కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయికుమార్‌.. అర్థం ఏంటంటే? | Aadi Sai Kumar Reveals His Son Name | Sakshi
Sakshi News home page

కొడుకు పేరు రివీల్ చేసిన ఆది సాయికుమార్‌.. అర్థం ఏంటంటే?

Mar 28 2026 7:41 PM | Updated on Mar 28 2026 7:49 PM

Aadi Sai Kumar Reveals His Son Name

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌-అరుణ దంపతులకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేసినట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. చిన్నారి ఫోటోని రివీల్‌ చేయలేదు కానీ.. పేరుని మాత్రం వెల్లడించారు. అతనికి ‘ఇషాన్‌ కార్తీక్‌’ అనే పేరు పెట్టారు.  ఈషాన్‌ అంటే శివుడు, కార్తీక్‌ అంటే.. కార్తీకేయ స్వామి. ఇలా ఇద్దరి దేవుళ్ల పేర్లు కలిసేలా తమ కొడుకు పేరును పెట్టుకున్నారు. 

శివుడితో పాటు కార్తికేయ స్వామి ఆశీస్సులతో తన కొడుకుకు ఇషాన్ కార్తీక్ అని పేరు పెట్టామని ఆది సాయికుమార్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఆది సాయికుమార్‌, అరుణల పెళ్లి 2014లో జరిగింది. అరుణ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఇప్పటికే  ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే కుమార్తె పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది జనవరి 2న పండంటి బాబుకు జన్మనిచ్చారు.

ఇక ఆది సాయికుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘శంబాల’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఈగో రాజా అనే సినిమా చేస్తున్నాడు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement