పెళ్లికాని అబ్బాయి చేస్తే తప్పులేదు కానీ అమ్మాయి చేస్తే తప్పా?: నటి ఫైర్‌ | Bhojpuri Actor Akshara Singh Hits Back At Trolls Questioning Her Chhath Puja Rituals | Sakshi
Sakshi News home page

పెళ్లికాని అబ్బాయి చేస్తే తప్పులేదు కానీ అమ్మాయి చేస్తే తప్పా?: నటి ఫైర్‌

Nov 17 2026 4:44 PM | Updated on Nov 17 2026 4:52 PM

Bhojpuri Actor Akshara Singh Hits Back At Trolls Questioning Her Chhath Puja Rituals

పెళ్లి కాలేదని ఛఠ్‌ పూజ చేయకూడదా?.. విమర్శలపై అక్షర సింగ్ కౌంటర్

ఛఠ్‌ పూజ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలపై భోజ్‌పురి నటి అక్షర సింగ్ స్పందించింది. అవివాహిత పురుషులు ఈ పూజలు చేస్తే ఎలాంటి ప్రశ్నలు ఉండవు కానీ.. మహిళల విషయంలో మాత్రం పెళ్లి ప్రస్తావన ఎందుకు వస్తోందని అక్షర నిలదీసింది.

ఇటీవల ఛఠ్‌  పూజ సందర్భంగా అక్షర సింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఆమె నీటిలో నిలబడి పూజలు చేస్తూ కనిపించింది. అలాగే నుదుటిపై ఆరెంజ్ రంగు సిందూరంతో ఆమె కనిపించడంపై కూడా కొందరు నెటిజన్లు స్పందించారు. అవివాహిత మహిళగా అక్షర సింగ్ ఛఠ్‌ పూజ ఎలా చేస్తారంటూ ఆమెను విమర్శిస్తూ కామెంట్స్‌ పెట్టారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా ఈ విమర్శలపై అక్షర సింగ్‌ స్పందించింది.  తాను చత్ మయ్యకు పూజ చేస్తే..కొందరు తన పెళ్లి గురించి ఆందోళన పడుతున్నారంటూ ఇన్‌స్టా స్టోరీలో వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టింది.

(చదవండి: అల్లు ‍అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్)

“నేను చత్ మయ్యకు పూజ చేస్తే.. కొంతమంది నా పెళ్లి గురించి ఆరా తీస్తున్నారు. పెళ్లికాని అబ్బాయి ఛఠ్‌పూజ చేయొచ్చంటే.. పెళ్లికాని అమ్మాయి ఎందుకు చేయకూడదు? దీనికి సరైన సమాధానం ఉంటే దయ చేసిన నాకు చెప్పండి. నేను తప్పకుండా వింటాను’ అని అక్షర తన పోస్ట్‌లో పేర్కొంది.

అంతేకాదు, తన మత విశ్వాసాలపై తీర్పులు చెప్పే హక్కు ఇతరులకు ఎవరు ఇచ్చారని కూడా ఆమె ప్రశ్నించింది. తనకు ఏ పద్ధతిలో పూజలు చేయాలో, తన విశ్వాసాలను ఎలా పాటించాలో నిర్ణయించే అధికారం ఇతరులకు లేదని స్పష్టం చేసింది.

అక్షర సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మహిళల మతపరమైన ఆచారాలు, వివాహ స్థితి ఆధారంగా విధించే సామాజిక నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది. తనను విమర్శించిన వారికి అక్షర సింగ్ నేరుగా ప్రశ్నలు సంధించడంతో ఆమె స్పందనకు మద్దతుగా కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే..అక్షర సింగ్ ఇటీవల ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమాలోని ‘ఘిస్ ఘిస్ ఘిస్’ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement