అల్లు ‍అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్ | Allu Aravind Introduces Allu Arjun's Sister at Pre Release Event | Sakshi
Sakshi News home page

Allu Aravind: అల్లు ‍అర్జున్ అక్క ఈమెనే.. పరిచయం చేసిన అల్లు అరవింద్

Nov 17 2026 11:36 AM | Updated on Nov 17 2026 11:40 AM

Allu Aravind Introduces Allu Arjun's Sister at Pre Release Event

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన తాజా చిత్రం ఆకాశంలో ఒక తార. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు.  ఈ మూవీలో శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ నవంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అల్లు అర్జున్‌తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్‌ కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపైకి వచ్చిన అల్లు అరవింద్.. ఈవెంట్‌కు వచ్చినందుకు అల్లు అర్జున్‌కు థ్యాంక్స్ అంటూ సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వేదికపై అల్లు అర్జున్‌ సిస్టర్‌ను అభిమానులకు పరిచయం చేశారు. అక్కడే ఉన్న విద్యను ఈమెనే అల్లు అర్జున్‌ అక్క అని అందరికీ షాకిచ్చారు. ‍అయితే ఆమె ఎవరనే విషయంపై అందరిలోనూ సస్పెన్స్ నెలకొంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement