Atlee And Priya: అవును.. ప్రపంచంలో ఇలాంటి ఫీలింగ్ మరెక్కడా లేదు: అట్లీ

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రయ్యారు. కొన్ని నెలల క్రితమే తన భార్య ప్రియా మోహన్ ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య, నటి ప్రియా మోహన్ మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించారు అట్లీ. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అట్లీ ఇన్‌స్టాలో షేర్‌చేస్తూ..'అవును వారు చెప్పింది నిజమే. ప్రపంచంలో దీన్ని మించిన ఆనందం మరెక్కడా లేదు. మాకు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా బిడ్డకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నా. ' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా.. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న అట్లీ- ప్రియ దంపతులు 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మించడంతో వారి ఇంట్లో ఎక్కడా లేని సంతోషం నెలకొంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార, నాజ్రియా, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన రాజారాణి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అట్లీ. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో 'జవాన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది.
They were right 😍 There’s no feeling in the world like this ♥️
And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today!Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼 @priyaatlee pic.twitter.com/TzvoiFPzyc
— atlee (@Atlee_dir) January 31, 2023