జేమ్స్‌బాండ్‌గా ‘బ్యాట్‌మన్‌’!  | Robert Pattinson revealed as new James Bond | Sakshi
Sakshi News home page

జేమ్స్‌బాండ్‌గా ‘బ్యాట్‌మన్‌’! 

Nov 17 2026 5:58 AM | Updated on Nov 17 2026 5:58 AM

Robert Pattinson revealed as new James Bond

లాస్‌ ఏంజెలెస్‌: తదుపరి జేమ్స్‌బాండ్‌ 007 ఎవరన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఆ ప్రపంచ ప్రఖ్యాత గూఢచారి పాత్రను ‘ద బ్యాట్‌మన్‌’ సినిమా హీరో రాబర్ట్‌ పాటిన్సన్‌ పోషించబోతున్నారు. ‘‘సినీ ప్రపంచంలోకెల్లా దిగ్గజ పాత్రలుగా చెప్పదగ్గవాటిలో జేమ్స్‌బాండ్‌ ఒకటి. అలాంటి పాత్ర చేయనుండటం జీవితకాల గౌరవం నాకు’’అంటూ ఒక ప్రకటనలో ఆయన హర్షం వెలిబుచ్చారు. తాజా జేమ్స్‌బాండ్‌ సినిమాను డెనిస్‌ విలెన్వే రూపొందిస్తున్నారు. 1962లో ‘డాక్టర్‌ నో’సినిమాతో జేమ్స్‌బాండ్‌ జైత్ర యాత్ర మొదలైంది. తొలి బాండ్‌గా సీన్‌ క్యానరీ అనితరసాధ్యమైన రీతిలో నటించి అలరించారు. తాజా మాజీ జేమ్స్‌బాండ్‌ డేనియల్‌ క్రెయిగ్‌ వరుసగా ఐదు సినిమాల్లో ఆ పాత్ర పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement