అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన తెలంగాణ ఫోక్ సింగర్ | Telangana Folk Singer Breaks Allu Arjun Record | Sakshi
Sakshi News home page

Ranu Bombaiki Ranu: అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ చేసిన ఫోక్ సింగర్

Nov 17 2026 1:32 PM | Updated on Nov 17 2026 1:37 PM

Telangana Folk Singer Breaks Allu Arjun Record

తెలంగాణ జానపద సంగీతానికి ఉండే గుర్తింపు కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఇప్పటికీ చాలా పాటలు య్యూట్యుబ్‌లో సంచలనం సృష్టించాయి. తాజాగా ‘రాను బొంబాయికి రాను’ ఫోక్‌ సాంగ్‌ అల్లు అర్జున్‌ రికార్ట్‌నే బ్రేక్‌ చేసింది. దీనిని రాము రాథోడ్‌, ప్రభ కలిసి పాడారు. 

విషయానికి వస్తే.
విషయానికి వస్తే.. ‘అలా  వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట రికార్డును ఈ జానపద గీతం అధిగమించింది. ‘బుట్టబొమ్మ’ సుమారు ఆరేళ్లలో 955 మిలియన్ల వ్యూస్‌ సాధించగా... ఇప్పుడీ ఫొక్‌ సాంగ్‌ ఆ వ్యూస్‌ను దాటి 956 మిలియన్ల వ్యూస్‌తో ముందంజలో నిలిచింది.  

దీంతో తెలంగాణ పల్లెపాట సత్తా మరోసారి ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  అయితే మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట 846 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా రాము బిగ్‌బాస్‌ సీజన్‌ 9లో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. 

(ఇదీ చదవండి: తెలుగు హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement