breaking news
Akshara Singh
-
పెళ్లికాని అబ్బాయి చేస్తే తప్పులేదు కానీ అమ్మాయి చేస్తే తప్పా?: నటి ఫైర్
ఛఠ్ పూజ సందర్భంగా తనపై వచ్చిన విమర్శలపై భోజ్‌పురి నటి అక్షర సింగ్ స్పందించింది. అవివాహిత పురుషులు ఈ పూజలు చేస్తే ఎలాంటి ప్రశ్నలు ఉండవు కానీ.. మహిళల విషయంలో మాత్రం పెళ్లి ప్రస్తావన ఎందుకు వస్తోందని అక్షర నిలదీసింది.ఇటీవల ఛఠ్ పూజ సందర్భంగా అక్షర సింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఆమె నీటిలో నిలబడి పూజలు చేస్తూ కనిపించింది. అలాగే నుదుటిపై ఆరెంజ్ రంగు సిందూరంతో ఆమె కనిపించడంపై కూడా కొందరు నెటిజన్లు స్పందించారు. అవివాహిత మహిళగా అక్షర సింగ్ ఛఠ్ పూజ ఎలా చేస్తారంటూ ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ విమర్శలపై అక్షర సింగ్ స్పందించింది. తాను చత్ మయ్యకు పూజ చేస్తే..కొందరు తన పెళ్లి గురించి ఆందోళన పడుతున్నారంటూ ఇన్‌స్టా స్టోరీలో వ్యంగ్యంగా పోస్ట్ పెట్టింది.(చదవండి: అల్లు అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్)“నేను చత్ మయ్యకు పూజ చేస్తే.. కొంతమంది నా పెళ్లి గురించి ఆరా తీస్తున్నారు. పెళ్లికాని అబ్బాయి ఛఠ్‌పూజ చేయొచ్చంటే.. పెళ్లికాని అమ్మాయి ఎందుకు చేయకూడదు? దీనికి సరైన సమాధానం ఉంటే దయ చేసిన నాకు చెప్పండి. నేను తప్పకుండా వింటాను’ అని అక్షర తన పోస్ట్‌లో పేర్కొంది.అంతేకాదు, తన మత విశ్వాసాలపై తీర్పులు చెప్పే హక్కు ఇతరులకు ఎవరు ఇచ్చారని కూడా ఆమె ప్రశ్నించింది. తనకు ఏ పద్ధతిలో పూజలు చేయాలో, తన విశ్వాసాలను ఎలా పాటించాలో నిర్ణయించే అధికారం ఇతరులకు లేదని స్పష్టం చేసింది.అక్షర సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. మహిళల మతపరమైన ఆచారాలు, వివాహ స్థితి ఆధారంగా విధించే సామాజిక నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది. తనను విమర్శించిన వారికి అక్షర సింగ్ నేరుగా ప్రశ్నలు సంధించడంతో ఆమె స్పందనకు మద్దతుగా కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమాల విషయానికొస్తే..అక్షర సింగ్ ఇటీవల ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమాలోని ‘ఘిస్ ఘిస్ ఘిస్’ పాటలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
Akshara Singh: హీరోయిన్ షోపై రాళ్ల దాడి.. వీడియో వైరల్
భోజ్‌పురి ప్రముఖ నటి, గాయని అక్షర సింగ్ నిర్వహించిన ఓ లైవ్ షో స్వల్ప ఉద్రిక్తలకు దారి తీసింది. ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ని అదుపు చేసేందకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా..కొంతమంది తిరగబడి పోలీసులపై రాళ్ల దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హీరోయిన్ అక్షర సింగ్‌కి భోజ్‌పురిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి గాయని, డ్యాన్సర్ కూడా. తాజాగా అక్షర బిహార్‌లోని జౌరంగాబాద్ జిల్లాలో ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లింది. (చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే: సమంత) పేపర్ ప్రకటన ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. పెద్ద ఎత్తున ఆ షాపింగ్ మాల్కి తరలి వచ్చారు. కాస్త ఆలస్యంగా వచ్చిన అక్షర.. స్టైజ్‌పైకి వెళ్లి ఓ అద్భుతమైన పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ఫ్యాన్స్ మధ్య తోపులాట జరిగింది. దీంతో వారిని అదుపు చేసేకుందు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం అక్షర సింగ్‌ని అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో చాలా మంది అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు అక్షర సింగ్‌కి రక్షణ కవచంగా మారి అక్కడి నుంచి సేఫ్‌గా పట్నాకు తరలించారు. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి స్పందిస్తూ.. అక్షర చాలా ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకుందని, దీంతో అక్కడ ఉన్న జనం అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు. (చదవండి: ఏం చేస్తోందసలు.. యాక్టింగా? గుర్తుపట్టడం కష్టమే!) 2010లో విడుదలైన సత్యమేవ జయతే అనే భోజ్‌పురి సినిమాతో అక్షర సింగ్ వెండితెరకు పరిచయమయ్యారు. తనదైన నటనతో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్షరకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 2015లో కాల టీకా, సర్వీస్ వాలి బాహు అనే హిందీ టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. కొన్నాళ్ల తర్వాత సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో 2021లో బిగ్‌బాస్ ఓటీటీ వర్షన్లో పాల్గొంది. #Bhojpuri star Akshara Singh पर Fans ने फेंके पत्थर, बेकाबू भीड़ पर Police ने किया लाठीचार्ज#Akshara #AksharaSingh #BhojpuriSongs #Bihar #AksharaSinghNews #AksharaSinghSongs #AksharaSinghHot #BhojpuriNews #Bollywood #Bhojiwood #BhojpuriMovies #BhojpuriFilms #PawanSingh pic.twitter.com/hPwCDe784o — JAYANTIKA TRIPATHI (@Jayantika_t) January 18, 2024 It’s late cold but still fans in thousands came to sherni event in Daudnagar..that’s the love she has earned. Some Bollywood stars don’t have such craze as humari bhojpuri Queen @AKSHARASINGH1 . #Bollywood #Bhojpuri #AksharaSingh #BiggBoss 🔥🔥🔥🔥 pic.twitter.com/z73tBwHKdB — Sherni Akshara Fan (@queen_twirl3) January 17, 2024


