ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘అరుంధతి నక్షత్రం’ అనే టైటిల్ ఖరారైంది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మేఘ శెట్టి, మధు దామరాజు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డా. సూర్యకాంతి కూచిభొట్ల నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తొలి సన్నివేశానికి నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కెమెరా స్విచ్చాన్ చేసి, చిత్ర నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. సాయికుమార్ క్లాప్ ఇచ్చారు. ‘‘ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి.


