నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు: అమల అక్కినేని | Akkineni Amala About Sobhita And Zainab | Sakshi
Sakshi News home page

Amala akkineni: ‘ఇప్పుడు మా ఇంటి వాతావరణమే మారిపోయింది’

Nov 17 2026 4:15 PM | Updated on Nov 17 2026 4:34 PM

Akkineni Amala About Sobhita And Zainab

అక్కినేని కుటుంబంలోకి ఇద్దరు కోడళ్లు రావడంతో ఇంటి వాతావరణమే మారిపోయింది. ఆ ఇద్దరు అమ్మాయిలతో ఆ ఇంట్లో మహిళల సందడి మొదలైంది. ఇదే విషయాన్ని నటి అమల అక్కినేని తెలిపారు. నాగచైతన్య భార్య శోభిత, అఖిల్‌ భార్య జైనబ్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

ఇద్దరు కూతుళ్లు వచ్చారు
‘అత్తగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మా ఇంట్లో అందరూ మగవాళ్లే ఉండేవారు. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంట్లో మహిళల సందడి ఉండటం చాలా బాగుంది. శోభిత ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. అందరితోనూ సులభంగా కలిసిపోతుంది.

అప్పుడే జైనబ్‌ నచ్చింది..
అఖిల్‌ జైనబ్‌తో  ప్రేమలో ఉన్నప్పుడే నేను కలిశాను. అప్పుడే తను నాకు ఎంతో నచ్చింది. ఎంతో ప్రేమగా ఉంటుంది. ఆమె నాకు సొంత కూతురిలా అనిపిస్తుంది. తనకంటే ఎక్కువగా నా గురించి శ్రద్ధ తీసుకుంటుంది. నాగార్జునను కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. జైనబ్‌ వచ్చిన తర్వాత ప్రతి వేడుకనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం’ అని అమల తెలిపారు. 

(ఇదీ చదవండి: ప్లీజ్‌.. ఇంకెప్పుడు ఇలా ఈవెంట్‌కి రావద్దు సార్‌: ధనుష్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement