పరమేశ్, సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న మూవీ ఐ హేట్ మ్యారేజ్. ఈ సినిమాకు పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మేడమ్, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్నారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత రోజుల్లో యువతను ఉద్దేశించి ఈ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లికి ముందు తీసుకునే తప్పుడు నిర్ణయాలు వాళ్ల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే కాన్సెప్ట్ ప్రధానంగా రూపొందించారు. ఈ రోజుల్లో అమ్మాయిల తమ జీవితాలను చేతులారా ఎలా నాశనం చేసుకుంటున్నారనే కథే ఈ మూవీ. ఈ సినిమాకు వరికుప్పల యాదగిరి సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ రాజ్, రవివర్మ అడ్డూరి, లోహిత్ కుమార్, ఆశ్రిత , ప్రభావతి, శ్రీదేవి, రాధా, ఇందు, అరుణ్ కుమార్ రెడ్డి, శృతి చిగురుపాటి, అఖండ సుధాకర్ రెడ్డి, మెయిల్ రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


