్య కొత్త మూవీలో గోపీచంద్ విలన్‌గా చేస్తున్నాడనే రూమర్ బయటకొచ్చింది.
ఈ ఏడాది కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్, సీన్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సూర్య.. ప్రస్తుతం తనతోనే 'జై భీమ్' తీసిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ మిల్లర్, డిసి చిత్రాలతో మెప్పించిన అరుణ్ మాతేశ్వరన్‌తోనూ సూర్య కలిసి పనిచేయనున్నాడనే వార్త బయటకొచ్చింది. ఈ ప్రాజెక్టులోనే విలన్‌గా గోపీచంద్‌ని అనకుంటున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: గుడిలో పూజలు.. ప్రభాస్ వీడియో ఇప్పుడెందుకు వైరల్?)


