baby boy
-
మొదటి బిడ్డకు స్వాగతం పలికిన శామ్ ఆల్ట్మాన్ - ఫొటో వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.శామ్ ఆల్ట్మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్‌హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..శామ్ ఆల్ట్మాన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.— Satya Nadella (@satyanadella) February 22, 2025 -
కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
సింగర్ గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక (ఫోటోలు)
-
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్స్ జంట (ఫొటోలు)
-
బాల భీముడు
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ బుల్లితెర నటి.. పోస్ట్ వైరల్!
ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి దేవోలీనా భట్టాచార్జీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మాకు బాబు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. కాగా.. ఈ ఏడాది ఆగస్టు 15న దేవోలీనా భట్టాచార్జీ తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. డిసెంబర్ 2022లో తన జిమ్ ట్రైనర్ షానవాజ్ షేక్‌ను వివాహం చేసుకుంది.బాలీవుడ్లో దేవోలీనా భట్టాఛార్జీ పలు సీరియల్స్‌లో నటించింది. తాను చివరిసారిగా 'కూకి' అనే సీరియల్లో కనిపించింది. అంతకుముందు హిందీ బిగ్‌బాస్ సీజన్-2006లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. హిందీలో సాత్ నిబానా సాథియా అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు దేవోలీనా. ఆ తర్వాత యో హై మోహబ్బతీన్, స్వీట్ లై, చంద్రకాంత, తేరే షహర్ మే, శుభ్ వివాహ్ లాంటి సీరియల్స్‌లో నటించారు. View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన చిత్రా శుక్లా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. నాలుగు రోజుల క్రితం అంటే సెప్టెంబరు 30న రాత్రి 9:31 నిమిషాలకు బిడ్డ పుట్టాడని చెప్పారు. ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు బాబు పుట్టడం మరింత స్పెషల్ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)ఇండోర్‌కి చెందిన చిత్రా శుక్లా.. 2014 నుంచి సినిమాలు చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఈమె కెరీర్ మొదలైంది. 2017లో 'మా అబ్బాయి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. అలా రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంలో అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది డిసెంబరులో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మగబిడ్డని ప్రసవించింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ కొడుకు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా వాటిని చూసేయండి.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Chitra Shukla Upadhyay (@chitrashuklaofficial) -
అప్పుడే పుట్టిన పసికందు కిడ్నాప్.. నర్సు వేషంలో వచ్చి..
సాక్షి,కృష్ణాజిల్లా : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి కలకలం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు కిడ్నాప్‌కు గురైంది. నర్స్ వేషంలో వచ్చిన ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితులు, ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో నాలుగు గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.కిడ్నాప్ చేసిన మహిళ మచిలీ పట్నానికి చెందిన చెరుకురసం అమ్మే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. అయితే మహిళ అప్పుడే పుట్టిన చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను పెళ్లాడిన ముద్దగుమ్మ గతంలోనే ప్రెగ్నెన్సీని ప్రకటించింది. తాజాగా ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. బిడ్డను ఇంటికి తీసుకెళ్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను అమలా పాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈనెల 11 వ తేదీన బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. దాదాపు వారం రోజుల తర్వాత బిడ్డ పుట్టిన విషయాన్ని వెల్లడించింది. కాగా.. మైనా చిత్రం ద్వారా కోలీవుడ్‌లో పాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించింది. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో అభిమానులను మెప్పించింది. View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్
స్టార్ హీరో శివకార్తికేయన్ మూడోసారి తండ్రయ్యాడు. ఇతడి భార్య ఆర్తి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 2నే బిడ్డ పుట్టినప్పటికీ ఒక రోజు లేటుగా శివకార్తికేయన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తమిళ యువ నిర్మాత అరెస్ట్.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి)యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకార్తికేయన్.. '3' సినిమాతో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా మారి వరస హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ టైంలో 'మహావీరుడు', 'అయలాన్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడు.ఇకపోతే 2010లో తన బంధువుల అమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఈ జంటకు ఆరాధాన అనే అమ్మాయి, 2021లో గుగున్ అనే అబ్బాయి పుట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లు తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలోనే పలువురు శివకార్తికేయన్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)#BlessedWithBabyBoy ❤️❤️❤️ pic.twitter.com/LMEQc28bFY— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 3, 2024 -
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?
హీరోయిన్ యామీ గౌతమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. కొన్నిరోజుల ముందు తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పింది. అలానే పిల్లాడికి వేదవిద్ అని పేరు కూడా పెట్టినట్లు ఇన్ స్టా పోస్ట్‌తో వెల్లడించింది. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్)2010లో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో యామీ గౌతమ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత ఏడాదే 'నువ్విలా' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ తదితర తెలుగు సినిమాల్లో చేసింది. కానీ ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. గత ఏడేళ్ల నుంచి అక్కడే మూవీస్ చేస్తోంది.2019లో రిలీజైన 'ఉరి' చేస్తున్న టైంలో ఆ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌తో ప్రేమలో పడింది. అలా రెండేళ్ల పాటు రిలేషన్లో ఉన్న వీళ్లిద్దరూ 2021లో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్గా 'ఆర్టికల్ 370' చిత్రంతో హిట్ కొట్టిన యామీ.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పింది. ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. స్పందించిన నటి హేమ) View this post on Instagram A post shared by Aditya Dhar (@adityadharfilms) -
టీమిండియా క్రికెటర్ భార్య.. మోడల్ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ నటి
తెలుగు సీరియల్ నటి మహేశ్వరి మరోసారి తల్లయింది. మంగళవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ.. ఆడ మగ అనేది చెప్పకుండా అందరి చేతులతో తీసిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలా శుభవార్తని అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తోటి సీరియల్ నటీనటులు అందరూ మహేశ్వరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) 'వదినమ్మ', 'శశిరేఖా పరిణయం' సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్వరి.. ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లోనూ పాల్గొని ఆకట్టుకుంది. టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివనాగ్ ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. గతేడాది ప్రెగ్నెన్సీ ప్రకటించిన మహేశ్వరిని.. రీసెంట్గా తన భర్త శివనాగ్ సడన్‌గా సీమంతం చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈమెకు మరో బిడ్డ పుట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. తమ బుజ్జాయికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే అందరూ బుల్లితెర నటి మహేశ్వరికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నారు. (ఇదీ చదవండి: వాళ్ల కోసం రూ.35 లక్షలు విరాళమిచ్చిన ప్రభాస్.. ఎందుకంటే?) View this post on Instagram A post shared by Gali Maheshwari (@mahishivan9_official) -
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోలు
-
సన్నాఫ్ విరాట్ కోహ్లీ
అనుష్క శర్మ ఈ నెల 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అబ్బాయికి ‘అకాయ్’ అని పేరు పెట్టినట్లు తెలియజేశాడు విరాట్ కోహ్లీ. అయితే ‘అకాయ్’ ఫొటోను ఎక్కడా షేర్ చేయలేదు. దీంతో ‘అకాయ్’ రూ΄ాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ అభిమానులు ఏఐ జెనరేటెడ్ ఫొటోలను క్రియేట్ చేశారు. అకాయ్‌ను విరాట్ ఎత్తుకున్నట్లు, విరాట్–అనుష్కలు అకాయ్‌తో ఆడుకుంటున్నట్లు... ఇలా రకరకాలుగా క్రియేట్ చేశారు. ‘అకాయ్ ఫొటో షేర్ చేయకుండా విరాట్ కోహ్లీ మంచి పని చేశాడు. చేసి ఉంటే ఇంత అద్భుతమైన చిత్రాలను చూసి ఉండేవాళ్లం కాదు’ అంటూ నెటిజనులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రశంసల వర్షం ఒక కోణం అయితే... సాంకేతిక ఆసక్తి మరో కోణం. ‘మీరు ఉపయోగించిన ఏఐ టూల్స్ గురించి వివరంగా తెలుసుకోవాలని ఉంది’ అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. -
ఆయనే మళ్లీ పుట్టాడు.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొడుకు పుట్టిన సందర్భంగా హీరో నిఖిల్ ఎమోషనలయ్యారు. తన తండ్రి మళ్లీ తిరిగి వచ్చాడంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'ఏడాది క్రితమే మా నాన్న మిస్సయ్యాను. ఇప్పుడు మా కుటుంబంలోకి మగ బిడ్డ అడుగుపెట్టారు. ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నా. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా కుటుంబంలోకి తన తండ్రే మళ్లీ తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యారు నిఖిల్. ఇక నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
తండ్రైన యంగ్ హీరో నిఖిల్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్, డాక్టర్ పల్లవి 2020లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?) నిఖిల్ సినీ కెరీర్ విషయాకొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. . చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. Our Unique Star ⭐️@actor_Nikhil and his wife #Pallavi are now blessed with a BABY BOY❤️ Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨#NikPal pic.twitter.com/ihRleHFUY8 — Team Nikhil Siddhartha Telangana ✊ (@TS_Team_Nikhil) February 21, 2024 -
పండంటి బిడ్డకు జన్మ: ఆసుపత్రికి భారీ విరాళమిచ్చిన ముద్దుగుమ్మ
దక్షిణ కొరియా ఒలింపియన్ జిమ్నాస్ట్ సన్ యోన్ జే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సంబంధిత వర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆమె సెవెరెన్స్ హాస్పిటల్ ప్రసూతి విభాగానికి భారీ ఎత్తున (సుమారు 62 లక్షల రూపాయలు) విరాళాన్ని కూడా ప్రకటించడం విశేషంగా నిలిచింది. దీంతో రిథమిక్ జిమ్నాస్ట్ సన్ యోన్ జేకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రసూతి, గైనకాలజీకి చాలా మద్దతు అవసరమని భావించానని, అందుకే ఈ విరాళమని సన్ యోన్ జే ప్రకటించింది.హై-రిస్క్ మెటర్నల్ అండ్ ఫీటల్ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ సెంటర్ కోసం ఈ విరాళాన్ని ఉపయోగిస్తామని ఆసుపత్రి ప్రతినిధి వెల్లడించారు. అయితే ఆసుపత్రికి విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తమ పెళ్లి సందర్బంగా 37,400డాలర్లను సెవెరెన్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల జిమ్నాస్ట్ ప్రీ-టీనేజ్లోనే బరిలోకి దిగి సత్తా చాటింది. 2014 ఆసియా క్రీడలలో ఆల్ రౌండర్ ఛాంపియన్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2010 ఆసియా గేమ్స్ ఆల్‌రౌండ్ కాంస్య పతకాన్ని కూడా కైవసం చేసుకోవడంతోపాటు, వరుసగా మూడుసార్లు ఆసియా గేమ్స్ ఆల్ రౌండర్ ట్రోఫీ దక్కించుకుంది. అలాగే దక్షిణ కొరియాలో అత్యధిక పారితోషికం పొందుతున్న అథ్లెట్‌గా నిలిచింది. 2022, ఆగస్టులో సౌత్ కొరియాలో హెడ్జ్ ఫండ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది సన్ యోన్ జే. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతామాధురి
తెలుగు సింగర్ గీతామాధురి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మాస్, రొమాంటిక్ గీతాల పాడటంలో స్పెషలిస్ట్ అయిన ఈమె.. గత కొన్నాళ్ల నుంచి మాత్రం కెరీర్ పరంగా బ్రేక్ ఇచ్చింది. ప్రెగ్నెన్సీతో ఉండటమే దీనికి కారణమని జనవరిలో తెలిసింది. ఎందుకంటే అప్పుడు ఈమెకు సీమంతం జరగ్గా.. ఇప్పుడు తనకు కొడుకు పుట్టిన విషయాన్ని గీతామాధురి బయటపెట్టింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) అయితే ఫిబ్రవరి 10నే తనకు బాబు పుట్టాడని.. దాదాపు వారం తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఇకపోతే తెలుగు నటుడు నందుని ప్రేమించిన గీతామాధురి.. 2014లో అతడిని పెళ్లి చేసుకుంది. వీళ్ల సంసారానికి గుర్తుగా 2019లో ఓ పాప పుట్టింది. ఇప్పుడు బాబు పుట్టాడు. గీతామాధురి ప్రస్తుతం సింగర్‌గా కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ.. నందు మాత్రం హీరో, స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్, ఓటీటీ యాక్టర్‌గా చాలా బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం వీళ్లిద్దరు కూడా కొడుకుతో సమయాన్ని గడుపుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
తండ్రి అయిన తెలుగు యంగ్ హీరో.. ఫొటో వైరల్
ప్రస్తుతం అందరూ శ్రీరామ నామజపం చేస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇలాంటి అద్భుతమైన రోజున ఓ తెలుగు హీరో సుహాస్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేశాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 'రైటర్ పద్మభూషణ్' అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్'.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) తాజాగా సోమవారం (జనవరి 22)న తన భార్యకు మగబిడ్డ పుట్టినట్లు సుహాస్ వెల్లడించాడు. 'ప్రొడక్షన్ నం.1' అని ఓ ఫన్నీ క్యాప్షన్‌తో తను తండ్రి అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఇకపోతే సుహాస్ భార్య పేరు లలిత. వీళ్లిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు నో చెప్పడంతో లేచిపోయి వచ్చి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇక లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫొటోలని సుహాస్ చేస్తుంటాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా బుల్లి సుహాస్ వచ్చాడనమాట. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) View this post on Instagram A post shared by Suhas (@suhassssssss) -
అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్.. తండ్రిగా ప్రమోషన్
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. 25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు. చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..
ఓ స్వలింగ జంట మగ బిడ్డకు జన్మనివ్వడమే ఓ మిరాకిల్ అనేకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడపున మోయడం మరింత విశేషం. ఈఘటన ఐరోపాలో చోటు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా!. ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించి బిడ్డల్ని కనే ప్రయత్నం చేశారనుకున్నా.. ఇద్దరూ గర్భంలో మోయడం ఏంటీ అనే డౌటు వస్తుంది కదా!. గతంలో తొలిసారిగా ఓ స్వలింగ జంట ఇలానే ఒకే బిడ్డను ఇద్దరూ మోసి చరిత్ర సృష్టించారని ఈ స్వలింగ జంట రెండోదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కథా కమామీషు చూద్దాం!. స్పెయిన్‌లో మజోర్కాలోని పాల్మాలో ఎస్టీఫానియా(30), అజహారా(27) అనే స్వలింగ జంట అక్టోబర్ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ మహిళలే. పిల్లల్ని కనాలని ఆశపడ్డారు. ఇద్దరు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలో పెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి మాతృత్వపు అనుభూతిని పొందారు. ఇందుకోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ తమ కలను సాకారం చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ కేర్ వహిస్తూ తమ అనుబంధం మరింత బలపడింది అనేందుకు చిహ్నంగా ఒకే బిడ్డకు జన్మనిచ్చాం. ఆ ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఆనందంగా చెబుతున్నారు ఇరువురు. ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్గా పిలిచే సంతానోత్పత్తి చికిత్స అంటారు. ఇలా ఇంతకుమునుపు 2018లో టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట(ఇద్దరు మహిళలు) ఒకే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. సంతానం లేనివాళ్లకే గాక పిల్లల్ని కనడం సాధ్యం కానీ ఇలాంటి స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం ఓ వరం. వైద్యవిధానం సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం (చదవండి: కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ!
బాలీవుడ్లో కుసుమ్ అనే సిరీయల్లో కుముద పాత్రకు గుర్తింపు తెచ్చుకున్న భామ ఆష్కా గొరాడియా. ఆ తర్వాత లగీ తుజ్సే లగన్లో కళావతి పాత్రకు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించిన క్యుంకీ సాస్ భి.. కభీ బహుతీ సీరియల్లో నటించింది. ఆ తర్వాత బాల్ వీర్, నాగిని, నాగిని-2 సీరియల్స్‌లో కూడా కనిపించింది. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్, నాచ్ బలియే వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్- 6లో పాల్గొన్న ఆష్కా గొరాడియా తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆష్కా గోరాడియా డిసెంబర్ 1, 2017న వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్ని వివాహం చేసుకుంది. తాజాగా బాబు జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా దంపతులు ప్రకటించారు. దీనికి సంబంధించి గోరాడియా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తమ ముద్దుల బిడ్డకు విలియం అలెగ్జాండర్ అని పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. కాగా.. ఆష్కా ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించినట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Brent Goble (@ibrentgoble) View this post on Instagram A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) -
బుమ్రా కచ్చితంగా బ్యాటర్ అవుతాడు! ఇప్పుడివన్నీ అవసరమా?
Jasprit Bumrah- Sanjana Ganesh Child: టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా- స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని చిన్నారి బుమ్రా కూడా క్రీడాకారుడు కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా బుమ్రా సతీమణి సంజనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాము తల్లిదండ్రులు అయిన విషయాన్ని వీరు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సహచర క్రికెటర్లు సహా అభిమానులు బుమ్రా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేర్లను ట్రెండ్ చేస్తున్నారు. అంగద్ బ్యాటర్ అవుతాడేమో? ఈ అందమైన ప్రపంచంలోకి అంగద్‌కు స్వాగతం అంటూ వెల్కమ్ చెబుతూ బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు. ఇక మరికొంత మందైతే.. ఓ అడుగు ముందుకేసి చిన్నారి భవిష్యత్ గురించి జోస్యం చెబుతూ.. ‘‘అంగద్ తండ్రిలా బౌలర్ కాకుండా.. బ్యాటర్ అవుతాడు’’ అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇప్పుడే పుట్టిన ఫ్యూచర్‌పై ఇలాంటి కామెంట్లు అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు. కొడుకును చూసుకునేందుకు స్వదేశానికి కాగా బుమ్రా ప్రస్తుతం ఆసియా కప్-2023 టోర్నీతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం శ్రీలంకకు వెళ్లాడు. అయితే, భార్య ప్రసవం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన బుమ్రా.. మళ్లీ సూపర్-4 మ్యాచ్‌ల కోసం అక్కడికి వెళ్లనున్నాడు. దీంతో నేపాల్‌తో సోమవారం నాటి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. కాగా 29 ఏళ్ల బుమ్రా 2021లో సంజనా గణేశన్‌ను వివాహమాడాడు. చదవండి: WC 2023: తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేసినట్లు? అతడు అవసరమా? Indian Star Pacer Jasprit Bumrah And His Wife Sanjana Ganesan has been blessed by Baby boy. They named him as "Angad". I guess Next bumrah is a batter for sure!😉 Congratulations @Jaspritbumrah93 ❤️ pic.twitter.com/uDwQ0zdZVr — ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) September 4, 2023 Angad Jasprit Bumrah cheering for his father in future matches pic.twitter.com/RYmgQPmuUe — ✰ (@insane_birdie) September 4, 2023 View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) -
తండ్రైన జస్ప్రీత్ బుమ్రా..
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రియ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్ సోషల్ మీడియా వేదికగా బుమ్రా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రాగా పేరు పెట్టినట్టుగా కూడా వెల్లడించాడు. "మా చిన్న కుటుంబం ఇప్పుడు పెరిగింది. ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాము. జీవితంలోని ఈ కొత్త అధ్యాయన్ని ప్రారంభిచేందుకు సిద్దంగా ఉన్నాము" అంటూ జస్ప్రీత్ బుమ్రా- సంజన పేరుతో సందేశాన్ని ఎక్స్‌లో(ట్విటర్) పోస్టు చేశారు. Our little family has grown & our hearts are fuller than we could ever imagine! This morning we welcomed our little boy, Angad Jasprit Bumrah into the world. We are over the moon and can’t wait for everything this new chapter of our lives brings with it ❤️ - Jasprit and Sanjana pic.twitter.com/j3RFOSpB8Q — Jasprit Bumrah (@Jaspritbumrah93) September 4, 2023 దీంతో పలువురు బుమ్రా-సంజన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆసియాకప్ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా.. భార్య డెలివరీ కోసం ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేశాడు. దీంతో అతడు నేపాల్‌తో జరగనున్న గ్రూపు స్టేజి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ సూపర్-4 మ్యాచ్‌లకు భారత జట్టుతో కలవనున్నాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్.. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..వీడియో వైరల్!
సీరియల్స్‌తో బాగా ఫేమస్ అయిన నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది లహరి. గతంలోనే గర్భం దాల్చినట్లు సోషల్ ద్వారా పంచుకుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే తొమ్మిదినెలలో సీమంతం జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్) తాజాగా మరో క్రేజీ వార్తను అభిమానులతో పంచుకుంది. తనకు మగబిడ్డ జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను ప్రసవించిన ఆస్పత్రిలో కేక్ కట్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Lahari Arundhati Vishnuvazhala (@lahari_actress) -
‘యూట్యూబ్’ చూస్తూ భార్యకు కాన్పు
హోసూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా యూట్యూబ్‌లో వీడియో చూస్తూ ఓ భర్త కాన్పు చేశాడు. మగబిడ్డకు జన్మనిచి్చన ఆమె తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురంలో జరిగింది. హనుమంతపురానికి చెందిన మాదే‹Ù(27)కు పోచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేశారు. ఇంటి వద్ద పెరట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలనే తినేవారు. ఈ క్రమంలో లోకనాయకి గర్భం దాల్చగా.. ఇంటి వద్దే సహజసిద్ధంగా ప్రసవం చేయాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మాదేష్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండేవాడు. మంగళవారం తెల్లవారుజామున లోకనాయకికి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను మాదేష్ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం యూట్యూబ్‌లో చూస్తూ కాన్పుకు సాయం చేశాడు. మగ బిడ్డకు జన్మనిచి్చన అనంతరం.. లోకనాయకి తీవ్ర రక్తస్రావంతో కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన డాక్టర్లు లోకనాయకి మరణించినట్లు తెలిపారు. -
పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!
నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో రిలేషన్లో ఉంది. కాగా.. ఇప్పటికే 2019లో ఈ జంటకు అరిక్ రాంపాల్ అనే కుమారుడు జన్మించారు. దీంతో దాదాపు 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు బాలీవుడ్ నటుడు రాంపాల్. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. కాగా.. 2018లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అర్జున్ రాంపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను, నా కుటుంబం ఓ అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీ, కొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. అద్భుతంగా సేవలందించిన వైద్యులు, నర్సులకు నా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా.. నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన ఊపిరి చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2018 నుంచి ఈ జంట రిలేషన్లో ఉన్నారు. కాగా.. అర్జున్‌కు మొదటి భార్య మెహర్ జెసియాకు మహికా రాంపాల్, మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ జంట 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అర్జున్ చివరిగా కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం 'ధాకడ్'లో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తదుపరి బాబీ డియోల్‌తో 'పెంట్‌హౌస్'లో కనిపించనున్నాడు. దీంతో అర్జున్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ 'క్రాక్'లో నటించనున్నారు. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
నా రక్తమే నా రిక్షాకు పెట్రోలు!
ఆమె భర్త ఏ పనిచేస్తాడో? అసలు పనిచేస్తాడో లేదో కూడా తెలియదు. ఆమె మాత్రం బతుకుదెరువు కోసం ఇ–రిక్షా నడుపుతుంది. ఇంట్లో పిల్లాడిని చూసుకోవడానికి ఎవరూ లేరు. దీంతో పిల్లాడిని ఒళ్లో పడుకోబెట్టుకొని ఇ–రిక్షా నడుపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమె వీడియో క్లిప్ 2.8 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజనులను భావోద్వేగానికి గురి చేసింది. ‘ఈ వీడియో చూసి నా గుండె చెరువు అయింది’ ‘ఆమె చాలా రిస్క్ తీసుకుంటోంది. పిల్లాడిని బేబీ కేర్ సెంటర్లో చేరిస్తే మంచిది’ ‘దగ్గర్లో ఉన్న దాతలు ఎవరైనా ఆమెకు బేబీ క్యారియర్ ఇప్పిస్తే బాగుంటుంది’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
హీరోయిన్ సనా ఖాన్ తల్లి అయింది. బుధవారం ఉదయం ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 2005లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వరుస సినిమాలతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’లోనూ హీరోయిన్గా నటించింది. (చదవండి: సేమ్ టు సేమ్..‘సలార్’ టీజర్లో ఇది గమనించారా?) కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి, 2020లో అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమయింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.తాజాగా కొడుకు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ ‘మీరందరూ మాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ దీవెనలు మా బిడ్డకు కూడా కావాలి’అని ఆమె కోరింది.దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
ఆంక్షలు ఉన్నా.. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రమిత (పేరు మార్చాం) ప్రస్తుతం రెండో నెల గర్భిణి. ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె బలహీనతకు కారణాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె.. మగపిల్లాడి కోసం ఆరు నెలల గర్భం సహా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈసారీ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమైంది. లింగ నిర్ధారణపై నిషేధం, కఠిన ఆంక్షలు ఉన్నా.. ఇన్నిసార్లు నిర్ధారణ, అబార్షన్లు ఎలా సాధ్యమయ్యాయి? ఓవైపు డయాగ్నొస్టిక్స్ కేంద్రాల అక్రమాలు, మరోవైపు విదేశాలకు వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడుతున్న తీరు పెరుగుతుండటం ఆందోళన రేపుతున్నాయి. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తూ.. మన దేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. ఒకవేళ అక్రమంగా పరీక్షలు చేస్తున్నా.. సాధారణ డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడానికి కనీసం గర్భం దాల్చిన 16 వారాల వరకు ఆగాల్సి వస్తోంది. అదే యూకే, అమెరికా, సింగపూర్ వంటి చాలా దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధమేదీ లేదు. పైగా 8 నుంచి 10 వారాల వ్యవధిలోనే నిర్ధారణ చేస్తుండటం, దీనిని రాతపూర్వకంగా కూడా వెల్లడిస్తుంటారు. మగ పిల్లలు కావాలనుకునే జంటలు దీనిని సావకాశంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 9–10 వారాల గర్భిణులు విదేశాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటూ.. మన దేశంలో గర్భిణులకు 12 వారాల వరకు అబార్షన్ చేయడానికి చట్టబద్ధంగా వెసులుబాటు ఉంది. విదేశాల్లో లింగ నిర్ధారణ చేయించుకున్నవారు ఆడపిల్ల అని తేలితే.. ఇక్కడికి తిరిగి వచ్చాక ఆస్పత్రులకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటున్నారు. ‘కండోమ్ ఫెయిల్యూర్, గర్భం రాకుండా వేసుకునే మందులు తీసుకోవడం మర్చిపోవడం’ అంటూ ఏదో కారణం చెప్తున్నారు. కొందరైతే లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ కూడా విదేశాల్లోనే చేయించుకుని వస్తున్నారు. ఇందు కోసం థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ‘‘డబ్బున్నవాళ్లు లిఖితపూర్వకంగా లింగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇచ్చే దేశాలకు వెళ్తున్నారు. కొందరు మధ్యతరగతి వారు కూడా మగ పిల్లలు కావాలన్న ఆశతో ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌ను నడిపించే వారి సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రసూతి, గైనకాలజీ సొసైటీకి చెందిన డాక్టర్ శాంత కుమారి చెప్పారు. చైతన్యం కలిగించడమే మార్గం.. ‘‘తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు మన దేశంలో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసుకోవడానికి రూ.25,000 నుంచి రూ. 45,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశాలలోనూ చట్టబద్ధంగా కూడా దాదాపు ఇదే ఖర్చు అవుతుంది. ప్రయాణ ఖర్చులే అదనం. విదేశాల్లో పరిశుభ్రమైన పరిస్థితులలో, సరైన మెడికల్ బ్యాకప్‌తో జరుగుతుంది. దీనితో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దేశం దాటుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు. జంటలలో అవగాహన పెంచడం, చైతన్యం కలిగించడం తప్ప మరోదారి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల వ్యవహారం లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్, నేరుగా అవాంఛనీయ గర్భాన్ని గానీ తొలగించుకోవాలనుకునే వారి కోసం.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, ఆస్పత్రులకు మధ్య ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ, విషయం బయటికి తెలియకుండా ‘పని’ కానిచ్చేస్తూ.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాల వారికి, ఆస్పత్రులకు వీరే సొమ్ము ముట్టజెప్తుంటారు. ఇలాంటి ఏజెంట్లు, దళారుల వల్ల భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. కొడుకు కావాలనే కోరికతో.. మగ పిల్లలు కావాలనే కోరికతో లింగ నిర్ధారణ పరీక్షలకు వెంపర్లాడే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారనేది సాధారణ నమ్మకం. ఈ విషయంలో సంపన్నులు, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కావాలనుకోవడం, అందులోనూ వంశాన్ని కొనసాగించడానికి కొడుకు ఉండాలన్న ఆలోచన, ఆ దిశగా ఇళ్లలో పెద్దల ఒత్తిళ్లు వంటివి.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించేందుకు తెగబడటానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇది కూడా చదవండి: పుడమి తల్లికి తూట్లు! -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ దీపికా కక్కర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోయబ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఆమెకు నెలలు నిండకుండానే డెలివరీ అయినట్లు ఇన్‌స్టాలో వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. (ఇది చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!) కాగా.. దీపీకా కక్కర్ ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్‌లో సోనాక్షి పాత్రలకు బాగా పేరు తెచ్చుకుంది. దీపికా రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్‌గా పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె నాచ్ బలియే 8 అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) View this post on Instagram A post shared by Shoaib Ibrahim (@shoaib2087) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ నటి!
బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ గౌహర్ ఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇది చదవండి: బీస్ట్ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో) కాగా.. గతేడాది డిసెంబర్లో తల్లి కాబోతోన్నట్లు ప్రకటించింది బాలీవుడ్ భామ. ఇటీవలే సీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా గౌహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గౌహర్ ఖాన్ రాకెట్ సింగ్: సేల్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అనే సినిమాతో నటిగా కెరీర్ ఆరంభించింది. అంతే కాకుండా గేమ్, 14 ఫెరే వంటి పలు చిత్రాల్లో నటించింది. ఝలక్ దిఖ్ లాజా 3, బిగ్‌బాస్ 7, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 5 వంటి రియాలిటీ షోలలనూ పాల్గొంది. తాండవ్, సాల్ట్ సిటీ, శిక్షా మండల్ వెబ్ సిరీస్‌లలో నటించింది. ఇటీవలే నెట్‌ప్లిక్స్‌లో ప్రసారమైన ఇన్ రియల్ లవ్ షోలో రణ్విజయ్ సింగ్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ కుమారుడైన జైద్ దర్బార్‌ను 2020 డిసెంబర్లో పెళ్లాడింది. (ఇది చదవండి: ఓ ఆర్టిస్ట్‌గా మాత్రమే చూడండి.. కామంతో కాదు.. బిగ్ బాస్ బ్యూటీ!) View this post on Instagram A post shared by Gauahar Khan (@gauaharkhan) -
మన్‌కీబాత్ కార్యక్రమంలో అనూహ్య ఘటన..ఓ మహిళకి నొప్పులు రావడంతో..
డిల్లీలో జరిగిన మన్ కీ బాత్ 100వ ఎపీసోడ్‌ని బీజేపీ కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా 11 విదేశీ భాషల తోపాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో కూడా అట్టహాసంగా ప్రసారమైంది. ఐతే ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఈ మన్‌కిబాత్ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన 24 ఏళ్ల పూనమ్ దేవికి అకస్మాత్తుగా నొప్పులు రావడం మొదలైంది. దీంతో పూనమ్‌ను హుటాహుటినా రాజధానిలోని ఆస్పత్రికి తరలించారు ఆమె భర్త. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళ. ఆమెకు అదేరోజు(ఆదివారం) సాయంత్రం 6.42 నిమిషాలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజధానిలోనే తమ బిడ్డ పుట్టడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డకు ఆదిత్య అని పేరు పెట్టుకుంటామని పూనమ్ భర్త ప్రమోద్ కుమార్ చెప్పారు. సదరు మహిళ పూనమ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితురాలిగా రాజధాని ఢిల్లీకి వచ్చారు. అంతేగాదు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ మన్ కీ బాత్ ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్లో మహిళలకు ఆదాయపు వనరులను సృష్టించడం కోసం ఆమె చేసిన కృషి, సాధించిన విజయాల గురించి ప్రసంసించడం విశేషం. ఐతే తన భార్య గర్భం దాల్చడంతో రాజధానికి వెళ్లేందుకు తాను అంగీకరించలేదని ఆమె భర్త పేర్కొన్నారు. ఐతే తన భార్య స్వయం సహాయక బృందంలో తను చేసిన పనిని గుర్తించారని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వెళ్లాలంటూ పట్టుబట్టడంతో వచ్చినట్లు ఆమె భర్త చెప్పారు. పూనమ్ లఖింపూర్ ఖేరీలోని సమైసా గ్రామంలో సరస్వతి ప్రేరణ గ్రామ్ సంగతన్ అనే స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఆమె అరటి కాండం నుంచే వచ్చే ఫైబర్‌తో హ్యాండ్‌బ్యాగ్‌ల, చాపలు వంటి ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తోంది. ఇది గ్రామంలోని మహిళలకు మంచి అదనపు ఆదాయ వనరులను అందించడమే గాక గ్రామంలో వ్యర్థాలను తొలగించడానికి కూడా దోహదపడింది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన 100 మంది ఆహ్వానితుల్లో ఆమె కూడ ఒకరు. ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్ ఎపిసోడ్లో సమాజానికి విశేషమైన సహాయ సహకారాలు అందించిన వారి గురించి మాట్లాడుతున్నప్పుడూ.. ఆమె గురించి కూడా ప్రస్తావించారు. కాగా, ఆదివారం జరిగిన 100వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ ప్రారంభించారు. ఈ కార్యకమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: గుజరాత్ సీఎం ప్రసంగిస్తుండగా ఆఫీసర్ కునుకు.. ఆ కమిట్మెంట్కు ఫలితంగా..) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ నటి.. అప్పుడే పేరు కూడా!
టాలీవుడ్లో నిఖిల్ హీరోగా నటించిన 'స్వామి రారా' నటి పూజా రామచంద్రన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొక్కెన్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. బాబు వేలిని పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. అప్పుడే తమ బిడ్డకు కియాన్ కొక్కెన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..) తమిళంలో బిగ్ బాస్ ద్వారా పూజాకు ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కాంచన-2, దోచేయ్, త్రిపుర, దళం, వెంకీమామ, పవర్ ప్లే లాంటి సినిమాల్లో నటించారు. మరో వైపు ఆమె భర్త జాన్ కొక్కెన్ విలన్‌గా పలు చిత్రాల్లో మెప్పించారు. ముఖ్యంగా కేజీఎఫ్, కబ్జా, వీరసింహారెడ్డి, తెగింపు లాంటి విలన్‌గా నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
తండ్రైన అసిస్టెంట్ డైరెక్టర్.. కంగ్రాట్స్ చెప్పిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరీనా కపూర్ బంధువు అయిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న కరీనా కపూర్, నీతూ కపూర్ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. నీతూ కపూర్‌కు ఆర్మాన్ జైన్ మేనల్లుడు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు. View this post on Instagram A post shared by Anissa Malhotra Jain (@stylebyanissa) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ (ఫొటోలు)
-
బిడ్డకు జన్మనిచ్చిన 'దసరా' నటి.. పిక్స్ వైరల్
సీమటపాకాయ్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాలతో మెప్పించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా సినిమాలోనూ కనిపించింది. తాజాగా ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆస్పత్రికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు పూర్ణకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. గతంలో ఆమె గర్భం ధరించినప్పటి నుంచి సీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
భర్తల భరతం పట్టిన భార్యామణులు!
కారేపల్లి: భార్యామణులు భర్తల భరతంపట్టారు. ఇంకొందరు పచ్చ బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించారు. చేసేదేం లేక పురుషపుంగవులు పరుగు లంకించుకున్నారు. హోలీ సందర్భంగా గిరిజన తండాల్లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది హోలీ నుంచి ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్యా, లాకావత్, తేజావత్, వడిత్యా వంశస్తుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడో ఆ ఇంట్లో డూండ్ వేడుక వైభవంగా నిర్వహిస్తారు. కారేపల్లి మండలం సామ్యతండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానం మగబిడ్డ దర్శక్ జన్మించడంతో ఈ వేడుక నిర్వహించారు. డూండ్ అంటే గిరిజన భాషలో వెతకడం అని అర్థం కాగా, బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టి గ్రామస్తులంతా వెతకడమే ఈ వేడుక! ఇదంతా హోలీ రోజు ముగియగా.. గురువారం గ్రామంలో ఓ గుంజ పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాళాలను తాళ్లతో కట్టారు. గంగాళాలకు మహిళలు పచ్చి బరిగెలతో కాపలాగా ఉండగా, పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. మహిళలు, పురుషులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రలు ఎత్తుకెళ్లేందుకు వచ్చే పురుషులను మహిళలు సరదాగా కొడుతుండటం చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడుకలో బావ, బావమరిది వంటి వరసైనవారు మహిళల దెబ్బల రుచి చూడాల్సిందే. చివరకు పురుషులు గంగాళాలను ఎత్తుకెళ్లి ఆరగించడంతో వేడుక ముగిసింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్‌తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
ప్లాస్టిక్ కవర్లో పసివాడి ప్రాణం
గుంటూరు ఈస్ట్: నవమాసాలు మోసిన తల్లి... ‘కని’కరం లేకుండా 48గంటల్లోనే తన బిడ్డను వదిలేసింది. పేగు తెంచి పంచిన పసి ప్రాణాన్ని తన పొత్తిళ్లలో అదుముకుని అల్లారుముద్దుగా చూసుకోకుండా... చెత్తను విసిరేసినంత సులభంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి పాడుబడిన ఇంట్లో పడేసింది. తల్లి స్పర్శ కోసం గుక్కపెట్టిన ఆ శిశువు ఏడుపు విని పక్క ఇంట్లో ఉంటున్న మరో మాతృమూర్తి వచ్చి ఆ బిడ్డను కాపాడారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గుంటూరువారితోట 5వ లైనులో ఓ పాడుబడిన భవనం పై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో పక్క ఇంట్లో ఉన్న మహిళ చూసేందుకు వెళ్లారు. అక్కడ పాలిథిన్ క్యారీ బ్యాగులో మగ శిశువు కనిపించాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి ఆ శిశువుని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పుట్టి రెండు రోజులు అయి ఉంటుందని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ శిశువు ఉన్న పాడుబడిన భవనం చుట్టూ హాస్పిటల్స్ ఉండటంతో సమీపంలోనే డెలివరీ అయి ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. -
ఆడ పిల్లలంటే ఓర్కా తిమింగలాలకూ వివక్షే! మగ బిడ్డను సాకేందుకు ఏకంగా
మగబిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం.. ఆడపిల్లపై వివక్ష చూపడమనేది మానవ సమాజంలో మాత్రమే కనిపించే అవలక్షణం అనుకుంటాం. కానీ.. మగ పిల్లవానిపై మమకారంతో జీవితంలో మరో బిడ్డకు జన్మనివ్వని జాతులు సైతం ఈ సృష్టిలో ఉన్నాయి. ఆ జాబితాలో ఓర్కా తిమింగలాలు ముందు వరసలో ఉన్నాయట. ఈ కారణంగా ఆ జాతి తిమింగలాల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందనే విభ్రాంతికర వాస్తవం వెలుగులోకి వచ్చింది. సాక్షి, అమరావతి: పుత్ర ప్రేమతో వంశాన్నే నాశనం చేసుకున్న ధృతరా్రషు్టడి గురించి మహాభారతంలో చదివే ఉంటారు. కానీ.. మగ బిడ్డలపై తల్లి ప్రేమ ఏకంగా ఓ జాతి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆ జాతే ఓర్కా తిమింగలాలు. వీటినే కిల్లర్ తిమింగలాలు అని కూడా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కనిపించే అరుదైన తిమింగలాలు ఇవి. అత్యంత తెలివైనవిగా గుర్తింపు పొందిన డాల్ఫిన్ జాతికి చెందిన ఓర్కా తిమింగలాల ప్రవర్తన అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఫలితంగా వాటి ఉనికే పెను ప్రమాదంలో పడింది. మానవులు వాటిని వేటాడుతుండటమో.. శత్రు జీవుల నుంచి తలెత్తుతున్న ముప్పు వంటివి దీనికి కారణం కాదు. కేవలం మగ బిడ్డల పట్ల తల్లి తిమింగలాలకు మితిమీరిన మమకారమే కారణమన్నది ఆశ్చర్యకరమైన వాస్తవం. గుంపునకు నాయకత్వం వహిస్తాడనే ఆశతో.. సగటున 70 ఏళ్లు జీవించే ఓర్కా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తాయి. పాడ్స్ అని పిలిచే ఆ గుంపునకు ఓ బలమైన మగ తిమింగలం నేతృత్వం వహిస్తుంది. ప్రతి తల్లి తిమింగలం తాను కన్న మగబిడ్డే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని కోరుకుంటాయి. అందుకోసం తాము జన్మనిచ్చే మగ తిమింగలాల పట్ల విపరీతమైన మమకారాన్ని కనబరుస్తాయి. ఎంతగా అంటే ఆడబిడ్డను పెద్దగా పట్టించుకోవు. ఆడ తిమింగలం ఓ కాన్పులో ఒక బిడ్డకే జన్మనిస్తాయి. ఆడబిడ్డ పుడితే తల్లి తిమింగలం కేవలం 15 నెలల వరకే సాకుతుంది. ఆ తరువాత ఆడబిడ్డను వదిలేస్తుంది. మగబిడ్డ జన్మ నిస్తే మాత్రం తల్లి తిమింగలం చేసే హడావుడి అంతాఇంతా కాదు. మగ బిడ్డను ఎంతో సుకుమారంగా చూసుకుంటాయి. బిడ్డకు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు వరకు సాకుతాయి. అంతవరకు మగబిడ్డకు తల్లి తిమింగలమే ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. తాను వేటాడి తెచి్చన ఆహారంలో సగానికిపైగా మగబిడ్డకే తినిపిస్తుంది. తాను కన్న మగ తిమింగలమే ఆ గుంపునకు నాయకత్వం వహించాలని తల్లి తిమింగలం ఎంత చేయాలో అంతా చేస్తుంది. జీవవైవిధ్యంలో ప్రధానమైనవి ఓర్కా తిమింగలాలు అత్యంత అరుదైనవి. జీవ వైవిధ్యంలో అత్యంత ప్రధానమైవవి కూడా. మగబిడ్డను అత్యంత మమకారంతో సాకడం కోసం తల్లి తిమింగలం మరో బిడ్డకు జన్మనివ్వకపోవడమన్నది వీటిలోనే మనం గమనిస్తాం. దాంతో వాటి సంఖ్య ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. వాటిని పరిరక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. – ప్రొఫెసర్ భరతలక్ష్మి , జువాలజీ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం మగ బిడ్డ పుడితే.. మరో బిడ్డకు జన్మనివ్వవు మగ బిడ్డను బలంగా తయారు చేసేందుకు తల్లి తిమింగలాలు మరో పెద్ద నిర్ణయం తీసుకుంటాయి. ఓ సారి మగబిడ్డ పుడితే ఆ తల్లి తిమింగలం జీవితాంతం పిల్లల్ని కనదు. ఎందుకంటే ఆడ తిమింగలం గర్భధారణ సమయం 18 నెలలు. అంతకాలం తాను గర్భంతో ఉంటే అప్పటికే పుట్టిన మగబిడ్డను సక్రమంగా పెంచలేనని.. తగినంత ఆహారం అందించలేనని తల్లి తిమింగలం భావిస్తుంది. అందుకే మగబిడ్డ పుడితే తల్లి తిమింగలం మగ తిమింగలంతో జత కట్టవు. ఈ నిర్ణయమే ఓర్కా తిమింగలాల జాతికి పెనుముప్పుగాపరిణమిస్తోంది. ప్రధానంగా 1990 నుంచి క్రమంగా అంతరిస్తున్న వీటి ఉనికి 2005 తరువాత అత్యంత ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఓర్కా తిమింగలాలు కేవలం 73 మాత్రమే ఉన్నాయని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెసర్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వాటిలో కేవలం మూడు మాత్రమే గర్భంతో ఉండటం గమనార్హం. అంటే ఓర్కా తిమింగలాల్లో పునరుత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నేళ్లలో ఓర్కా తిమింగలాలు కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఓర్కా తిమింగలాలను అత్యంత వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలో చేర్చి వాటి పరిరక్షణకు పరిశోధనలను ప్రోత్సహిస్తోంది. ఓర్కా తిమింగలాల ప్రత్యేకతలు ఇవీ ► ఓర్కా తిమింగలాల పైభాగం ముదురు నలుపు రంగులోనూ.. కిందిభాగం స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండటంతోపాటు కళ్ల మీద దళసరిగా తెల్లని మచ్చ ఉంటుంది. ►ఇవి అత్యంత తెలివైన జీవులు. నోటితో ఈల వేస్తాయి. ఈలలు, సంజ్ఞలు, శబ్దాలు చేస్తూ పరస్పరం సంభాషిం చుకుంటాయి. ► మానవుల మాటలు, హావభావాలను సరిగా అర్థం చేసుకుంటాయి. మానవులతో అత్యంత స్నేహంగా ఉంటాయి. ► పసిఫిక్ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కిల్లర్ తిమింగలాల ఆవాసాలు. ► అమెరికాలోని అలస్కా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు, ఒమన్ దేశంలో ఓర్కా తిమింగలాలను వీక్షించేందుకు ప్రత్యేక టూర్స్ నిర్వహిస్తున్నారు. ►మన దేశంలోని లక్షద్వీప్, అండమాన్ దీవులతోపాటు తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్ట్ర తీర ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ తిమింగలాలు కనిపిస్తుంటాయి. -
తండ్రైనా టాలీవుడ్ యంగ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర తండ్రయ్యారు. ఇవాళ ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. బాబును ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ చూసిన నవీన్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా.. టాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవలో బాలరెడ్డిగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో బసిరెడ్డి పాత్ర వేసిన జగపతి బాబు కుమారుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. Me and orma ❤️ Blessed with baby boy 👶!!!!❤️ pic.twitter.com/db2N21fZOh — Naveen Chandra (@Naveenc212) February 22, 2023 -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. తండ్రైన స్టార్ డైరెక్టర్
ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అట్లీ ఇన్‌స్టాలో షేర్చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. They were right 😍 There’s no feeling in the world like this ♥️ And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today! Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc — atlee (@Atlee_dir) January 31, 2023 View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ
ప్రముఖ కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి పండుగ రోజున తన భార్య హరిత పండండి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ‘మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. దీంతో రాహుల్ దంపతులకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతంలో గర్ల్‌ఫ్రెండ్‌కు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోను షేర్ చేస్తూ రాహుల్ పెళ్లి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి అయితే పెళ్లి తేదీ కానీ, పెళ్లికి సంబంధించిన ముచ్చట్లను కానీ ఆ తర్వాత రాహుల్ వెల్లడించలేదు. కానీ గతేడాది నవంబర్‌లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి అందరికి షాకిచ్చాడు. కాగా కమెడియన్‌గా పరిశ్రమలో రాహుల్ రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. షార్ట్ ఫిల్మ్ హీరోగా కెరీర్ ప్రారంభించిన అతడు సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్ పాత్రలు చేసి ఫేమస్ అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోకి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాతో తెచ్చుకున్న గుర్తింపుతో ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. Boy. Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1 — Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023 -
Viral News: తగ్గేదేలే! 60వ సారి తండ్రయిన పాకిస్తానీ.. నాలుగో పెళ్లికి రెడీ!
ఉరుకులు పరుగుల జీవితం. చాలీచాలని జీతం. సొంత పనులతో సతమతం. వెరసి ఒక్క బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు అనే పరిస్థితి. ఆర్థికంగా స్థితిమంతులైతే మరో ఇద్దరైనా పర్లేదనుకోవడం వింతేం కాదు! కానీ, పాకిస్తాన్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తాజాగా 60వ సారి తండ్రయ్యాడు. వైరల్‌గా మారిన ఈ సంగతి తెలిసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం... బలూచిస్తాన్ రాజధాని ఖ్వెట్టా ప్రాంతానికి చెందిన సర్దార్ జన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ తన 50 వ ఏట మరో వారసునికి తండ్రయ్యాడు. అంతేకాదు ఇప్పటికే ముగ్గురు భార్యలున్న ఈయన మరో భార్య కావాలంటూ ప్రయత్నాలు చేయడం విశేషం. ఫ్యామిలీ డాక్టర్ అయిన సర్దార్ జన్.. తన సొంతింట్లోనే క్లినిక్ నడుపుతున్నాడు. తాజాగా పుట్టిన తన బిడ్డకు హాజీ ఖుషాల్ ఖాన్ అనే పేరు పెట్టాడు. అంతేకాదు అంత పెద్ద కుటుంబాన్ని ఒకే చోట పెట్టి పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని షంషద్ న్యూస్ అనే వార్తా సంస్థ ట్విటర్లో పేర్కొనగా వైరల్‌గా మారింది. (చదవండి: 6 నెలల తర్వాత తొలిసారి.. ఉక్రెయిన్ సైనికుడిని చూసి భార్య భావోద్వేగం.. వైరలవుతోన్న వీడియో) ఇక మరోసారి తండ్రయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్దార్ జన్.. తనకు మగ సంతానం కంటే ఆడ సంతానం అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు. మరో పెళ్లి చేసుకుని మరింత మంది వారసులకు జీవితాన్నిస్తానని అంటున్నాడు. నాలుగో పెళ్లి కోసం స్నేహితుల సాయం కూడా కోరినట్టు వెల్లడించాడు. తన కుటుంబం మరింత పెద్దదైనా వేరు చేయకుండా ఒకేచోట ఉండాలని అతను ఆకాంక్షించాడు. ఇదిలాఉంటే.. ఇప్పటికే పదుల సంఖ్యలో బిడ్డలకు జన్మనిచ్చిన అతని ముగ్గురు భార్యలు మరిన్ని కాన్పులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం మరో విశేషం. (చదవండి: తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం) Sardar Jan, a resident of Quetta, became the father of the “sixtieth” child. Sardarjan Mohammad Khan, a resident of Quetta, the Capital of Balochistan, said his sixtieth child was given birth yesterday. Jan uttered the newborn child is a baby son and he named him Khushal. pic.twitter.com/OHxbYm35kW — ShamshadNews (@Shamshadnetwork) January 3, 2023 Sardar Jan, a resident of Quetta, became the father of the “sixtieth” child. Sardarjan Mohammad Khan, a resident of Quetta, the Capital of Balochistan, said his sixtieth child was given birth yesterday. Jan uttered the newborn child is a baby son and he named him Khushal. pic.twitter.com/OHxbYm35kW — ShamshadNews (@Shamshadnetwork) January 3, 2023 -
చిన్నారిని చిదిమేశారు.. నీటి సంపులో పడేసి రెండు నెలల పసికందు హత్య
సాక్షి, హైదరాబాద్: అభం శుభం తెలియని రెండు నెలల చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లి నీటి సంపులో పడేసి హత్య చేశారు. ఎస్ఐ రమేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 19న రాత్రి ఆమె భర్త ఉద్యోగ రీత్యా బయటికి వెళ్లడంతో సనాబేగం తన రెండు నెలల కుమారుడు అబ్ధుల్ రహమాన్.. అత్త, ఆడపడచూ ఫౌజియా బేగం, అడపడుచు కుమార్తెతో కలిసి ఒకే గదిలో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. ఎక్కడా ఆచూకీ దొరకŠక్ పోవడంతో అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్ట్ -
తండ్రిని బతికించుకునేందుకు... చిన్నారిని బలివ్వబోయింది!
న్యూఢిల్లీ: మూఢ నమ్మకాల మాయలో ఓ పాతికేళ్ల మహిళ ఒక పసికందునే బలివ్వబోయిన దారుణం ఢిల్లీలో వెలుగుచూసింది. ఇటీవల కన్నుమూసిన తండ్రి నవజాత మగ శిశువును బలిస్తే బతికొస్తాడని ఎవరో చెప్పడంతో ఇంతటి ఘోరానికి పాల్పడబోయింది. మామ్‌రాజ్ మొహల్లా దగ్గర నివసించే దంపతులకు రెండు నెలల బాబున్నాడు. శ్వేత అనే పాతికేళ్ల మహిళ వారితో పరిచయం పెంచుకుంది. ఎన్జీవోలో పనిచేస్తానని, పిల్లాడికి ఉచితంగా మందులిస్తానని నమ్మబలికి ఇంటికి రోజూ వచ్చిపోతూ దగ్గరైంది. బుధవారం పిల్లాడిని సరదాగా తిప్పుతానంటూ బయటకు తీసుకెళ్లింది. వెంట వచ్చిన పసికందు బంధువుకు క్రూల్డ్రింక్లో మత్తుమందు కలిపిచ్చి వదిలించుకుని బాబుతో పరారైంది. బంధువు బాబు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా శ్వేత జాడ కనిపెట్టారు. ఆమెను అరెస్ట్‌చేసి పసికందును తల్లిదండ్రులకు అప్పజెప్పారు. బాలున్ని కాపాడుతూ కేసును 24 గంటల్లోపే చేధించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. -
బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం
చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్థనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు. -
అల్లూరి జిల్లా ఆడపిల్లల ఖిల్లా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆడ పిల్లలే డామినేట్ చేస్తున్నారు. ఈ జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు జననాలను పరిశీలిస్తే మగ పిల్లలకన్నా ఆడపిల్లలే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 1001 మంది ఆడపిల్లలున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) పని తీరు సూచికల పురోగతి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా తరువాత పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆడపిల్లల సంఖ్య మెరుగ్గా ఉంది. పల్నాడు జిల్లాలో వెయ్యి మంది మగ పిల్లలకు 993 మంది ఆడపిల్లలున్నారు. పశ్చిమగోదావరిలో వెయ్యి మంది మగ పిల్లలకు 991 మంది ఆడ పిల్లలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు రాష్ట్రం లో 2,55,582 జననాలు సంభవిస్తే అందులో 1,31,954 మగ పిల్లలు కాగా 1,23,628 ఆడ పిల్లలుగా నివేదిక తెలిపింది. రాష్ట్రం మొత్తం సగటు చూస్తే ఆగస్టు వరకు వెయ్యి మంది మగ పిల్లలకు 937 మంది ఆడ పిల్లలున్నారని పేర్కొంది. ప్రత్యేకతల జిల్లా.. అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లాకు మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో నూటికి నూరు శాతం కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగినట్లు నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా నూరు శాతం కాన్పులు కోతల్లేకుండా సాధారణ కాన్పులే. ఈ ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు 6,181 కాన్పులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణంగా జరిగి నట్లు నివేదిక పేర్కొంది. వీటిలో ఒక్కటి కూడా కోత (సిజేరియన్) కాన్పు లేదని వెల్లడించింది. -
నయనతార ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్.. కవలలకు జన్మనిచ్చిన నటి
కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేశ్ శివన్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. తాజాగా నయనతార ఇద్దరు మగ పిల్లలకు(ట్విన్స్) జన్మనిచ్చినట్లు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు నయన్, విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయనతార నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్-విక్కీలు జూన్ 9న తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. ఇటీవలే అభిమానుల కోసం వీరిద్దరి పెళ్లి వేడుకను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నట్లు సర్ప్రైజ్ ఇచ్చారు. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వీరి పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని అభిమానులకు చూపించనున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి లవ్ స్టోరీ, పెళ్లి వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ప్రసారం కానుంది. అయితే నయనతార సరోగసి ద్వారా కవలలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. Nayan & Me have become Amma & Appa❤️ We are blessed with twin baby Boys❤️❤️ All Our prayers,our ancestors’ blessings combined wit all the good manifestations made, have come 2gethr in the form Of 2 blessed babies for us❤️😇 Need all ur blessings for our Uyir😇❤️& Ulagam😇❤️ pic.twitter.com/G3NWvVTwo9 — Vignesh Shivan (@VigneshShivN) October 9, 2022 -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్.. హరీశ్‌రావు ప్రశంసలు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. హరిశ్‌రావు ట్వీట్ తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు చాలా మెరగుపడ్డాయని, అందరికీ మొదటి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వించాల్సిన సమయం అని ట్వీట్ చేశారు. Congratulations to @Collector_JSK & Addl Collector Mulugu on delivering baby boy at district Area hospital. It is a matter of immense pride that health infrastructure in the state under able leadership of #CMKCR Garu, became first choice of people. pic.twitter.com/XNJRepCCoZ — Harish Rao Thanneeru (@trsharish) October 4, 2022 చదవండి: రాహుల్ యాత్ర విచ్ఛిన్నం కోసమే ఈడీ, ఐటీ దాడులు -
ఇది ప్రారంభం మాత్రమే!
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట ఆనందం వెల్లి విరిసింది. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. ‘శనివారం ఉదయం కొడుకు పుట్టాడు.. 2022 ఆగస్టు 20న ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పేరు పేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే. చిన్నారి రాకతో మా జీవితాలు మారిపోతాయనే విషయం మాకు తెలుసు’ అంటూ ఆమె పోస్ట్ చేశారు. కాగా సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాలు 2018 మే నెలలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు సోనమ్. ఆ తర్వాత బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేసుకున్నారు. సోనమ్–అహూజా తల్లితండ్రులయిన సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు..
Producer Dil Raju Blessed With Baby Boy With Wife Tejaswini: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు సతీమణి తేజస్విని బుధవారం (జూన్ 29) ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజు, అనితలకు ఒక కుమార్తె హన్షిత ఉంది. కాగా ప్రస్తుతం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఈ సమయంలోనే దిల్ రాజు ఇంటికి నిజంగానే వారసుడు వచ్చాడు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్ తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్ Superhit Producer Dil Raju blessed with a baby boy. Congratulations 🎉 — BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాజల్-గౌతమ్ కిచ్లు దంపతులకు మంగళవారం(ఏప్రిల్ 19) మగబిడ్డ పుట్టినట్టు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు కాజల్ కానీ, ఆమె భర్త గౌతమ్ కిచ్లు కానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే కాజల్ దంపతులకు మగబిడ్డ పుట్టాడంటూ పలు నేషనల్ వెబ్‌సైట్స్ తమ కథనంలో పేర్కొన్నాయి. అంతేకాదు ప్రముఖ సెలబ్రెటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘బేబీ బాయ్(Baby Boy)’ అని స్పష్టం చేశాడు. చదవండి: ‘ఆచార్య’ రీషూట్‌పై స్పందించిన డైరెక్టర్ కొరటాల దీంతో కాజల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కాజల్ దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే కాజల్ దంపతుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా ఎన్నో రూమర్ల అనంతరం కాజల్ జనవరిలో తన ప్రెగ్నెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బేబీ బంప్ ఫొటోలను, భర్త గౌతమ్ కలిసి బేబీ బంప్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ వచ్చింది. ఇక 2020 అక్టోబర్ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Congratulations to #kajalagarwal and hubby Gautam Kitchlu as they are blessed with a baby boy https://t.co/qEpN0oNtRW — Viral Bhayani (@viralbhayani77) April 19, 2022 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!
నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి ఎదుట రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన ఓ ఆటోలో మూడ్రోజుల మగ శిశువు లభ్యమైంది. నాంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దుస్తుల్లో చుట్టిన శిశువు ఏడుపులు విన్న ఆటో డ్రైవర్ నిలోఫర్ ఆస్పత్రికి, పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వైకల్యంతో పుట్టిన కారణంగానే పసికందును ఆటోలో వదిలివెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. శిశువిహార్ సిబ్బందికి సమాచారం అందించి చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యను సంతోష పెట్టడం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి..) -
మగపిల్లాడు పుడతాడని తలలో మేకు దించుకున్న గర్భిణి!
రోజుకో సరికొత్త టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో పలుచోట్ల మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మతున్నారంటే ఆశ్చర్యంగా అనిపించకమానదు. పైగా ఈ మూఢనమ్మకాల మాయలో అత్యంత క్రూరమైన పనులకు ఒడిగడుతున్నారు. అంతేకాదు ఈ మూఢనమ్మకాల మాయలో తమ జీవితాలను బలి చేసుకున్నవాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ మగపిల్లాడి కోసం భూతవైద్యుడి మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అసలు విషయంలోకెళ్తే... పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నివశిస్తున్న ఒక గర్భిణికి ముగ్గురు ఆడపిల్లలు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమోనన్న భయంతో భూతవైద్యుడిని సంప్రదించింది. అయితే ఆ భూతవైద్యుడి మగపిల్లాడు కావాలంటే తలలో మేకు దించుకోవాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ మగపిల్లాడి మీద ఆశ కొద్దీ అంగీకరించింది. ఈ మేరకు ఆ భూత వైద్యుడు ఆమె తలపై ఒక సుత్తితో మేకుని దించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి నొప్పికి తాళలేక పోయింది. పైగా ఆ భూత వైద్యుడు మేకు తీయడానికి ప్రయత్నిస్తే అది తలలోనే ఇరుక్కుపోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆస్పత్రిలోని వైద్యులు ఆపరేషన్ చేసి ఆ మేకును తీసేశారు. అంతేకాదు మగపిల్లాడు కోసం తాను ఈ చర్యకు పాల్పడ్డానని, భూతవైద్యుడే సుత్తితో మేకుని తలలోకి దించాడని వైద్యులకు ఆ బాధితురాలు తెలిపింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పెషావర్ పోలీసులు రంగంలోకిదిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. Special team has been made to bring to justice the fake Pir who played with the life of an innocent woman & put a nail in her head, with a false promise of a male child. The team will also investigate why incident was not reported to police by the treating doctor. — Abbas Ahsan (@AbbasAhsan) February 8, 2022 -
తండ్రైన యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ తన ట్విటర్లో స్వయంగా వెల్లడించాడు."నా అభిమానులకు, స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఒక శుభవార్త. మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోప్యతకు భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: యువరాజ్ సింగ్ గురించి మనకు తెలియని విశేషాలు కాగా 2016లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్‌ల వివాహమైన సంగతి తెలిసిందే. ఇక 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యువీ బౌలింగ్‌లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో యువీ పాత్ర మరువలేనిది. చదవండి: Legends League Cricket 2022: వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే ❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe — Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022 -
అయ్యో.. ఎంత ఘోరం.. బారసాల మురిపెం తీరకముందే..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): బారసాల చేసి నోటి నిండా బిడ్డను పిలుచుకోకుండానే ఆ దేవుడు ఆ దంపతులకు తీరని వేదనను మిగిల్చాడు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చినా ఆ తల్లి మురిపెంగా 21వ రోజు(నామకరణం) చేసిన మరుసటి రోజే మృత్యువు ఆ పసికందును కబళించడం అందరినీ కలచివేసింది. కనుపాప కళ్లముందే తుదిశ్వాస విడవడంతో ఆ కన్నతల్లి గుండెలు అవిసేలా రోదించడం అందరినీ కలచి వేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లెకు చెందిన చెరుకు మానస–భాస్కర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు గౌతమి(3) ఉండగా, 22రోజుల క్రితం మరో ఆడబిడ్డకు మానస జన్మనిచ్చింది. నామకరణం జరిపిన మరుసటిరోజు మరోసారి వైద్య చికిత్సకోసం మానస ఇద్దరు కూతుర్లు, అత్త ఎల్లవ్వతో కలిసి ఓ ఆటోలో బుధవారం సిరిసిల్ల వెళ్తుండగా పెద్దూరు శివారులో టాటా పికప్, ఆటో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పసికందు ఆటోలో ఉన్న తల్లి ఒడి నుంచి జారి కింద పడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో సిరిసిల్లకు తరలించేలోపే మరణించింది. మానసతో పాటు ఎల్లవ్వ, గౌతమిలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రాగట్లపల్లెలో విషాదం నింపింది. బిడ్డ కోసం రూ.2లక్షల ఖర్చు.. ప్రమాదంలో మరణించిన పసికందును కడుపులో ఉండగా అనారోగ్యంతో ఉన్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రుల్లో రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ఉమ్మినీరు తక్కువగా ఉండడం, పాప ఎదుగుదల సరిగా లేని కారణంగా వైద్యుల సూచనల మేరకు బిడ్డను దక్కించుకోవడానికి దొరికిన కాడల్లా అప్పులు చేసి ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన మురిపెం మూడునాళ్లు నిలవకముందే రోడ్డు ప్రమాదం ఆ పసికందును దంపతులకు దూరం చేసి కడపుకోతను మిగిల్చింది. విగత జీవిగా మారిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!
న్యూజిలాండ్‌లోని గ్రీన్‌కు చెందిన పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) తన బిడ్డ పుట్టడం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ, కొడుకు పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె కడుపుతో ఉండి సైక్లింగ్ చేసిన విధానాని వివరిస్తూ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) ఈ మేరకు జెంటర్కి సైకిల్ తొక్కాలని ముందుగా ఎటువంటి ప్లాన్ చేయలేదు. అయితే జెంటర్కి తెల్లవారుఝామున 2 గంటలకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకుంది. పైగా ఆ నొప్పులు అంత ఎక్కువగా ఏమి రావడం లేదుకదా అని సైక్లింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాలనుకుంది. ఆ తర్వాత ఆమెకు ఉదయ 3 గంటల సమయంలో సుఖ ప్రసవం అయ్యి ఆరోగ్యవంతమైన మగపిల్లాడు పుట్టాడు. అంతేకాదు జెంటర్ తాను సైక్లింగ్ చేయడం వల్ల ఎక్కువ సేపు నొప్పుల పడాల్సిన అవసరం లేకుండానే చాలా తొందరగా ప్రసవం అయిపోయిందంటూ క్యాప్షన్ పెట్లి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసించడమేకాక సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల డెలివరీ సమయంలో మంచి ప్రయోజనం ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!) -
అయ్యో.. చిన్నారికి ఎంత కష్టం..
సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఈ పిల్లాడు ఆస్పత్రి బెడ్డుపై బిక్కుబిక్కుమంటున్నాడు. గుండెకు రంధ్రం పడి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బిడ్డడిని చూస్తూ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన బందారపు లింగేశ్వర్, శైలజ దంపతుల ఎనిమిది నెలల బాబు మోక్షిత్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగు నెలల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పుట్టుకతోనే హృదయానికి రంధ్రం ఉందని అక్కడి వైద్యులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు సిఫారసు చేయగా..పరీక్షించిన పెద్ద డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.12 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాకపోవడంతో పెయింటింగ్ వర్కర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న లింగేశ్వర్.. ఇప్పటి దాకా రూ.3 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాడు. ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డడిని చూస్తూ.. చేతిలో డబ్బులు లేక కుమిలిపోతున్న ఆ అమ్మానాన్నల హృదయ వేదన అంతాఇంతా కాదు. దాతలు సాయం చేయాలి.. వైద్య సౌకర్యం ఉన్న ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలో లేకపోవడంతో మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని, తమ బిడ్డ మోక్షిత్ ఆపరేషన్‌కు దాతలు సాయం చేయాలని లింగేశ్వర్, శైలజ కోరుతున్నారు. దయార్థ్ర హృదయులు స్పందించాలని వేడుకుంటున్నారు. సెల్ నంబర్ 8179913499కు కాల్ చేసి కానీ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కానీ..ఆర్థిక సాయం చేసి, ఆపరేషన్‌కు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. -
అరుదైన బాలుడు.. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ఇలా..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు. పాల్వంచకు చెందిన శ్రావణి నెలలు నిండడంతో ప్రసవం కోసం భద్రాచలంలోని సురక్ష ఆస్పత్రికి వచ్చింది. కాగా, వైద్యులు డాక్టర్ శ్రీక్రాంతి, డాక్టర్ అక్కినేని లోకేష్, నర్సుల బృందం సోమవారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. శ్రావణికి పండంటి బాబు జన్మించగా.. శిశువు ఐదు కిలోల బరువు ఉన్నాడు. సహజంగా పిల్లలు రెండున్నర నుంచి నాలుగు కిలోల వరకు జన్మిస్తారని, ఐదు కేజీలు ఉండడం అరుదైన విషయమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే ఇలా అధిక బరువుతో జన్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వివరించారు. -
తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా
TV Actress Sameera Sahrif Introduced Her Baby Boy Arhan: ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్ సమీరా తొలిసారిగా తన చిన్నారిని పరిచయం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. 'మా ఆనందాలకు చిరునామా..మా బేబీ సయ్యద్ అర్హాన్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నేను ఎదుగుతున్న కొద్దీ ఆ ఇష్టం మరింత పెరిగింది. నా మేనకోడళ్లు, అల్లుళ్లు, ఫ్రెండ్స్ పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. ఇప్పడు నా కన్నబిడ్డ ఇప్పుడు నా చేతుల్లో ఉండటం అన్నది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారణం అయిన దేవుడికి ధన్యవాదాలు. థ్యాంక్యూ అర్హాన్..మమ్మల్ని తల్లిదండ్రులుగా సెలక్ట్ చేసుకున్నందుకు. నీకు బెస్ట్ మథర్గానే కాకుండా, బెస్ట్ ఫ్రెండ్‌గా కూడా ఉంటానని మాటిస్తున్నాను' అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకుంది. కాగా 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం సీరియల్స్‌కు బ్రేక్ ఇచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో ఎంతోమంది ఎంటర్టైన్ చేస్తుంది. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) -
కొడుకు పుడితేనే మా ఇంటికి రా..!.. భర్త, అత్త వేధింపులు
బహదూర్‌పురా: గర్భంలో ఆడపిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో.. మగపిల్లవాడు పుడితేనే ఇంటికి రా.. అని భర్త, అత్త ఖరాఖండిగా చెప్పడంతో నాలుగు నెలల గర్భిణీ మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురును ఈ ప్రపంచంలోకి రానివ్వడం లేదని ఈ లోకం విడిచి వెళ్లింది. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక శనివారం బలవన్మరణం పొందింది. కామాటిపురా ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన మేరకు.. మోయిన్‌పురా ప్రాంతానికి చెందిన మీనాజ్ బేగం కూతురు రుబీనా బేగం (23).. ముర్గీచౌక్ ప్రాంతానికి చెందిన అమేర్‌ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. భర్త, అత్తింటి వారు అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. రుబీనా బేగం నాలుగు నెలల గర్భవతి కావడంతో ఇటీవల పుట్టింటికి పంపించారు. మళ్లీ ఆడ పిల్ల పుడితే మా ఇంటికి రావద్దంటూ భర్త, అత్త ఖరాఖండిగా చెప్పారు. మీ సామగ్రిని పంపిస్తామని తేల్చి చెప్పారు. గర్భంలో ఆడ పిల్ల ఉంటే ఆబార్షన్ చేయించుకో... మగ పిల్లవాడు ఉంటేనే ఇక్కడికి రావాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రుబీనా బేగం శనివారం ఉదయం మొదటి అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పైకి వెళ్లిన కూతురు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మీనాజ్ బేగం తలుపులు పగలగొట్టి చూడగా... ఉరేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మీనాజ్‌బేగం ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వేటగాళ్ల ఉచ్చుకు పులి బలి!) -
తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన నటి
ఎట్టకేలకు తన బిడ్డ విషయంలో బెంగాలి నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ స్పందించారు. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి కారణం ఆమె భర్త నిఖిల్ జైన్‌తో విడిగా ఉండటమే. నిఖిల్ ఇంటి నుంచి బయటకు వచ్చాక తాను గర్భవతినని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయినా ఆమె నోరు విప్పలేదు. కానీ తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్ దాస్ గుప్తా పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. కాగా గతేడాది లాక్డౌన్ టైమ్‌లో `ఎస్ఓఎస్ కోల్‌కతా` సినిమా షూటింగ్ టైమ్‌లో నుస్రత్, యష్ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. అయితే యష్ దాస్ గుప్తాకు ఆల్రెడీ పెళ్లి అయింది. ముంబైకి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న శ్వేత సింగ్‌ను యష్ పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని సమాచారం. కాగా, జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించారు. -
పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ సమీరా
బుల్లితెర నటి, యాంకర్ సమీరా పండంటి మగబిడ్డకు జన్మనించింది. ఈ విషయాన్ని ఆమెఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సెప్టెంబర్ 4న తమ కుటుంబంలోకి ఓ మగబిడ్డ వచ్చాడని సమీరా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా పంచుకుంది. తనకు తోడుగా నిలిచిన అభిమానులకు, కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డెలివరీ చేసిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. కాగా, 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.ఈ తర్వాత ఈ యంకరమ్మ బుల్లితెరకు దూరమైంది. View this post on Instagram A post shared by Syed Anwar (@syedanwarofficial) -
మీ బిడ్డ తండ్రి ఎవరో చెప్పండి?!.. నటి ఘాటు జవాబు
సెలబ్రీటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. కొందరైతే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారి కోపానికి కారణమవుతుంటారు. అలాంటి ప్రశ్నే బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. నుస్రత్ జహాన్ ఈ మధ్యే ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తల్లైన దాదాపు నెల తర్వాత మొదటిసారి ఆమె పబ్లిక్‌లోకి వచ్చింది. బుధవారం కోల్‌కతాలో ఓ సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. (చదవండి: నా మొదటి ప్రేమ అలా.. ఎమోషనల్ అయిన షమితా శెట్టి) కాగా, జూన్ 19, 2019లో నుస్రత్, వ్యాపారవేత్త నిఖిల్ జైన్ టర్కీలోని ప్రైవేటు వెడ్డింగ్ సెరెమనీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించింది. ఆ సమయంలో ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్ దాస్‌గుప్తా రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వినిపించాయి. ఈ తరుణంలో గతనెల ఆమె ఓ మగబిడ్డకి జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. -
తల్లి అయిన టీఎంసీ ఎంపీ, విషెస్ చెప్పిన మాజీ భర్త
కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం బుధవారం రాత్రి కోల్‌కతా పార్క్ స్ట్రీట్‌లోని భగీరథి నియోతియా ఆమె చేరారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయిందనీ, తల్లీ బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని బెంగాలీ నటుడు, నుస్రత్ స్నేహితుడు యష్ దాస్‌గుప్తా ప్రకటించారు. దీంతో నుస్రత్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అభిమానులు, రాజకీయ మిత్రులు ఆమెకు అభినందనలు అందజేస్తున్నారు. Congratulations @nusratchirps wish could hug in personal. Love and hugs — Mimssi (@mimichakraborty) August 26, 2021 జూన్‌లో తన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను, స్నేహితుల శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన నుస్రత్ గురువారం ఉదయం కూడా హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్న దాస్గుప్తానే స్వయంగా దగ్గరుండి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు తమ మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ అంటూ తల్లీ బిడ్డలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ భర్త నిఖిల్ బాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా గతేడాది నవంబర్ నుంచి నుస్రత్, నిఖిల్ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nusrat (@nusratchirps) -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి కీర్తి ధునుష్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, బుల్లితెర నటుడు ధనుష్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. చిన్నారికి అప్పుడే రుద్వేద్‌గా పేరు పెట్టారు. కీర్తి-ధనుష్ తొలిసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడంతో బుల్లితెర నటులు సహా నెటిజన్లు ఈ కపుల్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఇటీవలె కీర్తి సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా కీర్తి బావ నిరుపమ్ అలియాస్ డాక్టర్‌బాబు అన్న విషయం తెలిసిందే. నిరుపమ్ భార్య మంజులా పరిటాల స్వయానా కీర్తికి అక్క. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. View this post on Instagram A post shared by 🅹🅰️🅸🅳🅷🅰️🅽🆄🆂🅷 (@jaidhanushofficial) -
హర్భజన్ సింగ్ కొడుకు పేరేంటో తెలుసా?
టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా ఇటీవల జన్మించిన తమ కుమారుడికి పేరు పెట్టారు. ఈ నెల జన్మించిన తమ ముద్దుల తనయుడికి జోవన్ వీర్‌గా నామకరణం చేసినట్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు గీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇందులో కూతురు హినయ తన తమ్ముడిని అప్యాయంగా చేతులోకి తీసుకున్నఫోటోను షేర్ చేస్తూ.. ‘పరిచయం చేస్తున్నాం మా హీర్ కా వీర్ జోవన్ వీర్ సింగ్ ప్లాహా’ అని కామెంట్ చేశారు. ఇక ఈ పోస్టుపై అభిమానులు స్పందిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా గత నెలలో హర్భజన్ మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయన భార్య గీతా బస్రా మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్ సింగ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు.. తల్లి బిడ్డా క్షేమంగా తెలిపాడు. అయితే హర్భజన్, గీత దంపతులకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. 2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు. గీతా బాలీవుడ్ లో ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి పలు సినిమాల్లో నటించింది. గీత, హర్భజన్ లు ప్రేమించుకుని 2015 లో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Geeta Basra (@geetabasra) -
తండ్రిగా ప్రమోషన్ పొందిన నటుడు..ఫోటోలు వైరల్
బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మహత్ రాఘవేంద్ర అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. మహత్ భార్య ప్రాచీ నిన్న (సోమవారం) ఉదయం పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని స్వయంగా మహత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 'ఈరోజు ఉదయం ఓ అందమైన పిల్లాడిని దేవుడు మాకు ప్రసాదించాడు. చిన్నారి రాకతో నేను, ప్రాచీ ఆనందంలో మునిగితేలుతున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నాన్నగా ఎంతో ఎక్సయిటెడ్గా ఉన్నాను' అని ట్వీట్ చేశాడు. చిన్నారితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక మహత్ పోస్టుపై స్పందించిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమిళ బిగ్‌బాస్-2తో మహత్ మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు డేటింగ్ అనంతరం ప్రాచీ, మహత్ 2020లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇక ప్రాచీ మాజీ మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ప్రాచీ ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నారు. God has blessed us with a cute little baby boy today morning! Prachi & me are over joyed with this bundle of happiness. Thank you everyone for all your love and good wishes 🤗❤️ So excited to be a dad🤩 @meprachimishra pic.twitter.com/FWrkMC82yz — Mahat Raghavendra (@MahatOfficial) June 7, 2021 చదవండి : సమంత గుడ్‌న్యూస్ చెప్పబోతోందా.. ఆ ఫోటోతో జోరుగా ప్రచారం! పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిర్చి’ హీరోయిన్ -
ఇంగ్లీష్ ఛానల్లో ప్రమాదం: 900 మైళ్ల దూరంలో శవం
నార్వే : గత సంవత్సరం బోటులో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటుతూ కుటుంబంతో పాటు గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 900మైళ్ల దూరంలో నార్వేలోని కార్మోయ్లో బాలుడి మృతేహాన్ని గుర్తించారు అధికారులు. గత సంవత్సరం అక్టోబర్ 27న తండ్రి రసూల్, తల్లి శివ, అక్క అనిత, అన్న అర్మిన్తో పాటు 15 నెలల ఆర్టిన్ బోటు ప్రమాదానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మిగిలిన కుటుంబసభ్యుల మృతదేహాలు లభించినప్పటికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఇక అప్పటినుంచి అధికారులు బాలుడి మృతదేహం కోసం అన్వేషణ మొదలుపెట్టారు. గత జనవరి నెలలోనే అతడి మృతదేహాన్ని గుర్తించారు. అయితే శవం పూర్తిగా పాడై ఉండగా.. అతడు ఆర్టినో కాదో కనుక్కోవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో శవానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల అనంతరం అది ఆర్టినేనని తేలింది. చిన్నారి శవాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లాల్సిందిగా ఇరాన్‌లోని ఆర్టిన్ బంధువులకు అధికారులు సమాచారం అందించారు. కాగా, ఇరాన్‌కు చెందిన రసూల్ కుటుంబం మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో ఆస్తులన్నీ అమ్ముకుని గత సంవత్సరం ఆగస్టు నెలలో యూకే పయనమైంది. అన్ని అడ్డంకులు దాటుకుని ఫ్రాన్స్‌కు చేరుకుంది. యూకేను చేరుకోవటానికి చేసిన ఓ రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈనేపథ్యంలో బోటులో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటడానికి ప్రయాణం కట్టారు. అయితే, సామర్థ్యానికి మించి మనషుల్ని కలిగి ఉండటంతో ఆ బోటు అక్టోబర్ 27న సముద్రంలో మునిగిపోయింది. చదవండి : 16 ఏళ్లకు భారీ అదృష్టం.. సరిగ్గా ఏడేళ్లకు ఊహించని విషాదం -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘మిర్చి’ హీరోయిన్
నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడనే శుభవార్తను సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించారు. బాబుకు ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. తన ముద్దుల తనయుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మా చిరు సంతోషం.. లుకా షాన్. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం. లుకా ఆరోగ్యంగా, ఆనందంగా, అచ్చం తన తండ్రి పోలికలతో ఉన్నాడు. లుకా.. నీ నువ్వు మా జీవితాల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా రిచా తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను సీక్రెట్‌గా వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే తను పెళ్లి చేసుకున్న విషయాన్ని కొద్ది రోజుల తర్వాత ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. అలాగే తన తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ను కూడా రహస్యంగా ఉంచిన ఆమె కొద్ది రోజుల కిందట బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి అసలు విషయం బయటపెట్టారు. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన రిచా.. గత నెల 27న పండంటి మగ బిడ్డ పుట్టాడంటు ఈ సారి కూడా కాస్త ఆలస్యంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తమకు పుట్టిన చిన్నారి ఫొటోలను కూడా రిచా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రిచా. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఆమె ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ‘మిర్చి’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమా కనిపించిన రిచా ఆ తర్వా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్ స్కూల్లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. View this post on Instagram A post shared by Richa Langella (@richalangella) చదవండి: Adipurush: ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్! లైవ్‌లో నీ వయసు అదేనా అని అడిగిన నెటిజన్, హీరోయిన్ కౌంటర్ -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్
సింగర్ నీతి మోహన్ బుధవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన విషయాన్ని ఆవిడే స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'మా కుటుంబంలోకి ఓ బుడ్డోడు అడుగు పెట్టినందుకు నిహార్ పాండ్యా, నేను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాం. ఆ పసివాడిని నా చేతుల్లోకి తీసుకోవడం అనేది మర్చిపోలేని అనుభూతి. ఇప్పటికీ అదే ఆనందంతో పులకరించిపోతున్నాను' అని రాసుకొచ్చింది. అటు నిహార్ కూడా తొలిసారి తండ్రైనందుకు ఆనందం వ్యక్తం చేశాడు. 'నాకు మా నాన్న నేర్పించినవన్నీ ఈ చిన్నోడికి నేర్పించే అవకాశాన్ని నా అర్ధాంగి కల్పించింది. ఆమె అనునిత్యం నాకు ప్రేమను పంచుతూనే ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు' అని పేర్కొన్నాడు. కాగా ఒక ఫ్రెండ్ పెళ్లిలో నిహార్ పాండ్యా, నీతి మోహన్ కలుసుకున్నారు. అక్కడి నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వరకూ వెళ్లింది. 2019 ఫిబ్రవరి 15న జరిగిన వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ వేదికగా నిలిచింది. ఇదిలా వుంటే నీతి.. జియా రే, ఇష్క్ వాలా లవ్. సాదీ గల్లీ ఆజా వంటి పలు పాటలు ఆలపించింది. ఇక గతంలో మోడల్‌గా మెరిసిన నిహార్ నటుడిగానూ సత్తా చాటాడు. 'మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ జాన్సీ' చిత్రంలోని ఓ పాత్రలో తళుక్కుమని మెరిసాడు. View this post on Instagram A post shared by NEETI MOHAN (@neetimohan18) చదవండి: హృతిక్ రోషన్ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్! యాంకర్ రవిపై ఫన్ బకెట్ జస్విక ఆసక్తికర వ్యాఖ్యలు -
వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!
సాక్షి, ఊట్కూర్: చిన్నారులకు చాక్లెట్లు.. ఐస్‌క్రీంలు.. బిస్కెట్లు అంటేనే ఎంతో ఇష్టం.. వాటి కోసం అల్లరి చేయడం పరిపాటి. అలాంటిది ఓ బుడతడు మాత్రం మూడు పూటలా పది చొప్పున వేపాకులు తింటూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన ఉమాదేవి, సూరం ప్రకాశ్ దంపతులకు కుమారుడు తనిష్క్ (15 నెలల బాలుడు) ఉన్నాడు. ఆరు నెలలుగా వేపాకును తింటున్నాడు. తండ్రి ఉదయం, సాయంత్రం వేళ వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ.. వాటికున్న పూలను చిన్నోడు ముందు వేసేవారు. ఆ చిన్నో డు ఆడుతూ.. పాడుతూ.. ఆ వేప పూలు తినేవాడు.. ప్రస్తుతం ఆకులు తినే అలవాటు చేసుకున్నాడు. రోజూ వేపాకు తింటే ఏమైనా అలర్జీ వచ్చిందా అనుకుంటే పొరపాటే.. అలాంటిదేమీ లేదంటున్నారు తల్లిదండ్రులు.. బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నట్లుగా వేపాకును నములుతున్నాడని చెబుతున్నారు. దీనిపై నారాయణపేటలోని డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించగా వేపాకులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రావన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యాంటీబాడీలు పెరుగుతాయన్నారు. చదవండి: కరోనా: వివాహంలో.. మాస్కులే పూల దండలు -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు షేర్ చేస్తు.. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇంతటి అనుభూతిని గతంలో ఎప్పుడు నేను పొందలేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా కుటుంబం సంతోషంలో మునిగితేలుతున్నాం’ అంటు ఆమె ఈ విషయాన్ని అభిమానులతో, సన్నిహితులతో పంచుకున్నారు. అలాగే తను బిడ్డకు మీరందరు ఇచ్చే లెక్కలేనన్ని ఆశ్వీర్వాదాలకు ధన్యవాదాలు అంటు ఆమె రాసుకొచ్చారు. కాగా శ్రేయా ఇటీవల బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాను అమ్మని కాబోతున్నానని, ప్రస్తుతం అమ్మ తనాన్ని ఆస్వాధిస్తున్నానంటు శ్రేయా మురిసిపోయింది. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్.. బాలీవుడ్.. మాలీవుడ్.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్ జగదీశ్’ సినిమాల్లో కూడా ఆమె పాడారు. చదవండి: శ్రేయా ఘోషల్ బేబీ బంప్ ఫోటోలు వైరల్ -
కొడుకు పేరును రివీల్ చేసిన హీరో
తమిళ హీరో కార్తి, రంజని దంపతులకు గతేడాది అక్టోబర్‌లో అబ్బాయి పుట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు తన వారసుడికి సంబంధించిన ఫోటోలను కానీ, ఇతర విషయాలను కానీ కార్తి బయట ప్రస్తావించలేదు. కేవలం కొడుకు పుట్టాడని మాత్రమే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. తమ హీరో వారసుడు ఎలా ఉన్నాడు? అతనికి ఏం పేరు పెట్టారు? అనే విషయాల కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. బుధవారం తన కొడుకుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పేరును ప్రకటించాడు కార్తి. ఈమేరకు తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో ‘నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి అని రాసుకొచ్చాడు హీరో కార్తి. కొడుకు పేరు అనౌన్స్ చేసిన వెంటనే కార్తికి సినీ ప్రముఖులతో పాటు అభిమనులను నుంచి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. కాగా, 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. కార్తి ప్రస్తుతం ప్రస్తుతం సుల్తాన్, పొన్నీయన్ సెల్వన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) -
రెండోసారి తండ్రైన స్టార్ కమెడియన్
ముంబై: బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. ఈ రోజు ఉదయం ఆయన భార్య గిన్ని చరాత్ పండంటి మగ బిడ్డకు జన్మినించారు. ఈ విషయాన్ని కపిల్ శర్మ సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించాడు. ‘నమస్కార్.. ఈ రోజు ఉదయం నా భార్య మగ బిడ్డకు జన్మినించింది. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటీనటులు, అభిమానులు కపిల్‌కు శభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే తమ ఇంట్లోకి చిన్న అతిథి రాబోతున్నాడన్న శుభవార్తను గతవారం కపిల్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: అందుకే బ్రేక్ తీసుకుంటున్నా: కపిల్ శర్మ) 2018లో హిందూ, సిక్కు సంప్రదాయంలో వివాహం చేసుకున్న కపిల్ శర్మ-గిన్ని చరాత్లకు 2019 డిసెంబర్లో కూతురు అనైరా శర్మ జన్మించింది. కాగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ షోతో ప్రాచుర్యం పొందిన కపిల్ శర్మ.. హిందీ బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అంతేగాక.. ఒక షోకు అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇక పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించిన కపిల్.. ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. Namaskaar 🙏 we are blessed with a Baby boy this early morning, by the grace of God Baby n Mother both r fine, thank you so much for all the love, blessings n prayers 🙏 love you all ❤️ginni n kapil 🤗 #gratitude 🙏 — Kapil Sharma (@KapilSharmaK9) February 1, 2021 -
తండ్రైన ప్రముఖ దర్శకుడు
సాక్షి చెన్నై: ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.తమకు కుమారుడు జన్మించాడంటూ రాఘవన్ భార్య గీతాంజలి తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అప్పుడే ఈ బుడ్డోడికి రిషికేష్ అనే పేరు కూడా పెట్టేశారు. గురువారం ఉదయం "రిషికేశ్ సెల్వరాఘవన్’’ తమ జీవితాల్లోకి ఎనలేని ఆనందాన్నితీసుకొచ్చాడంటూ గీతాంజలి ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని, తాము క్షేమంగా ఉన్నామని తెలిపారు. అలాగే తమకు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దీంతో తమిళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు వీరికి విషెస్ అందిస్తున్నారు. కాగా సెల్వరాఘవన్ తమిళ హీరో ధనుష్ సోదరుడు. 2006లో నటి సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. అనంతరం తన సహాయ దర్శకురాలు గీతాంజలిని సెల్వ రాఘవన్ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరికీ పిల్లలు లీలావతి, ఓంకార్ ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే గీతాంజలి, గత ఏడాది నవంబర్ నుంచి తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మహేష్ హీరోయిన్
నటి అమృతా రావు- ఆర్జే ఆన్మోల్ దంపతుల ఇంట్లోకి బుజ్జి పిల్లవాడు అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటి ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. అదే విధంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు అమృతా టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అమృతా, ఆర్జే ఆన్మోల్ దంపతులకు ఇది మొదటి సంతానం. కాగా గత నెలలో(అక్టోబర్) తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమృతారావు, ఆర్జే అన్మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్! ఇక సినిమాల విషయానికొస్తే.. వివాహ్, ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు, సూపర్ స్టార్ మహేష్‌బాబు అతిథి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్లో జమ్మీన్ అనే మ్యూజిక్ షోను హోస్ట్ చేస్తున్నారు. View this post on Instagram For YOU it’s the 10th Month... But for US, it's THE 9th !!! 🥳 🥰🕺💃 Surprise Surprise ..Anmol and I are in our NINE'th month Already !! Too excited to share this good news with You my Fans 🤗 And Friends ( sorry had to keep it tucked in my Belly All this long ) But It's True ... the Baby is Coming Soon 😃... An exciting journey for me, @rjanmol27 and our Families... ... Thank you universe 💫 And thank you ALL Keep blessing 😌🙏... #2020baby #2020mom #2020parents A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 18, 2020 at 9:28pm PDT View this post on Instagram NAVRATRI AND NINE'TH MONTH !! My Dear Instees, I feel blessed to witness my Nine'th month of pregnancy in the auspicious month of Navratri ! These 9 days are dedicated to Goddess Durga and her Nine Avatars. I am entering a New phase of embodying the Avatar of a Mother myself ! I bow to the Highest Female Energy in the Universe 🙏 as I surrender in good faith. May Goddess Durga bless ALL Mother's and Mommy's to be with strength and more power to gracefully carry on with the the many Devine Avatar's that comes along with the territory of motherhood !! 💫🤱🤰🌟 Wishing you ALL on Ashtami #HappyNavratri #navratri2020 A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 22, 2020 at 9:36pm PDT -
మళ్లీ నా బిడ్డను చూస్తున్నట్టే ఉంది!
సాక్షి, బెంగళూరు : దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాబు పుట్టాడని చిరంజీవి సర్జా సోదరుడు, నటుడు ధ్రువ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ చెప్పకొస్తున్న ధ్రవ "బేబీ బాయ్, జై హనుమాన్" అంటూ ఆనందం ప్రకటించారు. స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తన బిడ్డకు వెండి ఉయ్యాల కావాలన్న అన్న కోరికను నేరవేర్చానని ధ్రువ తెలిపారు. బాబుకి ఏపేరు పెట్టాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. చాలా సంతోసంగా ఉంది..మళ్లీ నా చిరంజీవిని చూస్తున్నట్టు ఉందంటూ చిరంజీవి సర్జా తల్లి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు మేఘనా, చిరంజీవి నిశ్చితార్థం చేసుకున్న రోజని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. కాగా చిరంజివి సర్జా 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని భార్య మేఘనా రాజ్ గర్భవతి. ఇటీవల మేఘనా బేబీ షవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
తండ్రి అయిన తెలుగు దర్శకుడు
తెలుగు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తండ్రయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో ఆదివారం వెల్లడించారు. నేడు ఉదయం 10.55 గంటలకు బాబు జన్మించాడని చెప్పుకొచ్చారు. శ్రీరామ్ హీరో సుధీర్‌బాబు నటించిన "భలే మంచి రోజు" చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలిచిత్రంతోనే విజయాన్ని నమోదు చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన "శమంతకమణి" చిత్రాన్ని తీశారు. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?) అనంతరం స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం సంపాదించుకున్నారు. అలా కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానిల కలయికలో "దేవదాస్" చిత్రాన్ని రూపొందించారు. కానీ ఇది అనుకున్నంత హిట్ అవకపోగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆయన గతేడాది చివరి నుంచి అశోక్ గల్లా (గల్లా జయదేవ్ కుమారుడు)ను హీరోగా పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: బాలీవుడ్ నటుడికి పుత్రికోత్సాహం) -
హర్దిక్ పాండ్యా కొడుకు పేరు ఏంటో తెలుసా..
ముంబై : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. తనకు కాబోయే భార్య నటాసా స్టాంకోవిక్ జూలై 30న మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కొడుక్కి ‘అగస్త్య’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన ముద్దుల కొడుకు కోసం ఓ బొమ్మ మెర్సిడెజ్ కారును బహుహతిగా పంపిన ఆ కార్ డిలర్ షిప్ కంపెనీకి కూడా ఇన్స్టాగ్రామ్ పోస్టులో కృతజ్ఞతలు తెలిపారు. కాగా చాలా రోజుల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న హార్దిక్ ఐపీఎల్ ద్వారా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. (హార్దిక్ స్పెషల్ ఇన్నింగ్స్‌కు ముంబై విషెస్) ఈ ఏడాది ప్రారంభంలో సెర్బియన్ నటి నటాషాతో హార్థిక్ పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి కాక ముందే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత గత నెలలో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి తన కొడుక్కి సంబంధించిన ఫోటోలను పాండ్య తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోటు నెట్టింటా వైరలవుతున్నాయి. అంతేగాక పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయిన ఈ జంట సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. (కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేసిన హార్దిక్) View this post on Instagram We are blessed with our baby boy ❤️🙏🏾 A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 30, 2020 at 3:03am PDT View this post on Instagram The blessing from God 🙏🏾❤️ @natasastankovic__ A post shared by Hardik Pandya (@hardikpandya93) on Jul 31, 2020 at 9:34pm PDT View this post on Instagram My family ❤️ my 🌍 @hardikpandya93 #blessed #grateful #myboys 🙏🏼❤️ A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Aug 2, 2020 at 9:33am PDT View this post on Instagram When I hold you, life makes sense. ❤️❤️❤️🤱🏻 #mamasboy #blessings A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Aug 12, 2020 at 2:46am PDT -
బాలురే అధికం.. మరణాల్లోనూ పురుషులే..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి మధ్య భారీగా అంతరం కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్న జనన, మరణాలు బాల, బాలికల నిష్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. పుడుతున్న వారిలో బాలురే అధికంగా ఉంటున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ఆయా మున్సిపాలిటీలు, ప్రణాళిక శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా గణాంకాలను క్రోడికరించి ప్రతీ రెండు సంవత్సరాలకోసారి ఒక ఏడాదికి సంబంధించిన జనన, మరణాల లెక్కలను సివిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా 2018 ఏడాదికి సంబంధించి గణాంకాలను తాజాగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం బాలికల కంటే బాలుర సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వివరాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో 75,344 మంది జన్మించగా, 10,596 మంది మరణించారు. అయితే, జన్మిస్తున్న వారిలో బాలురే అధికంగా ఉన్నారు. ఇటు మరణిస్తున్న వారిలోనూ మహిళల కన్నా పురుషులు అధికంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా మొత్తం 25,43,647 కాగా, పురుషులు 12,46,875 మంది, మహిళలు 12,96,781 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాలు ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో 2018 సంవత్సరంలో మొత్తం 75,344 మంది జన్మించారు. ఇందులో 37,972 మంది బాలురు జన్మిస్తే, 36,154 మంది బాలికలు ఉన్నారు. అంటే బాలికల కంటే 1,818 మంది బాలురు ఎక్కువ జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాల సంఖ్యలో ఎక్కువ ఉంది. జీవన ప్రమాణాలు పెరగడం, కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జననాల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2018 సంవత్సరంలో 10,596 మంది మృతి చెందారు. ఇందులో 4,939 మంది మహిళలుంటే, 5,657 మంది పురుషులున్నారు. మరణాల రేటులోనూ పురుషులే అధికంగా ఉన్నారు. శిశు మరణాలు కూడా ఎక్కువగానే సంభవించినట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. 2018లో 480 శిశు మరణాలు నమోదైనట్లు పేర్కొంది. -
తండ్రైన హార్దిక్ పాండ్యా..
ముంబై : భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతనికి కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ గురువారం పండంటి బాబుకు జన్మనించారు. ఈ విషయాన్ని హార్దిక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. దీంతో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్యా, సారా టెండూల్కర్, సోనాల్ చౌహాన్.. సహా పలువురు ప్రముఖులు కూడా హార్దిక్, నటాషా జంటకు కంగ్రాట్స్ తెలిపారు. మరోవైపు అభిమానులు జూనియర్ హార్దిక్ వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. (నటాషా.. అంత గ్లో ఎలా వచ్చింది?) హార్దిక్, నటాషా జోడి ఈ ఏడాది జనవరి 1న తమ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 31న తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. తమ జీవితంలో ఈ కొత్త దశ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. ఈ సమయంలో అభిమానుల ఆశీస్సులు, ప్రేమ కావాలని కోరారు. (ధోనిపై ఒత్తిడి ఎంత ఉందో అప్పుడే తెలిసింది) -
గుర్తు తెలియని శిశువు మృతదేహం లభ్యం
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీ సెక్టార్ – 7లోని క్యాన్సర్ ఆస్పత్రి వెనుకన ఉన్న సెల్లార్లో గుర్తు తెలియని పసికందు మృతదేహం లభ్యమయ్యింది. దీనిపై ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చిన రోజులు వెనుక ఉన్న సెల్లార్లో ఆశ్రయం పొందుతుంటారు. అయితే అక్కడ ఉన్న మరుగుదొడ్డి సమీపంలో ఆదివారం భారీగా దుర్వాసన వస్తుండటంతో ఆస్పత్రి పారిశుధ్య సిబ్బంది పరిశీలించారు. దీంతో చిన్న పిల్లాడి మృతదేహం బయటపడింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఏసీపీ మూర్తి, ఎస్ఐ భాస్కర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అంబులెన్స్‌లో కేజీహెచ్ మార్చురీకి శిశువు మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎంవీపీ ఎస్ఐ భాస్కర్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువు మృతదేహాన్ని ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇది కేవలం క్యాన్సర్ చికిత్స ఆస్పత్రి కావడంతో గర్భిణులకు ఇక్కడ చికిత్స జరగదన్నారు. ఈ నేపథ్యంలో శిశువును ఇక్కడ ఎవరు విడిచిపెట్టారో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. శిశువును బ్యాగ్‌లో తీసుకొచ్చి ఇక్కడ విడిచి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఇటీవల ఎంవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో గర్భిణుల ప్రసవాలకు సంబంధించిన డేటా కూడా సేకరిస్తున్నామని తెలిపారు. దీనిపై ఎవరికైనా వివరాలు తెలిస్తే 9440999804 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. -
స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి
జీడిమెట్ల: అడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, దంతెరపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చి అపురూపాకాలనీలో ఉంటున్నాడు. రామిరెడ్డి భార్య విజయలక్ష్మి అదే కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆఫీస్ క్లర్క్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమారులు రంజిత్ రెడ్డి(5), రిత్విక్‌రెడ్డి(3). శుక్రవారం ఉదయం విజయలక్ష్మి తన చిన్న కుమారుడు రిత్విక్‌రెడ్డితో సహా స్కూల్‌కు వెళ్లింది. మధ్యాహ్నం కుమారుడికి భోజనం పెట్టేందుకు చూడగా రిత్విక్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఇద్దరు కలిసి కుమారుడి కోసం గాలించినా ఆచూకీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పాఠశాల అవరణలోని స్విమ్మింగ్‌పూల్ వద్దకు వెళ్లి చూడగా రిత్విక్ నీటిపై తేలుతూ కనిపించడంతో అతడిని సమీపంలోని అస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. -
పాముకాటుతో బాలుడు మృతి
నందిగామ: ఇంటి ముందు వరండాలో ఆడుకుంటున్న ఓ బాలుడిని పాము కాటేయడంతో మృతిచెందాడు. నందిగామ పంచాయతీ పృథ్వీకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బాలుడి తండ్రి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బుద్ధాదేవ్ ప్రధాన్ కొన్నేళ్ల క్రితం నందిగామకు కుటుంబంతో వలస వచ్చాడు. పృథ్వీ కాలనీలో నివాసం ఉంటూ పక్కన్నే ఉన్న ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బుద్ధాదేవ్ ప్రధాన్ కుమారుడు అధర్వ్ ప్రధాన్(3) ఇంటి వరండాలో ఆడుకుంటుండగా గేటులోనుంచి వచ్చిన పాము బాలుడి కాలుపై కాటు వేసింది. బాలుడు అరుస్తుండగా వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు పరుగెత్తుకొని వచ్చి చూసే సరికి పాము చెట్ల పొదళ్లలోకి వెళ్లి పోయింది. వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాలుడి తండ్రి బుద్ధాదేవ్ ప్రధాన్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం స్వరాష్ట్రానికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
తండ్రి ఘాతుకం
యర్రగొండపాలెం:కుటుంబ సభ్యులు తన చిల్లర ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని 6 నెలల ఆడశిశువును కన్న తండ్రి గొంతుపట్టుకొని విసిరి హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని అమానిగుడిపాడు ఎస్సీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వైదన బాల ఏసు బీడీల కోసం భార్య విజయులును డబ్బులు అడిగాడు. తన వద్ద డబ్బుల్లేవని చెప్పిన వెంటనే కిందపడుకొని ఉన్న పసికందు గొంతుపట్టుకొని విసిరేశాడు. ఆ పాప అక్కడికక్కడే మృతి చెందింది. బాలఏసుకు మతిస్థిమితం లేదని, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థంకాని పరిస్థితని ఆయన బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.ముక్కంటి తెలిపారు. -
అక్రమ దత్తత: బాలుడి దీనగాద
పటాన్చెరు టౌన్: అక్రమ దత్తత వ్యవహారంలో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లికి చెందిన హరణ్ పాత బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది వినాయక చవితి రోజున హైటెక్ సిటీ సమీపంలో పాత బట్టలు అమ్ముతున్న సమయంలో వర్షం రాకతో రెండు సంవత్సరాల బాలుడు అతని వద్దకు తడుస్తూ వచ్చాడు. దీంతో హరణ్ చుట్టు పక్కల బాలుడికి సంబంధించిన వారు లేకపోవడంతో ఆ బాలుడి తీసుకొని పటాన్చెరు సాయి కాలనీలో ఉండే మామా యాకోబ్ ఇంటికి వచ్చాడు. దీంతో యాకోబ్, అతడి భార్య సరోజ పిల్లలు లేని కారణంగా ఆ బాలుడిని వారి వద్ద ఉంచుకున్నారు. అప్పటి నుంచి వారు ఆ బాలుడిని పెంచుకుంటున్నారు. బాలుడి దత్తత అక్రమని వారు సొంత తల్లిదండ్రులు కాదని జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు పోలీసులు బాలుడిని తెచ్చిన హరణ్, అక్రమ దత్తత తీసుకున్న యాకోబ్, సరోజ ముగ్గురు పై కేసు నమోదు చేశారు. కాగా బాలుడిని సంగారెడ్డి శిశువిహార్‌కు పంపించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘చివరి బహుమతి.. జాగ్రత్తగా చూసుకుంటా’
బీజింగ్: ప్రపంచాన్ని కలవర పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్ గురించి ముందుగానే హెచ్చరించి.. చివరకు దానికే బలయిన కళ్ల డాక్టర్ లీ వెన్లియాంగ్ భార్య వారి రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీచాట్‌లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నువ్వు నాకిచ్చిన చివరి బహుమతి ఈ రోజు ప్రాణం పోసుకుంది. ఈ బహుమతిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. స్వర్గం నుంచి నువ్వు దీన్ని చూస్తున్నావా’ అంటూ రాసుకొచ్చింది. ఈ మెసేజ్‌తో తమ రెండో సంతానం అయిన పిల్లవాడి ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. వుహాన్ నగరంలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు స్థానిక వైద్యుడైన వెన్లియాంగ్ సహచరులను దీని గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబర్లో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనా వైరస్ కుటుంబానికి చెందిందే. దాంతో తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబర్ 30న ఆయన మెసేజ్ పెట్టారు. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని పోలీసులు ఆయనను హెచ్చరించారు. చివరకు లీ వెన్లియాంగ్ కూడా కరోనా వైరస్‌తో ఫిబ్రవరిలో మరణించారు. -
అర్ధరాత్రి అమానుష ఘటన..!
కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి అమానుష ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని వీధికుక్కలు బలితీసుకున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..సుమారు పది కుక్కలు మీదపడి కరిచాయి. చిన్నారి హాహాకారాలు చేస్తున్నా విడిచిపెట్టలేదు. తీవ్రంగా గాయపడిన అతన్ని వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన నరసింహ అనే నాలుగేళ్ల బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. తండ్రి కొన్ని నెలలుగా ఓ కేసులో మచిలీపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తల్లి వరలక్ష్మి నాలుగు నెలల పాపను తీసుకుని మూడు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లింది. నరసింహ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే వదిలివెళ్లింది. ఈ చిన్నారి అప్పటి నుంచి రోజూ వీధుల వెంట తిరుగుతూ ఎవరైనా ఒక ముద్ద పెడితే తిని..ఇంటి వరండాలో నిద్రపోయేవాడు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకలేసిందో.. ఏమో తెలియదు గానీ ఇంటి గేటు దూకి వీధిలోకి వచ్చాడు. పోలీస్ క్వార్టర్స్ సమీపంలోని రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. సుమారు 10 కుక్కలుమీద పడి కరిచాయి. శరీరమంతటా గాయపరిచాయి. ముఖ్యంగా తల భాగంలో పీక్కుతిన్నాయి. ఈ క్రమంలో కుక్కల అరుపులు విన్న స్థానికులు బయటకొచ్చి చూశారు. చిన్నారిని కరుస్తున్న దృశ్యాన్ని గమనించి..వెంటనే కర్రలు తీసుకొచ్చి వాటిని తరిమారు. అప్పటికే చిన్నారిని తీవ్రంగా గాయపర్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపే చిన్నారి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. కాగా.. తల్లి ఎక్కడుందో సమాచారం లేకపోవడంతో బాబాయి ఓబులేసు చిన్నారి అంత్యక్రియలు నిర్వహించాడు. బాలుడి మృతి బాధాకరం ఆళ్లగడ్డలో వీధికుక్కల దాడిలో నరసింహ అనే చిన్నారి చనిపోవడం బాధాకరమని శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వీధికుక్కలను వెంటనే సంహరించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబును ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కలను సంహరిస్తాం పట్టణంలో కుక్కల దాడిలో చిన్నారి నరసింహ మృతి చెందడం తమను కలిచివేసిందని ఆళ్లగడ్డ మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని వీధి కుక్కలను పూర్తిగా సంహరిస్తామన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
పాపం 'నందన్'
తోటి చిన్నారులతో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు ఆ బాలుడిది. చక్కగా స్కూల్‌కి వెళ్లి చదువుకోవాల్సిన సమయంలో కిడ్నీ సంబంధిత వ్యాధితో వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నాడు. బాధ కలిగినప్పుడు ఏడవడం తప్ప.. తనకున్న జబ్బుఏంటో కూడా తెలియదు. నెల్లూరు, కలిగిరి: మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కందులవారిపాళెం గ్రామానికి చెందిన మార్తుల సుధాకర్‌రెడ్డి, అనూష దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు హసిక్ నందన్ కుమార్‌రెడ్డి (9) ఉన్నాడు. వీరు వ్యవసాయ కూలీగా చేస్తుంటారు. నందన్ పుట్టుకతోనే దివ్యాంగుడు. ఒక కిడ్నీ పూర్తిగా పాడైపోయింది. మరో కిడ్నీలో రాళ్లు ఉండి ఇన్ఫెక్షన్ చేరింది. ప్రత్యేక పైపు ఏర్పాటు చేస్తేనే మూత్రం వస్తుంది. వెన్నునొప్పి ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. నందన్‌కు 6 నెలల వయసు నుంచే హైదరాబాద్, చెన్నై, తిరుపతి, గుంటూరుల్లోని పలు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. అయితే పరిస్థితిలో మార్పురాలేదు. తల్లిదండ్రులతో నందన్ పింఛన్ ఇవ్వాలంటూ.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నందన్ పరిస్థితి చూసి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి చలించిపోయారు. స్వయంగా కలెక్టర్ వద్దకు ఆ బాలుడిని, అతని తల్లిదండ్రులను తీసుకువెళ్లి కలిశారు. పేద కుటుంబానికి చెందిన నందన్‌కు డయాలసిస్ చేయించేందుకు పింఛన్ మంజూరు చేయించాలని సిఫార్సు చేశారు. ఎమ్మెల్యే సూచనల మేరకు కలెక్టర్ నందన్ వైద్యానికి కొంత నిధులు అందించారు. డయాలసిస్ పింఛన్ అందించడానికి సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం నందన్‌కు దివ్యాంగుల పింఛన్ అందుతోంది. అప్పులు చేసి.. తలకు మించిన భారమైనా సుధాకర్‌రెడ్డి, అనూష అప్పులు చేసి కొడుక్కి వైద్యం చేయిస్తున్నారు. మూత్రం పోసుకోవడానికి ఇంటి వద్దే తల్లిదండ్రులు బ్యాగ్‌లు మారుస్తున్నారు. కిడ్నీ మార్చాలంటే ముందు మూత్ర సంబంధిత సమస్యను పరిష్కరించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వెన్నుపూస సమస్య ఉండటంతో ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా నొప్పులతో బాధపడుతున్నాడు. నందన్ వైద్యానికి సుమారు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు అవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. కూలి పనులు చేసుకునే నందన్ తల్లిదండ్రులు అంత ఖర్చుపెట్టి వైద్యం చేయించే స్తోమత లేక ఒక్కగానొక్క కుమారుడి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోతున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ బిడ్డ వైద్యానికి సహకరించాలని కోరుతున్నారు. సాయం కోరుతాం జగనన్న పాదయాత్ర సమయంలోమా గ్రామానికి వచ్చినప్పుడు కలిసి మా పరిస్థితి వివరించాం. త్వరలో ఆయన్ని కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించి సాయం కోరుతాం. – మార్తుల అనూష,నందన్ తల్లి నందన్ తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు పేరు: మార్తుల అనూష బ్యాంక్: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సిద్ధనకొండూరు అకౌంట్ నంబర్: 91073257658 ఐఎఫ్ఎస్ కోడ్: APGB0004016 సెల్ నంబర్: 94932 06631 -
తండ్రి అయిన దర్శకుడు
చెన్నై: ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి ఐశ్వర్య విజయ్ శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఐశ్వర్య విజయ్ మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు విజయ్ సోదరుడు, నటుడు ఉదయ తెలిపారు. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది’ అని ఉదయ ట్వీట్ చేశారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) కాగా హీరోయిన్ అమలాపాల్‌తో విడాకుల అనంతరం డాక్టర్ ఆర్.ఐశ్వర్యను దర్శకుడు ఏఎల్ విజయ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ 2014లో అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం అమలాపాల్ సింగిల్‌గానే ఉన్నారు. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) Yes..IAM A PERIYAPPA now..Brother Director VIJAY And AISHWARYA VIJAY blessed with baby boy at 11.25am ...Happppyyyyyyyy....Soooo happpy....@onlynikil — Udhaya (@ACTOR_UDHAYAA) May 30, 2020 -
చిన్నారిని మింగిన వాగు
ఆ పేదింటి చిరుదీపం ఆరిపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో చివరకు తీరని శోకమే మిగిలింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తల్లిదండ్రుల కళ్లముందే ఆడుకున్న ఇద్దరు పిల్లల్లో సాయంత్రానికి ఒకరు విగతజీవిగా మారడం.. మరో చిన్నారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ధన్సింగ్తండాలో ఆదివారం చోటు చేసుకుంది. నల్లగొండ, తిరుమలగిరి(నాగార్జునసాగర్): తిరుమలగిరి మండలం ధన్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీకి చెందిన మెగావత్ నాగు, సుశీల దంపతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు మెగావత్ హరిలాల్(5), మెగావత్ సాయి, కూతురు సంతానం. హరిలాల్, సాయితో పాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు మెగావత్ సైదా కలిసి గ్రామంలోని పాఠశాల వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. స్కూల్ పక్కనే వాగు ప్రవహిస్తుండటంతో అందులో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వాగు మధ్యలో గుంతలు ఉండటంతో నీటిలో ఆడుకుంటూ వెళ్లిన సాయి, హరిలాల్ మునిగిపోయారు. ఈ విషయాన్ని గమనించిన మెగావత్ సైదా గ్రామంలోకి వెళ్లి వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులకు తెలిపాడు. వారు వచ్చి వాగులో గాలించగా ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగిపోయి ఉన్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో హరిలాల్ మృతిచెందాడు. మరో బాలుడు సాయి పరిస్థితి విషమంగా మారడంతో మొదటగా మిర్యాలగూడ, అక్కడినుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెసింది. సొమ్మసిల్లిన తల్లిదండ్రులు అప్పటివరకు తమ కళ్ల ముందే ఆటలాడుకున్న ఇద్దరు కుమారుల్లో ఒకరు మృత్యుఒడికి చేరగా.. మరొకరు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడంతో ఆ దంపతులు గుండెలు బాదుకుని రోదిస్తూ సోమ్మసిల్లి పడిపోయారు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఈ విషయం తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. వాగుకు రిటర్నింగ్ వాల్ కట్టి ఉంటే.. ఊరు మధ్య నుంచే ప్రవహిస్తున్న ఇదే వాగులో గతంలో అదే గ్రామానికి చెందిన చిన్నారులు ఇద్దరు మృతిచెందారు. ఈ గ్రామ పంచాయతీని స్థానిక జెడ్పీటీసీ ఆంగోతు సూర్యాభాష్యానాయక్ దత్తత తీసుకుని వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మించాలని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రిటర్నింగ్ వాల్‌తో పాటు, వంతెన నిర్మాణానికి రూ.2.70 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. అధికారులు పంపిన నివేదికకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాగుకు రిటర్నింగ్ వాల్, వంతెన నిర్మించి ఉంటే ఇలాంటి విషాదకర సంఘటన జరిగి ఉండేది కాదని తండావాసులు పేర్కొంటున్నారు. -
కరోనా సోకిన గర్భిణికి ‘గాంధీ’లో పునర్జన్మ
గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్‌తో బాధపడుతున్న నిండు గర్భిణికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు పురుడుపోసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. కరోనా సోకిన గర్భిణీకి డెలివరీ చేయడం గాంధీ ఆస్పత్రిలో ఇది రెండోసారి. ఆస్పత్రి వైద్యవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బహుదూర్‌పురాకు చెందిన గర్భిణి (30)కి కరోనా సోకడంతో ఈ నెల 10న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ఇది ఆరవ కాన్పు కావడం, అధిక రిస్క్, పీపీహెచ్ కాంప్లికేషన్లు ఉండటంతో ఈ కేసును ఆస్పత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. గర్భిణితోపాటు కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. సాధారణ డెలివరీకి అవకాశం లేకపోవడంతో బుధవారం సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించి పండంటి మగశిశువును బయటకు తీశారు. శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని, తల్లి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మహిళకు కరోనా పాజిటివ్ కావడంతో పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడంలేదు. (చదవండి: లక్షణాల్లేని వారి నుంచే సంక్రమణ..) ఎన్ఐసీయూలోని ఇంక్యుబేటర్‌లో ఉంచిన శిశువుకు బాటిల్ ఫీడింగ్ అందిస్తున్నారు. శిశువు నుంచి నమూనాలు సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు వైద్యులు వివరించారు. గైనకాలజీ హెచ్‌వోడీ మహాలక్ష్మి నేతృత్వంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన గైనకాలజీ ప్రొఫెసర్ షర్మిల, అసిస్టెంట్ రాణిలతోపాటు అనస్తీషియా, పీడియాట్రిక్ వైద్యులను ఉన్నతాధికారులతోపాటు డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకాశరావులు అభినందించారు. (చదవండి: అలసట తెలీని వలస హీరోలు) -
బిందెలో చిన్నారి తల
చెన్నై,అన్నానగర్: మూడేళ్ల బిడ్డ ఆడుకుంటూ బిందె వద్దకెళ్లి తలదూర్చింది. ఇంకేముంది తల బిందెలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఆవడి సమీపంలో గురువారం కలకలం సృష్టించింది. ఆవడి సమీపంలోని కోవిల్పదాగై అశోక్ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ చెన్నై పాడిలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు దివ్యన్ (3). గురువారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్నదివ్యన్ తల బిందెలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సిల్వర్ బిందెలో నుంచి దివ్యన్ తలను బయటకు తీశారు. -
సురేశ్ రైనాకు పుత్రోత్సాహం
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ సురేశ్ రైనా ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అతని భార్య ప్రియాంక సోమవారం ఉదయం పండంటి బాబుకు జన్మనివ్వడంతో రైనా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇప్పటికే ఈ జంట 2016లో పాప గ్రేసియా రైనాకు జన్మనివ్వగా... తాజాగా కుమారుడు వీరికి జతయ్యాడు. ఈ సందర్భంగా బాబుతో కలిసి ఉన్న ఉన్న ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్న రైనా... అతన్ని ‘రియో రైనా’గా అభిమానులకు పరిచయం చేశాడు. ‘ఆశ, ఆశ్చర్యం, అవకాశంతో కూడిన కొత్త ప్రపంచానికి ఇది ఒక ఆరంభం. గ్రేసియా రైనా తమ్ముడు రియోను గర్వంగా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం’ అని రైనా ట్విట్టర్లో తెలిపాడు. -
రియో రైనాను స్వాగతిస్తున్నాం : రైనా
టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా రెండోసారి తండ్రి అయ్యారు. రైనా భార్య ప్రియాంక సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే రైనా దంపతులకు గ్రేసియా అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రైనా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మా కుమారుడు, గ్రేసియా సోదరుడు రియో రైనాను స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. తన భార్య, కుమారుడితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఆశ్చర్యం, ఆశ, అవకాశాలు, ఓ మంచి ప్రపంచం.. అన్ని విషయాలకు ఇది ప్రారంభం. మా కుమారుడు, గ్రేసియా చిన్నారి సోదరుడిని స్వాగతిస్తున్నందకు మేము గర్వపడుతున్నాం. అతడు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని తీసుకురావడానికి అంచనాలకు మించి కృషి చేస్తాడు’అని రైనా ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఐపీఎల్లో రైనా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్.. రైనా దంపతులకు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా రైనాకు విషెస్ చెబుతున్నారు. కాగా, 2015లో రైనా ప్రియాంకను వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. The beginning of all things – wonder, hope, possibilities and a better world! We are proud to welcome our son & Gracia’s little brother - Rio Raina. May he flows beyond boundaries, bringing peace, renewal & prosperity to everyone’s life. pic.twitter.com/SLR9FPutdx — Suresh Raina🇮🇳 (@ImRaina) March 23, 2020 -
దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!
సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా వంటి చిత్రాలు రూపొందించిన కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. రంజిత్ రెండోసారి తండ్రి అయ్యినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య అనిత చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తనకు కొడుకు పుట్టిన విషయాన్ని రంజిత్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుత్రోత్సాహంతో ఉన్న రంజిత్ ఇప్పటికే తన కొడుక్కి మిలిరాన్గా నామకరణం చేసినట్లు సమాచారం. రంజిత్ దంపతులకు ఇప్పటికే మఘజిని అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కూతురు పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన పా రంజిత్ తన కూతురుకు బర్త్‌డే రోజు ప్రత్యేక సందేశాన్ని రాశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') కాగా పా రంజిత్, అనితలది ప్రేమ వివాహం. డిగ్రీ చదివే రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమలో పడిన వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే ఆర్యతో కలిసి బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు మొదట సూర్యను అనుకున్నట్లు సమాచారం. చివరకు సూర్యతో కుదరకపోవడంతో ఆర్యతో తెరకెక్కిస్తున్నారు. (వావ్.. అచ్చం ఐశ్యర్యరాయ్ లాగే..) -
అమ్మ గోరుముద్దలే ఆఖరు..
కుత్బుల్లాపూర్: ఆప్యాయంగా అమ్మ తినిపించిన గోరుముద్దలే ఆ చిన్నారికి చివరివి అయ్యాయి. తల్లితో ప్రేమగా మాట్లాడిన మాటలే కడసారి పలకరింపులయ్యాయి. హోలీ పండగ కోసం మేనమామ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాబుకు నూరేళ్లూ నిండాయి. అపార్ట్మెంట్ మూడో అంతస్తులోనిబాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందిన ఘటన పేట్బషీరాబాద్పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన బాలుడు అసువులు బాయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. చేయి కడుక్కుని, గ్లాస్లో నీళ్లు తెచ్చేలోపు కుమారుడు మేడపై నుంచి పడి మృత్యు ఒడిలోకి చేరడంతో పండగ రోజు ఆ కుటుంబం విషాదంలో మునిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నితిన్ రెడ్డి, శ్రావ్య దంపతులు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీహన్‌రెడ్డి (6) ఉన్నాడు. వీరు దుబాయ్‌లో ఉంటున్నారు. కుమారుడికి మాటలు సరిగా రాకపోవడంతో సర్జరీ నిమిత్తం కుమారుడిని తీసుకొని ఆరు నెలల క్రితం శ్రావ్య నగర శివారు ప్రాంతంలోని కోణార్క్ ఆస్పత్రి పైప్‌లైన్ రోడ్డు సమీపంలోని లక్ష్మీగంగా ఎంక్లేవ్‌కు వచ్చి ఉంటున్నారు. కుమారుడు Ôశ్రీహన్‌రెడ్డి ప్లేస్కూల్లో చదువుతున్నాడు. ఉద్యోగరీత్యా నితిన్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో హోలీ పండగ కోసం జీడిమెట్లలోని భీమ్ప్రైడ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న సోదరుడి ఇంటికి శ్రావ్య తన కుమారుడు శ్రీహన్రెడ్డిని తీసుకొని ఆదివారం రాత్రి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాలుడికి అన్నం తినిపించారు. చేయి శుభ్రం చేసుకుని, గ్లాస్లో తాగునీరు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లారు. ఈ సమయంలో బాల్కనీలో ర్యాలింగ్ ఎక్కిన శ్రీహన్‌రెడ్డి అదుపుతప్పి మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మరో ఘటనలో డిగ్రీ విద్యార్థి.. కుత్బుల్లాపూర్: డిగ్రీ చదువుతున్న విద్యార్థి బిల్డింగ్‌పై నుంచి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్సీఎల్ గోదావరి హోమ్స్‌లో ఉంటున్న నాగరాజు రెండో కుమారుడు సుబ్రహ్మణ్యం (18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుతూ ఐదో అంతస్తుకు వెళ్లాడు. అనుమానాస్పదస్థితిలో కిందపడ్డాడు. వెంటనే గుర్తించి సూరారంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేనేం ‘పాపం'చేశాను!
వికారాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళ అమానవీయ ఘటనకు పాల్పడింది. కన్నపేగును పంచుకొని పుట్టిన బిడ్డను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలు.. వికారాబాద్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆటోలో వచ్చిన ఓ మహిళ.. సుమారు ఒకరోజు వయసున్న మగ శిశువును రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై వదిలేసి వెళ్లినట్లు కొందరు వాహనదారులు చెబుతున్నారు. ముందుగా ఏదో వస్తువు అయి ఉంటుందని భావించారు. విషయం తెలుసుకునే సరికి సదరు వ్యక్తులు వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న వికారాబాద్‌లోని డెంటల్ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆనంద్ విషయాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ లక్ష్మయ్య అక్కడికి చేరుకున్నారు. శిశువును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వాహనంలో తరలించారు. సూపరింటెండెంట్ శాంతప్ప చికిత్స చేశారు. శిశువు బరువు 1.6 కిలోలు ఉండటంతో నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహేతర సంబంధం నేపథ్యంలో గర్భం దాల్చిన మహిళ, విషయం బయటకు పొక్కుతుందనే భయంతో శిశువును వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ యాదప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పసికందుకు పునర్జన్మ
చైతన్యపురి: ఆ పసికందు బరువు 2.5 కేజీలు. పుట్టుకతోనే శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు. గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆపరేషన్ చేసేందుకు సహకరించని వయసు, పసికందు బరువు. దీంతో పారమిత ఆస్పత్రి యాజమాన్యం, వైద్యబృందం, హీల్ ఎ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ చొరవతో ప్రత్యేక చికిత్స చేశారు. గుండె రంధ్రాన్ని ప్రత్యేక పరికరంతో కోనార్ డివైజ్ అమర్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. గురువారం చైతన్యపురిలోని పారమిత ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యం బృందం మాట్లాడుతూ..తక్కువ వయసుఉన్న పసికందు (21 రోజులు)కు ఇటువంటి ఆపరేషన్ చేయటం ప్రపంచంలోనే మొదటిసారి అని తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సతీష్, శోభ దంపతులకు జన్మించిన కుమారుడు పుట్టుకతోనే నిమోనియాతో శ్వాస సంబంధిత ఇబ్బందులు రావటంతో నగరంలోని పారమిత చిల్డ్రన్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు బాబుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్స మొదలుపెట్టారు. శిశువుకు పరీక్షలు చేసిన చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, డాక్టర్ శ్రీరాంలు ఆపరేష్ తప్పనిసరి అని నిర్ధారించారు. పారమిత ఆస్పత్రి ఎండీ డాక్టర్ ధనరాజ్, మెడికల్ డైరెక్టర్ సతీష్‌లు కేసును చాలెంజ్‌గా తీసుకుని రెయిన్బో కార్డియాక్ సెంటర్‌కు చెందిన పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్‌ను సంప్రదించారు. ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. కోనార్ డివైజ్ బటన్‌ను అమర్చి గుండెకు ఉన్న రంధ్రాన్ని మూసేందుకు సమ్మతించా రు. అనారోగ్య పిల్లలకు ఆర్థిక సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ, పారమిత ఆస్పత్రి వర్గాల ఆర్థిక సహకారంతో డాక్టర్ నాగేశ్వర్, శ్వేత బృందం 21 రోజుల పసికందుకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శిశువు పూర్తిగా కోలుకుందని, సొంతంగా ఊపిరి తీసుకుంటోందని, గుండెపనితీరు కూడా బాగుందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలోనే 21 రోజుల పసికందుకు గుండె ఆపరేషన్ చేయటం మొదటిసారి అని పేర్కొన్నారు. తమ బాబుకు గుండె రంధ్రానికి ఆపరేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించారని తల్లిదండ్రులు సతీష్, శోభలు తెలిపారు. పారమిత ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యం, హీల్ ఏ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి డాక్టర్ ప్రమోద్, ఆపరేషన్ చేసిన డాక్టర్లు నాగేశ్వరరావు, శ్వేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
టానిక్ సీసా మూత మింగిన బాలుడు
ఒడిశా, సోంపేట: మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు టానిక్ సీసా పైకప్పు మింగడటంతో గొంతులోకి ఇరుక్కుంది. వెంటనే వైద్యులు తగిన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం... గ్రామానికి చెందిన కర్రి యోగేశ్వరరావు, గీత దంపతుల కుమారులు సాత్విక్(4), రాము (9 నెలలు) తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్కడ కింద పడి ఉన్న టానిక్ సీసా పైకప్పును బాలుడు మింగి వేశాడు. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన సోంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మంచు ప్రదీప్‌కుమార్, ఎం సాగర్ శస్త్రచికిత్స చేసి గొంతు నుంచి దాన్ని బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు వైద్యులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. -
కన్నపేగే భారమైంది!
గాంధీఆస్పత్రి: పండంటి మగశిశువుకు జన్మనిచ్చిన ఆ తల్లికి చివరికి ఆ కన్నపేగే భారమైంది. శిశువును వదిలేసి వెళ్లిపోయిన తల్లిని గుర్తించిన వైద్య సిబ్బంది, పోలీసులు శిశువుతోపాటు తల్లిని సంరక్షణ కేంద్రానికి తరలించిన ఘటన గాంధీ ఆస్పత్రిలో జరిగింది. వివరాలు.. కామారెడ్డికి చెందిన మంజుల, రమేష్ దంపతులు. గర్భవతి అయిన మంజుల కాన్పు కోసం ఈ నెల 22న గాంధీఆస్పత్రి గైనకాలజీ విభాగంలో చేరింది. 25న పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడం, వెంట ఉన్నవారు సరిగా పట్టించుకోకపోవడంతో పుట్టిన శిశువును బుధవారం రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువును సెక్యూరిటీ సిబ్బంది గమనించి అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. శిశువు చేతికి ఉన్న ట్యాగ్ ఆధారంగా వివరాలు తెలుసుకున్న ఆస్పత్రి పాలన యంత్రాంగం సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి శిశువు తల్లి ఫొటోలను పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కామారెడ్డికి వెళ్లే అన్ని దారులను పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కామారెడ్డికి వెళ్లేందుకు వేచిచూస్తున్న శిశువు తల్లి మంజులను గుర్తించారు. శిశువుకు ఉన్న ట్యాగు, బాలింత మంజులకు ఉన్న ట్యాగు సరిపోవడంతో ఆమెకు నచ్చజెప్పి గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాలింత మంజులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువుతోపాటు బాలింతను అమీర్‌పేట మైత్రివనం సమీపంలోని శిశువిహార్‌కు తరలించినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!
అబుదాబి: అదృష్టమంటే ఇదేనేమో... ఏడాది బుడ్డోడు ఒక మిలియన్ డాలర్(సుమారు ఏడు కోట్ల పైచిలుకు) గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ అరుదైన ఘటన దుబాయ్‌లో జరిగింది. రమీస్ రహ్మాన్ అనే కేరళకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్ సాలా పేరు మీద టికెట్ కొనుగోలు చేశాడు. మంగళవారంనాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో తనయుడు మహమ్మద్ పేరు కూడా ఉండటంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. (కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!) ‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది’ అని రమీస్ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్‌కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్ కొనుగోలు చేయగా 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది. చదవండి: ఎర్రచీరలో ఇరగదీసిన పెళ్లికూతురు చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది -
ఈ తల్లుల బాధ తీర్చలేనిది..
కడప అర్బన్ : తమ తల్లుల ఆశలను నెరవేర్చాల్సిన చిన్నారులు సరదాగా ఈతకు వెళ్లి విలువైన ప్రాణాలను కోల్పొయారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వారిని కోల్పోయి కష్టాల బారిన కాలం వెళ్లదీస్తున్న వారిని ఈ సంఘటన మరింత కుంగదీసింది. ఆదివారం సెలవురోజు కావడంతో ముగ్గురు చిన్నారులు సమీపంలోని బుడ్డాయపల్లె చెరువులోని బుదరగుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువులో బురద ఉందనే విషయాన్ని గ్రహించలేకపోయారు. బురదలోకూరుకుపోయారు. కొన్ని క్షణాల్లోనే వారి ప్రాణాలు అనంత వాయువుల్లోకి కలిసిపోయాయి. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కడప నగర శివార్లలోని రామాంజనేయపురం సాగర్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ యూసఫ్, షబానాల కుమారులు షేక్ ఖాజా (11) షేక్ మౌలా(9)లతోపాటు షేక్ హబీబుల్లా, సాబీరున్‌ల కుమారుడు షేక్ గౌస్‌పీర్ (9) ఆదివారం ఇంటిలో తమ తల్లులు, బంధువులతో కలిసి ఉదయం నుంచి సరదాగా గడిపారు. మధ్యాహ్నం చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సాయంత్రం సమీపంలోని బుడ్డాయపల్లె చెరువు వద్దకు వీరు ముగ్గురు వెళ్లారు. అక్కడ చెరువులో నీళ్లు ఎక్కువగా లేకపోవడం, వీరు దిగిన గుంతలో పైకి నీళ్లు, లోపల బురద ఉండడం గమనించలేకపోయారు. ఈత కొడతామని ఆడుకుంటూ అందులోకి దిగారు. కొంతసేపటికే బురదలో కూరుకుపోయారు. చీకటి పడగానే ముగ్గురు చిన్నారుల తల్లులు, వారి బంధువులు కలిసి వీరి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిమ్స్ సీఐ సత్యబాబు తమ సిబ్బందితో కలిసి చిన్నారుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. సాగర్ కాలనీకి సమీపంలో, రిమ్స్ పోలీసుస్టేషన్‌కు వెనుక భాగాన ఉన్న సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ పిల్లల అడుగులు గమనించి లోపల పరిశీలించాలని స్థానికులను గుంతలోకి దించారు. లోతుగా వెతకడంతో చిన్నారుల జాడ తెలిసింది. వెంటనే వారిని బయటికి తీశారు. అప్పటికే విగత జీవులుగా మారిపోయారు. వారిని రోదనల మధ్య రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. క్యాజువాలిటీ నుంచి మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించారు. విషాదంలో రిమ్స్ ఆవరణం ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడడంతో రామాంజనేయపురం సాగర్ కాలనీకి చెందిన ప్రజలు రిమ్స్‌కు చేరుకుని అయ్యో పాపం చిన్నారులంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాల్లో గౌస్‌పీర్ తండ్రి హబీబుల్లా ఇప్పటికే మృతి చెందాడు. మిగతా ఇద్దరు ఖాజా, మౌల తండ్రి మహమ్మద్ యూసఫ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే అతను కూడా ఐదు సంవత్సరాల కిందట మృతి చెందారు. పిల్లలు తనను విడిచి వెళ్లడంతో వారి తల్లి షబాన తీవ్రంగా విలపించి అస్వస్థతకు గురైంది. అన్నదమ్ములిద్దరినీ రిమ్స్ క్యాజువాలిటీలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆమెకు, వారి మరణవార్త చెప్పకుండా తిరుపతికి తీసుకెళదామని ఓదార్చేందుకు ప్రయత్నించారు. చివరకు ఆమె పిల్లలిద్దరూ చనిపోయారని తెలుసుకుని తీవ్రంగా విలపించింది. ఈ సంఘటనపై చిన్నారుల బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చిన్నారిని రైలుబోగీ నుంచి తోసేసిన గార్డు
తూర్పుగోదావరి,తుని: రైలు బోగీ నుంచి మూడేళ్ల చిన్నారి బాలుడిని తోసేసిన గార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్పీ ఎస్సై అబ్దుల్ మారూఫ్ ఆదివారం తెలిపారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండపేటకు చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు తలుపులమ్మ దేవ స్థానానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో తుని రైల్వే స్టేషన్లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ ఖాళీ లేకపోవడంతో వికలాంగ బోగీ ఎక్కారు. అయితే గార్డు ఇది వికలాంగ బోగిఅని, ఎక్క కూడదన్నాడు. దాంతో కిందకు దిగిపోయిన వెంకటేష్ కుటుంబం ప్రయాణికుల రద్దీతో పక్క బోగి ఎక్కలేక ట్రైను కదిలిపోయే పరిస్థితుల్లో అదే వికలాంగబోగీలోకి ఎక్కారు. దాంతో గార్డు విచక్షణ కోల్పోయి వెంకటేష్ మూడేళ్ల కుమారుడిని ప్లాట్‌ఫారంపైకి తోసేశాడు. దాంతో ఆ చిన్నారికి గాయాలయ్యాయి. వెంకటేష్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా రైల్వే పోలీసులు చిన్నారికి రైల్వే ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. -
సాయం కోసం ఎదురుచూపులు
అడ్డగుట్ట: వైద్యానికి డబ్బులేక ఓ నిరుపేద బాలుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. తండ్రి రైలు ప్రమాదంలో మరణించాడు.. తల్లి ఇళ్లలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. బాణసంచా చేతిలో పేలడంతో ఆమె చిన్న కుమారుడు అటు వైద్యానికి, ఇటు మందులకు డబ్బు లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఆ నిరుపేద కుటుంబం సాయం కోసం దాతలవైపు చూస్తోంది. వివరాలు.. అడ్డగుట్ట వడ్డెరబస్తీకి చెందిన కనకరాజు రైలు ప్రమాదంలో చనిపోవడంతో అతని భార్య సరిత ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈమె చిన్నకుమారుడు వి.రాజేష్(8) నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున ఇంటి ముందు బాణసంచా కాలుస్తున్న సమయంలో బాణాసంచా చేతిలో పేలింది. ఈ ప్రమాదంలో బాలుడి శరీరం దాదాపు 50 శాతం కాలిపోయింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.అయితే గాయాలతో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడిది లేవలేని పరిస్థితి. అసలే నిరుపేద కుటుంబం, ఒక్క ఇంజెక్షన్ రూ. 1,300 ఖరీదు. వారానికి ఒక సారి వేస్తే తప్ప శరీరంలో కదలికరాదు. వైద్యానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆ కుటుంబం మనోవేదనకు గురవుతోంది. స్నేహితులతో ఆడుకోవాల్సిన వయస్సులో కదలలేని స్థితితో ఉన్నాడు. బాగా చదువుకొని న్యాయవాది అవుతానని, లాయర్ చదువు అంటే ఇష్టమంటున్నాడు. వైద్యం ఖర్చుల నిమిత్తం ఎవరైనా సహాయం చేసేవారు అకౌంట్ నెంబరుకు డబ్బు పంపించవచ్చు.కెనెరా బ్యాంకు అకౌంట్ నంబర్ 0624108031004, ఐఎఫ్ఎస్సీ కోడ్ సీఎన్ఆర్బి0000624, వరికుప్పల సరిత, వివరాల కోసం 91776 98638నెంబరుకు ఫోన్ చేయవచ్చు. -
బొద్దుగా.. ముద్దుగా..
అనంతపురం,విడపనకల్లు: మండల పరిధిలోని వి.కొత్తకోట గ్రామానికి చెందిన రామనాథ్ భార్య వనిత మంగళవారం విడపనకల్లు ప్రభుత్వాస్పత్రిలో 4.50 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇంత వరకు కూడా తమ ఆస్పత్రిలో 4.50 కేజీలు బరువు ఉన్న శిశువు జన్మించలేదని, ఇదే తొలిసారని డాక్టర్ శ్రీధర్, స్టాప్ నర్సు లీలావతి తెలిపారు. వనిత ప్రారంభం నుంచి కూడా వైద్యుల సలహాల పాటిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల అత్యధిక బరువు గల ఆరోగ్యకరమైన శిశువుకు సాధారణ డెలివరీలోనే జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. -
చిన్న గుండెకు ఎంత కష్టమో..
గొల్లప్రోలు: మూడేళ్ల చిన్నారి గుండెకు గాయమైంది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు నిర్ధారించారు. గొల్లప్రోలులోని ఈబీసీ కాలనీకి చెందిన ఉమ్మిడి చంద్రశేఖర్, నీరజల మూడేళ్ల కుమారుడు దేవీశ్రీప్రసాద్ రెండో సంతానం. 2016లో పుట్టిన చిన్నారికి గుండె కొట్టుకును శబ్ధంలో తేడాను గమనించిన వైద్యులు స్కానింగ్ చేయించడం ద్వారా ఏరోటిక్ వాల్వ్ మూసుకుపోయి బ్లాక్ అవ్వడం ద్వారా రక్తసరఫరా మూసుకుపోయినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.రెండులక్షలు వెచ్చించి గుండె వైద్యపరీక్షలు నిర్వహించి ప్రమాదకరమైన గుండె వ్యాధిగా నిర్ధారించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యులు సూచన మేరకు మందులు వాడుతున్నారు. ఇటీవల బెంగుళూరులోని ఆర్ఎక్స్ డీఎక్స్ ఆసుపత్రి, కొలంబియా ఆసియా ఆసుపత్రి వైద్యులు పరిక్షలు నిర్వహించగా వాల్వ్ లీకేజీ ఎక్కువగా ఉండడంతో పాటు ఎడమ వైపు గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. గుండె పంపింగ్ కూడా బాగా తగ్గినట్టు గుర్తించారు. జనవరిలో ఓపెన్ హార్ట్ ఆపరేషన్ నిర్వహించకపోతే ప్రాణానికి ప్రమాదం అని కొలంబియా ఆసియా వైద్యులు తెలిపారు. కొన్ని గంటలపాటు నిరంతరాయంగా నిర్వహించే ఆర్ఓఎస్ఎస్ ఆపరేషన్‌కు సుమారు రూ.ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పురుగు మందులు షాపులో గుమస్తాగా పని చేస్తూ నెలకు రూ.10వేలు సంపాదించుకునే చిన్నారి తండ్రి చంద్రశేఖర్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు తట్టుకునే ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లిపోతున్నాడు. గుండె చికిత్స కోసం ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని చంద్రశేఖర్ కోరుతున్నారు. -
ఆరేళ్ల బాలుడి హత్య.. అంతు చిక్కని కారణాలు..
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో ఆరేళ్ల బాలుడు హత్యకు గురి అయ్యాడు. హత్యకు గల కారణాల అన్వేషనలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని ఎట్టయాపురానికి చెందిన జయశంకర్ కుమారుడు నకులన్(6) ఇంటి ముందు ఆడుకుంటుండగా సోమవారం అదృశ్యం అయ్యాడు. బాలుడి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. బాలుడ్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారన్న ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎక్కడా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. బాలుడి కోసం గ్రామస్తులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదళ్లల్లో బాలుడి మృత దేహం బయట పడింది. గొంతు నులిమి బాలుడ్ని హత్య చేసి ఉన్నట్టుగా తేలింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ఆస్పత్రికి తరలించారు. కాగా బాలుడ్ని కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుల్ని అరెస్టు చేయాలని కోరుతూ బాధిత కుటుంబంతో పాటు గ్రామస్తులు రోడ్డెక్కారు. తూత్తుకుడి – మదురై జాతీయ రహదారిలో బైటాయించారు. దీంతో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు గ్రామస్తుల్ని బుజ్జగించారు. విచారణను ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో అదే గ్రామానికి చెందిన అమల్ రాజ్ ఈహత్య చేసినట్టుగా ఇద్దరు వ్యక్తులు సమాచారం అందించారు. దీంతో అమల్‌రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇది వరకే ఓ హత్య కేసులో అమల్‌రాజ్ జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చి ఉన్నాడు. అయితే ఈబాలుడ్ని హతమార్చాల్సిన అవసరం అతడికి ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
కేజీహెచ్‌లో కిడ్నాప్ కలకలం
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ బిడ్డ కిడ్నాప్ అయ్యిందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేజీహెచ్‌లో కలకలం రేగింది. అయితే కుటుంబ సమస్యల వల్ల తల్లే బిడ్డను తీసుకుని వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధురవాడ సమీప కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన ప్రియాంక తన నాలుగు నెలల బిడ్డను కేజీహెచ్ పిల్లల వార్డులో ఈ నెల 23న వైద్య సేవల నిమిత్తం చేర్చింది. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను పిల్లల వార్డులోని ఆరోగ్యశ్రీ సిబ్బంది నుంచి తీసుకుని వెళ్లిపోయింది. కొంతసేపటి తర్వాత ఆమె భర్తకు సంబంధించిన వారు ఆస్పత్రికి వచ్చి బిడ్డ కిడ్నాప్ అయ్యిందని ఆందోళనకు దిగారు. అయితే బిడ్డకు కేటాయించిన పడక మీద మొత్తం సామగ్రితోపాటు పాల డబ్బా కూడా వదిలి వెళ్లిపోవడంతో వార్డులో కలకలం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల నేపథ్యంలో బిడ్డను తీసుకుని ప్రియాంక వెళ్లిపోయి ఉంటుందని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు. జరిగిన సంఘటనపై కేజీహెచ్‌లోని పోలీస్ అవుట్ పోస్ట్‌లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ప్రియాంక ఫోన్ నెంబరు పనిచేయకపోవడంతో ఎటువంటి సమాచారమూ ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భర్త, అతని కుటుంబ సభ్యులపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రియాంక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
డాక్టర్ తప్పిదం.. శిశువుకు శాపం
తమిళనాడు, సేలం: ఒకటిన్నర సంవత్సరాల శిశువు మక్కీలో సూది చిక్కుకున్నా పట్టించుకోని డాక్టరుపై తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఎట్టిమడైపుదూర్ గ్రామానికి చెందిన రమీలా (26). ఈమె భర్త కార్తికేయన్‌తో గొడవ కారణంగా పుట్టింటిలో ఉంటోంది. ఈమెకు ఒకటిన్నర సంవత్సరం వయస్సు కలిగిన సర్వేశ్వరన్ కుమారుడు ఉన్నాడు. గత నెల నవంబర్ 15వ తేదీ బిడ్డను తామరై కన్నన్ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లగా అక్కడ ఆ బిడ్డకు సరళ, హిందుమతి అనే ఇద్దరు నర్సులు సూది వేసినట్లు తెలుస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆ సూది బిడ్డ మక్కీలో ఉండి పోయినట్లు తెలుస్తోంది. విషయం సంబంధిత డాక్టర్‌కు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. ఇదిలాఉండగా నవంబర్ 29వ తేదీ కూడా రమీలా బిడ్డను చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకు వెళ్లింది. అప్పుడు కూడా నర్సులు, డాక్టరు నోరు మెదపలేదు. సర్వేశ్వరన్ మక్కి వద్ద బొబ్బ ఏర్పడింది. దాన్ని రమీలా మంగళవారం ఉదయం పగులగొట్టగా అందులో నుంచి సూది వెలుపలి వచ్చింది. రమీలా, బంధువులు మంగళవారం ఆస్పత్రిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. డాక్టర్ ఆమెను సముదాయించడానికి చూసినట్లు సమాచారం. ఈ విషయంగా రమీలా తిరుచెంగోడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
తండ్రి గాఢ నిద్రలో ఉండగా.. పాక్కుంటూ వెళ్లి..
రాంబిల్లి(యలమంచిలి): తెల్లవారు 3 గంటల సమయం.. ముళ్ల పొదల్లోంచి చిన్నారి ఏడుపు శబ్ధాలు గమనించిన స్థానికుడు 100 కు ఫోన్ చేశాడు. రంగంలోకి రాంబిల్లి పోలీసులు దిగా రు. ముళ్లపొదల్లో ఏడుస్తున్న బాలుడిని బయ టకు తీశారు. బాలుడు సురక్షితం. వెంటనే బాలుడికి పాలు, ఆహారం అందించిన ఎస్ఐ వి. అరుణ్‌కిరణ్ విచారణ ప్రారంభించారు. బాలు డు ఎవరని చుట్టుపక్కల ఆరా తీశారు. ఈ బాలుడు తండ్రి సుమారు 30 మీటర్ల దూరంలో గాఢ నిద్రలో పడుకొని వున్నాడు. తండ్రి పేరు దుంగా రాజు. ఇతనిది యలమంచిలి. కొండవారపాలెంలో కొబ్బరికాయలు తీస్తుంటాడు. అయితే గురువారం రాత్రి ఇతని కుమారుడు రెండేళ్ల దుంగా ఉదయ్‌ప్రకాష్ పుట్టినరోజు కార్యక్రమాన్ని యలమంచిలిలో తన భార్యతో కలిపి జరుపుకొన్నాడు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే తనతో పాటు కొడుకును కొండవారపాలెం తీసుకువచ్చాడు. గాఢ నిద్రలోకి జారుకోవడంతో బాలుడు తుప్పల్లోకి పాకుకుంటూ వెళ్లిపోయాడు. తర్వాత పోలీసుల రావడం , సురక్షితంగా బాలుడు బయటపడడం ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగిపోయాయి. -
11 మంది ఆడపిల్లల తర్వాత మగబిడ్డ
జైపూర్: రాజస్తాన్‌లోని చూరు జిల్లాకు చెందిన గుడ్డీ (42) అనే మహిళ పదకొండు మంది అమ్మాయిలకు జన్మనిచ్చిన తర్వాత పన్నెండో కాన్పులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. కేవలం ఆడబిడ్డలనే కంటున్నావంటూ తన భర్త కృష్ణ కుమార్, ఇరుగుపొరుగు వారు తనను నిందించేవారని ఆమె చెప్పారు. తన వంశాన్ని కొనసాగించేందుకు మగబిడ్డ కావాలంటూ ఆమె భర్త కోరేవాడని తెలిపింది. మగబిడ్డకు ముందు పుట్టిన అమ్మాయిల్లో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. అందులో పెద్ద కుమార్తె వయసు 22. వీరిలో ఇద్దరు బిడ్డలు ఇంకా స్కూల్లో చేరాల్సి ఉండగా మిగిలిన వారు స్కూల్లో చదువుతున్నారు. ఇంతమంది బాధ్యతలు ఎలా నెరవేర్చగలవన్న ప్రశ్నకు ఆమె చిరునవ్వును సమాధానంగా ఇచ్చారు. 2017లో కూడా మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ 10 మంది ఆడబిడ్డల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చింది. -
ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతా
ప్రొద్దుటూరు : మీరు డబ్బు కోసం వెనుకాడాల్సిన అవసరం లేదు. ధనవంతుల పిల్లలకు ఎలాంటి చికిత్స చేయిస్తారో అలాగే చికిత్స చేసి గాయపడిన బాలుడిని బతికించండి.. అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వైద్యులను కోరారు. ఆ బాలుడికి అయ్యే ఖర్చును తాను భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన శివప్రసాద్, ప్రియాంకలు ఇటీవల అమృతానగర్‌లో స్థిరపడ్డారు. కాగా పది రోజుల క్రితం వీరు అయ్యప్ప స్వాములకు భోజనం ఏర్పాటు చేసేందుకు వంటలు చేసే పనిలో ఉన్నారు. వీరి నాలుగేళ్ల కుమారుడు భువనేశ్వర్ ఆడుకుంటూ వెళ్లి నూనె గోళంలో పడటంతో శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. వీరు బాలుడిని బతికించుకునేందుకు వేలూరు, తిరుపతి ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని నాగదస్తగిరిరెడ్డి ఆస్పత్రిలో చేరారు. సోములవారిపల్లె మాజీ సర్పంచ్ శేఖర్ యాదవ్ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బుధవారం ఆస్పత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులు నాగదస్తగిరిరెడ్డి, టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడుతూ పిల్లాడిని బతికించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాగైనా బాలుడిని బతికించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. బాలుడి తల్లిదండ్రులు దొమ్మర సంఘానికి చెందిన నిరుపేదలు అని అన్నారు. వారిని తప్పకుండా తాను ఆదుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ రమణయ్య, సెల్ సుబ్బయ్య పాల్గొన్నారు. -
వరదస్తు ‘బంధనం’!
ఈ బాలుడు అల్లరివాడు కాకపోయినా హుషారెక్కువ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బిడ్డ దూరమవుతాడేమోనని అతని తల్లిదండ్రులు భయపడి ఇలా సంకెళ్లు వేశారు. ఇది గురువారం కుత్బుల్లాపూర్‌లోని దత్తాత్రేయ నగర్లో కనపించింది. భారీ వర్షానికి అక్కడ వరద పోటెత్తింది. ఇళ్లల్లోకి నడుంలోతు నీరు చేరింది. ఈ క్రమంలో పిల్లాడు ఎక్కడ బయటకు పోతాడో.. ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి తల్లిదండ్రులు ఇలా గొలుసు కట్టి తాళం వేశారు.– ఫొటో: దత్తు గుంటుపల్లి -
బాలుడి గొంతు కోసిన యువకుడు
చెన్నై,తిరువొత్తియూరు: ఇంటి తాళంచెవి ఇవ్వలేదని పక్కింటి వారితో గొడవ పడి, కత్తితో చిన్నారి గొంతు కోసి పారిపోయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు చెన్నైలోని తిరువళ్లూరు వీధికి చెందిన వివేక్ కుమార్ పెయింటర్. అతని భార్య ప్రియ. వీరికి ఒకటిన్నరేళ్ల సాయి చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. వీరి పక్కింటిలో నివాసం ఉంటున్న దంపతుల కుమారుడు ఆకాష్ (19). అతనికి గంజాయి, మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆకాష్ తల్లిదండ్రులు బుధవారం ఇంటికి తాళం వేసి ప్రియకు ఇచ్చి వెళ్లారు. సాయంత్రం ఇంటి వద్దకు వచ్చిన ఆకాష్ తన ఇంటి తాళం ఇవ్వమని ప్రియను అడిగాడు. అయితే కుమారుడికి తాళం ఇవ్వొద్దని అతని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ప్రియ తన వద్ద తాళం లేదని ఆకాశ్‌కు చెప్పింది. దీంతో ఆగ్రహించిన అతను ప్రియతో గొడవ పడ్డాడు. అక్కడే ఆడుకుంటున్న సాయిచరణ్‌పై కూరగాయల కత్తితో దాడి చేశాడు. దానిని అడ్డుకోవాలని చూసిన ప్రియ తల్లి శారదపై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న సాయిచరణ్, శారదలను స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం చిన్నారి సాయిచరణ్‌ను చెన్నై ఎగ్మూర్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పుళల్ పోలీసులు కేసు నమోదు చేసి ఆకాష్‌ను గురువారం ఉదయం అరెస్టు చేశారు. మాధవరం కోర్టులో హాజరుపరిచి విచారణ అనంతరం జైలుకు తరలించారు. -
ఇడ్లీ ప్లేటు రంధ్రంలో బుడ్డోడి వేలు
కర్ణాటక ,శివాజీనగర: ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంతో సందడిగా ఉంటుంది, ఒక్కోసారి వారిపట్ల పెద్దలు అజాగ్రత్తగా ఉంటే సమస్యలు కూడా వస్తాయి. నోట్లో ఏదైనా వస్తువు పెట్టుకోవడం, మింగడం వంటివి చేస్తుంటారు. ఓ 18 నెలల బాలుడు ఇడ్లీ తట్ట రంధ్రంలో వేలును దూర్చడంతో అది కాస్తా ఇరుక్కుపోయింది. దీంతో మార్తహళ్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు స్టీల్ కటింగ్ మిషన్‌ను తీసుకొచ్చి ఇడ్లీ తట్టను కత్తిరించాలని నిర్ణయించారు. సుమారు ఒక గంట పాటు కష్టపడి ప్లేటును కత్తిరించి బిడ్డ వేలుకు విముక్తి కల్పించారు. రంధ్రంలో వేలు చిక్కుకొని తక్షణమే ఉబ్బటం మొదలైంది. బయటకు తీయడం సాధ్యం కాలేదు, దీంతో ప్లేటును కత్తిరించాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. -
నాలుగునెలల బాలుడి మృతి
నెల్లూరు,విడవలూరు: వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వికటించి తమ నాలుగునెలల బాలుడు మృతిచెందాడని మండలంలోని దంపూరు గిరిజనకాలనీకి చెందిన ఆడిపూడి చెంచయ్య – చెంచమ్మ దంపతులు ఆరోపించారు. బుధవారం వారు వివరాలు వెల్లడించారు. చెంచయ్య – చెంచమ్మ దంపతులకు రెండో సంతానంగా నాలుగు నెలలు క్రితం బాలుడు జన్మించాడు. అతనికి గత శనివారం వావిళ్లకు చెందిన ఏఎన్ఎం పెంటా వ్యాక్సిన్ చేసి మాత్ర ఇచ్చింది. వ్యాక్సిన్ చేసిన గంట తర్వాత బాలుడు ఏడవటం మొదలుపెట్టాడు. పాలు పట్టించబోతే తాగలేదు. దీంతో తల్లి ఏఎన్ఎం ఇచ్చిన మాత్రలో కొంత భాగాన్ని బాలుడికి వేసింది. అయితే ఎలాంటి మార్పురాకపోగా సాయంత్రానికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తల్లిదండ్రులు అతను నిద్రపోతున్నాడని భావించారు. ఆదివారం ఉదయం బాలుడు లేవకపోవడంతో వెంటనే నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ కొంతసేపు చికిత్స అందించిన తర్వాత బాలుడు మృతిచెందాడని వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై ఏఎన్ఎంను అడగ్గా బాలుడికి షుగర్, గుండెజబ్బు, మూర్ఛ వ్యాధులున్నట్లుగా చెప్పిందని తల్లిదండ్రులు వాపోయారు. ఏఎన్ఎం శిరీషా నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని వారు ఆరోపించారు. దీనిపై రామతీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు నరేంద్ర మాట్లాడుతూ బాలుడికి షుగర్, మూర్చ, గుండె జబ్బులున్నట్లు నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు నిర్ధారించారని, అందువల్లే మృతిచెందాడని తెలిపారు. వ్యాక్సిన్ బాలుడితోపాటు మరో ముగ్గురికి కూడా వేశారని, అయితే వారికి ఏమి కాలేదని తెలియజేశారు. -
బాల భీముడు
అనంతపురం న్యూసిటీ : నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధర్మవరానికి చెందిన ముస్తాఫా భార్య షాహీనా బీ.. తన తొలి కాన్పులో నాలుగు కిలోల బాబుకు జన్మనిచ్చా రు. గైనకాలజిస్టు డాక్టర్ శివజ్యోతి పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగింది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ శివజ్యోతి తెలిపారు. -
బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను
హీరోయిన్ అమీ జాక్సన్ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భవతిగా తన ప్రయాణాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు అమీ. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను’’ అని ఓ పార్టీలో ఆనందంగా అనౌన్స్ చేశారు అమీ. యూకేకి చెందిన జార్జ్ పనయోట్టు అనే వ్యాపారవేత్తతో తాను డేటింగ్లో ఉన్నట్లు అమీ ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మార్చిలో తాను గర్భవతినని అమీ పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో అమీ–జార్జ్ల నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల అమీ డెలివరీ డేట్. బిడ్డ కడుపులో పడ్డాక నిశ్చితార్థం చేసుకున్న అమీ, జార్జ్ తల్లిదండ్రులయ్యాక పెళ్లి చేసుకుంటారు. వచ్చే ఏడాది గ్రీస్‌లో పెళ్లిని ప్లాన్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ‘బీచ్ సైడ్ వెడ్డింగ్’ని ప్లాన్ చేశారట. -
ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
అఫ్జల్‌గంజ్: ప్రమాదవశాత్తు సేప్టీ పిన్‌మింగిన బాలుడికి శస్త్రచికిత్స చేసి తొలగించిన సంఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అనూష దంపతుల కుమారుడు (8 నెలలు) ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ సేఫ్టీ పిన్ మింగాడు. దీనిని గుర్తించిన అతడి తల్లిదండ్రులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఎక్స్‌రే తీసిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు బాలుడిని నీలోఫర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా వైద్యులు ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి రెఫర్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా ఎమర్జెన్సీ విభాగానికి రాగా, గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగాధిపతి డాక్టర్ రమేష్ నేతృత్వంలో 15 నిమిషాల్లోనే ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీ పిన్ను బయటికి తీశారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... ఎండోస్కోపి ద్వారా ఫారిన్ బాడీ స్కాన్‌చేసి తీయడం పెద్దవారిలో సహజమే అయినా 8 నెలల పసికందుకు ఎండోస్కోపి ద్వారా ఓపెన్ ఎడ్జ్డ్ సేప్టీపిన్ తీసివేయడం క్లిష్టమైన, అరుదైన విషయమన్నారు. చికిత్స నిర్వహించిన డాక్టర్ రమేష్, సహకరించిన ఇతర డాక్టర్లను ఆయన అభినందించారు. తమ బిడ్డను కాపాడిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎవరీ పసికందు..?
నాగోలు: అభం శుభం తెలియని చిన్నారిని నిర్మాణంలో ఉన్న భవనం వద్ద వదిలేసి వెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ బిగ్‌బజార్ సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద మూడు నెలల బాబును వదిలేసి వెళ్లారు. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న వెంకటయ్య దీనిని గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టినా ఫలితం లేకపోవడంతో రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటి అధికారులకు అప్పగించారు. పోలీసులు కేసు నమేదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 4వేలకు ఆరు నెలల చిన్నారి కొనుగోలు
కంటోన్మెంట్: ఆరు నెలల బాలుడిని అపహరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బోయిన్పల్లి పోలీసులు బాధిత బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన మేరకు... నిజామాబాద్ జిల్లా వార్షి మండలం, మున్సాపూర్‌కు చెందిన సీహెచ్. ప్రసాద్ (40) నగరంలోని లంగర్ హౌజ్‌లో నివసిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. ఉండగా, కొడుకు కావాలన్న కోరికతో ఉన్నాడు. శనివారం రాత్రి నిజామాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రసాద్, మద్యం తాగి రాత్రి నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో నిద్రించాడు. మరుసటి ఉదయం బస్టాండ్ ఆవరణలోని యాచకుల ఆధీనంలో కొందరు చిన్నారులు ఉండటాన్ని గమనించాడు. వారి వద్ద ఉన్న ఆరు నెలల బాబును తనకు ఇవ్వాల్సిందిగా యాచకురాలిని అడగ్గా, రూ.10 వేలు ఇస్తే బాబును ఇస్తానని ఆమె తెలిపింది. చివరకు రూ.4వేలు యాచకురాలికి ఇచ్చిన ప్రసాద్ బాబును తీసుకుని నగరానికి బయలుదేరాడు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు న్యూబోయిన్‌పల్లి బస్టాప్‌లో దిగిన ప్రసాద్ అనుమానాస్పద కదలికలను గమనించిన బోయిన్పల్లి ఏఎస్ఐ వీరయ్య అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడించారు. బాలుడిని యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించిన పోలీసులు, ప్రసాద్‌పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రసాద్‌కు బాలుడిని అమ్మిన యాచకురాలి కోసం గాలిస్తున్నారు. -
బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి
వాషింగ్టన్ : రెండు నెలల క్రితం చికాగోకి చెందిన ఒక మహిళ, ఆమె కూతురు కలిసి 19 సంవత్సరాల గర్భవతిని హత్యచేసి కడుపు కోసి బిడ్డను బయటకు తీసిన దారుణం గురించి తెలిసిందే. బలవంతంగా బిడ్డను బయటకు తీయడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. దాంతో ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ బిడ్డ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. మాల్రేన్ ఒహోవా లోపేజ్(19) అనే గర్భవతికి చికాగోకి చెందిన క్లారిస ఫిగురోవా(46),ఆమె కుమార్తె డేసిరీ(24) ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. పిల్లలకు సంబంధించిన వస్తువులు తమ వద్ద లభిస్తాయని ఒహోవాను ఆకర్షించి తమ ఇంటికి రప్పించారు. వచ్చిన అనంతరం ఒహోవా గొంతు నులిమి చంపి ఆమె కడుపు కోసి బిడ్డను బలవంతంగా బయటకు తీశారు. ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగింది. తల్లి గర్భం నుంచి బయటకు తీసిన ఆ చిన్నారి ఊపిరి తీసుకోలేదు. దాంతో ఫిగురోవా ఆ శిశువును తన బిడ్డ అని ఆసుపత్రిలో చేర్పించింది. నెలల నిండకముందే.. బలవంతంగా శిశువును బయటకు తీయడంతో.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నది. చివరకు బ్రైయిన్ డెడ్ అయ్యి ఆ శిశువు మరణించినట్లు శుక్రవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. మరోవైపు ఒహోవా కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒహోవా ఫేస్బుక్ ఖాతాను పరిశీలించిన పోలీసులకు.. ఫిగురోవా మీద అనుమానం వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లి సోదా చేయగా అక్కడ ఒహోవా మృత దేహం కనిపించింది. బిడ్డ కోసం తానే తన కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు ఫిగురోవా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
పాపం పసివాడు
పశ్చిమగోదావరి, కొయ్యలగూడెం: చిట్టిపొట్టి మాటలతో తడబడుతూ, నడుస్తూ తల్లిదండ్రులను ఆనందింపచేస్తున్న ఆ బాలుడికి అనుకోని కష్టం వచ్చింది. దీంతో బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కార్పెంటర్ వృత్తి చేస్తున్న దార్ల సత్యనారాయణకు నాలుగు సంవత్సరాల జ్ఞానదీప్, కుమార్తె ఉన్నారు. జ్ఞానదీప్కు కొద్దిరోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. అక్కడ మెరుగుపడకపోవడంతో జంగారెడ్డిగూడెం, అక్కడ నుంచి విజయవాడకు తీసుకువెళ్లారు. అయితే జ్ఞానదీప్కు లివర్ సంబంధిత వ్యాధి సంక్రమించిందని, తద్వారా కిడ్నీలు, బ్రెయిన్ మొద్దుబారి కోమాలోకి జారుకున్నట్లు వైద్యులు తెలిపారన్నారు. జ్ఞానదీప్ మెరుగుపడటానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని తెలపడంతో ఇప్పటికే చికిత్స నిమిత్తం సత్యనారాయణ ఉన్నవన్నీ అమ్ముకుని కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలుడిని ఆదుకోవాలంటే రోజుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారని, కట్టుబట్టలతో మిగిలిన తమకు బాలుడు వైద్యచికిత్సను అందించడం కష్టంగామారిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున గానీ, దాతల తరఫున గానీ తమకు ఆర్థిక సహాయం అందించాలని దాతలు 9701705312 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. -
బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడు
లండన్: బ్రిటన్ రాజవంశంలో కొత్త వారసుడొచ్చాడు. యువరాజు హ్యారీ భార్య మేఘన్ మార్కెల్ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించేందుకు ఇప్పటికే ఆరుగురు క్యూలో ఉండగా, ఈ కొత్త వారసుడు ఏడో వాడయ్యాడు. బ్రిటిష్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5.26 గంటలకు మేఘన్ ఈ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు 3.2 కేజీల బరువు ఉన్నాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రిన్స్ హ్యారీ విలేకరులకు చెప్పారు. ‘నాకు ఇంతకంటే గొప్ప విషయం ఇప్పటివరకు ఏదీ లేదు. నా భార్యను చూస్తే చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చంద్రుడిపై ఉన్నంత సంతోషంగా ఉంది’ అని హ్యారీ తెలిపారు. -
కిడ్నాప్‌ల కలవరం
తిరుమల: శ్రీవారి సన్నిధిలో మూడునెలల బాబు కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది. ఆది వారం వేకువజాము లేపాక్షి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసి ఉడాయిం చింది. బాలుడి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన మహవీర్, కౌసల్య దంపతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలిసులు బాలుడి జాడ కోసం గాలిస్తున్నారు. లేపాక్షి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు బాబును ఎత్తుకెళ్లిన నిందితురాలి విజువల్ కనుగొన్నారు. కిడ్నాపర్ తిరుమలను వదిలివెళ్లిపోయారా లేదా అక్కడే ఉన్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వసతి లేకనే వెతలు.. స్వామి వారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో మినహా వారాంతాలు, పర్వదినాల్లో భక్తులకు వసతి సదుపాయం దొరకని పరిస్ధితి. దీంతో భక్తులు తిరుమలలోని ఖాళీ ప్రదేశాలు, పార్కులు, రోడ్ల పైనే సేదతీరుతుంటారు. దీన్ని అదునుగా తీసుకుంటున్న కొందరు పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. రద్దీ ప్రాంతాలే టార్గెట్.. ఇలా కొన్నేళ్లుగా చిన్నారుల కిడ్నాప్ తిరుమలలో సర్వసాధారణమైపోయింది. రద్దీ ప్రాంతా లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ♦ 2012 జూన్‌లో యాత్రికుల సముదాయం –1లో తమిళనాడు రాష్ట్రం అంబత్తూరుకు చెందిన రాజు, తంగప్రియ దంపతులకు చెందిన 8 నెలల బాలుడిని ఓ దుండగుడు అపహరించుకుపోయాడు. నేటికి బాబు జాడ తెలియరాలేదు. ♦ అదే ఏడాది ఆగస్టు 31న నెల్లూరుకు చెందిన యశ్వంత్ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ రెండు కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయి. ♦ గత ఏడాది జనవరి 28న ఆదిలాబాద్‌కు చెందిన సంతోష్ దంపతులు వారి కుమారుడు ఆదిత్యతో యాత్రికుల సముదాయం– 1లో బస చేశారు. నిద్రలేచేసరికి బాబు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయిం చారు. పోలీసులు శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థానమండపం వద్ద బాబుని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ♦ ఆ తర్వాత రోజే అనంతపురం జిల్లాకు చెందిన మహాత్మా, వరలక్ష్మి దంపతుల కుమార్తె నవ్యశ్రీని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. నాలుగు రోజుల తర్వాత మహబూబ్ నగర్ మేడ్చల్ వద్ద పోలీసులు నిందితుడిని పట్టుకుని పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ♦ జూన్ 14న అనంతపురం జిల్లా ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు దంపతులు తమ పిల్లలతో ఆలయం వద్ద సేదతీరారు. ఎనిమిది నెలల చెన్నకేశవులను గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకెళ్లాడు. 16 రోజుల తర్వాత తమిళనాడు నామక్కల్‌లో నిందితులను పోలీసులు అరెస్టు చేసి బాబును కాపాడారు. ♦ ఈ ఉదంతం మరువకముందే జూలై 23న శ్రీకాళహస్తికి చెందిన సురేష్ దంపతుల కుమార్తెను యాత్రికుల సముదాయం–4 వద్ద ఓ మహిళ అపహరించుకెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విస్తృతంగా గాలించిన పోలీసులు బెంగళూరులో కిడ్నాపర్‌ను అరెస్టు చేసి పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ♦ గత ఏడాది డిసెంబర్ 28న మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ కుమారుడు వీరేష్ యాత్రి కుల వసతి సముదాయం వద్ద అదృశ్యమయ్యాడు. 56 గంటలపాటు పోలీసులు గాలించడంతో బాబు ఆచూకీ లభ్యమైంది. డిసెం బర్ 30న మహారాష్ట్ర పోలీసులు అనుమానంతో బాబును కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సోషియల్ మీడియా ద్వారా తిరుమలలో బాలుడు కిడ్నాప్ అయిన విషయాన్ని గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు అర్బన్ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించి కిడ్నాప్ కథకు సుఖాంతం పలికారు. ఫిర్యాదుల్లో ఆలస్యం.. పోలీసులు అప్రమత్తంగా ఉన్నా భక్తుల ముసుగులో నిందితులు తిరుమలకు చేరుకుని చాకచక్యంగా చంటి పిల్లలను అపహరించుకుపోతున్నారు. మరోవైపు పిల్లలను ఎత్తుకెళ్లిన వెంటనే వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆలస్యం చేయడంతో కిడ్నాపర్లు సులువుగా తిరుమల దాటేస్తున్నారు. దీంతో కిడ్నాప్ కేసులను ఛేదించడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. ఈ కారణంగానే గతంలోని రెండు కేసులలో పురోగతి కనిపించని పరిస్ధితి. ఇక ప్రస్తుతం కిడ్నాప్‌నకు గురైన వీరేష్ ఉదంతంలోనూ ఇదే పరిస్థితి పోలిసులకు ఎదురైంది. బాబు అదృశ్యమైన నాలుగు గంటల తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ♦ తిరుమలలో జరుగుతున్న వరుస కిడ్నాప్‌లను ఛాలెంజ్‌గా స్వీకరిస్తున్న పోలీసులు ఆలస్యంగానైనా ఛేదిస్తున్నారు. అదే పిల్లలు కిడ్నాప్ అయిన వెంటనే వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం చేరవేస్తే మాత్రం కిడ్నాపర్ల ఆటకట్టించడం పోలీసులకు సులభతరంగా మారే అవకాశముంది. -
తిరుమలలో కిడ్నాప్ కలకలం
సాక్షి, తిరుమల : : మూడు నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన తిరుమలలో కలకలం రేపింది. తమిళనాడులోని ఇల్లిపురం గ్రామానికి చెందిన కైసల్య, భర్త మధిరతో కలిసి తిరుమల కొండపై చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి తిరుమల ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మగబిడ్డ (వీరా)ను పక్కన పడుకోబెట్టుకొని నిద్రిస్తున్నసమయంలో గుర్తుతెలియని దుండగులు అపహరించారు. వీర కనిపించకపోవడంతో మధిర, కౌసల్య ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో బాలుడి మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
పసిబిడ్డను వదిలి తల్లి పరారీ
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఓ మహిళ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. చార్మినార్ ఎస్ఐ నర్సింగ్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఈ నెల 7న ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహ్మదీ బేగం ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరింది. అదే రోజు మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్కడినుంచి వెళ్లిపోయింది. రెండు రోజుల పాటు వేచి చూసిన ఆసుపత్రి అధికారులు శనివారం చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం ఫలక్‌నుమా ప్రాంతంలో ఆమె కోసం గాలించగా ఆధారాలు లభించలేదు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరిన సమయంలో తప్పుడు అడ్రస్ ఇచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. చిన్నారిని శిశు విహార్‌కు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. -
‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ప్రణయ్ మళ్లీ పుట్టాడు’అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట తమ పెళ్లి రోజును పురస్కరించుకుని అమృత తన ఫేస్బుక్లో ఒక ఫొటోతోపాటు సందేశాన్ని పోస్టు చేశారు. ‘నీకు (ప్రణయ్) మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. మన వివాహమై నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజు నీ చెయ్యి పట్టుకుని నడిచేందుకు ఆత్రుతగా ఎదురుచూసిన సమయం ఇది. ఇప్పుడు మన బిడ్డను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. లవ్యూ లల్లు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాను‘అంటూ ఆ సందేశంలో పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం అమృత మగబిడ్డకు జన్మినిచ్చినట్లు మరో పోస్టు పెట్టారు. -
పేదింటి చిన్నారికి పెద్ద కష్టం
విశాఖపట్నం, గాజువాక: పేదింటి బిడ్డకు ఖరీదైన జబ్బొచ్చింది. ముక్కుపచ్చలారని చిన్నారిని బ్లడ్ క్యాన్సర్ ఆవహించింది. ఆరోగ్యశ్రీతో వైద్యం పొందుదామని వెళ్లిన పేద కుటుంబానికి ఆస్పత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఆరోగ్యశ్రీని నిలిపివేశారని, పది లక్షల రూపాయలు తెచ్చుకుంటేనే వైద్యం చేయగలమని స్పష్టం చేశారు. కూలి పనులు చేసుకొంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తండ్రి ఈ దీనస్థితిని చూసి మౌనంగా రోదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..: పెదగంట్యాడలోని శీకువానిపాలేనికి చెందిన ఎ.అప్పలరాజు ఒక వాటర్ ప్లాంట్ నుంచి నీటి ప్యాకెట్లను తీసుకొని దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. అతడి మూడేళ్ల కుమారుడు గురుచరణ్ శరీరంపై గతనెల 30న ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. స్థానిక ఆస్పత్రిలో చూపించినప్పటికీ తగ్గకపోవడంతో 31న నగరంలోని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు విజయ మెడికల్ ల్యాబ్‌లో రక్త పరీక్షలను చేయించారు. ఆ చిన్నారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టు తేలడంతో ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. తన బిడ్డకు వచ్చిన కష్టాన్ని వివరించి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డును డాక్టర్‌కు చూపించారు. ఈనెల 1 నుంచి ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని, అందువల్ల రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సమకూర్చుకోగలిగితే వైద్యం అందిస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. డాక్టర్ చెప్పిన విషయంతో హతాశుడైన గురుచరణ్ తండ్రి అంత మొత్తాన్ని సమకూర్చుకోవడానికి దారిలేకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. దాతలు తనను ఆదుకోవాలని వేడుకొంటున్నాడు. తమ పట్ల దాతృత్వం చూపించే దాతలు ఎ.అప్పలరాజు, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 30233740367, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0007087, ఫోన్ నంబర్ 9640100464లో సంప్రదించాలని ప్రాధేయపడుతున్నాడు. స్థానికుల వితరణ: అప్పలరాజు కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తెలుసుకున్న స్థానికులు శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. గురుచరణ్‌కు వచ్చిన వ్యాధి గురించి తెలుసుకున్న స్థానిక లైఫ్ వే స్కూల్ కరస్పాండెంట్ నక్కా రమణ నేతృత్వంలో స్థానికులు చందాలేసుకొని రూ.1.60 లక్షలను బాధితుడి తండ్రికి అందజేశారు. దాతలు ముందుకొచ్చి చిన్నారి గురుచరణ్‌ను కాపాడాలని పాఠశాల కరస్పాండెంట్ ఈ సందర్భంగా కోరారు. -
బాలభీముడు జననం
పశ్చిమగోదావరి,ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్.పోతేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఒక మహిళ 4.2 కిలోల బరువైన మగ శిశువుకు జన్మనిచ్చింది. గుండుగొలనుకుంటకు చెందిన కొలుకులూరి అంజలి పురిటినొప్పులతో బాధపడుతుండగా ఆమె భర్త నాగేశ్వరరావు సీహెచ్.పోతేపల్లిలోని పీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు కె.విజయ్కుమార్రాజ, వైద్య సిబ్బంది శ్రమించి ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఆమె 4.2 కిలోల బరువుతో మగ శిశువుకు జన్మనిచ్చినట్టు వైద్యుడు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. -
సానియా–షోయబ్‌కు పుత్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులకు కొడుకు పుట్టాడు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని మాలిక్, సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా ప్రకటించారు. స్వస్థలం హైదరాబాద్‌లోనే సానియాకు ప్రసవం జరిగింది. ‘చాలా ఉద్వేగంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. మాకు అబ్బాయి పుట్టాడు. నా అమ్మాయి (సానియా) బాగుంది. ఎప్పటిలాగే ధైర్యంగా కూడా ఉంది. మీ దీవెనలకు కృతజ్ఞతలు. సంతోషంగా అనిపిస్తోంది’ అని షోయబ్ ట్వీట్ చేశాడు. తమ తొలి సంతానానికి వారు ఉర్దూలో ‘దైవకానుక’ అని అర్థం వచ్చే ‘ఇజ్హాన్’ అని పేరు పెట్టారు. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరిగింది. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగింది. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిన 36 ఏళ్ల పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ స్వస్థలం సియాల్కోట్. అతను జాతీయ జట్టు తరఫున 35 టెస్టులు, 271 వన్డేలు, 105 టి20 మ్యాచ్‌లు ఆడాడు. సానియా ఇంట బిడ్డ పుట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్రికెటర్లు, అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. -
డబుల్ హ్యాపీ
వినాయకచవితి పండగ సెలబ్రేషన్స్ నటుడు గోపీచంద్ ఇంట్లో ఒక రోజు ముందే మొదలయ్యాయి. గురువారం పండగ రోజు డబుల్ అయ్యాయి. ఇంతకీ... విషయం ఏంటంటే... గోపీచంద్ రెండోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘బేబి బాయ్‌కి తండ్రి అయ్యాను. పండగను మించిన సంతోషం కలుగుతోంది’’ అని గోపీచంద్ పేర్కొన్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం రేష్మాను వివాహం చేసుకున్నారు గోపీచంద్. ఈ దంపతులకు 2014లో కలిగిన మగ సంతానానికి విరాట్ కృష్ణ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికోస్తే... ఇటీవల ‘పంతం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు గోపీచంద్. ఇప్పుడు గోపీచంద్ హీరోగా కుమార్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో ఓ సినిమా రూపొందనుందని టాక్. అలాగే దర్శకుడు సంపత్ నంది వినిపించిన ఓ స్టోరీ లైన్‌కు గోపీచంద్ ఇంప్రెస్ అయ్యారట. -
షాహిద్ కా బేటా జైన్
రెండు రోజులుగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌కు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అవి కంగ్రాట్స్ కాల్స్. షాహిద్ కపూర్ రెండో సారి తండ్రి అయినందుకు సన్నిహితులు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరా రాజ్పు త్ను మూడేళ్ల క్రితం షాహిద్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఆల్రెడీ మిషా కపూర్ అనే కుమార్తె ఉంది. ఇప్పుడు తాజాగా మీరా రాజ్‌పుత్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బాబుకి జైన్ కపూర్ అని పేరు పెట్టినట్లు షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘‘మా బేబీ బాయ్‌కి జైన్ కపూర్ అని పేరు పెట్టాం. ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నాం. మాకు విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు షాహిద్. -
రెండోసారి తండ్రైన షాహీద్ కపూర్
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ షాహీద్ కపూర్ ఇంట ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతం షాహీద్ ఇంటికి అభిమానులు, స్నేహితులు నుంచి అభినందనలు వరుసకడుతున్నాయి. విషయం ఏంటో ఈ పాటికే మీకు అర్థమయ్యి ఉంటుంది.. అవును షాహీద్ కపూర్ మరోసారి తండ్రయ్యాడు. షాహీద్ కపూర్ - మీరా రాజ్‌పుత్‌ల ఇంటికి ఓ చిన్ని రాకుమారుడు వచ్చాడు. బుధవారం సాయంత్రం ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో మీరా రాజ్‌పుత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మీరా రాజ్‌పుత్ ప్రాణ స్నేహితురాలు ప్రగ్యా యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. View this post on Instagram Biggest congratulations to all of you!!! ❤️ My darling Mira it’s been a beautiful journey and I’m so happy I got to share it with you, it’s been special! love love and more love 💖💕🌸 @mira.kapoor #itsaboy #bumpbuddies #love #kapoors A post shared by Pragya Kapoor (@pragyadav) on Sep 5, 2018 at 10:29am PDT ‘నా స్నేహితురాలు మీరా రాజ్‌పుత్‌కి కుమారుడు జన్మించాడు. తనకు నా శుభాకాంక్షలు.. ఈ సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకున్నాను’ అంటూ ప్రగ్యా యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది తెలిసిన వెంటనే అలియా భట్ తన స్నేహితుడు, సహ నటుడు అయిన షాహీద్ కపూర్‌కి అభినందనలు తెలిపారు. అలియా ‘షాన్‌దార్’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి చిత్రాల్లో షాహీద్ కపూర్ సరసన నటించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్ర మీరా రాజ్పూత్ని హిందూజ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ వెంటనే షాహీద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌ల తల్లులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షాహీర్ కపూర్ తెలుగు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 21న విడుదల కానున్నట్లు సమాచారం. -
కృష్ణా జిల్లాలో దారుణం
సాక్షి, గన్నవరం: కృష్ణా జిల్లాలోని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 5 రోజుల బాబు మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు మండలం పి.శోభనాపురం గ్రామానికి చెందిన జూకూటి వరలక్ష్మీకి ఈ నెల 24న గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నిన్న(గురువారం) రాత్రి 11 గంటల సమయంలో బాబు కదలకపోవడంతో వార్డులో ఉన్న నర్సుకి సమాచారం అందించారు. నర్సు సంబంధిత డాక్టర్‌కి ఫోన్ చేయడంతో ఆయన స్పందించలేదు. దీంతో బాబు రాత్రి 2 గంటల సమయంలో మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లాడు మృతి చెందాడని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. అయితే బాబు పుట్టినపుడు ఆరోగ్యంగానే ఉన్నాడని, నిన్న రాత్రి కూడా బాబు ఆరోగ్యం బాగుందని.. ఇది సహజ మరణం అని వైద్యులు చెబుతున్నారు. ముగ్గురు ఆడపిల్లల అనంతరం వరలక్ష్మికి బాబు పుట్టడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగిపోయారు. అంతలోనే ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పిల్లలు పుట్టకుండా వరలక్ష్మి గురువారమే ఆపరేషన్ చేయించుకుంది. -
ఫ్యామిలీ కొంచెం పెద్దదైంది
ఎన్టీఆర్ ఇంట్లో సందడి నెలకొంది. ఇక మీదట ఇంట్లో మరో లిటిల్ టైగర్ సందడి చేయనున్నారు. గురువారం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి బాబుకి జన్మనిచ్చారు. ఆ విషయాన్ని ట్వీటర్లో ‘‘కుటుంబం కొంచెం పెద్దదైంది. అబ్బాయి పుట్టాడు’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆల్రెడీ ఈ దంపతులకు ఓ కుమారుడు (అభయ్) ఉన్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాలో అదే ఫస్ట్ ఫొటో? ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి బుధవారం అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. మొదటి పోస్ట్‌గా తన లేటెస్ట్ సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’ ఫొటోను అప్లోడ్ చేసినప్పటికీ కొద్దిసేపటికే దాన్ని తీసేశారు. అభిమానులకు సర్ప్రైజ్గా తన రెండో కుమారుణ్ని పరిచయం చేసే పోస్ట్‌గా ఈ ఫస్ట్ ఫొటోను అప్లోడ్ చేస్తారని సమాచారం. బుజ్జాయి కోసం బ్రేక్? యాక్చువల్లీ సెకండ్ బేబీ కోసం ఎన్టీఆర్ తన షెడ్యూల్‌ని మార్చుకున్నారట. బాబు పుట్టాక కొన్ని రోజుల పాటు షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి ఎక్కువ సమయాన్ని బాబుతోనే గడపాలనుకున్నారని సమా చారం. పొల్లాచ్చిలో జరగనున్న ‘అరవింద సమేత..’ చిత్రానికి ఓ పదిహేను ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి, ఆ తర్వాత షూట్లో జాయిన్ కావాలని భావిస్తున్నారట ఎన్టీఆర్. -
రెండోసారి తండ్రైన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. తారక్, ప్రణతీ దంపతులకు ఈ రోజు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక సోదరుడు హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. The family grows bigger. It’s a BOY! — Jr NTR (@tarak9999) 14 June 2018 -
కొడుకు పుట్టలేదని విడాకులు అడుగుతున్నాడు
కర్నూలు: కొడుకు పుట్టలేదని భర్త రవికుమార్ విడాకుల నోటీసు పంపించాడని, తనకు న్యాయం చేయాలంటూ గడివేముల మండలం గని గ్రామానికి చెందిన మహిళ పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యాక్రమంలో భాగంగా 9121101200 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ గోపీనాథ్‌జెట్టి నోట్ చేసుకున్నారు. అనంతరం నేరుగా వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టారని, అయితే మగ సంతానం కలగలేదనే ఉద్దేశంతోనే భర్త రవికుమార్ తనకు విడాకులు నోటీసు పంపాడని ఎలాగైనా న్యాయం చేయాలని ఆమె ఎస్పీని వేడుకుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని.. ♦ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఇప్పిస్తామని వ్యవసాయాధికారి ఒకరు డబ్బులు తీసుకొని మోసం చేశాడని, విచారించి అతనిపై చర్యలు తీసుకొని తమ డబ్బులు వాపసు ఇప్పించాలని ఆళ్లగడ్డ మండలం పెద్దకంబలూరుకు గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ♦ తనభర్త కారు డ్రైవర్‌గా పని చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని బిడ్డతో పాటు తనను పట్టించుకోవడం లేదని పగిడ్యాల మండల పాతకోట గ్రామానికి చెందిన నాగరత్నమ్మ ఫిర్యాదు చేశారు. భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాల్సిందిగా ఆమె వేడుకున్నారు. ♦ అల్లుడు తన కుమార్తె పిల్లలను వదిలి వేరే అమ్మాయితో వెళ్లి పోయాడని అతడని ఎలాగైనా రప్పించి తన కూతురి కాపురం నిలబెట్టాని గూడూరు సింగరేణి కాలనీకి చెందిన దస్తగిరి ఫిర్యాదు చేశారు. ♦ ఎక్స్ ఆర్మీ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఓ వ్యక్తి మోసం చేశాడని ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ♦ పోలీసు ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు బాబుప్రసాద్, నజీముద్దీన్, ఖాదర్‌బాషా, వెంకటాద్రి, సీఐలు రామయ్యనాయుడు, మురళిధర్‌రెడ్డి, ములకన్న, పవన్ కిషోర్, సుబ్రమణ్యం, ఎస్ఐలు మోహన్‌కిషోర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి..విషాదం
సాక్షి, ఒడిశా: 16 రోజుల చంటి పిల్లాడిని కోతి ఎత్తుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. గత శనివారం ఇంట్లో తల్లిపక్కన నిద్రపోతున్న 16 రోజుల శిశువును ఇంట్లోకి చొరబడ్డ కోతి ఎత్తుకెళ్లింది. అది గమనించిన తల్లి గట్టిగా అరవడంతో కోతి చిన్నారిని తీసుకుని దూరంగా వెళ్లిపోయింది. తర్వాత పిల్లాడి శవం ఇంటి పక్కనున్న బావిలో వెలుగు చూడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది. ఈ సంఘటన ఒరిస్సాలోని కటక్ జిల్లాలో చోటుచేసుకుంది. అంతకుముందు ఘటనపై బాధిత కుటుంబం అధికారులకు సమాచారమివ్వడంతో గాలింపు చర్యలు ఊపందుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఇంటి పక్కనున్న బావిలో బాబు శవం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసు అధికారి బిస్వరంజన్ సాహూ మట్లాడుతూ.. పిల్లాడిని ఎత్తుకెళ్లిన కోతి కొద్ది సేపటి తర్వాత బావిలో పడేసుంటుందని అభిప్రాయపడ్డారు. కెరీర్లో ఇలాంటి కేసును మొదటి సారిగా చూశానని ఆయన చెప్పారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. -
తల్లి అయిన మాజీ హీరోయిన్!
‘ఏమైంది ఈ వేళ’, ‘సోలో’ లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించిన నిషా అగర్వాల్ ఇటీవల పండంటి బాబుకి జన్మనిచ్చింది. దీంతో నిషా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక కాజల్ అగర్వాల్ ఆ బాబుని ముద్దాడుతూ దిగిన ఓ ఫోటోని తన ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో పాటు నిషా కొడుకు పేరు ‘ఇషాన్ వాలేదా’ అని అందరికి పరిచయం చేసింది. నిషా కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ తన అక్కలాగా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఆమె నటించిన ఏమైంది ఈ వేళ, సోలో వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఆ తర్వాత ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి సినిమాల్లో నటించింది. అనంతరం ముంబైకి చెందిన వ్యాపారవేత్త కరణ్‌ను నిషా 2013లో పెళ్లి చేసుకుంది. నిషా పెళ్ళి అయిన తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక కాజల్ అగర్వాల్ ఇటీవల ‘అ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ కళ్యాణ్ రామ్‌కి జంటగా ‘ఎంఎల్ఏ’ సినిమాలో నటిస్తుంది. The force awakens (at all hours of the night). Meet our new little jedi *Ishaan Valecha* 😻 @AggNisha @_karanvalecha_ so much love ❤️ pic.twitter.com/5uDvoIdQUh — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 21, 2018 -
మంచు ఫ్యామిలీకి న్యూ ఇయర్ గిఫ్ట్
సాక్షి, సినిమా : కొత్త సంవత్సరం రోజున మంచువారి ఇంట సందడి నెలకొంది. మోహన్‌బాబు తనయుడు-నటుడు అయిన విష్ణు భార్య విరానికా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం అందుతోంది. కాగా, నెలలు నిండడంతో విరానికాను హాస్పిటల్‌కు తీసుకువెళ్లినట్టు ఈరోజు మధ్యాహ్నం విష్ణు ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ‘‘మా కుటుంబంలోకి మరో వ్యక్తికి ఆహ్వానం పలికే సమయం వచ్చేసింది. ఇప్పుడే హాస్పిటల్‌కు వచ్చాం. చాలా ఉత్కంఠగా ఉంది’’ అని విష్ణు ట్వీట్ చేశాడు. ఆ దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇక వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదు అని మంచు విష్ణు ఓ ట్వీట్ ద్వారా కొందరికి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. విష్ణుకు మగబిడ్డ పుట్టినట్లు బీఏ రాజు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
మొదట కుమారుడన్నారు..తర్వాత ఆడబిడ్డ అన్నారు
సాక్షి,బెంగళూరు (కలబుర్గి): ఓబాలింతకు బాలుడు జన్మించినట్లు చెప్పిన వైద్యులు తర్వాత మాట మార్చారు. పుట్టింది బాలుడు కాదు..ఆడబిడ్డ అని చెప్పారు. దీంతో బాలింత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈఘటన కలబుర్గీ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కలబుర్గీ జిల్లా జీవర్గీ తాలూకా కోణశిరసగి గ్రామానికి చెందిన నందమ్మ పురిటినొప్పులతో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేరింది. కొద్ది సమయం తర్వాత ఆమె ఓ పండంటి బాబుకు జన్మించినట్లు వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. అటుపై అరగంట తర్వాత వచ్చి.. మీకు అబ్బాయి కాదు అమ్మాయి పుట్టిందని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న మిగిలిన వారు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి డీఎన్ఏ పరీక్షలకు ఒప్పించడంతో పరిస్థితి సద్దుమునిగింది.