‘శంబాల’ వంటి హిట్ మూవీ తర్వాత ఆది సాయికుమార్, యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు కాంబినేషన్‌లో మరో సినిమా ఖరారైంది. ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని సమర్పణలో మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించనున్న ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
ఆది మంచి మాస్ రోల్ చేయనున్నట్లు ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘‘ఎమోషన్స్‌తో పాటు హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించనున్న చిత్రం ఇది. భయం, ఉత్కంఠ, అపరిమితమైన వినోదంతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా మా సినిమా ఉంటుంది. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కథ ఇది ’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల.


